పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తీగజాతి కూరగాయలు సొర

తీగజాతి కూరగాయలు సొర

సొరను ఉత్తర భారత దేశములో విస్తారముగా సాగుచేస్తారు. ఆకుపచ్చరంగులో ఉండి, లేతగా ఉన్న కాయలను కూరగాయగా ఉపయేగిస్తారు. సొర తీగజాతి వార్షిక పంట. మన రాష్ట్రములో ముఖ్యమైన పందిరి కూరగాయలలో ఒకటి. సొర తీగలను వేల పై గని పందిరి మీరు గాని పరికించి పండించవచ్చును. ఈ పంట బెట్టాను బాగా తట్టుకుంటుంది. సొరకాయను కూరగాయగా, స్వీటు తయారీ లోను వాడుతారు. భారతదేశంలో సొర 1,16,939 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తూ 14.28 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. సరాసరి దిగుబడి : 12.21 ట/ఎ.

వాతావరణం : తేమతో కూడిన పొడి వాతావరణం పంటకు చాల అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం. ఉన్నట్లయితే పెరుగుదల బాగా ఉండి పూత, పిండే బాగా పడుతుంది. పూత, పిండే సమయంలో అధిక వర్షపాతం వున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంటను వివిధ రకాలైన నెలలలో పండించవచ్చును. ఉదజని సూచిక 6-7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాల అనుకూలము.

రకాలు

పూసా సమ్మర్ ప్రోలిపిక్ లాంగ్ : వీటి కాయలు 40-50 సెం.మీ. పొడవు, లేత ఆకుపచ్చు రంగు కలిగి ఉండును. ఈ రకము వేసవి వంటగా వేయటకు చాల అనుకూలమైనది.

పూసా సమ్మర్ ప్రొలిఫక్ రెండ్ : ఈ రకం కాయలు గుండ్రంగా ఉంటాయి. 15-18 సెంటి మీటర్ల వ్యాసముతో, ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఇది అధిక దిగుబడినిచ్చే రకము.

పూసా మేఘదూత్ : ఇది ఎఫ్-1 హైబ్రిడ్ రకము. నీటి కాయలు పొడవుగా ఉండును.

పూసా మంజరి : ఇది ఎఫ్-1 హైబ్రాడ్ రకము. ఈ హైబ్రాడ్ రకం కాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

పూసా నవీన్ : వీటి కాయలు మధ్యస్ధంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

అర్కబహార్ : వీటి కాయలు ఒక కిలో బరువు ఉండి, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి కండ చాల లేతగా ఉండి మంచి సువాసన కలిగి యయందును. దీని పంట కాలము 120  రోజులు. దిగుబడి 16-18 ట/ఎ. వేసవి పంటకు అనువైనది.

సామ్రాట్ : వీటి కాయలు 30-40 సెం.మీ. పొడవు ఉంది ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఒక్కో కాయా 700-800 గ్రా బరువు ఉంటుంది. ఈ పంట సరాసరి దిగుబడి 18 ట/ఎ.

పూసా సందేశ్ : ఈ రకము కాయలు గుండ్రంగా ఆకర్షణీయంగా ఆకుపచ్చ రంగులో ఉండి మధ్యస్ధంగా ఉంటాయి. ఇది కాయలు 600 గ్రా. వరకు బరువు కలిగి ఉంటాయి. ఇవి త్వరగా కాపుకు వచ్చే రకము. మొదటి కొత్త విత్తిన 60-65 రోజులలో కోయవచ్చు. ఈ రకం 11-12 ట/ఎ. దిగుబడి నిస్తుంది.

ఇవేగాక వివిధ రకాల ప్రెవేట్ హైబ్రాడ్ రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. కాకనుగుణంగా వీటిని వేసుకుంటే మంచిది. వరద, కావేరి, స్వాతి మొదలగున్నవి వేసవికి అనువైన హైబ్రిడ్ రకాలు.

విత్తన మేతాడు

ఖరీఫ్ పంటకు 1.0 - 1.2 కిలోలు / ఎ .

వేసవి పంటకు 1.2 - 1.6 కిలోలు / ఎ.

విత్తన శుద్ధి : కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ బాగా పట్టించి ఆ తర్వాత ట్రెకోడెర్మా విరిడి 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

విత్తేదూరం

 

వరసల మధ్య

పాదుల మధ్య

ఖరీఫ్ పంటకు

3.0   మీ.

90 సెం.మీ

వేసవి పంటకు

2.0 – 2.5  మీ.

75 – 80 సెం.మీ

విత్తే  విధానం : ఖరీఫ్ పంటకు 3 మీ దూరంలో, వేసవి పంటకు 2.5 మీ దూరంలో 60 సెం.మీ. వెడల్పు గల కాలువలను తయారుచేయాలి. ప్రతి పాదుకు 3,4 విత్తనములు 1-2 సెం. మీటర్ల లోతులో పడునట్లు విత్తి నీరు పెట్టాలి. విత్తనములు 3 నుండి 7 రోజులలో మెలకెత్తును. పాడుకు రెండు బలమైన మొక్కలు ఉంచి మిగిలినవి పెరికి వేయాలి.

ఎరువుల యాజమాన్యం : చివరి దుక్కలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24-32 కిలోల భాస్వరము, 20-24 కిలోల పోటాష్ ను కలువుకోని నామానంగా పొలమంతా వేసుకోవాలి. నత్రజనిని 32-40 కిలోల రెండు సమపాళ్ళుగా చేసి మొదటి మేతాడు విత్తిన 25 రోజులకు వేయాలి. ఎరువులను మొక్కకు 10-15 సెం. ఎడంలో గొప్ప త్రవ్వి, ఎరువు వేసి మట్టిని కప్పి నీరు పెట్టాలి.

అంతరకృషి

కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. మొక్కలు బలంగా పెరుగుడానికి 1-2 సార్లు తేలికగా మట్టిని పాడుచుట్టు గుల్లచేయాలి. అలకలా 0.4 కిలో గ్రాము లేదా బ్యూటక్లోర్ 0.6 కిలో గ్రాము మూలా పదార్ధాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2-3 రోజులలో నెల మీద పిచికారి చేసిన యెడల నెల రోజుల వరకు కలుపు మొక్కలను సమర్ధవంతంగా నివారించవచ్చు.

మల్చింగ్ : వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలైన ఎండుగడ్డి, వరిపొట్టు, వేరుశనగ పొట్టు, మొదలగు వానిని రెండు వరుసల మధ్య పరచాలి లేదా 30-50 మైక్రాన్ మందం గల తెల్ల పలిదాన్ మల్చింగ్ వాడడం వలన నెలలో తేమ కాపాడుకొని నీటిని అదా చేసుకోవచ్చు. నెల అడువులో ఉంటుంది.

కోత, దిగుబడి : బాగా పెరిగిన లేత కాయలను కోయాలి.

దిగుబడి : వేసవి లో 10-12 ట/ఎ.; ఖరీఫ్ 12-18 ట/ఎ.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

2.83333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు