অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆముదం

తెలంగాణ రాష్ట్రంలో వర్షాధరంగా సాగు చేసే నూనెగింజల పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. ఆముదంలో 30-50% నూనె శతం ఉంటుంది. మన రాష్ట్రంలో సుమారు 25-30 వేళా హెక్టార్ల విస్తరణంలో సాగుచేయబడుతూ హెక్టారుకు సగటు 633 కిలోల దిగుబడి నుమోదవుతున్నది. ఈ పంట వర్షాకాలంలో మహుబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తరణలో సాగవుతున్నప్పుటికి, అన్ని జిల్లాల్లోనూ ప్రతివికించి యుసంగిలో తక్కువ సాగు ఖర్చుతో ఈ పంటను ఆరుతడి పంటగా పండించడానికి చాల అవకాశముంది. ప్రస్తుతం వివిధ పంటల్లో ఎదురవుతున్న అడివి పందులు మరియు పక్షుల బెడద, అలాగే విత్తన నిల్వలో సమన్వ ఆముదంలో లేకపోవడం ఈ పంట యొక్క నివేకతగా చెప్పవచ్చు. రైతులు ప్రస్తుతం ఈ పంటను పండించటనికి మొగ్గు చూపుతున్నారు.

విత్తే సమయం

ఖరీఫ్ లో జూన్ రెండవ పక్షం నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఆముదంను యాసంగిలో అక్టోబర్ రెండవ పక్షం లోపు విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చును.

నేలలు

నీరు బాగా ఇంకే నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఈ పంటను ఎర్ర నేలలు, నల్లరెగడి నేలలు మరియు గరప నేలలు మరియు నీరు నిలువ ఉండే నేలల్లో ఈ పంటను పండించరాదు.

విత్తన మోతాదు మరియు విత్తే పద్ధతి

ఋతువు పేరు సూటి రకాలు/హైబ్రిడ్లు విత్తన మోతాదు (కిలోలు/ఎకరాకు) విత్తే దూరం(సెం.మీ)
వర్షాకాలంలో
బరువైన నల్లరేగడి నేలలు హైబ్రిడ్లు 2.0 - 2.5 90 X 60
తేలికపాటి ఎర్ర/ఎర్ర చల్కా నేలలు సూటి రకాలు 3.5 - 4.0 90 X 45
హైబ్రిడ్లు 2.0 - 2.5 90 X 60 (తేమను నిలుపుకునే ఎర్రనేలలు)
యాసంగి (నీటి పారుదల క్రింద)
నల్లరేగడి నేలలు హైబ్రిడ్లు 2.0 - 2.5 120 X 90
తేలిక నేలలు హైబ్రిడ్లు 2.0 - 2.5 90 X 90

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయడం వలన మొలకకుళ్ళు తెగులును అరికట్ట వచ్చును. వడలు తెగులు ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిలో విత్తనశుద్ధి చేయాలి.

రకాలు

ప్రగతి, హరిత రకాలు మరియు పిసిహెచ్-111 హైబ్రిడ్ విత్తనాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం నుండి డిసిహెచ్-177, డిసిహెచ్-519 విత్తనాలను భారత నూనె గింజల పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుండి పొందవచ్చును.

రకం పంట కాలం(రోజులు) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు
సూటి రకాలు
ప్రగతి (పిసిఎస్-262) 120-140 6.0-7.0 స్వల్పకాలిక రకం, గింజ పరిమాణం పెద్దగా వుంటుంది. అధిక నూనె శాతం కలిగి ఉంటుంది.
హరిత(పిసిఎస్-124) 130-150 5.0-6.0 ఎండు తెగులును మరియు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
డిసిఎస్-107 130-150 6.0-7.0 ఎండు తెగులును, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది.
జ్వాల (48-1) 140-150 4.0-5.0 ఎండు తెగులును తట్టుకుంటుంది.
హైబ్రిడ్లు
పిసిహెచ్-111 120-140 7.0-8.0 మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎండు తెగులును తట్టుకుంటుంది.
డిసిహెచ్-177 130-160 6.0-7.0 బెట్టను తట్టుకుంటుంది.

ప్రైవేట్ రంగానికి చెందిన జిసిహెచ్-4, జిసిహెచ్-7, ఎంఆర్ సిఏ-409, ఎన్ బిసిహెచ్-22 హైబ్రిడ్లను కూడా ఎంచుకోని మంచి దిగుబడులు సాధించవచ్చును.

ఎరువుల యాజమాన్యం

ఎకరానికి 2-3 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియదున్నాలి. సూటి రకాలను సాగుచేస్తే ఒక ఎకరాకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఈ మోతాదులో సగ భాగం నత్రజని, మొత్తం భాస్వరం మరియు పొటాష్ ను దుక్కిలో వేయాలి. హైబ్రిడ్లు సాగుచేస్తే మరొక 8 కిలోల నత్రజని విత్తిన 60-65 రోజులకు అదనంగా వేసుకోవాలి. యాసంగిలో ఆముదంను బిందు సేద్య పద్దతిలో సాగు చేసేటప్పుడు నత్రజని ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో, వారానికొకసారి నాలుగు కిలోల యూరియాను వెంచూరీ ద్వారా పంట 120 రోజుల వరకు అందజేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి

పంట విత్తిన తరువాత 40-60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. పెండిమిథాలిన్ (30 %) 1.3-1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేలపై పిచికారి చేయాలి. విత్తిన 15-20 రోజులకు క్విజలోఫాప్-పి-ఇథైల్ కలుపు మందును ఎకరాకు 400 మి.లీ. చొప్పున పిచికారి చేసి గడ్డిజాతి కలుపును నివారించవచ్చును. తరువాత దశల్లో వచ్చే కలుపును గుంటకతో వరుసల మధ్య అంతరకృషి చేసి నివారించవచ్చును.

నీటి యాజమాన్యం

సాధారణంగా ఆముదంను వర్షాధారంగా పండిస్తారు. అయితే బెట్ట పరిస్థితులలో నీటి వసతి ఉంటే 1-2 తడులు ఇస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. యాసంగిలో ఆముదంను విత్తిన తరువాత నేలను తడపాలి. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు తక్కువ ఉష్ణోగ్రతల వలన 12-15 రోజులకోకసారి తడి ఇవ్వాలి. జనవరి నెల నుండి 8-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. మొక్కలు పుష్పించే దశ మరియు కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా నీరివ్వాలి.

బిందు సేద్య పద్దతిలో ఆముదంను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్రతి 3 నుండి 4 రోజులకు 1.5-2 గంటలు మరియు జనవరి నుండి మార్చి వరకు 2.5-3 గంటలు నీరివ్వాలి. ఈ పద్దతిలో సాగు చేసినప్పుడు 30% వరకు నీరు ఆదా అవుతుంది.

సస్యరక్షణ

పురుగు/తెగులు గుర్తించే లక్షణము అనుకూల పరిస్థితులు నివారణ చర్యలు
దాసరి పురుగు / నామాల పురుగు ఈ పురుగు మొదట ఆకులపై ఆశించి రంధ్రాలేర్పరిచి తింటాయి. పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులనంతా తినేసి కేవలం ఈనేలు/కాడలను మాత్రమే మిగులుస్తుంది. ఈ పురుగు ఆగస్టు నుంచి అక్టోబర్ మాసం వరకు పంటలపై ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. మైక్రోప్లెటిన్ వరాన్నజీవి (గూటం పురుగు) ఈ పురుగుపై ఆశించి అదుపులో ఉంటుతుంది.
పొగాకు లద్దె పురుగు తొలి దశలో గుంపులుగా ఆకుల క్రింద భాగంలో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. తరువాత దశలో ఆకులపై రంధ్రాలేర్పరిచి జల్లెడాకులుగా మారుస్తాయి. ఈ పురుగు సెప్టెంబర్ మాసంలో ఆశించడం మొదలై అక్టోబర్ నెలలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. 1) ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనించాలి. (2) పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ 2 మి.లీ., ఉధృతి ఎక్కువైనప్పుడు నొవల్యూరాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (3) బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరను (5 కిలోల వరి తవుడు +500 గ్రా. బెల్లం + 500 మి.లీ, మోనోక్రోటోఫాస్) ఉపయోగించాలి.
కొమ్మ మరియు కాయ తొలుచు పురగు ఈ పురుగు మొక్క పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది. తరువాత కాయల్లోకి వెళ్ళి నష్టపరుస్తుంది ఈ పురుగు ఆశించడం పుష్పించే దశ నుండి మొదలై పంట పూర్తి అయ్యే వరకు ఉంటుంది. పూత దశలో ఫ్రోఫెనోఫాస్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పచ్చ దీపపు పురుగులు ఈ పురుగులు ఆశించిన ఆకులు ముడతలు పడి, పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతాయి. పగటి ఉష్ణోగ్రత 28 డి. సె. కంటే ఎక్కవైనప్పుడు పురుగుల ఉధృతి ఎక్కవగా ఉంటుంది. పురుగు ఉధృతిని బట్టి ఫ్రోఫెనోఫాస్ 2 మి.లీ. /లీ. లేదా ఎసిటామిప్రిడ్ 5 గ్రా./ 10 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూజు తెగులు ఈ తెగులు సోకిన గెలల కాయలపై దూది పింజల లాంటి బూడిద పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకున కాయలు మెత్తబడి, కుళ్ళి రాలిపోతాయి. గెలల్లో కాయలు ఏర్పడే సమయంలో గాలిలో తేమ 90 రాత్రి ఉష్ణోగ్రత 22 డి.సె. కంటే తక్కువ. ఎడతెరిపి లేకుండా 5-6 రోజులు వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. (1) వరుసల మధ్య కనీస దూరం 90 సెం.మీ. పాటించాలి. (2) తుఫాను సూచనలు తెలిపిన వెంటనే, వర్షానికి కనీసం 6-8 గంటల ముందు 1 మి.లీ. ప్రోపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వర్షాలు పడిన తరువాత మరోసారి పిచికారి చేసి ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి.
ఎండు తెగులు మొక్కలు వడలిపోతాయి. ఆకులు పాతిపోయినట్లై తరువాత చనిపోతాయి. కాండం చీల్చి చూన్తే లోపల తెల్లని బూజులాంటి శీతింధ్రపు పెరుగుదల కనిపిస్తుంది. ఈ తెగులు పంట విత్తిన 20-60 రోజుల దశలో నేల ద్వారా సంక్రమిస్తుంది. ఒకే పంటను ఎక్కువ కాలం అదే పొలంలో సాగు చేయడం ద్వారా ఈ తెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. (1) తెగులును తట్టుకునే రకాలను(ప్రగతి, హరిత, డిసిఎస్-107) సాగు చోసుకోవాలి. (2) తెగులు లక్షణాలు కనిపిస్తే కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర నేలను తడపాలి.
మొలకకుళ్ళు తెగులు మొలకెత్తిన తరువాత ఆకులపై లేత రంగు పెద్ద మచ్చలు ఏర్పడి, అడుగున తెల్లని శీలింధ్రపు పెరుగుదల ఉంటుంది. విత్తనశుద్ది చేయకుండా మొలకేత్తిన తరువాత ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా,/లీ. నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి.

దిగుబడి

వర్షాకాలంలో ఆముదం సాగుచేసినప్పుడు ఎకరాకు 4-6 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. అదే యసంగిలో హైబ్రిడ్ లు వేసి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10-12 క్వింటాళ్ళ దిగుబడి లభిస్తుంది.

విత్తనోత్పత్తి

అముదంలో సూటి రకాలు మరియు హైబ్రిడ్ల విత్తనోత్పత్తికి యాసంగి అనువైనది. సూటి రకాల విత్తనోత్పత్తి నీటి సౌకర్యం గల ప్రదేశంలో పొలం చుట్టూ 1000 మీటర్ల వరకు ఎలాంటి ఆముదం లేని ప్రదేశంను ఎన్నుకోవాలి. సెప్టెంబరు రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చును. విత్తన తర్వాత మూడు దశలలో బెరుకులను తీసివేయవలెను. శాఖీయదశలో ఉన్నప్పుడు విత్తనోత్పత్తి చేసే రకాల లక్షణాల కంటే భిన్నంగా ఉన్న మొక్కలను కాండం రంగు, కణుపుల, సంఖ్య, కణుపుల సంఖ్య, కణుపుల మధ్య దూరం, మొక్కపై గల మైనపుపూత మరియు ఆకుల ఆకారం గుర్తించి ఏరి వేయవలెను. పూతదశలో గెల క్రింద భాగంలో ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు మాత్రమే ఉన్న మొక్కలను ఉంచి, ఎక్కవగా మగ పూత వచ్చిన మొక్కలను తీసివేయాలి. పూత దశ తర్వాత కాయల లక్షణాల ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కలను తీసి వేయాలి.

హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయుటకు నీటి సౌకర్యం గల ప్రదేశంలో పోలం చుట్టు 500 మీ. వరకు ఎలాంటి ఆముదం మొక్కలు లేని ప్రదేశం ఎన్నుకోవాలి. విత్తుటకు సెప్టెంబర్ మొదటి పక్షం నుండి అక్టోబర్ మొదటి పక్షం వరకు అనుకూలమైనది. ఆడ, మగ మొక్కలను 4:1 వరుసలలో నాటుకోవాలి. కాండం రంగు, కణువుల సంఖ్య, మొక్కలపై మొవపు పూత ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. మగ మొక్కలోని మొదటి గెలపై క్రింది భాగాన ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు ఉన్న మొక్కలను తీసి వేయాలి. ఆడ మొక్కలలో గెల మొత్తం ఆడ పుష్పాలు ఉన్న మొక్కలను మాత్రమే ఉంచాలి. గెల క్రింద భాగాన మగ పుష్పాలు వస్తే అట్టి మొక్కలను తీసివేయాలి.

ఆడ మొక్కల గెలల్లో ఆడ పుష్పాల మధ్య తరచుగా మగ మొగ్గలు వస్తుంటాయి. ఇట్టి మొగ్గలను ఎప్పటికప్పుడు విచ్చుకోకముందే తీసివేయాలి. మిగాతా యాజమాన్య పద్దదతులు యథావిథిగా ఆముదం పంట బాగా పాటించాలి. ఆడ మరియు మగ మొక్కల నుండి వచ్చు గెలలను వేరువేరుగా కోయాలి. ఆడ మొక్కలనుండి వచ్చు విత్తనాలను హైబ్రిడ్ విత్తనంగా వాడుకోవాలి. మేలైన యాజమాన్యంతో ఎకరానికి 4-5 క్వింటాళ్ళ హైబ్రిడ్ విత్తనం తయారుచేయవచ్చును.

  • ఆముదంలో దాసరి పురుగు ఉధృతిని గమనిస్తే ధయోడికార్చ్ 1 గ్రా+ డైక్లోరోవాస్ 1.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దాసరి పురుగుల పెద్దవిగా వున్నప్పడు వాటిని ఏరి నాశనం చేయాలి.
  • పొగాకు లద్దె పురుగులు ఆశించిన పొలాల్లో జల్లెడాకులను ఏరి నాశనం చేయాలి. ఉధృతి ఎక్కువగా వున్నప్పడు నొవాల్యురాన్ 1 మి.లీ/లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా విషపు ఎర పెట్టాలి.
  • ఎండు తెగులును గమనించినటైతే మొక్క మొదళ్ళలో కార్చండిజం 3 గ్రా/లీ. ద్రావణమును పోయాలి. పొలంలో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి.
  • వరాలు అధికంగా పడి గాలిలో తేమ ఎక్కువగా వుండడం వలన బూజు తెగులు ఆశించే ఆస్కారం వుంది. కావునా వాతావరణ హెచ్చరికలను అనుసరించి వరానికి కనీసం 6 గంటల ముందు కార్బండిజం 1 గ్రా./లీ. లేదా ప్రాపికొనజోల్ 1 మి.లీ/లీ. ను మొక్క మొత్తం తడిచేలా పిచికారి చేయాలి. తెగులు సోకిన గెలలను కోసి దూరంగా వేసి తగుల బెట్టాలి.
  • రబీ ఆముదము సాగుకు అక్టోబర్ మొదటి పక్షం అనువైనది.
  • ఒక ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాI కాష్ట్రాన్ మందు కలిపి శుద్ధి చేయాలి.
  • సాధారణ భూములలో 90X60 సెం.మీ. సారవంతమైన భూములలో 90x90 సెం.మీ దూరంలో విత్తుకోవాలి.
  • విత్తిన 48 గంటలలోపు తేమ వున్నప్పడు పెండిమిధాలిన్ కలుపు మందును 5-6 మి.లీలీటరు నీటికి కలిపి పిచికారి చేసి కలుపును నివారించుకోవాలి.
  • విత్తిన 10-15 రోజులకు ఎకరానికి 35 కిలోల డి.ఎ.పి, కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్ వేయాలి.
  • ఖరిఫ్ ఆముదం గెలలో 80 శాతం కాయలు ఎండినట్లు కానిపించినట్లైతే అట్టి గెలలను సికేచార్ తో కోసుకోవాలి.
  • కోసిన గెలలను రెండు రోజులు నీడలో ఉంచి మూడవ రోజు ఎండలో పెట్టి ఎండిన తరువాత వెడల్పు పలకలతో కొట్టి విత్తనం వేరుచేసుకోవాలి.
  • పొగాకు లద్దెపురుగు ఆశించిన పొలాలలో జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రా/లీ లేదా నోవాల్యురాన్ 1.0 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా విషపు ఎరును పెట్టాలి.
  • ఎండు తెగులును గమనించినట్లైతే కార్బండాజిమ్ 3గ్రా. మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళలో పోయాలి. పొలంలో నీరు లేకుండా చూసుకోవాలి.
  • పంటకాలంలో నవంబరు నుండి డిసెంబర్ వరకు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కనుక 12-15 రోజులకొకసారి నీటి తడులు ఇవ్వాలి.
  • మొలక కుళ్ళు తెగులు గమనించినట్లైతే 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా కర్బండాజిమ్ మందును ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate