Accessibility options
Accessibility options
భారత ప్రభుత్వం
భాగస్వామ్యం అందించినవారు : Molugu Sukesh07/01/2021
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
చింత సుమారు 24 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిపై 10-20 కొమ్మలు ఉండి చివర తొడిమలు, పూలు అక్కడక్కడ వెదజల్లినట్లుగా ఉంటాయి. కాయలు నవంబరు, డిసెంబరులో పడుతాయి. బాటల పక్కన ఖాళీ స్దలాలలో అనువైన చెట్టు. కలప గట్టిది కాబట్టి పనిముట్లు, రోకళ్ళు, గానుగలు తయారుచేస్తారు.
నిస్తారమైన తక్కువ తేమ గల ప్రాంతాల్లో పెరుగగలదు. చెట్ల వేర్లు లోతుగా ప్రక్కకు విస్తరించడం వలన నేల గుల్లబారి, భూసారము పెరుగుతుంది.
పి.కే.యం – 1 రకం అంట్లు వేయాలి. దీని వలన 4-5 సంవత్సరాలలో చెట్లు పూతకు వచ్చి దిగుబడి మొదలవుతుంది. చెట్టుకు 30-40 కిలోల కాయ దిగుబదినిస్తుంది.
విత్తనాలను జనవరి – ఫెబ్రవరిలో సేకరించి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. కిలో బరువులో 2000 గిజలుంటాయి. విత్తనాలను నీటిలో 24 గంటలు నానబెట్టి సంచుల్లో నాటాలి. వారం రోజులలో విత్తనం మొలకెత్తుతుంది. జూలై నేలలో నాటటానికి సిద్ధంగా ఉంటాయి.
ఎకరానికి 40-50 మొక్కలు వరకు నటుకోవచ్చు.
10 x 10 మీ. లేదా 9 x 9 మీ. ఎడంలో నాటుకోవాలి. ఒక సంవత్సరం వయస్సు కలిగిన మొక్కలను వర్షాకాలంలో నాటుకోవాలి.
మొదటి 4-5 సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు లాభసాటిగా పెంచుకోవచ్చు. చెట్లు బాగా పెరిగాక పశుగ్రాస పైర్లను పెంచుకోవచ్చును.
మొక్కలు పెట్టె ముందు నేలను లోతుగా దున్నాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో లోతుగా దున్నినట్లయితే కలుపు నివారణే కాక వర్షపు నీరు భూమిలో నిలువ ఉండి మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
నీరువున్న ప్రదేశాలలో మొదటి వేసవి కాలంలో మొక్కలకు 3 వారాలకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి.
10 సంవత్సరాలు పెంచిన చెట్లకు సుమారు 20-30 కిలోల పచ్చికాయలు లభిస్తాయి. 15 సంవత్సరాల చెట్లకు 30-40 కిలోల కాయలు లభిస్తాయి. ఇలా సుమారు 80 సంవత్సరాల వరకు ప్రతి 2 సంవత్సరాల కొకసారి దిగుబడి వస్తుంది. దీనిలో 55 శాతం గుజ్జు, 34 శాతం గింజలు ఉంటాయి. గింజలు పిండి పదార్దాలకు చౌక ప్రత్యామ్నాయం. కొన్ని ప్రాంతాలలో చింత చిగురును అమ్మి లాభాలు సంపాదిస్తారు.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
మన దేశములో వ్యవసాయ పంటల్లో కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మరియు పక్షుల వలన నష్టం కలుగుతుంది.
ఈ పేజిలో వరంగల్ జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.
జామతోటల సాగులోనులిపురుగులబెడద-సమగ్రయాజమాన్య పద్దతులు
వ్యక్తులు సాధించిన విజయాలు
వివిధరకాల అటవీ వ్యవసాయ పద్ధతులు
ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.
భాగస్వామ్యం అందించినవారు : Molugu Sukesh07/01/2021
పెద్ద పెద్ద సారాంశాలను చదవాల్సిన అవసరం లేదు. వికాస్ AI సహాయంతో సంక్షిప్త సారాంశం కోసం 'కంటెంట్‌ను సంగ్రహించు' పై క్లిక్ చేయండి.
32