పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పొట్ల

ఈ ముఖ్యమైన పందిరి కాయగూరలలో 'పొట్ల' ఒకటి.

మన రాష్త్రంలో సాగు చేస్తున్న ముఖ్యమైన పందిరి కాయగూరలలో 'పొట్ల' ఒకటి. ఇది త్వరగా పెరిగే వార్షిక తీగజాతి రకం. దీని కాయలు రకాన్ని బట్టి 30 సెం.మీ. నుండి 200 సెం.మీ పొడవు వరకు ఉంటాయి. కొన్ని రకాల కాయల పై చారలు ఉంటాయి.

వాతావరణం : తేమలో కూడిన వేసి వాతావరణం వీటి సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూత, పిందె సమయంలో అధిక ఉష్ణం, వర్షపాతం లేనట్లయితే మంచి దిగుబడులు పొందువచ్చును.

నేల ఎంపిక : నీటికి నిలుపుకోను తేలికపాటి బంకమట్టి నెలలు, ఉదజని సూచిక 6.0-7.0 మధ్య ఉన్న ఒండ్రు మట్టి నెలలు అనుకూలము.

రకాలు

స్వేత : దీని కాయలు 180-200 సెం.మీ. వరకు పెరిగి తెలుపు రంగులో లేత ఆకువచ్చిని చారలు కలిగి ఉండును. ఇది అధిక దిగుబడినిచ్చే రకం. దీని పంట కాలము 125-130 రోజులు. ఎకరాకు 11-12 టన్నుల దిగుబడి యిస్తుంది. వేసవి పంటకు కూడా అనువైనది.

కో-1 : దీని కాయలు 160-180 సెం.మీ. పొడవు వుండి తెల్ల చర్యలతో ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. పంటకాలము : 135 రోజులు, దిగుబడి : సుమారు 7 ట/ఎ.

కో-2 : ఈ రకాన్ని పందిరి అవసరం లేకుండా పండించవచ్చు. కాయలు 30-35 సెం.మీ. పొడువు ఉండి లావుగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి చారలు లేకుండా ఉంటాయి. పంటకాలము 120-130 రోజులు. దిగుబడి : 10-12 టన్నులు/ఎ.

ఎమ్.డి.యు-1 : కాయలు సుమారు 60 సెం.మీ. పొడవు ఉండి ఆకుపచ్చ రంగులో తెల్లని చారలు కలిగి ఉంటాయి.

విత్తే సమయం : ఈ పంటను తొలకరిలో జూన్ - జులై  మాసాలలోను, వేసవి పంటగా అయితే డిసెంబర్ - జనవరి మాసాలలో విత్తుకోవడం మంచిది.

నేల తయారీ : పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదిన్నాలి. 60-80 సెం.మీ. వెడల్పు కాలువలు  2.0 మీ. ఎడంతో వేసుకోవాలి. కాలువలో పాడుకి పాడుకి మధ్య 1.0 - 1.5 మీ. ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి.

విత్తన మేతాడు : ఎకరాకు 0.6-0.8 కిలోల విత్తనం అవసరం అవుతుంది.

విత్తన శుద్ధి : ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. ఒక కిలో విత్తనానికి పట్టించి, ఆ తర్వాత ట్రెకోడెర్మా వీరిది 5 గ్రా. లేదా 3 గ్రా. థేరం మందుతో విత్తనాధుడి చేసి విత్తుకోవాలి.

విత్తు పద్ధతి : ఒక్కో పాడుకి 3-5 విత్తనానికి 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. విత్తిన 8-10 రోజులలో విత్తనాలు మెలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని పెరికి వేయాలి. వర్షాధార పంటగా అయితే, పంట త్వరగా చేతికి రావడానికి మే 2 వ వారంలో 15*20 సెం.మీ. కొలతలు గల్ పాలిథిన్ సంచులలో 2-3 విత్తునాలు చొప్పున విత్తుకోని, ఆ సంచులలో 15-20 రోజులు పెరగనిచ్చి రెండు ఆకుల దశలో అదును చూసి పొలంలో నాటడం మంచిది. నాటేటప్పుడు మట్టిగడ్డతో సహా మొక్కలను నాటినట్లయితే త్వరగా మొక్కలు నిలదొక్కికోగలుగుతాయి.

ఎరువుల యాజమాన్యం : ముందుగా ఎకరాకు 24-32 కిలోల భాస్వరము, 20-24 కిలోల పోటాష్ ని బాగా కలిపి అన్ని గుంతలలోను సమానంగా నింపాలి. నత్రజని 32-40 కిలోల రెండు సమభాగాలుగా చేసి మొదటి భాగం విత్తిన లేదా మొక్క నాటిన 25 రోజులకు, రెండువ టపా పూత, పిందె సమయంలో అంటే విత్తిన 45 రోజులకు వేయాలి. మొక్కకు 15-20 సెం.మీ. దూరంలో గొప్ప త్రవ్వి రేయువును వేసి మట్టి కప్పి నీటిని పారించవలయును.

అంతరకృషి : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. మేకలు బలంగా పెరగడానికి 1-2 సార్లు పాడుచుట్టు తేలికగా మట్టిని గుల్ల చేయాలి. పోటీలకు పందిరి తప్పనిసరి. పాదులను పందిరి పైకి ప్రకించ వలయును. 3-4 రోజుల వయస్సు గల కాయలకు పురికొసకి రాయిని కట్టి సలాడదీయడం వలన కాయ విటరుగా పెరుగుతాయి. లేనిచో కాయలు చుట్టుకొని పోతాయి.

కలుపు నివారణ : కలుపు మొక్కలను నివారించుటకు అలాకాలోర్ లేదా బ్యుటాక్లోర్ ఒక కిలో మూలా పదార్ధము 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరా విస్తీర్ణంలో 2-3 రోజుల తర్వాత వెలతాడిచేటట్లు పిచికారి చేయడం వలన పొలంలో కలుపు మొక్కలను సమర్ధవంతంగా నివారించు కోవచ్చు.

నీటి యాజమాన్యం : గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి 3-4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. ఈ విధంగా మేళకేతే వరకు నీరు పెట్టి మొలకెత్తిన తర్వాత వారానికి ఒకసారి పాదులలో నీరు మంచిగా పారించాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి.

దిగుబడి : వేసవిలో 6-9 ట/ఎ, ఖరీఫ్ లో 7-12 ట/ఎ.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

2.92857142857
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు