వెదురును పచ్చ బంగారం అని కూడా అంటారు. ఇది బహువర్శికం. సన్నగా పొడవుగా ఎదుగుతుంది.భూమిలోని దుంప నుండి పెరుగుతుంది. అనుకూల పరిస్దితులో చాలా త్వరగా పెరుగుతుంది. మన రాష్ట్రంలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో విరివిగా పెంచుతున్నారు.
అన్ని రకాల నేలల్లో పెతుగుతుంది. గరప నేలలు అనుకూలమైనవి. చవుడు లేదా ఆమ్ల గుణాలు కలిగిన నేలలు పనికిరావు.
జూన్ – జూలై (తొలకరి వర్షాలకు నాటుకోవాలి)
గట్టి వెదురు (డె౦డ్రోకాలదుస్ స్త్రీక్టస్) : ఈ వెదురు గుల్ల ఉండదు.
మామూలు వెదురు (బాంబుసా ఆరండునేసియ) : ఈ వెదురులో గుల్ల ఉంటుంది. వంకర లేకుండా నిటారుగా ఉండి తేలికగా ఉంటుంది. గుల్లగా ఉండటం వలన సన్నగా చీల్చి వివిధ పనులకు వినియోగిస్తారు.
గట్ల చుట్టూ 4 మీ. దూరంలో, తోటగా పెంచినపుడు 5 x 5 మీ.
200
వెదురు వేరు రైజోమ్స్ ద్వారా ప్రవర్ధనం అవుతుంది. సుమారు ఒక సంవత్సరం పెంచిన రైజోమ్స్ ని సుమారు 1 లీటరు వరకు కత్తిరించి వర్షాకాలంలో నాటాలి.
మొదటి 3 సంవత్సరాల వరకు అల్లం, మిరప, పసుపు లాంటి నీడను ఇచ్చే పంటలను అంతర పాటలుగా వేసుకోవాలి .
నాటే సమయంలో ప్రతి గుంతలో 4 కిలోల పశువుల ఎరువు కలిపి నింపాలి. వెదురు పంటకు ఎక్కువ మోతాదులో ఎరువులు కావాలి. వెదురును కోసిన తర్వాత ఎరువులు వేసి నీరు పెట్టాలి. నత్రజని, పోటాష్ ఎరువును సంవత్సరంలో 3-4 సార్లు వేయాలి. అలాగే పచ్చిరోట్ట ఎరువులు, పశువుల ఎరువు, కర్ర బూడిదను వేయాలి.
వెదురు పంటల వరుసల మధ్య ఒకటి రెండు సార్లు దుక్కిచేసి అంతర పంటలు వేయవచ్చు. భూమిలోని తేమ సద్వినియోగానికి భూమిపైన 20 సెం. మీ. వరకు వరి గడ్డిని వరుసలలో కప్పాలి. దీని వలన కలుపు పెరుగుదల కూడా తగ్గుతుంది.
పంట నాటే సమయంలో నీరు పెట్టాలి. అలాగే వేసవి కాలంలో నెలకొకసారి తడి ఇచ్చినట్లయితే దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ పధ్ధతి ద్వారా కూడా నీరు పెట్టవచ్చును.
ఒక ఎకరంలో 150 కుదుళ్ళు వరకు ఉంటాయి. 7-8 సంవత్సరాల నుండి కుదురుకు సంవత్సరం విడిచి సంవత్సరం 10 గేదల చొప్పున 1500 గేడలు వస్తాయి. గెడకు రూ. 10/- చొప్పున ఎకరానికి రూ. 15,000/- ఆదాయం వస్తుంది. ఇలా 20-25 సంవత్సరాల వరకు అధికంగా దిగుబడినిస్తాయి.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/10/2023