హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / సస్యరక్షణ మందులు కొనుగోలు, వాడకంలో పాటించవలసిన మెళకువలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సస్యరక్షణ మందులు కొనుగోలు, వాడకంలో పాటించవలసిన మెళకువలు

పంటలలో చీడపీడలను సమర్ధవంతంగా నివారించాలంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.

పంటలలో చీడపీడలను సమర్ధవంతంగా నివారించాలంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. తప్పనిసరి పరిస్ధితులలో మాత్రమే మార్కెట్ లో లభ్యమయ్యే సస్యరక్షణ మందులను వాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రైతాంగం సస్యరక్షణ మందుల కొనుగోలు. వాడకంలో క్రింద పేర్కొన్న సూచనలను ఆచరిస్తే సరియైన మందులను కొనుగోలు చేసి పిచికారి చేయటం వల్ల చీడపీడలను సమర్ధవంతంగా నివారించవచ్చును.

సస్యరక్షణ మందులు కొనుకోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన సూచనలు

 • ఒకే మందు పొడి మందు గాను, నీటిలో కరిగే ద్రావకం గాను లేదా గుళికల రూపంలో లభ్యమౌతున్నప్పుడు అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి పంట దశ, నీటి లభ్యతను మరియు సమస్య తీవ్రతను బట్టి ఎన్నుకోవాలి.
 • పొడి మందులు ఎక్కువగా గాలికి ఎగరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడి మందులను సరిగ్గా కలియబెత్తనప్పుడు స్ప్రేయర్ ల నజిల్స్ లో చేరి సరిగా పనిచేయవు. నాసి రకం మందుల ఫార్ములేషన్లు ఎక్కవగా చర్మంలో నుంచి మోతాదు పెరిగినపుడు, పంటపై నిష ప్రభావం చుపించాగాలవు.
 • సస్యరక్షణ మందుల గుణగణాల పై అవగాహన వున్న నమ్మకస్తులైన డీలర్ల దగ్గర మాత్రమే మందులు కొనుగోలు చేయాలి. ఆశించినది తెగులో/పురుగో గుర్తించి దగ్గరలోని వ్యవసాయ అధికారి లేదా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు సస్యరక్షణ మందులను కొనుగోలు చేయాలి.
 • కొన్న మందు యొక్క వివరాలను పొందుపరిచిన రాసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.
 • రెండు మూడు మందులు అందుబాటులో ఉండి ఎన్నుకొనే అవకాశం వున్నపుడు, ఆ మందు యొక్క విషపుర్తిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. మందు ప్యాకింగ్ పై త్రిభుజాకారంలో వివిధ రంగుల ద్వారా విషపూరిత గుణాన్ని తెలియచేయబడుతుంది.
  1. ఎరుపు రంగు ఉంటే - అత్యధిక విషపూరితం
  2. పసుపు రంగు ఉంటే - అధిక విషపూరితం
  3. నీలం రంగు ఉంటె - ఒక్కమోస్తరు విషపూరితం
  4. ఆకుపచ్చ రంగు ఉంటె - కొద్దిపాటి విషపూరితం
 • లేబుల్ క్లైమ్ ను బట్టి మందును ఎన్నుకోవాలి అంటే ఏ పంటపై, ఏ పురుగుకు/ఏ తెగులుకు సిఫార్సు చేయబడినదో అదే మందును వాడాలి.
 • సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడాలి.
 • కొనేటటువంటి మందు డబ్బాగని , ప్యాకెట్ గాని పదిలంగా ఉన్నట్లు అంటే చిల్లులు లేక, కొత్త ప్యాక్, గడువు తేది నిర్ధారించుకొని తీసుకోవాలి.

సస్యరక్షణ మందుల వాడకంలో పాటించవలసిన మెళకువలు

 • అవసరాన్ని బట్టి తగిన స్ప్రేయర్ ని, నాజిల్సును ఎన్నుకోవాలి. పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులను పిచికారి చేయడానికి ప్లాట్ ఫాన్ నాజిల్ కాని, హాలో కోన్ నాజిల్ కాని వాడవచ్చు. స్ప్రేయర్ ని వాడిన తరువాత మూడుసార్లు మంచినీటితో కడిగి శుభ్రపరచాలి. సాధరణంగా నాజిల్స్ లో చెత్త చెదారం చేరి పిచికారి సరిగ్గా జరగక మందు ద్రావణం ఎక్కువ తక్కువ అవ్వడం, అవసరమైన చోట పడకుండా వృధాగా పోవడం జరుగుతుంది.
 • మందు ద్రావణం తయారు చేయడానికి మంచినీటిని వాడాలి. స్ప్రేయర్లోని ఫిల్టర్లను తరచుగా శుభ్రపరచాలి. నాజిల్ లో చెత్త చేరినప్పుడు నోటితో ఎప్పుడు ఊదరాడు.
 • మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదుని మాత్రమే వాడాలి. తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువ వాడిన పురుగు లేదా తెగులు త్వరగా రోగనిరోధక శక్తిని పెంపొందిచుకుటుంది.
 • ఎండ త్రీవ్రత ఎక్కువగా ఉన్నపుడు గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు మందులు పిచికారి చేయరాదు.
 • పిచికారి చేసిన తరువాత కనీసం ఆరుగంటలు వర్షం కురవదు అని భావిస్తేనే పిచికారి చేపట్టాలి.
 • మందు ద్రావణాన్ని జలాశయాల దగ్గర, నీరు నిల్వ వుంచే ఒక బక్కెట్లో నీరు తెచుకొని అందులో కొలిచిన మోతాదులో మందును కలిపి ఆపై స్ప్రేయర్ లో పోయాలి.
 • పిచికారి చేసే మనిషి శరీరం పై స్ప్రేయర్ ను తగిలించుకున్న తర్వాత మందు ద్రావణాన్ని పోయకూడదు.
 • ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకొని పంపులో నింపే ముందు ప్రతిసారీ కలియబెట్టి వాడుకోవాలి.
 • మందు మోతాదు కొలవడానికి డబ్బా మూతలు కాకుండా మందు డబ్బాతో వచ్చిన కొలమనికనే వాడాలి.
 • చేతి పంపుతో అయితే 200-250 లీటర్లు, తైవాన్ పంపుతో 100 లీటర్లు, పవర్ పంపుతో 80-100 లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది.
 • మందు ద్రావణం పంపుని బట్టి మారిన ఎకరానికి వాడే మందు మోతాదు మారదు.
 • ఉదా : ఎసిఫేట్ ఎకరాకు 300 గ్రా. అయితే, పంపేదయినా సూచించినా మోతాదును పంపుకు పట్టే ద్రావణంలో కలిపి వాడుకోవాలి.
 • పిచికారి సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌసులు, ముక్కుకి మాస్క్, కళ్ళకు రక్షణ కవచాలు విధిగా ధరించాలి. సస్యరక్షణ మందులు మన శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి. నుదురు నుండి 36 శాతం చెవుల నుండి 47 శాతం, చేతులు నుండి 21 శాతం, పాదాల నుండి 14 శాతం, పొట్ట నుండి 18 శాతం, జననేంద్రియాల ద్వారా 100 శాతం సస్యరక్షణ మందులు శరీరంలోకి ప్రవేశిస్తాయని అంచనా. కాబట్టి రక్షణ దుస్తులు ధరించాలి. ఎక్కువ చెమట పట్టేటటువంటి దుస్తులు ధరించిన అవశేషాలు ఎక్కువగా శరీరంలోనికి ప్రవేశించే ప్రమాదం ఉండి.
 • పిచికారి చేసిన వెంటనే రక్షక దుస్తులను శుభ్రంగా ఉతికి, సబ్బుతో స్నానం చేయాలి.
 • మందులను పిచికారి చేసే సమయంలో నీరు త్రాగటం, ఆహారం తినడం గుట్కా తినడం, పొగ త్రాగడం వంటివి చేయరాదు.
 • ఆహార పంటలపైన, కూరగాయలు, పండ్లతోటల్లో, పశుగ్రాస పంటలపై సస్యరక్షణ మందులు వాడినప్పుడు సిఫారసు చేసిన వేచి ఉండాల్సిన సమయం సుమారు 7-10 రోజుల తరువాత కోసి మార్కెట్ కి పంపాలి.
 • పిచికారి చేసిన వెంటనే పశువులను మేపకుండా జాగ్రత్త పడాలి.
 • పంటకాలంలో 2-3 సార్లు పిచికారి చేయవలసినప్పుడు ఒకే మందును కాకుండా మందులను మార్చి పిచికారి చేయాలి. నిపుణుల సలహా మేరకు మాత్రమే రెండు మూడు మందులను కలిపి పిచికారి చేసుకోవాలీ . లేదంటే పంట దెబ్బతింటుంది.
 • కాలపరిమితి దాటిపోయిన మందులను వాడరాదు.
 • పిచికారి చేసిన తరువాత స్ప్రేయర్లు వాటి విడి భాగాలు ముఖ్యంగా నాజిల్ లను మంచి నీటితో మూడు సార్లు కడిగి ఆరబెట్టాలి.
 • విత్తనశుద్ధి చేసినటువంటి విత్తనాల్ని విడిగా భద్రపరచాలి. పిల్లకు అందుకుండా జాగ్రత్త పడాలి.
 • వాడేసిన మందు డబ్బాలను నీటి కుంటల దగ్గర, పొలంలో ఎక్కడంటే అక్కడ వదిలి వేయకూడదు. పొలంలో ఒక నిర్ధారించిన చోట జలాశయాలకు దూరంగా గుంత త్రవ్వి ఈ మందు డబ్బాలను పూడ్చి పెట్టాలి.
 • ఒకవేళ మందు ద్రావణం శరీరం పైన గాని, కళ్ళలోన గాని పడితే వెంటనే నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. పొరపాటున సేవించినట్లయితే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
 • సి.ఐ.బి.ఆర్.సి చే నిషేదించబడిన మందులను వాడరాదు. ఇది వారి వెబ్సైట్ లో నుంచి తీసుకోవచ్చు. ఉదా: మోనోక్రోటోపాస్ వాడకం కూరగాయల పై నిషిద్ధం.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.00188323917
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు