పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్యారెట్

క్యారట్ వేరు కూరగాయలలో ముఖ్యమైనది.

క్యారట్ వేరు కూరగాయలలో ముఖ్యమైనది. మనదేశంలో అన్ని ప్రాంతాలలో దీనిని సాగుచేస్తున్నారు. వీటి వేర్లు దుంపలుగా మారడం వల్ల సలాడగా తినడానికి, పలు రకాల కూరలు, స్వీట్లు తయారుచేయడానికి వాడతారు. క్యారెట్ లలో అంధోసైనిన్ ఎక్కవగా ఉండడం వల్ల  ఎర్రగా ఉండే రకాలు, కెరోటిన్ అధికంగా ఉండడం వల్ల నారింజ రంగులో ఉండే రకాలున్నాయి. క్యారెట్ లో విటమిన్-ఎ తో పాటు ప్రోటీన్లు లవణాలు, విటమిన్లు ఎక్కవగా ఉండడం వల్ల మంచి ఫోష్టికాహారంగా గుర్తింపబడింది.

రకాలు : క్యారెట్ లో ఆసియా (ఎర్ర దుంపలు), యూరోపియన్ (నారింజ దుంపలు) రకాలున్నప్పటికీ ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సాగుచేయాలి. ముఖ్యంగా పూసా కేసర్, పూసా మేఘాలు, చంటని, నాటిస్ హాఫ్ లాంగ్, ఖరోడా, రాయల్ ఫోర్టు, న్యూఖరోడా మరియు శంకర రకాలైన రాయల్ ఖరోడా, కురుంచ, నిషా నేహా, నందిని ఎక్కువ సాగులో ఉన్నాయి.

పూసా కేసర్ : దుంపలు లోకల్ రెడ్ కన్నా నెల రోజులు ఎక్కవగా నెలలోనే ఉన్న నాణ్యత చెడిపోదు. అధిక దిగుబడి నిచ్చు ఎర్రదుంపల రకం. దీనిలో కెరోటిన్ శాతం ఎక్కవ.

ఎర్లీ నాన్ టిస్ : దుంపవేర్లు సదుపాకారంలో ఉంది 12-15 సెం.మీ. పొడవు, పై పోరా కలిగి నారింజరంగు కండ కలిగిన రకం. దుంప విత్తిని 90-100 రోజుల్లలో తయారవుతుంది.

చాన్ టని : క్యానింగ్, నిల్వచేయడానికి అనుకూలమైన రకం. వేరు దుంప 11 నుండి 15 సెం.మీ పొడవు, 3-5 సెం.మీ. మందంతో నారింజరంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది శీతోష్ణమండలానికి బాగా అనువైన రకం.

పూసా యమదగ్ని : ఇ.సి. 9981 లో నుంచి త్వరగా కాపుకొచ్చే లక్షణము మరియు నాన్ టిస్ నుంచి బెండు, కండ ఒకే రమగు కలిగిన లక్షణములు ఈ సంకర రకములో ఉన్నాయి. దుంపవేర్లు 15 నుంచి 16 సెం.మీ. పొడవు కలిగి, నారింజ రంగుతో నిగనిలాడుతూ ఉంటాయి. ఎక్కువ కైరో టిన్ శాతంలో అధిక దిగుబడినిచ్చు రకం.

ప్రెవేట్ సీడ్ కంపెనీ వారి లాష్మణే, ఫోటాన్ రకాలు అందుబాటులో ఉన్నవి.

నేలలు : మురుగునీటి వసతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గరప నేలలు చాల అనుకూలం. బరుఁవైన బాల్కనీలలు పనికిరావు. నెల ఉదజని సూచిన 6.5 ఉంటే మంచిది. బంక నెలల్లో వేర్లు పెరుగుడుల మందగించి దుంపలు అభివృద్ధి  చెందకుండా పక్కవేర్లు ఏర్పడతాయి.

వాతావరణం: క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అధిక ఉష్ణోగ్రతతో దుంప పెరుగుదల, రంగు సరిగా ఉండదు. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపలు రంగు తక్కువగా, పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపల దిగుబడిన 18 నుంచి 24 సెం. ఉష్ణోగ్రత ఉండాలి. 15 సెం. కన్నా తక్కువ, 21 సెం. కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కెరోటిన్ శాతం తగ్గుతుంది. అధిక వేడి లేని బెంగుళూరు, చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలు ఏడాది పొడవునా క్యారెట్ సాగుకు అనుకూలం.

విత్తన మేతాడు: ఎకరానికి 2 కిలోల విత్తనం సరి పోతుంది.

విత్తే కాలం: ఆగస్టు నుంచి నవంబరు వరకు విత్తుకోని క్యారెట్ ను సాగుచేయవచ్చు. ప్రతి 15 రోజుల తేడాతో ఆగష్టు నుంచి నవంబరు వరకు విత్తుకుంటే ఎక్కవ కాలం పంట పొందవచ్చు.

ప్రధాన పొలం తయారీ మరియు సాగు విధానం : ఎన్నిక చేసిన పొలాన్ని 4 లేదా 5 సార్లు దుక్కిదున్ని చదును చేయాలి. క్యారెట్ ను చిన్న చిన్న మడులు లేదా బోదెలు చేసి తయారుచేసి సాగుచేయవచ్చు. పొలంలో చిన్న మందులను తయారుచేసి 22.5 సెం.మీ. దూరంలోని వరుసలలో విత్తనాలను 1-1.5 సెం.మీ. లోతులో పడేటట్లు చిత్తాలి. లేదా 30 సెం. మీ దూరంలో బోదెలు తయారుచేసి విత్తనాలు 5 సెం.మీ. దూరంలో పడేలా విత్తాలి. మొలకెత్తే శాతం పెంచడానికి విత్తనాన్ని బాగా రుద్దాలి. విత్తనాలు చిన్నవిగా ఉన్నందువల్ల, ఒక కిలో విత్తనానికి 10 కిలోల సన్నవి ఇసుకతో కలిపి విత్తకుంటే సరియైన దూరంలో విత్తుకోవడానికి సులభంగా ఉంటుంది. విత్తిన 7 రోజులలో విత్తనాలు మెలకెత్తుతాయి.

ఎత్తెన మడుల పద్ధతి : ఇటీవల కాలంలో క్యారెట్ బెడ్ కామ్ సీడ్ ప్లంటర్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ యంత్రంలో బెడ్ తయారీ, విత్తనం ఒకేసారి 8 వరుసల్లో రెండు బెడ్ల పైన నాటడానికి వీలుగా యంతన్ని తయారుచేశారు. ఇది ప్రస్తుంతం వ్యాపార సరళిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలనుకునే వారికీ అత్యంత సులభమైన పద్ధతి. దుంపలు బెడ్ల పైన పెరుగుతాయి. కాబట్టి ఏపుగా పెరగడమే కాకుండా తక్కువ సమయంలో 10 నుండి 15 రోజులు ముందుగా తవ్వకానికి వస్తుంది. ఈ పద్దతిలో నీరు నిలువదు కనుక వేరు కుళ్ళు వ్యాధి సోకె అవకాశం లేదు.

నీటి యాజమాన్యం :వేరు దుంప అధిక దిగుబడులు సాధించటానికి ఎక్కువసార్లు నీరు పెట్టాలి. నేలస్వభావం, వాతావరణ పరిస్ధితులను బట్టి 5 నుంచి 7 రోజులకొకసారి నీరు పారించాలి. దుంపల పెరుగుడుల దశలో తేమ తగినంత ఉండాలి కనుక ఆకులూ వాడిపోయినట్టు గమనించక ముందే తప్పనిసరిగా తడివ్వాలి. అవసరానికి మించి నీరు పెట్టిన వేరు దిగుబడి తగ్గి, మొక్క పెరుగుదల ఎక్కవగా ఉంటుంది. నీటి యాజమాన్యంలో ఒడుదుడుకులుంటే క్యారెట్ నాణ్యత దెబ్బ థింటుంది కనుక క్యారెట్ సాగులో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం.

ఎరువులు : క్యారెట్ కు ఎక్కువ పోషక పదార్ధాలు అవసరం. ఆఖరి దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువు 10 టన్నులు ఒక ఎకరానికి వేయాలి. పశువుల ఎరువుతో పాటు 16 కిలోల భాస్వరం, 10 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. 20 కిలోల నత్రజని  ఎరువులను రెండు సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కిలో మిగతా సగం విత్తిన ఆరువారాల తర్వాత వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా తడివ్వాలి. ఎక్కువ మేతాడు నత్రజని ఎరువులు వేసినచో క్యారెట్ వేర్లు చీలిపోయే అవకాశముంది. రసాయన ఎరువుల కంటే, సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకుంటే క్యారెట్ లో దిగుబడులతో పాటు వేరు నాణ్యత కూడా పెరుగుతుంది.

అంతరకృషి : బోదెలలో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెం.మీ. ఒకటి చొప్పున ఉంచి మిగిలినవి తీసేయాలి. ఖాళీగా వున్నా ప్రదేశాలన పూరించాలి. విత్తిన నెలరోజుల లోపు ఎలాంటి కలుపు తీయంచుకొని మట్టిని మొక్కల మెదళ్ళకు ఎగద్రోయలి. కలుపు నివారణకు ట్రెపీలోన్ కలుపు మందు 0.24-0.4 కి మూలా పదార్ధం ఎకరానికి విత్తేముందు వేయాలి. దుంపలు పెరిగేటప్పుడు ఎండ తగలకుండా మట్టిని ఎగదోయాలి. ఎండ తగిలినచోట దుంపలు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ధర పలకదు.

సస్యరక్షణ : క్యారెట్ పంట పై వచ్చే చీడలు, తెగుళ్ళు చాల తక్కువ, కొన్ని ప్రాంతాలలో క్యారెట్ పై పెంకు పురుగులు, రాష్ట్ర పై దీపపు పురుగులు ఆశించే అవకాశముందు. పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు :

క్యారెట్ రాష్ట్ ప్లై : పిల్లదశ పురుగులు వేర్లులోకి చొచ్చుకొనిపోయి. వేర్లను తినివేస్తుంది. దీనివల్ల వేర్లు ఆకారాన్ని కోల్పోయి, లోపల కుళ్ళిపోయి మార్కెట్ కి పనికి రాకుండా పోతాయి. ఆకులూ కూడా వాడిపోయి రాలిపోతాయి. నివారణకు మలాథియాన్ 2 మీ.లి. ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

ఆకుమచ్చ తెగులు : ఆకుల పై మచ్చలు మీదట ఆకూ అంచుల మీద కనిపించి క్రమేపి ఆకూ అంత వ్యాపిస్తుంది. చివరికి ఆకూ పండుబారి రాలిపోతుంది. ఒక్కసారి ఆకుల కథలు కూడా పూర్తిగా మాది ఎండిపోతాయి. పొలంలో మురుగు నీరు పోయే శోకార్యం కల్పించాలి. 50 సెం. వేడి నీటితో విత్తనాన్ని 15 ని ఉంచి విత్తనశుద్ధి చేయాలి. పంట పై మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 మీ.గ్రా. లేదా కాపర్ హైడ్రాక్సయిడ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బాక్టీరియా ఆకుమచ్చు తెగులు : ఆకుల పై పసుపు మచ్చలు ఏర్పడి గోధుమ రంగు కలిపి నీటి మచ్చలుగా మారతాయి. మచ్చల మధ్యభాగం పొడిగాను, పెలుసుగాను ఉంటుంది. ఆకుల అంచులు ముడుచుకుపోయి చినిపోతాయి. దుంపల పై కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పిడి ఆ భాగం కుళ్ళిపోతుంది. తెగులు నివారణకు తెగులు సోకని పంటల నుంచి మాత్రమే విత్తనం సేకరించాలి. వేడి నీటితో విత్తనశుద్ధి చేయాలి. పంట మార్పిడి పాటించాలి.

పంటకోత : వేరు దుంపలు మొదట తెల్లగా ఉండి తర్వాత పసుపు రంగు నుండి క్రమ క్రమంగా ముదురు నారింజ లేదా ఎరుపు రంగుకు మారతాయి. దుంపలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత నీరు పారించి తర్వాత రోజు ఆకులతో సహా దుంపలను పెరికివేయాలి. పక్వానికి వచ్చిన తర్వాత కూడా దుంపలను తుయకపోతే దుంపల పై వేర్లు వస్తాయి.

దిగుబడి :8-12 ట/ఎకరానికి

నిలువ : పెరికిన క్యారెట్ దుంపలు సాధారణ వాతావరణ పరిస్ధితుల వద్ద 3-4 రోజులు తాజాగా ఉంటాయి. కానీ 0-4.4 సెం. ఉష్ణోగ్రత, 95 శాతం గాలిలో తేమ వద్ద శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే 3-4 నెలలు  చెడిపోకుండా ఉంటాయి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.13333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు