పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బెండ

ఈ బెండ కాయలను వివిధ రకాలు వంటల తయారీ లో ఉపయేగిస్తారు.

బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలలో ప్రపంచ వ్యాప్తిముగా దీనిని పండిస్తారు. లేత కాయలను కూరగాయగా వాఫుతారు. బెండ పరుగులను (ఎండ బెట్టిన బెండ ముక్కలను) స్తెన్యం ఎతైన ప్రాంతాలలో ఉన్నప్పుడు వాడుతారు. తాజా కాయలకు గల్ఫ్ దేశాలలో మంచి గిరాకీ ఉంది.

ఉపయెగాలు

 • లేత బెండ కాయలను వివిధ రకాల వంటల తయారీ లో ఉపయేగిస్తారు. వేపుడు గాను, ఉడకబెట్టి సలాడ్ గాను, సుప్తో కానీ తీసుకుంటారు.
 • బెండ వేర్లు కందము నుండి వచ్చిన రసమును చెరుకు రసమును శుభ్రపరచడానికి బెల్లం, చెక్కెర పరిశ్రమలలో వాడుతారు.
 • ముదిరిన కందం, కాయల నుండి తీసిన నారను కాగితపు పరిషమ్యాలలో వాడుతారు.
 • ఈ కాయలలో ఐడి ఎక్కవగా ఉన్నందున "గాయిటర్" వ్యాధి నివారణ కోసం వాడుతారు.

బెండును మనదేశంలో వ్యాపార నరాశిలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళ్ నాడు, కర్ణాటక, హర్యానా మరియు పంజాబ్ రాప్ట్రలలో పండిస్తున్నారు. భారతదేశంలో5,33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడి హెక్టారుకు 11.9 టన్నుల స్వాగత దిగుబడితో మొత్తం 63,46,000 టన్నుల దిగుబడి వస్తుంది.

ప్రస్తుతం బెండ సాగులో ఉన్న సమస్యలు

 • పల్లాకు తెగులు
 • తలనత్తా మరియు కాయ తొలుచు పురుగు
 • హైబ్రిడ్ వత్తినము లభ్యత మరియు అధిక ధర

నివారణ మార్గాలు

 • పల్లాకు తెగులును తఱుకునే రకాలను/హైబ్రీడ్స్ ను సాగు చేయాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 • రైతుస్ధాయిలో విత్తనోత్పత్తికి శిక్షణ కార్యక్రమములు నిర్వహించాలి. మార్కెటింగ్ నియంతన ఉండేటట్టు చూడాలి.

రకాలు (దేశవాళి) : బెండలో హైబ్రిడ్ రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడి నిస్తున్నాయని నిరూపించ బడింది. పూసా ముఖమాలి, పూసా నవాని, కో-1 , ఎం.డి.యు-1 , పంజాబ్ పద్మిని, గుజరాత్ బెండి-1 , హర్భజన్, సెలక్షన్-2 , పి-7 , పర్భానీ క్రంతి, ఆర్కా అన్నమికి ఆర్కా అభయ మెదలగున్నంవి ఎక్కవగా సాగులో వున్నాయి.

పంజాబ్ పద్మిని : మొక్కలు 180 - 200 సెం.మీ. పొడవు పెరుగుతాయి. 4 - 5 కొమ్మలు వస్తాయి. కాయ 15 - 20 సెం.మీ. పొడవు ఉంది 20 - 21 గ్రా. తూగుతుంది. కాయలు 3 - 4 రోజుల వరకు లేతగా ఉంటాయి. ఈ రకం పల్లాకు తెగులు రాకుండా నిరోధించగలుగుతుంది. కొంత వరకు రసం పీల్చే పురుగులు, ప్రత్తికాయ తొలుచు పురుగు నుండి తట్టుకొని నిలబడుతుంది. దిగుబడి: 4 - 5 ట/ఎ.

పర్భానీ క్రంతి: కాయలు 8 - 9 సెం.మీ. పొడవుతో ముదురాకుపచ్చు రంగులో 5 కుదుపులతో ఉంటుంది. కాయలు కోసిన 2 - 3 రోజుల తర్వాత కూడా లేతగానే ఉంటాయి. వేసవి పంట దిగుబడి : 3.5-4.0 ట/ఎ. వర్షాకాలం పంట దిగుబడి : 4.0-4.5 ట/ఎ.

ఆర్కా అనామిక : ఈ రకంలో మొక్కలు 100 సెం.మీ. ఎత్తు వరకు పెరుగుతాయి. తక్కువ కొమ్మలుంటాయి. కాండం మీద లాసపులు దగ్గరగా ఉంటాయి. లేత ఎరుపు రంగు మచ్చలు కాండం మీద, ఆకూ తొడిమ భాగంలో ఉంటాయి. కొద్దిగా సుగు ఉంటంది. 55 రోజులలో మొదటికి కోతకు వస్తుంది. పల్లాకు తెగులును బాగా తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. వేసవి పంటకు అనువైనది.

అర్క అభయ : ఇది కూడా బెంగుళూరు నుండి విడుదలయను రకం. ఇది కాయతొలిచే పురుగును, శంఖురోగాన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. వేసవి పంటకు అనువైనది.

సంకరజాతి రకాలు : వర్ష, విజయ్, విశాల్, నద్శోభ, మహికో హైబ్రిడ్ నెం. 10, 64, ప్రియా, సుప్రియ రకాలు శముఖు రోగాంన్ని బాగా తట్టుకొంటాయి. ఇవికాక ఐశ్వర్య, మిస్టిక్ కూడా అందుబాటులో ఉన్నవి.

ఎగుమతికి అనువైన రకాలు : పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నధిసోభ, వీటి లేత కాయలు ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉంటాయి.

వాతావరణం : ఇది ఉష్ణమండలపు పంట. ఎత్తెన కొండా ప్రాంతాలలో, చల్లటి వాతావరణంలో సరిగా పెరగదు. చలిని, మంచును అస్సలు తట్టుకోఠేడు. పగటి ఉప్నోగ్రత 25-40 సెం. మరియు రాత్రి 22 సెం. ఉన్నట్లయితే మొక్క పెరుగుదల బాగా ఉంటుంది.

నేలలు : సారవంతమైన ఇసుక నేలలు, మురుగు నీరుపోయే సకార్యం గల నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలము. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలలు అధిక దిగుబడి వస్తుంది. ఉదజని సూచిక 6.0-6.8 ఉన్న నేలలు అనుకూలం.

పంటకాలం : ఖరీఫ్ పంటగా జూన్-జులై (వర్షధారపు పంట) మాసాలలోను, వేసవి పంటగా ఫిబ్రవరి-మర్చి లలో విత్తుకోవాలి. పంటను వర్షాకాలంలో ఆలస్యంగా (ఆగష్టు లో) విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు. బూడిద తెగులు ఎక్కవగా ఆశిస్తుంది. వేసవిలో పంట ఆలస్యంగా వేసుకుంటే మొక్క పెరుగుదల తగ్గి పల్లాకు తెగులు ఎక్కవగా ఆశిస్తుంది.

విత్తనం మేతదు : ఖరీఫ్ పంటకు 4-6 కి/ఎకరాకు, వేసవి పంటకు 7-8 కి/ఎకరాకు అవసరం. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు దగ్గర దగ్గరగా ఉండేటట్లు ఎక్కువ విత్తనం విత్తుకోవాలి.

విత్తనశుద్ధి : రసం పీల్చే పురుగుల నుండి రక్షణగా ఇమిడాక్లోప్రిడ్  పొడి మందును 5 గ్రా. తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మ్ వీరిది ఒక కిలో విత్తనానికి పట్టొమ్చి విత్తుకోవాలి.

విత్తే దూరం : ఖరీఫ్ పంటకు - 60*30 సెం.మీ. వేసవి పంటకు -45*15-20 సెం.మీ.

విత్తే విధానం : ఖరీఫ్ పంటకు నేలను 4-5 సార్లు బాగా దుక్కి చేసి 60 సెం.మీ. దురంతో బోదెలు వేసి విత్తనం విత్తుకోవాలి. వేసవి పంటకు నేలను మాళ్ళుగా తాయారు చేసుకొని వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 15-20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

పదిపాదులు  వేయటం : ఒక్కో పడకు ఒక మొక్క ఉండేటట్లు చూడాలి. మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఒకవేళ ఖాళీలు ఉన్నట్లయితే ఆ స్ధలంలో గింజలు మరల విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం : చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల బాగా మాగిన పశువును వేసి బాగా కలియదున్నాలి. 20 కిలోల భాస్వరం మరియు పోటాష్ నిచ్చే ఎరువులకు కూడా ఆఖరి దుక్కలో వేసుకోవాలి. హైబ్రీడ్స్ ను వేసుకుంటే రసాయానికి ఎరువులు 50 శాతం పెంచి వేసుకోవాలి.

48 కిలోల నిచ్చే నత్రజని ఎరువును మూడు సమభాగాలుగా చేసి, ఒక వంతును ఆఖరి దుక్కిలో మిగిలిన రెండు భాగాలు విత్తిన 30 వ, 45 వ, రోజున వేసి నీరు పారించాలి. హైబ్రీడుకయితే 25 % నత్రజని ఎక్కువగా వేసుకోవాలి. అంతే ఎకరాకు 60 కి ల నత్రజని వేసుకోవాలి.

జీవన ఎరువులు : ఎకరాకు 2 కిలోలు అజతోబాక్టర్ ను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మగనిచ్చి, తర్వాత ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. దీనితో పాటుగా ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబాక్టీరియా (పి.యస్.బి.) ను కూడా పొలం అంత నామంగా చల్లుకోవాలి. ఈ జీవన ఎరువులు వేసుకున్నప్పుడు సిఫార్సు చేసిన దానిలో 75 % నత్రజని, భాస్వరం, పూర్తి పోటాష్ వేసుకుంటే సరిపోతుంది.

నీటి యాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తర్వాత 4-5 రోజులకు రెండువసారి నీరు పారించాలి. ఖరీఫ్ బట్టి నీరు పారించాలి. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు పెట్టాలి.

అంతరకృషి : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి, మట్టిని వాదులు చేసి బోదెలు సరి చేయాలి. విత్తన నెలరోజులకొకసారి కలుపు తయాలి లేదా ఎకరాకు పెండిమిధలైన్ (స్టాంప్) 1.20 లి మందును 200 లీటర్ల నీటిలో కలిపి వత్తిన 2-3 రోజులలో తడి భూమిపైన నెలంతా తడిచేటట్లు పిచికారి చేయాలి. ఆ తర్వాత అవసరమైతే 45 రోజులకు కూలీలతో కలుపు తీయంచి మట్టిని ఎగదోయాలి.

సస్యరక్షణ : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

మొవ్వు మరియు కాయతొలుచు పురుగు : మొక్క పెరుగుదల దశలో మెవ్వను, పూత దశలో కాయలను తొలచి నష్టం కలిగిస్తుంది.

నివారణ : పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తిరుంచి నాశనం చేయాలి.

 • ట్రైకొగ్రామా గ్రుడ్ల  కార్డులను  ఆకుల పై ఉంచి కాయ తొలిచే పురుగును నివారించవచ్చు.
 • క్రైసోపేర్లా కార్నియాను మొదటి లార్వా దశలో 40,000/ఎ. చొ. న ఉంచాలి.
 • 4 - 5 దీపపు ఎరలు/ఎ. చొ.న ఉంచాలి.
 • లింగాకర్షక బుట్టలను 2-3/ఎ ఏర్పాటు చేయాలి.
 • డైవెల్ (బి.టి.పార్ములా) 2 గ్రా./ లి నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 • ప్రొపెనోపాస్ 2 మీ.లి. లేదా క్లొరాంత్రనిప్రోల్ 0.2 మీ.లి. లేదా ఇమామేక్తిం బెంజయేత్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి

దీపపు పురుగులు (పచ్చదోమ) : పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగచేస్తాయి.

నివారణ : ఇమిడాక్లోప్రిడ్ మందుతో (5 గ్రా./1 కిలో) వత్తినశుద్ది చేయాలి. 2 మీ.లి. మిద్దెల దేమాతం లేదా లండశైలోధ్రన్ 5 % ఇ.సి. 0.6 మీ.లి. లేదా దయమీదకేసం 0.3 గ్రా. లేదా 2 మీ.లి. డైమిదోయేట్ లేదా మలాథియాన్ 2 మీ.లి. లేదా 2 మీ.లి. పిప్రాణి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.6 మీ.లి. లీరారు కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి : ఈ  పురుగులు  ఆకులూ నుండి రసాన్ని పీల్చటం వలన ఆకులూ పండుబారుతాయి.

నివారణ : లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా పెంప్రోపత్రిన్ 30% ఇ.సి. 0.5 మీ.లి. పొడి లేదా 5 మీ.లి. డైకోపాలను లేదా 1.25 మీ.లి. స్పైరోమిసిపి  లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్లదోమ : ఇది ఆకుల నుండి రసాన్ని పీల్చి వేయడం వాళ్ళ ఆకులూ పసుపు రంగుకు మారుతాయి. ఇవి పల్లాకు తెగులును (శంఖు రోగం) వ్యాప్తి చేస్తారు.

నివారణ : లీటరు నీటికి 2 మీ.లి. డైమిదోయేట్ లేదా మేతసిస్తాక్స్ లేదా పిప్రాణి లేదా దయమీదకేసం 0.3 గ్రా. లేదా పెంపొరపత్రిన్  30% ఇ.సి. o.5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగులు మందులను పిచికారి చేసేమందు తయారయిన కాయలు కోసి మార్కెటకు పంపించు కోవాలి.

తెగుళ్ళు

బూడిద తెగులు : ఆకుల పైన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులూ పసుపు రంగుకు మరి రాలిపోతాయి.

నివారణ : లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకము పొడి లేదా 1 మీ.లి. కెరాధేను లేదా హేక్స్కోనజోల్ 0.5 మీ.లి. లేదా దైపెంకోనకిల్ 2 మీ.లి.లేదా దినొక 48 % ఇ.సి. 0.5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చెయాలి. 7-10 రోజుల వ్యవధిలో మరోసారి చేయాలి.

పల్లాకు తెగులు (శంఖురోగం) లేదా వై.వి.యం.వి : తెగులు సోకినా ఆకుల ఈనెలు పసుపు రంగులు మరి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాప్తి అవుతుంది.

నివారణ : దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.

 • తెగులును తట్టుకునే అర్క అనామిక, అర్క అభయ్, పర్భానీ క్రంతి రకాలను వేసుకోవాలి.
 • ఆలస్యంగా  విత్తే పంటకు ఈ తెగులు ఎక్కువగా సోకె ఆకాశం ఉంది. కాబట్టి పంటను జులై 15 లోపు విత్తుకుంటే మంచిది.
 • ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా./కిలో విత్తనానికి పట్టించో విత్తుకుంటే.
 • తెగులు సోకినా మొక్కలను పీకి నాశనం చేయాలి.
 • ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, సకాలంలో అంతర్వాహిక క్రిమి సంహారక మందులనుపయేగించి అరికట్టాలి.

ఎండు తెగులు : గింజలు మెలకెత్తినప్పుడు, మొదటి 15 రోజులలో మొక్కలు పడిపోయి చనిపోతాయి. ఈ సమస్య నీరు నిలబడే నల్లరేగడి నెలల్లో ఎక్కువ.

నివారణం : ఆఖరు దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కేలియదున్నాలి. పొలంలో నీరు నిలబడకుండా చూడాలి.

 • మొక్కల మెదళ్ళు వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపినా ద్రావణాన్ని పోయాలి. పది రోజుల వ్యవధిలో మరొకసారి ఈ విధంగా చేయాలి.
 • పంట మార్చిదిని తప్పనిసరిగా పాటించాలి.

కోత కోయటం : గింజలు విత్తిన 45-50 రోజులకు మొదటి కోత వస్తుంది. పిండే కట్టిన 4-6 రోజులకు కొస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2-3 రోజుల కొకసారి కాయలు కోయాలి లేకుంటే కాయలు ముదురు, పనికి రాకుండా పోతాయి.

దిగుబడి : ఖరీఫ్ పంట : 3-4 టన్నులు/ఎకరాకు.  వేసవి పంట: 2.0-2.5 టన్నులు/ఎకరాకు.

కోత అనంతరం జాగ్రత్తలు : సాధారణంగా రైతులు రెండు రోజుల కొకసారి కోత కోసి బస్తాలలో నింపి మార్కెట్ కి పంపిస్తారు. జనుము బస్తాల్లాలో బాగా నింపి, కుందించి బిగ్గరగా కుట్టడం వలన, కాయలు ఒత్తిడికిగురై విరగటం, కాయ రంగు మారటం, దీని వలన కాయ నాణ్యత దెబ్బతిమ్టుంది. అంతేకాక లేత కాయల నుండి తేమ కోల్పోవటం వలన కాయ వాడాలి ధర తక్కువ పలుకుతుంది. దీనికి బదులుగా, బెండకాయలను వెదురు గంపలలో లేదా ప్లాస్టిక్ క్రేట్లలో వదులుగా నింపటం వలన 2-3 రోజులు కాయ దెబ్బతినకుండా నిలువ ఉంటుంది.

 • బెండ కాయలను 100 మైక్రాన్ల మందం గల పాలిథిన్ సంచులలో ప్యాకింగ్ చేసి 50-52 పారన్ హిట్ వద్ద నిలువచేస్తే 16-18 రోజులు నిలువ ఉంటాయి.
 • బెండ కాయలను ఆస్కార్బిక్ యాసిడ్ 250 మీ.గ్రా./లి. ద్రావణంలో 10 నిమిషాలుంచి తిస్తె ఆకువచ్చా రంగు, తేమ కిలిపోకుండా తాజాగా ఉంటాయి. వీటిని గాడి ఉప్నోగ్రత వద్ద (90-93 పారన్ హిట్) నిలువ ఉంచితే 9 రోజులు తాజాగా నిలువ ఉంటాయి.
 • జిబ్బరిలిక్ యాసిడ్ 100 పి.పి.యం . (100 మీ.గ్రా.లి.నీటిలో) ద్రావణంలో 10 నిమిషాలుంచి తీసి నిలువ ఉంచినా అదే ఫలితం ఉంటుంది.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.07692307692
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు