অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి సాగులో మెళకువలు

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి సాగులో మెళకువలు

మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా రమారమి 44మి. హెక్టార్లలో రైతుసోదరులు సాగు చేస్తున్నారు. ఇందులో 3 శాతం (1.32 మి. హెక్టారలో) హైబ్రిడ్ వరిని సాగు చేస్తున్నారు. భారత దేశానికి పెరుగుతున్న జనాభాకనుగుణంగా 2025 వరకు వారి ఉత్పత్తిని 130 మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయాల్సి ఉంది. దిగుబడి పెంచాలంటే ఇతర యాజమాన్య పద్ధతులతో పాటు హైబ్రిడ్ వారి విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని సాధించాలంటే ఏం సాగుచేసే విస్తీర్ణంలో సరాసరి 20 శాతం వరకు సంకర వరిని మనం సాగుచేసుకోవాలి. హైబ్రిడ్ వరి విస్తీర్ణం పెంచాలంటే అధిక దిగుబడినిచ్చే సంకర వంగడాలతో పాటు నాణ్యమైన హైబ్రిడ్ విత్తనం రైతులకు అందించాలి. మన దేశంలో సుమారు 40కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సంకర వరి విత్తనోత్పత్తిని చేస్తున్నాయి.

మన దేశంలో వరి ప్రధాన ఆహార పంటగా రమారమి 44మి. హెక్టార్లలో రైతుసోదరులు సాగు చేస్తున్నారు. ఇందులో 3 శాతం (1.32 మి. హెక్టారలో) హైబ్రిడ్ వరిని సాగు చేస్తున్నారు. భారత దేశానికి పెరుగుతున్న జనాభాకనుగుణంగా 2025 వరకు వారి ఉత్పత్తిని 130 మిలియన్ టన్నుల వరకు అభివృద్ధి చేయాల్సి ఉంది. దిగుబడి పెంచాలంటే ఇతర యాజమాన్య పద్ధతులతో పాటు హైబ్రిడ్ వారి విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని సాధించాలంటే ఏం సాగుచేసే విస్తీర్ణంలో సరాసరి 20 శాతం వరకు సంకర వరిని మనం సాగుచేసుకోవాలి. హైబ్రిడ్ వరి విస్తీర్ణం పెంచాలంటే అధిక దిగుబడినిచ్చే సంకర వంగడాలతో పాటు నాణ్యమైన హైబ్రిడ్ విత్తనం రైతులకు అందించాలి. మన దేశంలో సుమారు 40కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సంకర వరి విత్తనోత్పత్తిని చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంకర వరి విత్తనోత్పత్తిని రబీ కాలంలో చేస్తున్నారు. ఈ విత్తనోత్పత్తిలో రైతు సోదరులు కొన్ని మెళకువలు పాటించినట్లయితే నాణ్యతగల మంచి విత్తనాలు ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలు గడించవచ్చు.

రబీ పంట కాలంలో సంకర వరి విత్తనోత్పత్తికి అనుకూలమైనది. ఈ కాలంలో ఆడ, మగ రకాలు పుష్పించే దశలో వర్షాల బారిన పడవు. తద్వారా అధిక, మంచి నాణ్యత కలిగిన విత్తనాలను పొందవచ్చు. ఈ సమయంలో గాలిలో తేమ శాతం 72–80 శాతం వరకు, సాధారణం. పగటి ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెంటీగ్రేడ్, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా 8-10 డిగ్రీల సెంటిగ్రేడకు మించి ఉండని సమయాన్ని ఎంచుకొని సం విత్తనోత్పత్తి చేపటాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తేడా 8-10 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా లేదా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే వరి సంకర విత్తన దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కనుక మంచి సారం కలిగి నీటి వసతులతో పాటు మురుగు నీరు పోయే వసతి  కలిగిన నేలలు వారి విత్తనోత్పత్తికి అనుకూలం. ఈ నేలలు ఆడ మగ రకాలు ఒకేసారి పుత దశకు వచ్చేవిధంగా దోహదపడి అధిక దిగుబడికి అనుకూలిస్తాయి.

వరిలో సంకర విత్తన్నాని అనగా ఆడ మగ మొక్కలను సంకర పరచడం ద్వారా విత్తనం ఉత్పత్తి చేస్తారు. డిసెంబర్ నుండి జనవరి వరకు ఎ(ఆడ), ఆర్ (మగ) మొక్కల విత్తనాలను విత్తుకోవడానికి అనువైన సమయం. ఇందుకు గాను ఎ, ఆర్ లకు, చెందిన విత్తనాలను అధీకృత సంస్ధల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. ఎ-15 కిలోలు/హె ఆర్-10 కిలోలు/హె.

హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో జన్యు స్వచ్చత విత్తన ధృవీకరణ సంస్థ ప్రమాదాలకనుగుణంగా ఉండాలంటే - సిఫారుసు చేయబడిన ఏర్పాటు దూరం తప్పనిసరిగా - పాటించాలి. వరిలో ఏర్పాటు దూరం పరిస్థితులను బట్టి - మూడు రకాలుగా నిర్ణయించబడుతుంది.

  • అంతర వేర్పాటు దూరం (స్పేస్ ఐసోలేషన్) - వేరే వరి రకాలు నుంచి సుమారు 100 మీ. చేర్పాటు దూరం తగ్గకుండా ఉండేటట్లు చూడాలి.
  • సమయ ఏర్పాటు దూరం (టైమ్ ఇసోలేషన్) వివిధ కారణాల చేత పంటకు కావాల్సిన అంతరు వేర్పాటు వీలుకానప్పుడు హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసే పంటకు, ఈ పంటకన్నా ముందు చేసిన వరి పంటకు విత్తే సమయంలో కనీసం 21 రోజులు తేడా ఉండే విధంగా నాటుకోవాలి.
  • అపరాధ పంటల ద్వారా ఏర్పాటు దూరం (బారియర్ ఐసోలేషన్) - పంట చుటు ఎక్కువ ఎత్తు పెరిగి పంటలు అనగా చెరకు, మొక్కన్న జొన్న సజ్జ వంటివి 30 మీ. వరకు వేసుకొని వేర్పాటు దూరాన్ని కల్పించవచ్చు.

ఒక హెక్టారు విస్తీర్ణం నాటుకోవడానికి 100 చ.మీ. నారుమడి సరిపోతుంది. ఎంపిక చేసిన స్దలంలో నారుమడి కోసం రెండుసార్లు చేయాలి. ఒక హెక్టారుకి సరిపోయే నారుమడికి 500 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని, నారుమడిలో 2-3 సెం.మీ. మేర నీరు నిల్వ ఉంచి ఐదు రోజుల వ్యవధిల 2-3 సార్లు బాగా దమ్ముచేసుకోవాలి. దమ్ము చేసిన తర్వాత 1 మీ వెడల్పుతో అవసరానికి అనువైన  పొడవుతో పొలానికి 5 నుండి 10 సెం.మీ. ఎత్తుతో  మళ్ళను తయారు చేసుకోవాలి. మడికి మడికి మధ్యలో మురుగు నీటి కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. 100 చ.మీ. గల నారుమడికి ఆఖరి దమ్ములో 1 కిలో నత్రజని, 1 కిలో పొటాష్ లనిచ్చే ఎరువులను వేసుకోవాలి. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల నారు ఎదుగుదల తగ్గే పరిస్థితుల్లో ఫాస్ఫరసినిచ్చే ఎరువుల మోతాదును రెట్టింపు చేసి నారుమడిలో వేయాలి. జింక్ లోపం ఉన్న భూముల్లో నారుమడికి 1 కిలో జింక్ సల్ఫేట్ వేయాలి. అలానే ఇనుప ధాతు లోపం గమనించినట్లయితే 1 లీటరు నీటిలో 10 గ్రా. అన్నభేదిని నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని 2-3 సార్లు ఏడు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.

అధికారుల సూచన మేరకు నారుమడులు తయారు చేసుకున్న తర్వాత విత్తనాన్ని నీటిలో ఒకరోజు నానబెట్టాలి. విత్తనాలు నానబెట్టే ముందుగా విత్తనాలను కలియబెట్టాలి. తద్వారా తొలు విత్తనాలు నీటిపై తేలుతాయి. వాటిని తీసివేయాలి. ఈ విత్తనాలకు విత్తనశుద్ధి కార్బండిజమ్ మందుతో (3 గ్రా. కిలో విత్తనానికి) చేయాలి. నానబెట్టిన విత్తనాలను మండె కట్టుకోవడం ద్వారా మొలకశాతం ఎక్కువ వస్తుంది. ఈ మొలక వచ్చిన విత్తనాలను నారుమడిలో ఒక కిలో చొప్పున (20 చ.మీ.లకు) చల్లుకోవాలి. నారుమళ్ళలో నీరు పలుచగా ఉండేలా ఎప్పుడూ చూసుకోవాలి. విత్తనాలు చల్లిన పదిహేను రోజుల తర్వాత నారుమడికి 1 కిలో నత్రజనినిచ్చే ఎరువులను పైపాటుగా వేసుకొని అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆడ (ఎ-లైను), మగ (ఆర్-లైన్) మొక్కలను నిర్దిష్టమైన వరుసలలో నాటుకోవాలి. సాధారణంగా పరి వరుసలను 8 ఎ వరుసలు, 2 ఆర్ వరుసలు (8:2) ఉండే విధంగా నాట్లు వేసుకోవాలి. ఆడ, మగ వరుసల నిష్పత్తి ప్రాంతాల వారిగా, మొక్కలు లక్షణాల ఆధారంగా నిర్ణయిస్తారు.

సాధారణంగా ఎ, ఆర్ మొక్కలు 21 నుండి 25 రోజుల వయస్సులో ఉన్నప్పుడు నాటుపెట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ఏ, ఆర్ మొక్కల మధ్య పంటకాలంలో ఉండే తేడాను బట్టి ఆడ, మగ మొక్కలలో వేటిని ముందు నాటు వేయాలో నిర్ణయించుకోవాలి. ఎక్కువ వయస్సున్న నారు నాటడం వలన పూత ఆలస్యంగా రావడం, అదే విధంగా తక్కువ వయస్సుగల నారు వలన పూత తొందరగా రావడం జరుగుతుంది. దీని వలన ఎ, ఆర్ వరుసల మధ్య పూత సమయంలో తేడావచ్చి విత్తనాలు సరిగా ఏర్పడక దిగుబడి తగ్గడానికి అవకాశముంది. అందువలన ముందుగా కోతకు వచ్చే ఆడ లేదా మగ మొక్కలను ఆలస్యంగా నాటుకోవాలి. ఆలస్యంగా కోతకు వచ్చే మొక్కలను ముందుగా నాటుపెట్టాలి. ఆడ, మగ మొక్కల మధ్యగల పూత కాలంలో గల తేడాను బట్టి అదే వ్యత్యాసం ఉన్న రోజుల్లో నాటాలి. సాధారణంగా వరి సంకర విత్తనోత్పత్తిలో మగ, ఆడ మొక్కల మధ్య దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి.

ఆర్ మొక్కల మధ్య దూరం - 30 సెం.మీ.

ఎ మొక్కల మధ్య దూరం - 15 సెం.మీ.

మగ (ఆర్), ఆడ (ఎ) వరుసల మధ్య దూరం 20-30  సెం.మీ.

ఆడ, మగ మొక్కకి మొక్కకి మధ్య దూరం- 15 సెం.మీ.

రెండు మగ (ఆర్) వరుసల మధ్యలో 8 వరుసల ఆడ మొక్కలను ఒక బ్లాక్ లో వేసుకోవాలి. నాటేటప్పుడు ఒక కుదురుకు 1-2 మొక్కలు ఉండే విధంగా 15x15 సెం.మీ. ఎడంతో నాట్లు పెట్టుకోవాలి.

ప్రధాన క్షేత్రంలో మగ (ఆర్) మొక్కలను రెండు వరుసలలో నాటుకోవాలి. రెండు మగ (అర్) వరుసల మధ్యలో ఆడ (ఎ) మొక్కలను 8 వరుసలలో నాటడానికి 145 సెం.మీ. వదిలి వేయాలి. నాటేటప్పుడు ఒక్కో కుదురుకు 2-3 మొక్కలు ఉండే విధంగా 30x15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

సంకర విత్తనోత్పత్తిలో మంచి జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత సాధించాలంటే విత్తన ధృవీకరణ సంస్థ సూచించిన పద్దతులను విధిగా అమలు చేయాలి. కేళిలను మొక్క ఆకుల బాహ్య లక్షణాలను ప్రాతిపదికగా తీసుకొని శాఖీయ దశలో గుర్తించాలి. పంట పూత దశలో ఆడ, మగ మొక్కలు వెన్ను బయటకు వచ్చే పద్ధతి, వెన్ను లక్షణాలు, పుప్పొడి రంగు ప్రాతిపదికగా పక్వ దశలో ఆడ మొక్కలలో గింజశాతం, గింజ రకం, గింజ ఆకారం ప్రాతిపదికగా గుర్తించి కేళీలు పొలంలో నుండి ఏరివేయాలి.

వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ప్రధాన సమస్య అడ మొక్కల వరుసలో పోటాకు నుండి వెన్ను పూర్తిగా వెలువడదు. ఇందుకొరకు జిబ్బరిల్లిక్ ఆమ్లాన్ని హెక్టారుకు 45-60 గ్రా. చొప్పున 500 లీ. నీటిలో కలిపి రెండు దఫాలుగా 5-10 శాతం వెన్నులు బయటకు వచ్చిన దశలో 40 శాతం, తర్వాత రోజున (60 శాతం) పిచికారి చేయాలి. అంటే రెండు దఫాలుగా జిబ్బరిల్లిక్ ఆమ్లం నీటిలో కరగదు కనుక ద్రావణాన్ని 1 గ్రా. జిబ్బరిల్లినేని 25 మి.లీ. ఆల్కహాలుతో 70 శాతం కలిపి రైతుసోదరులు తయారు చేసుకోవాలి.

వరి స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని వృద్ధి జరుపుకుంటుంది. హైబ్రిడ్ వరిలో పరపరాగ సంపర్కం పెంపొందించడానికి తాడు లాగడం లేదా కర్రలతో మగ మొక్కలను దులపడం లేక వంచడం వలన పుప్పొడి రేణువులు ఆడ మొక్కల కీలాగ్రంపై పడి పరపరాగ సంపర్కం జరుగుతుంది. మొదటిగా ఈ అనుబంధ సంపర్క చర్యను ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్యలో 30 నిమిషాల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు వారం రోజుల పాటు 30-40 శాతం పన్నులు బయటకు వచ్చిన దశలో నైపుణ్యం గల వారిచే చేయించాలి.

వరిలో కలుపు నివారణకు గాను నాటిన 3-5. రోజులలోపు 2.5 లీ. బ్యూటాక్లోర్ అనే కలుపు మందును 50-70 కిలోల ఇసుకలో కలిపి ఒక హెక్టారులో చల్లుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు మొక్కలను పనివారిచే తీసి వేయించాలి. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు లేదా 4 టన్నులు కోళ్ళ ఎరువు (బాగా చివికిన ఎకరాకు) వేసుకోవాలి. సుమారు 50 కిలోల డి. ఎ.పి. 150 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనగా ఎకరాకు 15 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. ఆఖరి దుక్కిలో భాస్వరం, పొటాషినిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనినిచ్చే ఎరువులను అలరి దుక్కిలో, పిలక తొడిగే దశలోపు పైపాటుగా వేయాలి. నత్రజనిని ఎక్కువగా వాడినట్లయితే పూత రావడం ఆలస్యం అవుతుంది. అలాగే భాస్వరం, పొటాషలు వేసినట్లయితే పంట పూతకు త్వరగా పస్తుంది. ఎకరానికి 20 కిలోల జింక్ సల్పేటీసు దన్నులో వేసుకోవాలి.

రైతు సోదరులు అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు సమయానుకూలంగా చేపట్టాలి. వెన్ను చొప్ప పసుపు రంగుకు మారినప్పుడు నీటి తడులను నిలిపివేసినట్లయితే మొక్కల్లోని తేమశాతం తగ్గి గింజలు అరడం మొదలవుతుంది. సంకర విత్తనోత్పత్తిలో మొదట ముగ వరుసలు కోసి పొలం నుండి బయటకు తీసిన తర్వాతనే ఆడ మొక్కల వరుసలను కోయాలి. ఏ మాత్రం కేజీలలో కల్తీ జరగకుండా నూర్పిడి చేపట్టాలి. ఆడ, మగ మొక్కల కుప్పలను వేర్వేరు నూర్పిడి బల్లలపై చేపట్టినట్లయితే యాంత్రిక కర్తిలు చాలా వరకు తగ్గించవచ్చు.

విత్తన ధృవీకరణ సంస్థ సిఫారసు చేసిన విత్తన ప్రమాణాలు:

ప్రమాణం

విత్తన ధృవీకరణ శాతం

స్వచ్చమైన విత్తనం

98.0

కేళీలు

0.20

ఆడ మొక్కల వరుశల్లో ఇతర మొక్కలు

0.20

మగ మొక్కలలో ఇతర మొక్కలు

0.20

ఆడ వరుసల మొక్కల్లో పుప్పొడినిచ్చే మొక్కలు

0.10

అభ్యంతరకరమైన కలుపు మొక్కలు

0.20

పైన తెలియజేసిన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన రైతుపొదరులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సంకర విత్తనాలను ఉత్పత్తి చేసి అధిక లాభాలను పొందవచ్చు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate