పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్లగ్ ట్రేలలో కూరగాయల నారు పెంపకం

కూరగాయల నారు పెంపకం.

సాధారణంగా రైతులు కూరగాయలు నారును సొంతంగా పొలంలోనే పెంచి నాటుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మెతుంది/చదువు కొన్న రైతులు ప్లగ్ ట్రేలలో నారును పెంచి వారి చుట్టూ ప్రక్కల గ్రామా రైతులకు అమ్మి లాభం గడిస్తున్నారు.

నారును ప్లగ్ ట్రేలలో పెంచటం వలన ఉపయెగలు

 1. లేత మేలకాలకు/వేర్లకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
 2. నారు మేలకాలాన్ని ఒకే పరిమాణంలో ఎదుగుతాయి.
 3. నారు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.
 4. మొక్కలు బాగా ఏసుకుంటాయి.
 5. తక్కువ ప్రదేశంలో ఎక్కువ ట్రేలను ఉంచుటకు అవశాశం ఉండటం వలన కూలి, స్ధలం, ఇతర ఖర్చులు, తగ్గుతాయి.

ప్లగ్ ట్రేలను పిలిస్టిక్ లేదా స్టెరోపొం లేదా చెక్క లేదా తేలిక పాటు లోహవు రేకుతో తయారీ చేస్తారు. ప్రతి గది/గంటకు రంధ్రం ఉంది నీరు పోయే సకార్యం ఉంటుంది. సాధారణంగా తెల్ల రంగు కంటే నల్ల రంగు ట్రే లకు ప్రాధాన్యం ఉంటుంది.

ట్రేల పరిమాణం

 • 72 గంటల (గదులు) ట్రే : టమాటా, వంగ, మిరప నారును పెంచుటకు అనుకూలం.
 • 128 గంటల (గదులు) ట్రే : శీతల పంట లైన క్యాబేజి, క్యాలీప్లవర్, బ్రకోలి నారు పెంచుటకు అనుకూలం. ఒక్కో గది పరిమాణం 40-90 క్యూ. సెం.మీ.

సాధారణంగా గదులు / గుంటలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటాయి. కొన్ని సార్లు త్రిభుజాకారం లేదా శద్భిజా లేదా గుండ్రంగానూ ఉంటాయి.

ట్రేలలో నింపు వేరు మిశ్రమము : దీని కోసం మట్టిని అస్సలు వాడరాదు. ఆరోగ్యకరమైన బాగా మాగిన కొబ్బరి పీచు, వర్మీక్యులేట్, పార్కెట్ను 3:1:1 నిష్పత్తిలో బాగా కలుపుకొని ట్రేలను నింపాలి.

విత్తే పద్ధతి : ప్రతి గది / గుంటలో వేరు మిశ్రమాన్ని నింపాలి. ఒక గుంటలో విత్తి పైన కోకోపీట్ ను కప్పి రోజ్కయం తో నీరు చల్లాలి. పది ట్రేలను ఒకదాని మీద మరొక్కటి పెట్టి జమయ్మచాలి. దీని పైన పాలిథిన్ షిట్ ను కప్పి 3-6 రోజులుంచాలి. కోకోపీట్ వాడటం వలన నీరు మరల మరల పోయాల్సిన అవసరం లేదు. 3-6 రోజుల తర్వాత పాలిథిన్ షిట్ తీసి ట్రేలను విడివిడిగా పెట్టుకోవాలి. ట్రేలను తెగుళ్ళు రాకుండా కాపర్ ఆధారిత మందు ద్రావణం (3 గ్రా./లి. చొప్పున) తో తడపాలి.

ప్లగ్ పుషర్లు నారును సులభంగా ట్రేల నుండి తీయటానికి వాడుతారు. పంటను అనుసరించి 4-6 వారల వయస్సు గల వారును ప్రధాన పొలంలో నాటుతారు. నమూనా కోసం ఈ పద్దతిలో టమాటా నారును పెంచు విధానమును పరిశీలిద్దాం.

ప్లగ్ ట్రేలలో టమాటా నారు పెంపకం

 • టమాట విత్తనాలను 5-6 వారల ముందు ట్రేలలో విత్తుకోవాలి.
 • విత్తటానికి ముందు ట్రేలలో 10% బ్లీచింగ్ ద్రావణంలో శుభ్రపరచాలి. (1 భాగం బ్లీచింగ్ పొందాడు 9  భాగాల నీటిలో)
 • ట్రే గదులను వేరు మిశ్రమ పదార్ధంతో నింపాలి.
 • విత్తనం 1/4 లోతులో విత్తాలి.
 • ట్రెకు విత్తిన రకం పేరు, తేదీ ఉన్న ట్యాగ్ ను కట్టాలి.
 • 21-23 సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత, 15.5-16 సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత అనుకూలం.
 • ఒక గదిలో ఒక గుంజు మాత్రమే విత్తాలి. 7-14 రోజులలో విత్తనం మెలకెత్తుతుంది. రోజుకు 14 గంటల వెలుతురు పడేలా చూడాలి.
 • నారును ప్రధాన పొలంలో నాటుటకు 10 రోజులకు ముందు నారును గట్టి పరిచేలా రోజు కొన్ని గుంటలు ఎండలో ఉంచాలి (ఒక వేళ నారును హరిత గృహాలలో పెంచినట్లయితే). ఈ సమయంలో తక్కువ నీరు ఇవ్వాలి. ఎరువులు వాడరాదు.
 • నారును మరి అతిగా గట్టి పరచరాదు. దీని వలన మొక్కలు గిడస బారి, పెరుగుడుల వేగం తుగ్గుతోంది.
 • గట్టిపరిచిన 21 రోజుల వయస్సు నారును ప్రధాన పొలంలో నాటాలి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు