অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పొద్దుతిరుగుడు

మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పంట సాధారణ విస్తరణం 4,300 హెక్టార్లు

విత్తే సమయం

ఖరీఫ్ లో తేలికపాటి నేలల్లో జూన్ రెండవ పక్షం నుండి జులై రెండవ పక్షం వరకు మరియు బరువైన నేలల్లో ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో నవంబర్-డిసెంబర్ మరియు వేసవిలో జనవరి మొదటి పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. పుష్పించే దశ మరియు గింజ గట్టిపడే దశలో ఎక్కువ పగటి కాలం (8-10 గంటలు) మరియు సూర్యరశ్మి ఉంటే, గింజలు బాగా నిండి నూనె శాతం పెరుగుతుంది.

అనువైన నేలలు

నీరు నిల్వ ఉండని ఎర్ర చల్కా, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు శ్రేష్ఠమైనవి. వర్షాధరంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి వున్నట్లయితే తేలిక నేలలు అనుకూలమైనవి.

రకాలు

హైబ్రిడ్ పంట కాలం (రోజులు) దిగుబడి (కిలోలు/ఎకరానికి) నూనె శాతం
కెబిఎన్ హెచ్-44 90-95 560-600 38
ఎన్ డిఎస్ హెచ్-1 80-85 600-700 40
డిఆర్ఎస్ హెచ్-1 90-95 600-700 40

పైన తెలుపబడిన హెబ్రిడ్లతో పాటు, ప్రైవేటు రంగ హెబ్రిడ్లను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చును.

అంతర పంటలు

ప్రొద్దుతిరుగుడు ఏక పంటగా లేదా వేరుశనగ+ప్రొద్దుతిరుగుడు 4:2, కంది+ప్రొద్దుతిరుగుడు 1:2 నిష్పత్తిలో ఖరీఫ్ లో సాగు చేయవచ్చును.

పంట మార్పిడి

చిరుధాన్యాలు (జొన్న, సజ్జ), అవరాలు (కంది, మినుము), వేరుశనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేయవచ్చును.

విత్తన మోతాదు

ఎకరాకు 2.5-3.0 కిలోల విత్తనం అవసరమవుతుంది.

విత్తనశుద్ధి

నెక్రోసిన్ వైరస్ తెగులు సవస్యను అధిగమించడానికి థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్ 25%+ కార్బండాజిమ్ 25% మందును 2 గ్రా. కిలో విత్తనానికి వాడి విత్తనశుద్ధి చేసుకోవాలి.

విత్తే పద్ధతి

బోదేలు చేసి విత్తనం నాటినట్లయితే పంటకాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొక్కలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది.

విత్తే దూరం

తేలిక నేలల్లో 45 సెం.మీ X 20-25 సెం.మీ. నల్లరేగడి నేలల్లో 60 సెం.మీ X 30 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఆరోగ్యకరమైన ఒక మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటి తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 2-3 టన్నుల పశువు, ఎరువును విత్తే ముందు వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు, మిగాతా సగం 2 దఫాలుగా వేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం 55 కిలోలు/ఎకరాకు వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో (ఆకర్షకపత్రాలు వికసించే దశలో) 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

సస్యరక్షణ

పురుగు/తెగులు గుర్తించు లక్షణాలు అనుకూల పరిస్థితులు నివారణ చర్యలు
పచ్చదీపపు పురుగులు దీపపు పురుగులు ఆశిస్తే, ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, పూర్తిగా ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు 30 డి. సెం. కంటే ఎక్కువైనప్పుడు మరియు పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ తెల్లదోమ ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన, మొక్కలు గిడసబారి పోతాయి. ట్రైజోఫాస్ 2.5 మి.లీ. లేదా ధయోమిధాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు ఆకులు, పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి. నెక్రోసిన్ వైరస్ తెగుల్లను పరోక్షంగా వ్యాప్తి చేసి నష్టాన్ని కలుగ చేస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. (1) థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. (2) ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ/ 10 లీ. నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు గుంపులుగా ఆకులపై పత్ర హరితాన్ని గోకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి. పైరు 30 రోజుల దశ నుండి ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించుకోవచ్చు.
బీహరి గొంగళి పురుగు పురుగులు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడు బారిపోతాయు. పుష్పించే దశలో ఎక్కువగా ఆశిస్తుంది. క్లోరిపైరిఫాస్ 2 మి.లీ.+ డైక్లోరోవాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
శనగ పచ్చ పురుగు లార్వాలు పువ్వులు, గింజల మధ్యన చేరి వాటిని తింటు అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పుష్పించే దశలో ఆశిస్తుంది. థయోమికార్బ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అల్జర్నేరియా ఆకుమచ్చ తెగులు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. పైరు 25 రోజుల నుండి 65-70 రోజుల వరకు ఈ తెగులు ఆశించి నష్టం చేస్తుంది. ప్రోపికొనజోల్ 25% ఇసి 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు ఆకులపై, అడుగుభాగాన బూడిదలాంటి పొడి కప్పబడి ఉంటుంది. తేమ తక్కువగా ఉండే వేడి వాతావరణంలో తెగులు తీప్రత ఎక్కువగా ఉంటుంది. డినోక్యాప్ 1 మి.లీ. లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నెక్రోసిస్ తెగులు ఆకులు సరిగ్గా పెరగక గిడస బారి పోతాయి. పువ్వు సరిగ్గా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతుంది. తామర పురుగుల ద్వార వ్యాప్తి చెందుతుంది. (1) విత్తనశుద్ధి చేయాలి. (2) పార్థీనియం కలుపును నివారించాలి. (3) ఇడిమాక్లోప్రిడ్ 4.0 మి.లీ/ 10 లీ. నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం

నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ మరియు గింజకట్టే సమయం కీలక దశలు.

కలుపు నివారణ, అంతరకృషి

పెండిమిథాలిన్ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని నేలపై పిచికారి చేయాలి. పంట విత్తిన 25-30 రోజుల తరువాత గుంటక/దంతితో అంతరసేద్యం చేయాలి.

పక్షుల బెడద

ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి రాక నివారణకు పైరును కనీసం సామూహికంగా 20-25 ఎకరాల్లో వేయాలి. రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున, సూర్యరశ్మి రిబ్బనుపై పడేలా కట్టాలి. శబ్ధం చేయడం, దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను పారద్రోలాలి.

పైరుకోత

పువ్వు వెనుకభాగం నిమ్మ పచ్చరంగుకి మారిన తరువాత, పువ్వులను కోసి 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి.

దిగుబడి

ఎకరాకు సుమారు 400 కిలోలు వర్షాధారం క్రింద, 400-600 కిలోల నిశ్చిత వర్షపాత పరిస్థితులలో, 800-900 కిలోలు నీటి పారుదల క్రింద దిగుబడి సాధించవచ్చును.

  • ఈ పంటను రబీలో నీటి పారుదల క్రింద నవంబరు 2వ పక్షం నుండి జనవరి మొదటి పక్షం వరకు విత్తుకోవవచ్చు.
  • కెబి.ఎస్.హెచ్-44, ఎన్.డి.ఎస్. హెచ్-1 మరియు డి.ఆర్.ఎన్.హెచ్-1 అనే సంకర రకాలు అనుకూలమైనవి.
  • నీరు నిలువ ఉండని తటస్దభుములైన (ఉదజన సూచిక 6.5-8.0) ఎర్రచల్క, ఇసుక. రేగడి మరయు ఒండ్ర్రు నేలలు పంట సాగుకు అనుకూలమైనవి.
  • ఎంపిక చేసుకున్న నేలను గుంటకతో రెండు సార్లు కలియదున్ని తరువాత చదును చేసి బోదెలు (తేలిక నేలలలో 45 సెం.మీ. నల్లరేగడి నేలలలో 60 సెం.మీ.) వేసి మొక్కకు మొక్కకు మధ్య 20-30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఈ విధంగాబోదెలు వేసుకోవడం వలన నీటి వృధాని అరికట్టవచ్చు.
  • ఎకరానికి 2.5-3 కిలోల విత్తనం సరిపోతుంది.
  • సేక్రోసేస తెగులు త్రివ్రంగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 3 గ్రా. ధైయోమిధాక్సామ్ లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి.
  • విత్తేటప్పుడు ఎకరానికి 25కి యూరియా, 100 కి సింగల్ సుపర్ ఫాస్ఫేట్ మరియు 20కి. మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలి.
  • గంధకం తక్కువగా ఉన్న నేలలలో ఎకరానికి 50-55 కి. జిప్స్ మ్ వేయాలి.

ఆధారం: వయసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate