పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కాలిప్లవర్

శీతాకాలములో సాగుచేసే పంటలలో కాలిప్లవర్ చాలా ముఖ్యమైనది.

శీతాకాలములో సాగుచేసే పంటలలో కాలిప్లవర్ చాలా ముఖ్యమైనది. ఈ పంట మఖ్యంగా దీని యెక్క లేత పూలు కోసం సాగు చేయబడుతోంది. 'పూగోభి' గా పిలవబడే ఈ పంటను అనేక రకాలుగా వాటాలలో ఉపయేగిస్తారు. కాలిప్లవర్ లో పొటాషియం, సోడియం, ఇనుము, పాస్పేర్స్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి లవణాలు, ధాతువులు చాల ఎక్కువగా లభ్యమవుతాయి.

విస్తీర్ణం : ఈ పంట మనదేశంలో సుమారు 4,33,900 హెక్టారులలో సాగు చేయబడుతూ 85,73,300 టన్నుల దిగుబడితో 19.8 టన్నులు/హె. ఉత్పాదకతను కలిగి యున్నది.

ప్రస్తుతం సాగులో వున్న సమస్యలు

  • విత్తనాల ధర అధికంగా వుండడం
  • కాలానుగుణంగా రకాలను ఎంపిక చేయకపోవటం
  • రైతులకు సాంకేతిక పారిజానం సరిగా లేకపోవడం
  • చీడపీడల సమస్యలు అధికంగా వుండడం
  • విచక్షణా రహితంగా పురుగు మందులు ఉపయెగించడం
  • సమగ్ర ఎరువుల మరియు పురుగుల యాజమాన్యం పాటించక పోవడం.

కాలిప్లవర్ పంటను సాగుచేసేటప్పుడు ఆయాప్రాంతాల శీతోష్ణ పరిస్ధితులు అనుగుణంగా వుండేలా రకాలను ఎన్నిక చేయాలి.

రకాలు

స్వల్పకాలిక రకాలు :

ఎర్లికున్వారి : చాలా త్వరగా కోతకు వచ్చే రకము. లేత ఆకుపక్క ఆకులతో, ఆకుల పై మైనపు పూతతో వుంటుంది. పూలు తెల్లగా, ఒత్తుగా వుండి, సున్నితంగా వుంటాయి. సెప్టెంబర్ మాసంలో కోతకు వస్తుంది. దిగుబడి : 2.5-3 ట/ఎ.

పూసా కేట్కి: అక్టోబర్-నవంబర్ మనంలో కోతకు వచ్చే రకం. మధ్యస్ధా పరిమాణం గల పూలతో వుంటుంది.

పంత్ గోబీ-2 : నవంబర్-డిసెంబరులలో కోతకు వస్తుంది. దిగుబడి : 5 ట/ఎ .

పంత్ గోబీ-3 : అక్టోబర్ లో కోతకు వస్తుంది. దిగుబడి : 4 ట/ఎ.

మధ్యకాలిక రకాలు

ఇంప్రూవ్డ్ జాపనీస్ : ఈ రకము ఇజ్రాయిల్ దేశము నుండి ప్రవేశపెట్టబడినది. పూలు మధ్యస్ధా పరిమాణంలో ఉంటాయి.

పంత్ శుభ్ర : పువ్వు నంరైసిగా వుంటుంది. దిగుబడి : 8 ట/ఎ.

పూసా హిమజ్యోతి : పువ్వు మొత్తం పూర్తిగా ఆకులతో కప్పబడి వుంటుంది. పూలు తెల్లగా వుండి, ఎండ తగిలినా కూడా రంగును కోల్పోకుండా వుంటాయి. ఈ రకం ముఖ్యంగా కొండా ప్రాంతాలలో సాగుచేయుటకు అనుకూలమైంది. ఎండాకాలంలో సాగు చేసినప్పుడు (కొండా ప్రాంతాలలో) సుమారు 500-600 గ్రా. బరువు గల పూలను ఇస్తుంది.

పూసా హైబ్రిడ్-2 : ఈ రకము బూజు తెగులును తట్టుకుంటుంది. పూవు తెల్లగా వుండి సుమారు కిలో బరువు కలిగి వుంటుంది. నవంబరు మధ్య నుండి డిసెంబర్ మధ్యకాలం వరకు కోతకు వస్తుంది. దిగుబడి : 9 ట/ఎ.

దీర్ఘకాలిక రకాలు :

పూసా సింథటిక్ : పూలు మధ్యస్ధంగా వుండి తెల్లగా, ఒత్తుగా వుంటాయి. మధ్య సెప్టెంబర్ నుండి చివరి సెప్టెంబర్ వరకు నాటుటకు అనుకూలంగా వుంటుంది. జనవరిలో కోతకు వస్తుంది.

పూసా శుభ్ర : పూలు 700-800 గ్రా. బరువును కలిగి, పూవు పై నూగు లేకుండా వుంటాయి. నాటిన 90-95 రోజులకు సుమారు నాగం వుగోభిలు తెగులును తట్టుకుంటుంది. దిగుబడి : 8 ట/ఎ.

దానియా కలింపంగ్ : తూర్పు కొండల ప్రాంతాలలో బాగా సాగుచేయబడుతున్న రకం. జనవరి-ఫిబ్రవరి మాసాలలో కోతకు వస్తుంది. గట్టిగ, బలంగా వుండే  మొక్కలు, తెల్లటి పూలను కలిగి వుంటాయి. పూలు మధ్యస్ధా పరిమాణాన్ని కలిగి వుంటాయి. ఈ రకం వాతావరణం లోని మార్పులను తట్టుకోలేడు. దిగుబడి : 10-12 ట/ఎ.

పూసా స్నోబాల్ : పూలు ఒత్తుగా, మధ్యస్ధంగా, తెల్లగా మంచు వంటి తెల్లదనాన్ని కలిగి వుంటాయి. కాబట్టి దీనిని స్నోబాల్ అంటారు. ఉత్తర భారత ప్రాంతంలో సాగుచేయడానికి అక్టోబర్ మొదటి పషంలో అనుకూలం. ఇది జనవరి-ఫిబ్రవరి మాసాలలో కోతకు వస్తుంది. నల్ల కుళ్ళు తట్టుకోదు.

పూసా స్నోబాల్ కె-1 : నల్లకుళ్ళు తెగులును తట్టుకునే రకము. పూలు తెల్లగా గుండ్రంగా వుంటాయి. ఆలస్యంగా కోతకు వచ్చి మంచి నాణ్యతకు కలిగి వుండడం వల్ల ఈ రకము చాలా ప్రాచుర్యం పొందింది. జనవరి-ఫిబ్రవరి మాసాలలో కోతకు వస్తుంది.

ఇవేగాక అనేక ప్రయివేట్ కంపెనీకి విడుదల చేసిన రకాలు కూడా సాగుచేయబడుతున్నవి.

విత్తన మేతదు:

స్వల్పకాలిక రకాలు : 240-320 గ్రా.

దీర్ఘకాలిక రకాలు : 160-200 గ్రా.

కాలిప్లవర్ లో కూడా క్యాబేజి మాదిరిగా సాగు పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ చర్యలు అవలంభించాలి.

కాలిప్లవర్ సాగు ఇతర సమస్యలు

బట్టనింగ్ : చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. దీనికి కారణాలు ముదురు నారు నాటుకోవడం, నత్రజని తక్కువ అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వాలాను ఈ సమస్య వస్తుంది. నివారణకు : 21-25 రోజుల వయసు గల నరుసు నాటుకోవాలి. తగినంత మేతదులో నత్రజని ఎరువు వేయాలి. స్వల్పకాలిక తాకాలని సిపార్సు చేసిన సమయంలోనే నాటుకోవాలి.

రైసెనేస్ : వాతావరణంలో ఉప్నోగ్రత పెరిగితే పువ్వు వదులుగా, విచ్చుకున్నట్లుగా అయి, పువ్వు గడ్డ పై నూగు వస్తుంది. మార్కెట్ విలువ తగ్గుతుంది. నివారణకు : అధిక ఉప్నోగ్రతను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పువ్వలను సరైన సమయంలో ఆలస్యం చేయకుండా కొత్త కోయాలి.

బ్రానింగ్ : షరా నెలల్లో పెంచే పంటలో బోరాన్ లోపం వలన పువ్వా పై గోధుమ రంగు మచ్చులు ఏర్పడతాయి. కందం గుల్లగా మరి నీరు కారుతోంది. నివారణకు ఆఖరు దుక్కిలో 8-10 కి/ఎ. చొ న బొరాక్స్ వేయాలి. 3 గ్రా. బొరాక్స్/లి. నీటికి కలిపి పువ్వగడ్డ దశలో పిచికారి చేయాలి.

కొరడా తెగులు (విప్ టెల్) : మాలిబ్డినం ధాతు లోపం వలన ఆకులూ పసుపుగా మరి, అంచులు తెల్లబడతాయి. లోపం తీవ్రంగా ఉండే ఒక్క మధ్య ఈనే  మాత్రమే ఉంటుంది. నివారణకు నత్రజని మేతదు ఎక్కువైతే మాలిబ్డినం మొక్కకు అందుబాటులో ఉండదు. కండువాలను తగు మేతదులో సిపార్సు మేరకు నత్రజని వేయాలి. ఎకరాకు 400 గ్రా. సోడియం లేదా అమ్మేనియం మాలీబడేట్ 200 లి. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కాలిప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వు పై కప్పుతూ (సూర్యరశ్మి చేరకుండా చేసి) దారం లేదా రబ్బరు బ్యాండు కట్టాలి. ఆ తర్వాత 4-5 రోజులకి తీసి, కొత్త కోయాలి.

దిగుబడి : పంటకాలం, రకం ననుసరించి 8-14 ట/ఎ.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

2.78571428571
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు