অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అపరాలు

  • రబీలో నీటి పారుదల క్రింద ఆరుదల పంటలుగా బోర్లు బావుల క్రింద 3-4 తడులు ఇచ్చే అవకాశమున్నచో పెసర, వినుము మరియు కంది వంటలు పండించవచ్చును.
  • మిగులు తేమను మరియు మంచును ఆధారం చేసుకొని నల్ల రేగడి భూములలో వరాధారంగా శనగ పంటను పండించవచ్చును.
  • పెసర/మినుము/కంది పంటలను అక్టోబర్ 20 లోపు విత్తుకోవలెను.
  • శనగ నవంబరు వరకు విత్తుకునే అవకాశమున్నప్పటికి అక్టోబరులో విత్తుకున్నచో కీలక దశలలో బెట్టకు రాకుండా అధిక దిగుబడి పొందవచ్చును.
  • ఆఖరు దుక్కిలో ఎకరానికి 18 కిలోలు యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులు వేయాలి.

అనువైన రకాలు

కంది: డబ్ల్యు.ఆర్.జి-65, ఐసిపిఎల్-87119, ఐసిపిఎల్85063, ఐసిపిహెచ్-2740, ఎల్ఆర్జి-41 .

పెసర: డబ్ల్యు.జి.జి-87, డబ్ల్యు.జి. జి-42, యం.జి.జి.-295, యం.జి.జి-347, టి.యం-96-2

మినుము: పి.యు-31, ఎల్.బి.జి-752, ఎల్.బి.జి-787, యం.బి.జి.–207, టి.బి.జి-104

శనగ: జె.జి-11, ఎన్బిఇజి-3, ఎన్బిఇజి-47

విత్తనమోతాదు (ఎకరానికి)

పెసర/మినుము: 6 కిలోలు, కంది : 8 కిలోలు, శనగ : 25-30 కిలోలు

విత్తన శుద్ధి: పెసర / మినుములో కిలో విత్తనానికి 5 మి.లీ. మోనోక్రోటోఫాస్ 2.5గ్రా మాంకోజెబ్: శనగలో 2.5గ్రా మాంకోజెబ్ లేదా 1.5 గ్రా, విటావాక్స్ మరియు 8 గ్రా టైకోడర్మా విరిడితో విత్తనశుద్ధి చేసి ఆఖరుగా ఎకరా విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చరును (పెసర/మినుము/కందికి) పట్టించాలి. శనగలో ప్రతి 8 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ ను పట్టించి నీడతో ఆరబెట్టి తగు పదనులో విత్తుకోవాలి.

విత్తే దూరం: కందిలో సాళ్ళ మధ్య 60-75 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఎడంలో బోదె కాల్వల పద్ధతిలో విత్తుకోవాలి. అంతర పంటగా వేరు శనగ (1:7 లేదా 2:7) వేసుకోవచ్చును. పెసర/మినుము/శనగ 30x10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. కలుపు నివారణ: విత్తిన 24-36 గంటలలోపు పెండిమిథాలిన్ 1.25 లీటర్లు ప్రతి ఎకరానికి (అనగా లీటరు నీటికి 5 మి.లీ.) 200లీటర్ల నీటిలో కలిపి చేతి పంపుతో సమంగా పిచికారి చేయవలెను.

ప్రస్తుత పంటలలో తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • రబీలో సెప్టెంబర్ మాసంలో విత్తిన పెసర/మినుములో తొలి 20-25 రోజుల వరకు కలుపు లేకుండా చూడవలెను. అవసరం మేరకు తేలిక పాటి తడి ఇచ్చి ఆ తర్వాత అంతరకృషి చేసినచో పైరు ఎదుగుదలకు తోడ్పడును. కందిలో తొలి 40-50 రోజుల వరకు కలుపు లేకుండా చూడవలెను.
  • తొలి దశలో పెసర/మినుములో రసం పీల్చే పురుగుల ఉధృతి గమనించినచో మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను. తెల్ల దోమ ఆశించినచో డైఫెన్త్యురాన్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలెను.
  • ఖరీఫ్లో విత్తిన కంది పంటలో అంతర పంటలైన పెసర/ మినుము లేదా జొన్న మొక్కజొన్న తదితర పంటల అనంతరం వాటి అవశేషాలను భూమిలో కలియదున్ని లోతైన బోదెలు ఏర్పాటు చేయాలి. తద్వారా పైరు పూత, పిందె దశలో బెట్టకు రాకుండా వుండును.
  • ఖరీఫ్లో విత్తిన స్వల్పకాలిక కంది రకాలు త్వరగా మొగ్గకు రావడం జరుగుతుంది. శనగ పచ్చ పురుగు మరియు మారుకా మచ్చల పరుగు ఉనికిని ఎప్పటికప్పుడు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొగ్గదశలో 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత పూత దశలో క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. + డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • శనగపచ్చపురుగు ఉనికిని అంచనా వేయడానికి ఎకరానికి 4 ఫిరమోన్ట్రాప్స్ మరియు 20 పక్షిస్థావరాలను ఏర్పరుచుకోవాలి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate