অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మలబారు వేప

మలబారు వేప శాస్త్రీయ నామము మిలియ దూబియ. ప్రస్తుత పరిస్దితులలో రైతుల పాలిట కల్పవృక్షం మరియు చాలా అద్భుతమైన కలప జాతికి చెందిన చెట్టు. ఇది మన వాతావరణానికి అనుకూలమైనది. తక్కువ పెట్టుబడి, కూలీలు ఎక్కువగా అవసరం లేనిది మరియు మంచి మార్కెట్ అవకాశాలు కలది.

మలబారు వేప దాదాపు 25-35 అడుగుల ఎత్తు వరకు నిటారుగా పెరుగుతుంది. దీని కైవారము (చుట్టుకొలత) సుమారుగా 3-4 అడుగులు ఉంటుంది. మలబారు వేప బహుళ ప్రయోజనకారి. చెట్టులోని ప్రతి భాగము విలువైనదే, వృధాగా పోయేది ఏదీ ఉండదు. ఈ కలపను ప్లైవుడ్ కు, బిల్డింగ్ మెటీరియల్, బయోమాస్, కర్రబొగ్గు వంట చెఱకు, ఇంటిరియర్ డెకరేష్ న్ కు, ఫ్లోరింగ్, సీలింగ్, ప్యాకింగ్ మొదలైన వాటికీ ఉపయోగించి అధిక అడయంను పొందవచ్చును.

రెండు సంవత్సరాల వయస్సు ఉన్న చెట్టు అగ్గిపుల్లల తయారీకి, 4 సంవత్సరాల వయస్సు చెట్టు కాగితపు పరిశ్రమకు, చివరగా 7 సంవత్సరాలు దాటినా తరువాత ప్లైవుడ్ తయారికి వాడవచ్చు.

సాగు విషయాలు

మలబారు వేపను రెండు విధాలుగా సాగు చేయవచ్చు

సాగు అంశాలునీటి వసతివర్షాధారం
భూమి తయారు ఎండాకాలం లోతు దుక్కి దున్ని చదును చేయాలి. దుక్కి లోతుగా దున్ని సాళ్లలో వేయడం మంచిది.
నాటే సమయం జూన్ నుండి మార్చ్ వరకు ఎప్పుడైనా నాటవచ్చు,. జూన్ – జూలై వర్షాకాలంలో నాటవచ్చు.
మొక్క ఎంపిక/ఎత్తు పాలీ సంచిలో ఒక అడుగు ఎత్తు ఉండాలి. పాలీ సంచిలలో నాటవచ్చు .
గుంతలు 1.5 x 1.5 x 1.5 అడుగుల పొడవు, వెడల్పు, లోతు 1.5 x 1.5 x 1.5 అడుగుల పొడవు x వెడల్పు x లోతు
మొక్క నాటే విధానం మెత్తటి ఎర్రమట్టి 5-10 కిలోలు, పశువుల ఎరువు 5 కిలోలు, వర్మికంపోస్ట్ 2 కిలోలు, సూపర్ ఫాస్పేట్ 1 కిలో అన్ని కలిపి గుంతలు నింపుకోవాలి. పాలీ కవర్ చింపి మట్టి గడ్డతో పాటు గుంత మధ్యలో నేరుగా నాటుకోవాలి. ఎర్రమట్టి 5 కిలోల పశువుల ఎరువు 5 కిలోలు, వర్మికంపోస్ట్ 2 కిలోలు సూపర్ ఫాస్పేట్ 1 కిలో అన్ని కలిపిన మిశ్రమాన్ని గుంతలలో నింపుకోవాలి. పాలికవర్ చింపిమట్టి గడ్డతో పాటు గుంత మధ్యలో నేరుగా నాటుకోవాలి.
మొక్కల సంఖ్య 10 x 10 అడుగులు = 460 మొక్కలు ఎకరానికి 10 x 10 అడుగులు = 460 మొక్కలు ఎకరానికి
12 x 12 అడుగులు = 300 మొక్కలు ఎకరానికి 9 x 9 అడుగులు = 550 మొక్కలు ఎకరానికి
ఎరువు పెరుగుదల మొదలైన తర్వాత ప్రతి 6 నెలలకు 8-10 కిలోల పశువుల ఎరువు, వర్మికంపోస్ట్ (2 కిలోలు) డిసెంబరు-జనవరి మరియు జూన్ – జూలై నేలలో 2 దఫాలుగా వేయాలి. పెరుగుదల మొదలైన తర్వాత ప్రతి 6 నెలలకు 8-10 కిలోల పశువుల ఎరువు వర్మికంపోస్ట్ (2కిలోల) డిసెంబర్ – జనవరి మరియు జూన్ – జూలై నేలలో 2 దఫాలుగా వేయాలి.
నీటి తడులు ప్రతి నెల ఒకసారి నీరు ఇస్తే మొక్క పెరుగుదల త్వరగా ఉంటుంది. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెట్టవచ్చును. మధ్యలో వీలును బట్టి ట్యాంకర్ ద్వారా నీరు ఇవ్వాలి. ముఖ్యంగా ఎండలు మొదలైనప్పటి నుండి ఎండకాలం అయితే వరకు తప్పనిసరిగా నీటితడులు జాగ్రత్తగా ఇస్తూ ఉంటె మొక్కల పెరుగుదల బాగుంటుంది.

అంతర పంటలు

అటవీ వ్యవస్యంలో భాగంగా మొక్కల మధ్య ఖాళీ స్ధలములో ప్రారంభ దశ నుండి మొక్కల లేత వయస్సు వరకు అంటే 3-4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసి వాటి నుండి ఆదాయం పొడవచ్చు. అంతర పంటల ఎంపికలో రైతుకు ఉన్న వనరులు, ఇబ్బందులు, మార్కెట్ సదుపాయాలను బట్టి వాటిని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటలు వేసుకోకపోతే వర్షాకాలంలో అధిక వర్షాలకు నెల పై పొర కోత జరుగవచ్చు లేదా కలుపు మొక్కలు పెరిగి ఇతర చీడ, పిడలకు స్దవరము ఇవ్వవచ్చు.

ఒకవేళ అంతర పంటలు వేయకపోతే కనీసం జనుము విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత పూత రాక ముందే పొలములో కలియ దున్నితే భూసారము ఎక్కువ పెరగుతుంది.

నాణ్యమైన మొలకలు (విత్తనాల ద్వారా వచ్చినవి) మరియు క్లోన్స్ (శాఖీయ పధ్ధతి ద్వారా) తమిళనాడు రాష్ట్రంలోని గుర్తించబడిన నుర్సిరిలా నుండి తెచ్చుకోవచ్చు. ఒక్కో మొక్క సుమారుగా రూ. 6-7, అదే క్లోన్స్ రూ. 10-12 అమ్ముతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా కొద్ది నర్సరిల లోనే మలబారు వేప మొక్కలను పెంచుతున్నారు. నమ్మకమైన నర్సారిలలో నాణ్యమైన మొక్కలు మాత్రమే కొనుకోలు చేయలి.

సాగు ఖర్చులు ఎకరానికి మొదటి సారి కోత సమయంలో 7 సంవత్సరాలు ఉన్న ఒక్క చెట్టు సుమారు 20-25 అడుగుల ఎత్తు, 120 – 150 సెం. మీ. కైవారం (చుట్టుకొలత) 500 కిలోలకు పైగా బరువు ఉంటుంది.

మొదటి సంవత్సర ఖర్చురూపాయలు
దుక్కి నేల తయారీ 10,000
మొక్కల గుంతల తవ్వకము, మట్టి, ఎరువు మిశ్రమము 15,000
నాటడం, నింపడము, బేసిన్ చేయడం 2,000
నీటి తాడులు ట్యాంకర్ మోటరు ఖర్చు 10,000
పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, కూలీల ఖర్చు (2 దఫాలు) 7,000
కలుపు తీయడము, ఊత కర్రలు కట్టడం, అంతర సేద్యం మరియు ఇతర ఖర్చులు 6,000
మిగితా 6 సంవత్సరాలకేయ్యే ఖర్చు 50,000
మొత్తం ఖర్చు (7 సం. లకు) (రూ.) 1,00,000

మలబారు వేపను ఉపయోగించే విధానాన్ని కలపా కోత సమయాన్ని బట్టి ఆరు సంవత్సరాలకు ఎకరానికి సుమారు రూ. 3 నుండి 6 లక్షల వరకు నికరాదాయాన్ని అర్జించవచ్చును.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate