పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వంగ

ఈ కూరగాయలు నుంచి పోషక విలువలు ఉంటాయి.

భారతదేశములో ప్రాచీనకాలము నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైనది. ఈ వంట అన్ని బూతువులలోను వండించుటకు అనుకూలము. పర్వత ప్రాంతాలలో వేసవిలో మాత్రమే పండించుటకు అనుకూలమైనది.

విస్తీర్ణం : మనదేశంలో 7,11,300 హెక్టార్లలో సాగు చేయబడుతూ  1,35,57,800  టన్నుల దిగుబడి కలిగి ఉన్నది. సరాసరి దిగుబడి : 19.1 ట/హె.

మనదేశములో ఒరిస్సా, బీహార్, వశ్చిమ, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాప్ట్రలలో వంగ విస్తారంగా పండించబడుచున్నది.

ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి, విశాఖపట్మం, గుంటూరు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు మరియు తెలంగాణాలో రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, కరీంనగర్, జిల్లాలలో వంగ వంటను ఎక్కువ విస్తీర్ణములో పండించుచున్నారు.

వంగ సాగులో సమస్యలు

 • అధిక దిగుబడినిచ్చే మేలు రకాలు మరియు సంకరజాతి రకాల విత్తనం కావలసినంత మేర రైతులకు లభ్యం కాకపోవడం.
 • ఆయాప్రాంతాలలో వినిమేగదారుల అభిరుచికి తగిన రకాలు మరియు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలు విత్తనం సరసమయాను ధరలో రైతులకు అందుబాటులో లేకపోవడం.
 • వెర్రి తెగులును తఱుకొని అధిక దిగుబడినిచ్చే వంగడాల లభ్యత లేకపోవడం.

ఈ సమస్యలు ఉన్నప్పటికీ రైతులు వంగ పంటను సాగుచేయటానికి గల కారణాలు.

 • అన్ని బూతువులలోను సాగు చేయడానికి అనుకూలము.
 • బెట్టాను మరియు చెడును కొంత వరకు తట్టుకోగలగడము.
 • అంతర సేద్యము మరియు కలుపు నివారణ ఇతర పంటలతో పోలిస్తే తేలిక.
 • మరైట్ ధరలలో ఒడిదుడుకులుండి గిట్టుబాటు ధర రానప్పుడు చెట్టును వదిలి లాభసాటి ధారాలున్నప్పుడు కార్శి పంటను (రేటును పంట) తీసుకోవడానికి అవకాశం ఉండటం.
 • దూరప్రాంతపు రవాణాకు అనుకూలము.

ఇన్ని అవకాశాలున్నందున సాగుచేయుటలో తగిన మేషాకువలు పాటించినట్లయితే ఈ పంటను లాభకటిగా పండించుకోవచ్చును.

రకాలు

తెలంగాణా : పుసాక్రయంతి, పుసాపర్ఫుల్ క్లస్టర్, శ్యామల, దేశవాషి పచ్ఛవంగా రకాలు.

కోస్తా ఆంధ్ర : భాగ్యమతి, పుసాపర్ఫుల్ లాంగ్, గులాబీ, పుసాక్రంతి, పూసపర్ఫుల్ క్లస్టర్.

రాయలసీమ : ఆర్కా కుసుమాకర్, దేశవాళి పచ్ఛవంగా రకాలు, దేశవాళి చారల వంగ రకాలు (రాయదుర్గం, పోలూరు వంగ).

సూటి రకాలు

ఊదా పొడువు కాయ రకాలు : ఆర్కా కేశవ్, అన్నామలై, ఆర్కా నిధి, ఆర్కా నీలకంఠ, ఆర్కా శిల్, ఆజాద్, క్రంతి, పంత్ సామ్రాట్, పూసా అనుపమ.

ఆకుపచ్చ పొడవు కాయ రకాలు : ఆర్కా శిరీష్, ఆర్కా నవనీత్,ఆజాద్-బి-1 , హిస్సార్ శ్యామల, మంజరి గోట, పంత్ రిట్రాజ్,పూసా ఉపకార్, పూసా ఉత్తం.

భాగ్యమతి : నీటి ఎద్దడిని, కాయతొలుచూపురుగు మరియు వెర్రితల వైరస్ తెగులును బాగా తట్టుకుంటుంది. కాయలు ఉదారంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పంటకాలం 150-165 రోజులు, ఎకరానికి 12-14 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

శ్యామల : మసాలా వంటకాలకు అనువైనది. కాయలు గుండ్రంగా, చిన్నివిగా, ముదురు ఉదారంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. పంటకాలం : 130-150 రోజులు, ఎకరానికి 6-6.5 టన్నుల దిగుబడి వస్తుంది.

గులాబీ : కాయలు మధ్యస్ధా పొడవుగా ఉండి, 3-4 కాయలు గుత్తులుగా కసి ఆకర్షణీయంగా తేథా గులాబీ రంగులో నిగనిగలాడు తుంటాయి. పంటకాలం 140-160 రోజులు. దిగుబడి 9-10 టన్నులు / ఎ.

సంకరజాతి రకాలు

ఊదా రంగు గుండ్రటి రకాలు : అర్కసావనీత్, పూసా హైబ్రిడ్-6 , మహికో-2 , మహికో-54, ఉత్కర్ష, మంజు, సంజు, మ్యు-మ్యు, ఫ్రిదా ఆర్.జెడ్.

ఊదా రంగు పొడవు రకాలు : మహికో హైబ్రిడ్-9, గ్రింలంగ్, హరిత, హర్షిత.

పచ్చటి గుండ్రటి రకాలు : మహికో హైబ్రిడ్-56, గ్రాన్ మేతి

ఊదా రంగు చారల రకాలు : కల్పతరు, మహికో హైబ్రాడ్ నెం.11, 16, అప్సర, విజయ్, వైశాలి.

వాతావరణం : వంగ ఉష్ణమండలపు పంట, అధికాఆప్నోఅగ్రతా లను, నీటి ఎద్దడిని చాలావరకు తట్టుకోగలరు. కొమ్దప్రాతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది. అధిక చలిని, మంచును తట్టుకోలేదు.

నేలలు : వంగ సాగుకు లోతేన, సారవంతమైన మురుగు నీరు పోయే సుమకార్యంగల అన్ని రకాల నేలలు అనుకూలమే. నెల ఉదజని ముచిక 5.5-6.5 ఉండే నేలలు అనుకూలము. చేదు నెలలో ఈ పంట వేయకూడదు.

విత్తన మేతదు : ఎకరానికి సుతిరకాలైతే 260 గ్రా. శంకర రకాలైతే 120 గ్రా. విత్తనంతో పెంచిన నారు నాటడానికి సరిపోతుంది.

విత్తనశుద్ధి : విత్తే ముందు కిలో విత్తనానికి  ధైరమ్ 3 గ్రా. కలిపి ఆ తర్వాత ట్రైకోడెర్మావిరిడి 4 గ్రా. తో విత్తనశుద్ధి చేయాలి.

నారుమడుల పెంపకం : టమాటా మాదిరిగా నారును పెంచాలి.

నాటకాలం : సాధారణముగా వంగాను ఏడాది పొడువునా సాగుచేయవచ్చు. వర్షాకాలం పంటగా జూన్-జులై, శీతాకాలం పంటగా అక్టోబర్-నవంబరు, వేసవి పంటగా ఫిబ్రవరి-మార్చ్ లో విత్తుకోని నాటుకోవాలి.

ప్రధాన పొలం తయారీ

 • పొలాన్ని నాలుగైదు సార్లు దున్ని బాగా చదును చేయాలి. వర్షాకాలం పంటను బుడిలు కాలువల పద్దతిలో, వేసవి, శీతాకాలం పంటను చదునైన మళ్లలో నాటుకోవాలి.
 • రకాలను బట్టి బోదెలను 75 సెం.మీ. లేదా 50 సెం.మీ. దూరంలో ఉండేలా తాయారు చేసుకోవాలి.
 • పొలంలో నాటే ముందు బాగా నీటిలో పారించో, 30 - 35 రోజుల వయస్సు గల నరుసు బోదెల పై నాటుకోవాలి.
 • నాటిన వరం రోజుల లోపు మొక్కలు చనిపోయి ఖాళిగా ఉన్న పాదులలో మరల నారుసు నాటు కోవాలి.

నాటే దూరం : గుబురుగా పేడిగే రకాలను (పుసాక్రంతి, ఆర్కా కుసుమాకర్, గులాబీ) 75*75 సెం.మీ. పొడవుగా నిటారుగా పెరిగే రకాలను (భాగ్యమతి శ్యామల) 50*50  సెం.మీ. దూరంలో నాటుకోవాలి.

నీటి యాజమాన్యం : వంగ నారు నతేముందు లేదా నాటిన తరువాత నీటి తడి ఇవ్వాలి. నెలలో తేమానుబట్టి 7-10 రోజులకొకసారి, అదే వేసవిలో అయితే 4 రోజులకొకసారి తడిపెట్టాలి. మంచు ఎక్కవగా ఉన్న ప్రాంతాలలో చలిని తట్టుకోవటానికి ఎక్కువసార్లు తడి ఇవ్వాల్సిన అవసరముంటుంది. పూత, కావు దశలలో ఎప్పుడునేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే పూత రాలిపోయే ప్రమాదముంది. బరువైన నల్లరేగడి నెలల్లో తప్పనిసరిగా మురుగునీరు పోయే సేకర్యం కల్పించిలి. వేసవిలో కాయకొత్తోకు ఒకటి రెండు రోజుల ముందు తప్పనిసరిగా తేదీనివాళి. లేడంటే కాయలో చేదు ఎక్కవవుతుంది.

ఎరువుల యాజమాన్యం : ఆఖరి బుక్కులో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. పశువుల ఎరుపుతోపాటు 24 కి. భాస్వరం (150 కిలోల సింగల్ సూపర్ పాస్పెట్), 24 కి. పోతశ్రేణిచ్చే (40 కి మ్యురేట్ ఆప్ పోటాష్) ఎరువుల వేయాలి. 40 కి నత్రజని ఎరువును (85 కిలోల యూరియా లేదా 200 కి అమ్మేనియం సల్పేట్) మూడు సమభాగాలుగా చేసి నాటిన 30,60 మరియు 75 వ రోజు పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మేతదు 50 శాతం అధికంగా వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా తడివ్వాలి.

అంతరకృషి : పై పాటు ఎరువులు వేసే ప్రతిసారి గొప్ప తవ్వి మొక్కల మెదళ్లపైకి మట్టిని ఎగదోస్తే పంట బాగా పెరుగుతుంది. 2-3 సార్లు అంతరాకుర్షి చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.

కలుపు నివారణ : నాటిన రెండు మూడు రోజుల్లోగా ఎకరానికి 800 ప్లుక్లోరలిం కలుపు మందును 200 లి. నీటిలో కలిపి నాటిన మొక్కలకు తగలకుండా నెల పై పిచికారి చేయాలి. తర్వాత నెల రోజులకు కూలీలతో కలుపు తీయంచాలి. నల్లని పాలిథిన్ ఫిలింతో మల్చింగ్ చేసినా, చాలా వరకు కలుపును నివారించవచ్చు.

సస్యరక్షణ : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

మొవ్వ మరియు కాయతొలుచు పురుగు : మొక్క పెరుగుదల దశలో మెవ్వను, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు ఒక్కోసారి వంకర తిరిగి ఉంటాయి. వంగ తోటలో మొవ్వ భాగం వడలిపోయి / వాలిపోయి, కాయల పై రంధ్రాలలో పిల్ల పురుగుల వినార్జనను గమనించి ఈ పురుగు ఉదుర్తిని తెలుసుకోవచ్చు. పురుగు ఆశించిన మొవ్వు భాగాన్ని తుంది వేయాలి. నివారణకు కితారు నీటికి అసిపేట్ 1.5 గ్రా. లేదా  కారన్తరినిప్రోల్  18.5 ఎస్. సి. @ 0.2 మీ.లి. లేదా 10 రోజుల వ్యాధిలో 2-3 సార్లు పిచకార చేయాలి. లింగాకర్షక బుట్టలు పొలంలో ఉంచాలి.

ఆశింతల పురుగు : పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగువహగానా చేరి పత్రహరితాన్ని గోకి తినటం వలన ఆకులు జల్లెడలాగా తయారవుతాయి. ఉధ్రతి ఎక్కువైనప్పుడు కేవలం ఆకుల ఈనెలు మాటఁజేమే ఉండి వారి పాతేయలీ.0, 4 మీ.లి.ఒక్క తట్టారు నీటికి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి : ఆకులపై తెలుపు, గోధుమ వర్ణ నచ్చ తెరపడతాయి. ఏకుల అడుగు భాగాన చేరి రసం చేత మొక్కలు ఎదగవు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే కలిపి ఆకుల అడుగు భాగం తడిచేత పిచికారి చేయాలి.

రసం పీల్చు పురుగులు (తెల్లదోమ / పేనుబంక) : పొలంలో నల్ల చీమలు కన్పస్తే ఈ పురుగులు ఉన్నట్లు గమనించవచ్చు. ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి ఎండిపోతాయి. నివారణకు డైమిదియేట్ 2 మీ.లి. లేదా మెతనిస్టాక్స్ 2 మీ.లి. లేదా పిప్రాణి 2 మీ.లి. లేదా అసిపేట్ 1.5 గ్రా లేదా దైపెన్ ఢ్యురం 50% డబ్ల్యు.పి 1.2 గ్రా. / లి లేదా పెంప్రోపత్రిన్ 30% ఐ.సి @ 0.5 మీ.లి/లి నీటికి సలిపి పిచికారి చేయాలి.

పిండి పురుగు : మొక్కల మీద తెల్లసున్నం వేసినట్లు ఈ పురుగులు ఆశిస్తాయి. ఆకుల నుంచి రసం పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మరి క్రవేపి ఎండిపోతాయి. నివారణకు మలాథియాన్ 2 మీ.లి.లేదా పిప్రాణి 2 మీ.లి. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

వెర్రి తెగులు (లిటిల్ లిప్): మొక్కలు గుబురుగా, చీపురు కట్టల కనిపిస్తాయి. ఆకులు సన్నగా ముడుచుకొని పోయి పాలిపోయిన ఆకుపచ్చని టంగులో గుబురుగా ఉంటాయి. మొక్క పూత, కథ లేకుంగా గొద్దుబారి పోతుంది.

ఈ తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమ నివారణకు మేతసిస్తాక్స్ 2 మీ.లి/లి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మీ.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నారుమడిలో నారు తీతకు వారం రోజుల ముందు 40 చ.మీ. నారుమడికి 180 గ్రా. ఫూరడం గుళికలు వేయాలి. నాటిన రెండు వారాల తరువాత రెండో దఫాగా ఎకరాకు 8 కిలోల ఫూరడం గుళికలు వేయాలి. నాటే ముందు నారు వేర్లను 1 గ్రా. తేత్రాస్తేక్లిన్ లీటరు నీటిలో కలిపి ద్రావణంలో మంచి నాటాలి. నాటిన నాలుగైదు వారాల తర్వాత వరం, పదిరోజుల తేడాతో లీటరు నీటికి 2 మీ.లి. చొప్పున డైమిదోయేట్ లేదా మెటాసిస్టాక్స్ కలిపి 3  సార్లు పిచికారి చేయాలి. తెగులు సోకినా మొక్కల్ని పొలంలో ఆశించిన వెంటనే పెరికేసి నాశనం చేయాలి. జిబ్బరిలిక్ ఆమ్లం 50 మీ.గ్రా. లీటరు నీటిలో కలిపి (50 పిపిఎం) పిచికారి చేస్తే తెగులు ముద్రతి కొంతవరకు తగ్గుతుంది.

బాక్టీరియా ఎండు తెగులు : ఈ తెగులును తట్టుకొనే పుసాపర్ఫుల్ క్లస్టర్ పూసా క్రంతి రకాలను ఎన్నుకొని తప్పనిసరిగా పంటమార్పిడి పెద్దతో అవలంభించాలి. ఎక్కువగా వేసవిలో ఆశిస్తుంది. ఒకసారి దాని ఉనికిని పొలంలో గమనిస్తే ఏళ్ళు తరబడి ఈ తెగులును పొలంలో గమనించవచ్చు. నారుమడి నుంచి నారును తీసిన తర్వాత స్టర్పీతోస్తేక్లిన్ ఒక గ్రాము 4 లీటరు నీటిలో కలిపినా ద్రావణంలో అరగంటసేపు ముంచి నాటుకోవాలి.

ఆకుమడు మరియు కాయకుళ్ళు తెగులు : ఆకుల మీద అక్కడక్కడా గోధుమ రంగ మచ్చలు సంపిస్తాయ్. తెగులు ఉధార్థంగా ఉన్న ఎదల ఆకులు మాడిపోయి రాలిపోతాయి. తెగులు సోకినా కాయలు పసుపు రంగుకు మరి కుళ్ళిపోతాయి. దీని నివారణకు విత్తనాలు నారుమడిలో విత్తే ముందు 50 సెల్సియస్ ఉప్నోగ్రతగల నీటిలో 30 ని లపాటు విత్తనాలు నానబెట్టి విత్తుకోవాలి.

సమగ్ర సస్యరక్షణ

 • పురుగు సోకినా కాయలు, తలనత్తా ఆశించిన కొమ్మల్ని తుంచి నాశనం చేయాలి. తోటంతా కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
 • అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసు కోవాలి.
 • తోటలో మొక్కకు రెండు చొప్పున అల్లిక రెక్కల పురుగులను వదలాలి.
 • ఎకరానికి 20 వేళా ట్రైకోడెర్మా వీరిది కలిపి విత్తనశుద్ధి చేయాలి.
 • లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున ఎకరానికి 200 లీటర్ల బిటి ముందు ద్రావణం పిచికారి చేయాలి.
 • ఎకరానికి 250 కిలోల వేపపిండిని ఆఖరి దుక్కిలో వేయాలి.
 • రసంపీల్చు పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల కార్బొఫూరం 3 జి గుళికలు వేయాలి.
 • కాయ తొలుచు పురుగుల నివారణకు క్లొరంత్రనిప్రోల్ 18.5 ఇసి 0.3-0.4 / లి. లేదా ధాయేదికార్బ్ 75 డబ్య్లు.పి. 2 గ్రా./లి నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • బాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల బ్లీచింగ్ పొడి వేసుకోవాలి.
 • పొలంలో నులిపురుగులు బెడద ఉంటే బంతిపూలతో పంట మార్పిడి చేయాలి. కూడా వెల్లుల్లి లేదా బీట్రూట్ పంటల క్రమం పాటించాలి.
 • మొక్కజొన్న - బెండ - ముల్లంగి లేదా మొక్కజొన్న - అలసంద - మొక్కజొన్న లేదా బెండ - అలసంద - మొక్కజొన్న పంటల మార్పిడితో భక్తిడితో వడలు తెగులును తగ్గించవచ్చు.

దిగుబడి : నాటిన 50 - 60 రోజులకు మొదటి కొత్త వస్తుంది లేత కాయల కోసం ప్రతి 3 రోజుల కొకసారి కొత్త కోయాలి. వర్షాకాలపు పంట నుంచి 8-14 తన్నులు, వేసవి పంట నుండి 4 తన్నులు ఎకరానికి పొందవచ్చు.

వంగలో అధికోత్పత్తికి పాటించాల్సిన సూచనలు

 • అధిక దిగిబడినిచ్చు మేలు జాతి రకాలు/సంకరజాతి రకాలు ఎంచుకోవడం.
 • మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం.
 • నారుమడి పెంవాకములో తగిన జాగ్రత్తలు పాటించడము.
 • వంగ పైరు పెరుగుడుల దశలో 1-2 శాతం యురియు ద్రావణం (లీటరు నీటికి 10 - 20 గ్రా.) పిచికారి చేస్తే అధిక పంట దిగుబడితోపాటు 20 శాతం నత్రజని కూడా అదా చేయవచ్చు.
 • పంట పూత,కొత్త దశలో 2, 4-డి (లీటరు నీటికి 10 మీ.గ్రా లేదా ప్లానోపిక్స్ 2 . 5 మీ.లి/10 లి. నీటికి) పదిరోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి అధిక దిగుబడి పొందవచ్చు.

వంగ పంటను పండించేప్పుడు సాగునీరు సదుపాటువం, మార్కెట్లలో ఆ రకానికి గల గిరికి, సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే రైతులు తక్కువ సాగు ఖర్చుతో దిగుబడులను సాధించి ఆర్ధికంగా అభివురద్ది చెందగలరు.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.3125
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు