పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాకర

కాకర

కాకరలో విటమిన్లు, కాల్షియం, ఇనుము, ఖనిజ లవణములు, క్రొవ్వు పదార్ధములు, పిండి పదార్ధములు అధికముగా కలవు. కాకరను మనదేశములో వాణిజ్య సరళిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు కేరళలో సాగుచేస్తున్నారు. భారతదేశములో 26,004 హెక్టార్ల  విస్తీర్ణంలో సాగుచేయబడుచున్నది. సరాసరి దిగుబడి 6.20 ట/హె.

రకాలు : కోయంబత్తూరు గ్రింలింగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్, అర్కాహరిత్, పూసా విషెష్, పూసా దో మెసామి, ప్రియా మొదలగునవి.

హైబ్రీడ్స్ : ఎంబిటి హెచ్ 101, 102, ఎన్.ఎస్-431, 432, 7711, పాలి, ప్రాంచి, ష్వెత.

కోయంబత్తూరు గ్రీన్ లాంగ్ :  వీటి కాయలు 30-35 సెం.మీ. పొడవు ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంది ఎక్కవ రోజులు రంగు కోల్పోకుండా ఉంటాయి. దూరప్రాంతాలకు ఎగుమతి చేసినప్పుడు కాయలు నిగారింపు కోల్పోకుండా ఉంటాయి. సగటు దిగుబడి : 6-7 ట/ఎ.

కోయంబత్తూరు వైట్ లాంగ్ : వీటి కాయలు కూడా 20-25 సెం. పొడవుండి తెల్లగా ఉంటాయి. కాయలు ఎక్కువ రోజులు నిల్వకు పనికిరావు. సగటు దిగుబడి 6.5 ట/ఎ.

ఆర్కా హరిత్ : ఈ రకాన్ని తొలకరి మరియు వేసవి పంటగా కూడా పండించవచ్చు. కాయలు సన్నగా నీళ్లు కండె ఆకారంలో ఉంటాయి. ఈ రకంలో చేదు తక్కువగా ఉండి తొక్క మందము మధ్యస్ధంగా ఉండి ఎకరాకు 3-4 టన్నుల దిగుబడి వస్తుంది.

పూసా విశేష్ : ఈ రకము వేసవి పంటగా సాగుచేయుటకు చాలా అనుకూలము.

పుసాదో మెసామి: ఒక్కో కాయ 100-120 గ్రా. బరువు ఉంటుంది. సగటున ఎకరానికి 4-6 టన్నుల దిగుబడి ఉంటుంది.

ప్రియ : కాయల పై బుడి పెలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాయలు ఆకుపచ్చ రంగులో ఉండి 40 సెం.మీ. పొడవుండును. ఒక్కో తీగ సుమారు 40-50 కాయలను యిస్తుంది.

వాతావరణం : ఉష్ణోగ్రత 25 నుండి 30 సెం. మధ్య ఉంటే తీగ పెరుగుదల బాగుంది ఎక్కవ దిగుబడి నిస్తుంది. అదే 18 సెం. కంటే తక్కువగా ఉంటే పూత ఆలస్యముగా వచ్చి కథ తగ్గుతుంది. ఉష్ణోగ్రత 36 సెం. కంటే ఎక్కువగా ఉంటే మగాపుల శాతం పెరిగి దిగుబడి తగ్గుతుంది.

నేలలు : సారవంతమైన ఎర్ర గరప నేలలు, ఓండ్రునెలలు, మురుగు నీరుపోయే సకార్యంగల తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలము. ఉదజని సూచిక 6.5-7.0 మధ్య ఉంటే మంచిది.

పంటకాలం : ఖరీఫ్ పంటగా జూన్-జులై మాసములో విత్తాలి. వేసవి పంటగా డిశంబర్ రెండో పాశము వరకు విత్తుకోవచ్చు. ఖరీఫ్ పంట ఆలస్యంగా విత్తినచో పూత, పిండే సమయంలో చలి ఉంటే పాదు ఎదుగదుల తగ్గి దిగుబడులు బాగా తగ్గుతాయి.

విత్తన మేతాడు : 0.8-1.0 కిలోలు/ఎకరాకు.

విత్తనశుద్ధి : ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత ట్రెకోడెర్మా విరిడి 5 గ్రా. ఒక కిలో విత్తనానికి లేదా కప్తాన్ లేదా ధైరం 3 గ్రా. మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

విత్తేదూరం : వరుసల మధ్య 1.5-2.0 మీ. వరుసలో పాదుల మధ్య 0.5-0.75 మీ. ఉంటేటట్లు విత్తుకోవాలి. ఒక్కో పాదులో 3-5 విత్తనాలు ఉండేటట్లు నాటుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత 2-3 వారాలకు పాదుకు 2 మొక్కలు ఉంచి మిగిలినవి తీసివేయాలి. విత్తిన 2 వారాల తర్వాత పాదులో మొక్కలు మెలకెత్తకపోతే తిరిగి విత్తుకోవాలి.

ఎరువులు యాజమాన్యం : ఆఖరి దుక్కిలో 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును ఎకరా పొలంలో చేసి కలియదున్నాలి. ఎకరాకు 8 కి నత్రజని, 32 కి. భాస్వరము, 20 కి పోటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. వర్షాధార పంటకు ఎరువుల మెత్తారు సగానికి తగ్గించాలి. పై పాటు ఎరువుగా 8 కి. నత్రజనిని విత్తిన 25-30 రోజులలో రెండో దపా మేతాడు పూత, పిందె సమయంలో అంటే విత్తిన 50 రోజులకు ప్రతి పాదులో వేసి నీరు కట్టాలి.

నీటి యాజమాన్యం : గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి 3-4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. ఈ విధంగా మొలకెత్తే వరకు నీరు పెట్టి మెలికెత్తిన తర్వాత వారానికి ఒకసారి పాదులలో నీరు నిండుగా పారించాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు యివ్వాలి.

అంతరకృషి : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. పాడుచుట్టు ఉన్న నేలను గుల్లబడేటట్లు చేయాలి. కలుపు మెక్కల నివారణ కొసం ఎకరాకు అలకాలా 0.6 లేదా బ్యూటక్లోర్ 0.2 కిలోల మూలపదార్ధం చొప్పున గింజలు విత్తిన మరసటి రోజు నెల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. పై మందులు పిచికారి చేసే ముందు నెలలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. ఈ మందులు విత్తిన 30 రో. వరకు కలుపు మొక్కల పెరుగుదలను నివారిస్తాయి. ఆ తర్వాత 45 రోజులకు కూలీలతో కలుపు తీయంచాలి. కాకర తీగలను పందిరి పైకి ప్రాకి స్తే కాయ దిగుబడి పెరుగుతుంది. పండు ఈగ బెడద బాగా తగ్గుతుంది.

జీవన ఎరువులు : ఎకరాకు 2 కిలోల అజోస్పెరిల్లం మరియు 2 కిలోల పాస్పో బాక్టీరిమ్యను పశువుల ఎరువుతో కలిపి వేయాలి.

దిగుబడి : విత్తిన 60-65 రోజులకు కాయలు కోతకు వస్తాయి. 3-4 రోజులకు ఒకసారి కోయాలి. దిగుబడి : 4-6 ట/ఎ.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.2
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు