অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సుబాబుల్

సుబాబుల్ అతి త్వరగా పెరిగే బహువార్షిక మొక్క వంట చెఱకు, పశుగ్రాసం, పనిముట్లకు కలప మరియు కాగితపు గుజ్జు లాంటి అవసరాలు తీర్చగలదు. విత్తనాలు సులభంగా మొలకేత్తుతాయి. వర్షాభావ పరిస్దితులల్లోకూడ బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మి. మీ. ఉన్న ప్రాంతాలలో బాగా పెరుగుతుంది.

నేలలు

తటస్ద నేలలు అనుకూలమైనవి. లోతైన, సారవంతమైన, ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి.

అనుకూలమైన సమయం

జులైలో మొక్కలు నాటుకోవాలి.

రకాలు

హవయిన్ జెయింట్, కె.636 రకాలను సాగుచేయవచ్చు. కె-6, ఎస్-24, 22, ఎస్-10, కె-8 మొదలుగు రకాలు జాతీయ పశుగ్రాస అభివృద్ధి సంస్ధ, ఝాన్సీ వారిచే అందించబడుతున్నవి.

విత్తన మోతాదు (ఎకరాకు)

3 కిలోలు

విత్తన శుద్ధి

విత్తనాన్ని సుమారు 30o సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి, తీసిన విత్తనాన్ని చల్లని నీటిలో 12 గం. నానబెట్టి విత్తుకోవాలి.

విత్తే దూరం

3 x 2 మీ.

మొక్కల సాంద్రత (ఎకరాకు)

666 నుండి 1000 మొక్కలు

విత్తు పధ్ధతి

వేసవిలో 30 x 30 x 45 సెం. మీ. గుంతలను తవ్వితే నేల గుల్లబారి మొక్క నటటానికి అనువుగా ఉంటుంది. వర్షాకాల ప్రారంభంలో మట్టి నింపిన గుంతల్లోను మొక్కలను నాటుకోవాలి.

అంతర పంటలు

మొదటి సంవత్సరం పప్పుదినుసు జాతి పైర్లను పెంచవచ్చు. రెండవ సంవత్సరం నుండి పశుగ్రాస పంటలను పెంచుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం

సుబాబుల్ లెగ్యుమినేసికి చెందినది కావడం వలన నత్రజని ఎక్కువగా అవసరం లేదు. 10-12 కిలోల నత్రజని మరియు 12-15 కిలోల భాస్వరం ఎకరానికి విత్తే ముందు వేసుకోవాలి. ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి భాస్వరం ఎరువును వర్షాకాలం మొదట్లో వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం

కలుపు నివారణ మొదటి 2 సంవత్సరాల వరకు చేసుకోవాలి. చెట్ల ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికి ఎత్తుగా పెరిగేటట్టు చేస్తే 10-15 సంవత్సరాల వరకు కలప ఉత్పత్తి అవుతుంది.

నీటి యాజమాన్యం

సుబాబుల్ వేర్లు భూమిలో చాలా లోతుగా వెళ్తాయి. కాబట్టి బెట్ట పరిస్దితులను బాగా తట్టుకుంటుంది. ఆశించిన దిగుబడులు పొందడానికి ప్రతి నెలకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి.

పంటకోత, దిగుబడి

2-5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంట చెఱకు అయితే 2-3 సంవత్సరాల మధ్య నరకవచ్చు. పశుగ్రసానికయితే ప్రతి 2-3 నెలలకు 10-15 సెం. మీ. ఎత్తులో నరకాలి. కాగితపు గుజ్జుకు అయితే 4-5 సంవత్సరాల మధ్య నరకవచ్చు. పచ్చిరోట్టగా ఉపయోగిస్తే ఎకరాకు 8-12 కిలోల నత్రజని లభిస్తుంది.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate