మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 8.13 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.36 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత ఎకరాకు 180 కిలోలు. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా, గోదావరి డెల్లా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్ల ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. ప్రత్తిలో అంతర పంటగా కూడ పండించవచ్చు.
ఖరీఫ్ కాలంలో ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తరకోస్తా మండలాల్లో జూన్-జులైలోను విత్తుకోవచ్చు.
రబీలో ఉత్తర, దక్షిణ తెలంగాణా, కృష్ణా-గోదావరి, దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబరులో విత్తుకోవచ్చు. కృష్ణా-గోదావరి మండలంలో వరి మాగాణుల్లో నవంబరు-డిసెంబరు మొదటి వారంలో, వేసవికాలంలో ఫిబ్రవరి – మార్చిలో విత్తుకోవచ్చు.
పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.
ఒకసారి నాగలితోను, రెండుసార్లు గొలుతోను మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు.
ఎకరాకు 6-7 కిలోలు ( తొలకరిలో), మాగాణిలో వరి కోతల తర్వాత, రబీలో, మరియు వేసవిలోని వరి మాగాణుల్లో 10-12 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6-7 కిలోలు.
కిలో విత్తనానికి 30 గ్రాముల కార్పోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఈ పైరును కొత్తగా పండించేటప్పడు, రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
రకం |
పంటకాలం |
దిగుబడి(క్వి/ఎ) |
గుణగణాలు |
1 |
2 |
3 |
4 |
ఎల్.జి.జి 407 |
65-70 ఖరీఫ్, రబీ, వేసవి |
5-6 |
మొక్కలు నిటారుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన కాస్తాయి. గింజలు మెరుస్తూ మధ్యస్ధ లావుగా వుంటాయి. ఎల్లో మొజాయిక్, నల్ల అకుమచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది. బెట్టను కూడ కొంత వరకు తట్టుకొంటుంది. |
ఎల్.జి.జి 460 |
60-65 ఖరీఫ్, రబీ, వేసవి |
5-6 |
కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో వుండి కోయడానికి సులువుగా వుంటుంది. ఒకేసారి కోత కొస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. మొవ్వుకుళ్ళ తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. వరి మాగాణులకు అనువైనది. |
ఎల్.జి.జి – 450 |
65-70 ఖరిఫ్, రబీ, వేసవి |
5-6 |
మొక్కలు మధ్యస్ధ ఎత్తులో ఉండి గుబురుగా కన్పిసాయి. మొక్క పంటకొచ్చే సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా వుంటాయి. |
ఎల్.జి.జి 410 |
65-70 ఖరిఫ్, రబీ, మాగాణిలో వరి తర్వాత |
5-6 |
మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తూ వుంటాయి. ఒకే సారి కోతకొస్తుంది. కాపు పై భాగం ఉంటుంది. వరిమాగాణులకు అనువైనది. |
ఎల్.జి.జి 295 |
60-65 ఖరిఫ్, రబీ |
5-6 |
మొక్కలు నిటారుగా పేరుగుతాయి. కాపు మొక్క పై భాగానే ఉండి, గింజ మధ్యస్ధ లావుగా, సాదాగా ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది. మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. |
ఎల్.జి.జి 37 |
60-65 ఖరిఫ్, రబీ, వేసవి |
5-6 |
గింజలు ఆకర్షణియంగా పచ్చగా మెరుస్తుంటాయి. రాష్ట్రమంతటా, అన్ని కాలాల్లో పండించటానికి అనుకూల మైనది. ఎల్లో మొజాయిక్ తెగులును తట్టు కొంటుంది. ఒకేసారి కోతకొస్తుంది. |
ఎల్.జి.జి 2 |
60-65 ఖరిఫ్, రబీ, వేసవి |
5-6 |
మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తుంటాయి. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది.
|
టి.ఎమ్. 96-2 |
60-65 ఖరిఫ్, రబీ, వేసవి, మెట్ట మరియు మాగాణి |
4-6 |
అధిక త్వేమను మరియు బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. వరిమాగాణులకు అనువైనది. |
యమ్.జి.జి – 348 |
65 ఖరిఫ్, రబీ |
4-5 |
మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీలో సాగుకు అనుకూలమైనది. |
యం.యల్ -267 |
65 ఖరిఫ్, రబీ, వేసవి |
4-5 |
రాష్ట్రంలిని అన్ని ప్రాంతాలకు అనువైనది. మొక్క నిటారుగా పెరుగుతుంది. క్రింది నుండి పై దాకా కాపు కాస్తుంది. కాయ గుత్తులకున్న కాడ మరియు గింజలు అన్నీ చిన్నవిగా వుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. |
పూసా-105 |
65-70 ఖరిఫ్, రబీ, వేసవి, మాగాణిలో వరి తర్వాత |
5-6 |
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైనది. కాపు మొక్క పైభాగానే ఉంటుంది. ఒకే సారి కోతకొస్తుంది. గింజలు మధ్యస్ధ లావుగా పచ్చగా మెరుస్తుంటాయి. ఎల్లో మొజాయిక్, అకుమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకొంటుంది. |
మధిర పెసర (యమ్.జి.జి. 347) |
65-70 |
4-6 |
మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కారూ మొక్కపై బాగానే ఉండి, గింజలావుగా, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు మరియు అకుమచ్చ తెగుళ్ళను తట్టుకొంటుంది. |
సాళ్ళలో గొర్రుతో వెదబెట్టాలి. మాగాణిలో వరి కోయడానికి 2-3 రోజుల ముందు భూమి తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లాలి.
వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
ఎరువు |
మోతాదు (కిలోలు/ఎకరాకు) |
వేయవలసిన దశలు |
పశువుల ఎరువు |
2000 |
దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి |
నత్రజని |
8 |
విత్తనం చల్లే ముందు |
భాస్వరం |
20 |
విత్తం చల్లే ముందు |
వరి మాగాణుల్లో ఎరువులు వాడాల్సిన అవసరంలేదు.
పెసర వర్షాధారపు పంట. కాని వరాభావ పరిస్థితులేర్పడినప్పడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి.
పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.8-16 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పన విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పడు గొర్రుతో అంతరకృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు పెనాక్సాప్రాప్ ఇథైల్ 9% ఎకరాకు 250 మి.లీ. చొప్పన విత్తిన 20, 25 రోజులప్పడు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తొలకరిలో పెసర సాగుకు ఒకేసారి కోతకువచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసినాగాని గింజలు మొలకెత్తని రకాన్ని (యల్.జి.జి. 450) ఎన్నుకోవాలి. పెసరను వరాలు తగ్గిన తర్వాత గాని, రబీలోగాని లేక వేసవిలో గాని పండించాలి.
పెసరను అంతరపంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. పెసర : పత్తి/రబి కంది - 3:1. పెసర : తొలకరి కంది - 7:1. అంతరపంటకు అనువైన పెసర రకాలు : యల్.జి.జి. 460, 450, 410, యం.జి.జి. -295, డబ్ల్యు. జి.జి. -2, 37, యుం.యల్. 267.
పెసరను పత్తి లేదా రబి కందితో అంతరపంటగా వేసినపుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతరపంటగా వేసినపుడు 6 కిలోల విత్తనం, 7 క్రిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం వేయాలి.
చిత్తపురుగులు: ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పడు నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 2.0 మి.లీ. ఎండోసల్ఫాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు : ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుమడత అనే వైరస్ వ్యాధి కూడ వ్యాపిస్తుంది. పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ: ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లోమొజాయిక్ అనే వైరస్ వ్యాధిని (పల్లాకు తెగులు) కూడా వ్యాపింప చేస్తాయి. వీటి నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. మిధైల్ డెమెటాన్ను లేదా టైజోఫాస్ 2.0 మి.లీ లీటరునీటికి కలిపి పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు: ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీరి తినటం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంద్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నేర్రేలలోను చేరతాయి.
నివారణకు ఈ క్రింద సూచించిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి.
బూడిద తెగులు : ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పడు, ముదురు ఆకులపై, బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకులపైన, క్రింది భాగాలకు మరియు కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండైజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లీ. కెరాథేన్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ లేదా 1 మి.లీ. టైడిమార్చ్లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. నిర్దేశించిన కాలంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత సరిపడా వుండాలి. తెగులును తట్టుకునే రకాలను విత్తుకోవాలి.
సెర్కోస్పారా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రా, క్లోరోథలోనిల్ లేదా 1 గ్రాము కార్బండైజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్లను కలిపి వాడటం ద్వారా ఆకుమచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును కూడా నివారించవచ్చు.
బాక్టీరియల్ బైట్: ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. 1 గ్రా. పౌషామైసిన్ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి విత్తాలి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటో మైసిన్ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఆకుమడత తెగులు (మొవ్వకుళ్ళు): ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచు కుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగుభాగంలోని ఈనెలు రక్తవర్గాన్ని పోలి వుంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీక్రి తగులబెట్టటం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మి.లీ. డైమిధోయేట్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి. -295, యల్.జి.జి.-460 పెసర రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకొంటాయి.
ఎల్లోమొజాయిక్ (పల్లాకు) తెగులు : ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేక 2 మి.లీ. డైమిధోయేట్ మందును పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు. ఎమ్. ఎల్. 267, ఎల్జిజి 407, ఎల్ జిజి 460, డబ్ల్యు జిజి 37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. తెల్లదోమల ఉధృతిని వెంటనే అరికట్టాలి.
బంగారు తీగ (కస్కుటా): వరి మాగాణుల్లో బంగారు వన్నెగల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కలనుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోతుంది. ఈ తీగ, పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కాల్చి వేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నచోట పైరు 20 రోజులప్పడు “ఇమిజితాపిర్" (పర్ష్యూట్) అనే కలుపు మందును ఎకరాకు 200 మి.లీ. చొప్పన పిచికారి చేసి 5–7 రోజుల లోపల పైరుపై 1.0% యూరియాను పిచికారీ చేయాలి. అశ్రద్ధ చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును నష్టపరుస్తుంది.
పంట కోత – నిల్వ: తొలకరిలో ఎండిన కాయలను ఒకటి రెండు సార్లుగా కోసి నూర్చుకోవాలి. రబీ కాలంలో కాని, వేసవిలోగాని, మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తర్వాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టి శుభ్రపరచి నిల్వ ఉంచుకోవచ్చు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 2/4/2020