పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బీర

తీగజాతి కూరగాయ పంటలలో బీర ఒక ముఖ్యమైన పంట.

తీగజాతి కూరగాయ పంటలలో బీర ఒక ముఖ్యమైన పంట. మనదేశంలో బిరను 10,040 హెక్టేగార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ మొత్తం 1,28,310 టన్నుల దిగుబడి పొందుతున్నాం. సరాసరి దిగుబడి 6 ట/ఎ.

వాతావరణం : తేమలో కూడిన వేసి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం. ఉంటే తీగ పెరుగుదల బాగా ఉంది పూత, పిండే బాగా వాడుతుంది. తీగ మొదటి పెరుగుదల దశలో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే మగపులు ఎక్కువగా వస్తాయి.

నేలలు : నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్ర గరపా మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6.0-7.0 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సకార్యం గల ఒండ్రు నేలలు అనుకూలం.

రకాలు

జగిత్యాల లాంగ్ : కాయలు 50-60 సెం.మీ. పొడవుతో సన్నగా, లోత్తెన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్ లో అధిక దిగుబడినిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

కో-1 : కాయలు 40-50 సెం.మీ. పొడవుంది ఒక్కో కయ 800 గ్రా. బరువు ఉంటుంది. పంట కాలం : 125 రోజులు, దిగుబడి 5.6 ట/ఎ.

కో-2 : ఈ రకం కాయలు చాల పొడవుగా 90-100 సెం.మీ వరకుంటాడు. ఒక్క కాయ 700 - 800 గ్రా. బరువుంటుంది.  పంటకాలం : 120 రోజులు, దిగుబడి 10 ట/ఎ.

పి.కె.యం-1 : 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, ముందు భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం : 130 రోజుల, దిగుబడి : 6-7 ట/ఎ.

పూసా నాసదర్ : త్వరగా (60-65 రోజులలో) కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15-20 కాయలు కాస్తాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులోను, లోపలి, గుజ్జు లేత పసుపు రంగులను ఉంటుంది. ఈ రకం ఖరీఫ్ కు, వేసవికి అనుకూలం. దిగుబడి: 6-7 ట/ఎ.

సత్ పుతియ: ఈ రకంలో ద్విలింగ పుష్పాలుంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు చిన్నగా ఉంటాయి. ఖరీఫ్, వేసవి కాలానికి అనువైనది.

అర్క సుమిత్ : కాయలు 25 సెం.మీ మందం, 55 సెం.మీ. పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13-15 కాయలు వస్తాయి.ఒక్కో కయ 380 గ్రా. బరువుంటుంది. పంటకాలం: 120 రోజులు, దిగుబడి : 21 ట/ఎ.

అర్క సుజాత : కాయ 50-55 సెం.మీ. పొడవుంటుంది. పంటకాలం : 100 రోజులు, దిగుబడి 21 ట/ఎ. ఈ రకం కొంత వరకు బూజు తెగులును తట్టుకుంటుంది.

పంటకాలం : ఖరీఫ్ : జూన్ - జులై ; వేసవి : డిసెంబర్ - జనవరి

నేల తయారీ : పొలాన్ని 3-4 సార్ల బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6-8 టన్నులు/ఎ. చొప్పున వేసి కలియదున్నాలి. 60-80 సెం.మీ. దురంతో కాలువలు వేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 2 మీ. ఉండేటట్లు చూడాలి.

విత్తన మేతాడు : 0.6 - 0.8 కిలోలు/ఎ.

విత్తన శుద్ధి: ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత ట్రెకోడెర్మా వీరిది 5 గ్రా. కిలో విత్తనానికి లేదా ఒక కిలో విత్తనోనికి 3 గ్రా. ధైరమ్ లేదా క్యాప్టె పొడి మందు కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

విత్తు పద్ధతి : రెండు పాదులు మధ్య దూరం వర్షాకాలంలో అయితే 75 సెం.మీ. వేసవి పంటకాయతే 50 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో పాడుకు 3-5 గింజలను 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. విత్తిన 8-10 రోజులకు మెలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒక వేళ ఖరీఫ్ లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్ సంచులలో గింజలను విత్తుకోని, రెండు ఆకుల దశలో (విత్తిన 15-20 రోజులకు) పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు జాగ్రత్తగా పాలిథిన్ సంచులను తీసి, మట్టి గడ్డ ఏ మాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుకొని బాగా పెరుగుతాయి.

ఎరువుల యాజమాన్యం : ఎకరాకు 24-32 కిలోల చొ న భాన్వరం మరియు పోటాష్ ను బాగా కలిపి అన్ని గుంతలలో  (45*45*45 సెం.మీ.) సమానంగా నింపాలి. నత్రజని 32-40 కి/ఎ. చొప్పున రెండు భాగాలుగా చేసి, ఒక భాగం విత్తిన 20-25 రోజులకు, రెండవ భాగం 50-60 రోజులకు వేసి నీరుకట్టాలి. ఎరువులు మొక్కకు  10-15 సెం.మీ. దూరంలో వేసి, మట్టి ఎగదోసి నీరు పారించాలి.

అంతరకృషి : కలుపు మొక్కలను ఇప్పటికిప్పుడు తీసివేయాలి. లేదా గింజలు విత్తిన 2-3 రోజులలో అలకలా లేదా బ్యూటక్లోర్  0.8 కిలోల మూలా పదార్ధం 200  లిరర్ల నీటిలో కలిపి తడినేల పై పిచికారి చేయాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపుతారు. ఆ తర్వాత 45 రోజులకొకసారి పడుచుట్టు తేలికగా మట్టిని గుల్లచేసి, మొక్క దగ్గరకు ఎగదోయాలి. పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరి.

రెండు ఆకుల దశలో 3-4 గ్రా. బొరాక్స్/లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే అడవులు ఎక్కువగా వస్తాయి. లేదా ఇద్దరిల్ 2.5 మీ.లి. పది  లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.

దిగుబడి : 6-8 టన్నులు / ఎకరాకు.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు