పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

క్యాబేజి

ఈ సాగుచేసే కూరగాయలలో క్కబెజి చాలా ముఖ్యమైనది.

శీతాకాలంలో సాగుచేసే కూరగాయలలో క్యాబేజి  చాల ముఖ్యమైనది. ఈ క్కబెజిని కూరగాయగానే కాకా సలాడుగా కూడా వాడుతారు. దులుకోసినోలేట్ సినీగీరిం అనే మదార్ధము కలిగి ఉండడం వల్ల ఈ క్కబెజి ఒక రకమైన వాసనను కలిగే ఉంటుంది.

విస్తీర్ణం : మన దేశంలో 4,00,100 హెక్టారులలో సాగుచేయబడుతూ 90,39,200 టన్నుల దిగుబడితో 22.6 ట./హి.కు చొ.న ఉత్పసకథను కలిగి వున్నది.

ప్రస్తుతం సాగులో వున్న సమస్యలు

 • విత్తనాల ధర అధికంగా వుండడం
 • రైతులకు సాంకేతిక పారిజినలు తగినంత లేకపోవడం
 • చదపీడల సమస్యలు అధికంగా వుండడం
 • పురుగు ముందులు విచ్చదనారహితంగా ఉపయెగించడం
 • రైతులు సమగ్ర యాజమాన్య మరియు సస్యరక్షణ చర్యలు పాటించకపోవడం

క్యాబేజి వంటను పండించేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ పరిస్ధతులకు అనుగుణంగా ఉండే రకాలను ఎన్నిక చేయాలి.

స్బల్పకాలిక రకాలు

గోల్డెన్ ఏకర్ : గడ్డలు చిన్నగా, గుండ్రంగా వుండి 1.0 నుండి  1.5 కిలోల  బరువును కలిగి వుంటాయి. నాటిన తర్వాత సుమారు 60-70 రోజుల లోపల కోతకు వస్తాయి. ఆలస్యంగా కొస్తే గడ్డలు పగులుతాయి. కాబట్టి తయారైన 10 రోజుల లోపుగానే కోతను కోయాలి.

ఎర్లిద్రమ్ హెడ్ : గడ్డలు 2-3 కిలోల బరువుంటాయి. దిగుబడి : 8-12 ట/ఎకరానికి.

ఫ్రీడ్ అఫ్ ఇండియా : గడ్డి పరిమాణం 1.5-2.0 కిలోల వరకు ఉంటుంది. గోల్డెన్ ఏకర్ కంటే కొంచెం గట్టిగ వుంటుంది. దిగుబడి 8-11 ట/ఎ.

పుసాముక్త : గడ్డలు కొంచెం గుండ్రంగా బల్ల పరుపుగా వుండి సుమారు 1.5 నుండి  2 కిలోల బరువును కలిగి ఉంటాయి. ఈ రకము 'నల్లకుళ్ళు'  తెగులును తట్టుకుంటుంది. నాటిన 65-70 రోజులలో 10-12 టన్నుల దిగుబడిని ఎకరాకు ఇస్తుంది.

కోపెన్ హాగన్ మార్కెట్ : గడ్డలు 2.0 నుండి  2.5 కిలోల  బరువును కలిగి వుంటాయి. ఆకులూ బయటకు వుండి బాగా విస్తారంగా వుంటాయి. నాటిన 75-80 రోజులకు కోతకు వస్తాయి.

ఎక్స్ ప్రెస్ : గోల్డెన్ ఏకర్ లగే వుంటుంది. కానీ దాని కంటే త్వరగా కోతకు వస్తుంది.

హరిరాణిగోల్ : మహికో (ఎఫ్-1  హైబ్రిడ్) గడ్డలు 1.9 కిలోల బరువుతో, పెద్దగా, వుండి, ఆకుపక్క రంగులో వుంటాయి. నాటిన 95 రోజుల లోపున కోతకు వస్తుంది. ఈ రకాలని బాగా విలువ ఉండే గుణం వుంటుంది. కాబట్టి దూర ప్రాంతాల మార్కెట్ కు పంపడానికి వీలుంటుంది. వైరస్ తెగులు మరియు నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. ఎకరాకు 22-24 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

మధ్యకాలిక రకాలు

మిడ్ సీజన్ మార్కెట్ :  నాటిన 80-90 రోజులకు కోతకు వస్తాయి. గడ్డలు 2-4 కిలోల బరువుంటాయి.

సెప్టెంబరు ఎర్లీ : నీలగిరి కొండలలో సాగుచేయడానికి అనువైన రకం. 3-5 కిలోల పొడవు వుంటాయి. ఈ రకం కొనిన తరువాత కూడా మిగలకుండా నిలువ వుంటుంది. కాబట్టి మెర్కెట్ ను బట్టి కోతలకు అనుకూలంగా వుంటుంది. నాటిన 150-110 రోజులలో కోతకు వస్తుంది. దిగుబడి : 16-20 ట/ఎ.

దీర్ఘకాలిక రకాలు:

పుసాడా మ్ హెడ్ :  దీర్ఘశీతాకాలానికి అనువైన రకం. గడ్డలు బల్లపరుపుగా ఉంది సుమారుగా 3 - 5 కిలోల బరువును కలిగి వుంటాయి. బయట ఆకులూ లేత ఆకుపచ్చ రంగులో వుండి మధ్య ఈనెల ప్రస్ఫూటంగా కన్పిస్తూ వుంటాయి. దిగుబడి : 8 - 12 ట/ఎ.

లెట్ డ్రమ్ హెడ్ : 110-116 రోజుల లోపల కోతకు వస్తాయి. గడ్డలు పెద్దవిగా వుండి వదులుగా వుంటాయి. కె-1 : గడ్డ పెద్దగా లోపల భాగం తెల్లగా ఉంటుంది. దిగుబడి : 8 - 12 ట/ఎ.

ప్త్రెవెట్  సంకర రకాలు : బియాస్ యస్ -150 బియాస్ యస్-126 , నాధలష్మి, గ్రీన్క్ష్ప్రెస్, గ్రీన్ బాయ్, శ్రీ గణేష్ గోల్, సోనా, శ్యేత, అవంతి, క్విస్తో, మినాశి, గ్రీన్ ఛాలెంజర్, గ్రీన్ బాయ్ మొ.వి.

నేలలు : నీటి పారుదల బాగా వుండి, మురుగునీటి సేకర్యం గల నల్లరేగడి నేలలు క్యాబేజి సాగుకు అనుకూలంగా వుంటాయి. ఉదజని సూచిక 5.5-6.5 వరకు వుండే నేలలు అనుకూలం.

విత్తన మేతాడు : సూటి రకాలు ఎకరాకు 280-320 గ్రా. సంకర రకాలు : ఎకరాకు 120-200 గ్రా.

విత్తనశుద్ధి : విత్తే ముందు విత్తనాలను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా/కి తర్వాత ధైరం 3 గ్రా. కిలోకు ఆ తర్వాత త్రైకోడెర్మా విరిడితో 5 గ్రా/కి విత్తనానికి విడివిడిగా విత్తనశుద్ధి చేయాలి. బాగా ఆరబెట్టినా విత్తనాలను నారుమడిలో విత్తుకోవాలి.

నాటే కలం : స్వల్పకాలిక రకాలు : జులై-ఆగష్టు లోను మధ్యకాలిక రకాలు : సెప్టెంబర్ లోను, నారుమడిలో విత్తకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటాలి.

ప్రధాన పొలం తయారీ : పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నాలి. దుక్కిలో 8-10 టన్నులు పశువుల ఎరువుతో బాటుగా భాస్వరము, పోటాష్ ఎరువులకు వేయాలి. బాగా చదును చేసిన తరువాత కాలువలు, బోదెలను 60 సెం. మీ. దూరంలో వుండే విధంగా తయారు చేయాలి.

నారు నాటుట : 4-6 వారాల వయస్సుగల నారును పొలంలో నీటిని పెట్టి నాటాలి. నాటిన వారం రోజుల లోపుగా ఖాళీగా వున్న ప్రాంతాలలో పై నాటును వేయాలి.

నాటే దూరం : స్వల్పకాలిక రకాలు : 60*30 సెం.మీ. లేదా 45*45 సెం.మీ., మధ్యకాలిక రకాలు :  60*45 సెం.మీ. దీర్ఘకాలిక రకాలు: 60*60 సెం.మీ.

నీటి యాజమాన్యం : నాటిన వెంటనే నీరు పెట్టాలి. నల్ల రేగడి నెలలలో 10 రోజులకు ఒకసారి మరియు తేలిక నెలల్లో 6 రోజులకు ఒకసారి చొప్పున ఆపివేయాలి. నీటిని ఇస్తే గడ్డలు పగితే అవకాశం వుంటుంది. మంచి దిగుబడులు రావాలంటే క్యాబేజీలో తప్పనిసరిగా నీటి యాజమాన్యం పాటించాలి.

ఎరువుల యాజమాన్యం : చివరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువుతో బాటుగా 200 గ్రా. వేపపిండి, 2 కిలోల పాస్పోబ్యాక్టీరియా, 60-80 కిలోల భాస్వరము, 40 కిలోల పోటాష్ ను ఇచ్చే ఎరువులను వేయాలి. రసాయనిక ఎరువులను జీవన ఎరువులతో కాకుండా విడిగా వేయాలి.

 • 24-32 కిలోల నత్రజని ఎరువును 2 లేదా 3 ధపాలుగా వేయాలి. నాటిన 30 మరియు 60 రోజుల తరువాత వేయాలి. దీర్ఘకాలిక రకాలకు 75-80 రోజులకు మూడవసారి వేయాలి.
 • పై పాటు నత్రజని ఎరువులతో బాటుగా పోటాష్ ఎరువులను కూడా వేసుకుంటే గడ్డలా నాణ్యత, నిలువ వుండే గుణం వుంటుంది.

కలుపు నివారణ :

అంతరకృషి : పెండిమిధలైన్ 30% ఇసి 1.25 లి . లేదా  అలకలా  1.2 లి /ఎకరాకు చొ న  200 లి. నీటిలో కలిపి నాటిన  24-48 గం లలో  తడినేల పై పిచికారి చేయాలి.అంతరకృషి నాటిన 20-25 రోజులకు  చేయాలి.   2-3 సార్లు గొప్ప త్రవ్వి మట్టిని బోదెల పైకి ఎగద్రోయలి.

సస్యరక్షణ : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

క్యాబేజి రెక్కల పురుగు : (డైమండ్ బ్యాక్మత్) ఈ పురుగు ఆకుల అడుగు భాగాన వుండి, ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులూ వాడి, ఎండి పోతాయి. రెక్కల పురుగులు చిన్నవిగా, ఆకుపచ్చ, గోధుమ రంగుల కలయికలో ఉంది పాలిపోయిన తెలుపు రంగు, సన్నవి ముందు రెక్కలు, పొడుగాటి వెంట్రుకలు కలిగిన వెనుక రెక్కలు కలిగి ఉంటాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పై రులో ఆకులన్నీ రంధ్రాలతో ఉంది, క్యాబేజి పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజి వరుసలు 2 వరుసల చొప్పున ఆవల మొక్కలను ఎరా పంటగా వేయాలి. గ్రుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని (5%) పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎడిపేట్ 1.5 గ్రా  లేదా నోవాల్యురం 10% ఇ.సి. 1.25 మీ.లి. లేదా స్పైనోషద్  0.3 మీ. లి. కలిపి కోతకు 15 రోజుల వ్యాధితో పిచికారి చేయాలి. నాటిన తరువాత 30 , 45 రోజుల్లో బి.టి. మందులు 1 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

నల్లకుళ్ళు తెగులు : ఈ తెగులు పంట ఏ దశలో అయినా ఆశించవచ్చు. ఆకులూ పత్రహరితాన్ని కోల్పోయి 'వి' (V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారుతాయి. స్ట్రెప్టోసైక్లిన్ (1 గ్రా/10 లీటర్ల నీటికి) మందుతో నిత్తనశుద్ది చేయాలి. ఇదే మందును (5 మీ.గ్రా. ఒక లీటరు నీటికి) నారు నాటినప్పుడు, గడ్డ తయారవుతున్నప్పుడు పైరు పై పిచికారి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా. ఒక లీటరు నీటికి) మందు ద్రావణంతో మొక్కల మెదళ్ళు చుట్టూ తడపాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ ప్రొడర్ ను భూమిలో వేయాలి. ఏదైనా నూనెగింజల పంటతో 2 సం.ల. పాటు పంట మార్పిడి చేయాలి.

సమగ్ర సస్యరక్షణ : క్యాబేజి పంటను ఆశించే పురుగుల నివారణ కొరకు సమగ్ర సస్యరక్షణ పధకం రూపొందించాం బడింది. దీనిలో భాగంగా

 • మంచి నారును ఎత్తెన నారుమడులలో పెంచాలి.
 • విత్తే ముందు కప్తాన్ 3 గ్రా. లేదా కర్బందాజిమ్ 1 గ్రా. కిలో విత్తనానికి పట్టించి, తర్వాత త్రైకోధర్మవిరిడి 5 గ్రా/కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
 • నారుపోసిన 15 రోజులకు బిటి సంబంధిత మందులు 1 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి నారు పై పిచికారి చేయాలి.
 • వేసవి దుక్కులు చేయాలి.
 • ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 25 వరుసల క్యాబేజీతో బాటుగా లావు ఆవాలు రెండు వరుసలు ఎరా పంటగా వేయాలి. మొదటి వరుస విత్తిన 15 రోజులకు రెండవ వరుస అవా పంట వేయాలి.
 • నాటిన తరువాత 30 మరియు 45 వ రోజున మరల బి.టి. సంబంధిత మందులు 1 గ్రాము మందు ఒక లీటరు నీటికి చొ న కలిపి పంట పై పిచికారి చేయాలి.
 • 5 % వేపగింజులా ద్రావణం 10 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
 • అవా పంట పై ఆశించిన పురుగుల నివారణకు డైక్లోర్వాస్ 1 మీ.లి. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
 • అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధితో రసం పీల్చు పురుగుల నివారణకు అంతర్వాహి కీటక నాశినులు (సైమిషాయేట్ 2 మీ.లి. లేదా మేతసిస్తాక్స్ 2 మీ.లి. లేదా పిప్రాణి 2) ఒక లీటరు నీటికి చొ న కలిపి పిచికారి చేయాలి.
 • క్యాబేజి పంటకు నష్టం లలిగించే పురుగులతో పొగాకు లద్దె పురుగు కూడా చాల ముఖ్యమైనది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్దతులను తప్పకుండా పాటించాలి.

వీటిలో భాగంగా

 • పొలంలో అక్కడక్కడా ఆముదం మొక్కలను వేయాలి.
 • గ్రుడ్ల సంచులను ఏరి నాశనం చేయాలి.
 • పురుగుల ఉనికిని గమనించడానికి పొలంలో ఎకరాకు 4 చొ న లింగాకర్షక బుట్టలు పెట్టాలి.
 • గ్రుడ్లను తినే ట్రైకొగ్రామా బాధనికలు ఎకరాకు 20,000 చొ న పెట్టాలి.
 • వారానికి ఒకసారి చొ న వరుణగా 4 వరాలు యస్.పి.వి. వైరస్ ద్రావణం 250 యల్.ఇ. 200 లి నీటికి కలిపి పంట పై పిచికారి చేయాలి.
 • ఎకరానికి 20 చొ న రాశి స్ధావరాలను ఏర్పాటు చేయాలి.
 • పెద్ద పురుగుల నివారణకు విషపు రాలను తాయారు చేసి పొలంలో అక్కడక్కడా వుంచాలి.   విషపు ఎరల తయారీకి 10 కి తవుడు + 1 కి బెల్లం పాకం + 500 గ్రా. కార్బరీల్/500 మీ.లి. తగినంత నీటిలో కలిపి చిన్న చిన్న వుండలు చేసి 24 గం ల పాటు వుంచి తరువాత పొలంలో అక్కడక్కడా సాయంత్రం వేలల్లి పెట్టాలి.

తెగుళ్ళ నివారణ

 • నారుమళ్ళలో ఆశించే నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తనశుద్ధి చేయాలి.
 • ఎత్తెన నారుమళ్ళలో నరుసు పెంచాలి.
 • నరుకుళ్ళు తెగులు నివారణకు నరుశుద్ది బ్లేటాక్స్ 3 గ్రా. ఒక లీటరు నీటికి చొ న కలిపినా ద్రావణంతో తడపాలి.
 • కుళ్ళురోగం ఆశించినప్పుడు మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటికి చొ న కలిపి మొక్క చుట్టూ మట్టి బాగా తడిచేలా పోయాలి.
 • పంట మార్పిడి పారించాలి.
 • విత్తనాలకు 50 - 52 సెంటీగ్రేడ్ వేడి నీటిలో ముంచి 20 ని తరువాత తీసి ఆరబెట్టాలి.
 • అంతర పంటకుగా క్యారెట్ మరియు తమతను వేయడం వల్ల డైమండ్ రెక్కల పురుగు తక్కువగా ఆశించే అవకాశం ఉంటుండి.

దిగుబడి : సూటి రకాలు : 8 - 10 టన్నుల / ఎకరాకు, శంకర రకాలు : 20 టన్నులు / ఎకరాకు

 • కోతను ఎప్పుడు చల్లని వెల్లిలో కోయాలి.
 • సైజుల ప్రకారం గ్రేడింగ్ చేసి మార్కెట్ కు పంపాలి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

2.78571428571
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు