অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శనగ

శనగ

మన రాష్ట్రంలో శనగ పంటను 1.12 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నిజామాబాద్, మెదక్, మహబుబ్ నగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు ఎక్కువ అనుకూలమైనవి.

నేలలు

తేమ బాగా పట్టివుంచే సారవంతమైన మధ్యస్థ మరియు నల్లరేగడి నేలలు అనుకూలం. చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు వనికిరావు. తొలకరి పైరు కోసిన తర్వాత భూమిని నాగలితో లేదా కల్టివేటరుతో ఒకసారి ఆ తర్వాత గొర్రుతో రెండు సార్లు మేత్తగా దున్ని చదునుచేసి విత్తుటకు సిద్ధం చేయాలి. భూమిలో సరిపడా తేమ లేనిచో ఒక తడి ఇచ్చు దుక్కి తయారు చేసుకొనవలెను.

పంటకాలం

సాధారణంగా 90-110 రోజుల పంట కాలం కలిగి ఉంటుండి. స్వల్పకాలిక రకాలు 80-90 రోజుల పంట కాలం కలిగి ఉంటాయి.

అనుకూలమైన సమయం :

అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు.

రకాలు

రకం యాసంగి పంట కాలం(రోజుల్లో) దిగుబడి(క్వి/ఎకరాకు) గుణగణాలు
దేశవాళి రకాలు
జె.జి. 11 100-105 8-10 ఎండు తెగులును తట్టుకొంటుంది. లావు గింజ రకము.
జె.ఎ.కె.ఐ. 9218 95-100 8-10 ఎండు తెగులును తట్టుకుంటుంది. లావు గింజ రకం.
క్రాంతి (ఐ.సి.పి.వి-37) 100-105 8-10 గుబురుగా పెరుగుతుంది. గింజలు మధ్యస్ద లావుగా ఉంటూ ఎండు తెగులును తట్టుకోగల రకం.
జె.జి.-130 95-100 8-10 కోమ్మలు బాగా కలిగి ఉండి, గింజ లేత గోధుమ రంగులో ఉంటుంది. ఎండు తెగులు తట్టుకొనును.
నంద్యాల శనగ-1 90-100 8-10 వేడిమి మరియు బెట్టను కొంత వరకు తట్టుకోనును.
నంద్యాల శనగ-47 95-100 10-12 ఎండు తెగులును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. గింజలు ఆకర్షణీయంగా ఉండును, యాంత్రికంగా కోయుటకు అనువైనది.
కాబూళీ రకాలు :
కె.ఎ.కె.-2 95-100 8-10 లావు గింజ గల రకం. మొక్క ఎత్తుగా పెరుగుతుంది.
పూలే.జి. 95311 95-100 7-8 గింజ లావుగా ఉంటుండి.
శ్వేత (ఐ.సి.పి.వి.-2) 80-85 6-7 త్వరగా కపుకు వచ్చే రకం. ఎండు తెగులను తట్టుకునే రకం. ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలం (నవంబర్).

విత్తన మోతాదు

శనగ రకాలలో విత్తన బరువును బట్టి ఎకరాకు వేసుకోవాల్సిన విత్తన మోతాదు మారుతుంది.

దేశవాళి రకాలు :

25-30 కిలోలు/ఎకరానికి

కాబూళీ రకాలు :

45-60 కిలోలు/ఎకరానికి

విత్తన శుద్ధి

విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. ధైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రా. కార్బండాజిమ్ లేదా 1.5 గ్రా. విటావాక్స్ పవర్ తో విత్తిన శుద్ధి చేసి విత్తుకోవాలి. శనగను మొదటసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రా. రైజోబియం మిశ్రమాన్ని 300 మి.లీ. నీటిలో 10% బెల్లం మిశ్రమం 8 కిలోల విత్తనాలకు సరిపోతుంది, బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలింద్రనాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను ట్రైకోడర్మ విరిది 8 గ్రా.లు. ప్రతి కోలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

విత్తే దూరం

సాళ్శ మధ్యన 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం. మీ. లావు గింజలు కలిగిన కాబూళీ రకాలు విత్తినప్పుడు సాళ్ళ మధ్యన 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

మొక్కల సాంద్రత/ఎకరాకు

1,33,333.

విత్తే పద్ధతి

సాళ్ళ పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. విత్తనం 5-8 సెం. మీ. లోతులో తడి మట్టిలో పడేలా విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్చిలైజర్ పద్ధతిలో కూడా విత్తికోవచ్చు.

అంతర పంటలు / పంటల సరళి

  • మొక్కజొన్న – శనగ
  • జొన్న – శనగ
  • పెసర / మినుము – శనగ
  • సోయాచికుడు – శనగ
  • ఎడగారు వరి – శనగ
  • నువ్వులు – శనగ
  • శనగ + ధనియాలు (16:4)

సమగ్ర ఎరువుల యాజమాన్యం

  • సేంద్రియ ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొళ్లలను రోటావేటార్తో భూమిలో కలియదున్నాలి.
  • జీవన ఎరువులు : రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గింజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చలార్చవలెను. చల్లారిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత వహించవలెను. ఈ ప్రక్రియ పాలథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీడలో అరబెట్టే విత్తుకోవాలి.
  • ఎకరాకు 2 కిలోల ఫాస్పోబ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళలో పడేటట్లు వేసుకొనవలెను. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును.

  • రసాయనికి ఎరువులు : ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ మరియు 40 కిలోల గంధకము నిచ్చే ఎరువులు వేయాలి. ఎరువుల రూపంలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డి.ఎ.పి. మరియు 14 కిలోల పోటాషియంను వాడాలి. 8-12 కిలోల నీటిలో కరిగే గందకాని విత్తునప్పుడు వేసుకోవాలి. బాస్వరం ఎరువును సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో వేసెన పంటకు కావాల్సిన గంధకం అందుతుంది.

సూక్ష్మ పోషక లోపాలు – యాజమాన్యం

పోషక ధాతు లోపాలు ముఖ్య గురింపు లక్షణాలు అనుకూల వాతావరణం / పరిస్దితులు లోప సవరణ చర్యలు
జింక్ ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడతాయి. కణుపుల మధ్య దూరం తగ్గును, కాలి పొయిన మచ్చలు కనపడును వరి తరువాత శనగ సాగు చేసే నేలల్లో, ఉదజని సూచిక ఎక్కువ (>8.5) వున్న నేలల్లో లోపం కంనిపిస్తుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై లోవ లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారి చేయాలి.
ఇనుము లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలి పోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువ వుండి ఉదజని సూచిక ఎక్కువ (>8.5) ఉన్న నేలలో లోపం కనిపిస్తుంది. లీటరు నీటికి 5 గ్రాముల ఫెర్రాస్ సల్ఫేట్ (అన్నభేది) ఒక గ్రాము నిమ్మఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
గంధకం తొలుత లేత చిగురు హరిత వర్షం కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారును నేలలో 8 పి.పి.యం కంటే తక్కువగా గంధకం ఉన్నప్పుడు ఎకరాకు 8-12 కిలోల నీటిలో కరిగే గంధకాని విత్తునప్పుడు వేయాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

పైరు విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.

విత్తే ముందు

ప్లుక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారి చేసి, భూమిలో కలియదున్నాలి.

మొలకెత్తక ముందు

పెండిమిధాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్లు నీటికి కలిపి విత్తిన వెంటనే గాని మరసటిరోజుగాని పిచికారి చేయాలి.

అంతరాకృషి

30 నుండి 35 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసి కూడ కలుపు నివారించుకోవచ్చు.

నీటి యాజమాన్యం

  • పంటకు సమారు 300 మి.మీ. నీరు అవసరం ఉంటుండి.
  • నల్ల రేగడి నేలల్లో నిలువ/మిగులు ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలోని మంచులో మొక్కలు పెరుగుతాయి.
  • నేలలోని తేమను బట్టి ఒకటి లేదా రెండు తేలిక పాటి తడులు ఇవ్వాలి.
  • పూత దశకు ముందు (విత్తిన 30 – 35 రోజులకు) ఒకసారి మరియు గింజ కట్టే దశలో ఒకసారి (విత్తిన 55-65 రోజులకు) తడులిస్తే మంచి దిగుబడులు వస్తాయి.
  • నీటి తడులు పెట్టేటపుడు పొలంలో నీరు నిల్వ వుండకుండా జగ్రతపడావలెను.

కీలక దశలు

మొగ్గదశ మరియు గింజ కట్టే దశ. బెట్ట పరిస్దితులలో లేదా పూత దశలో 2% యూరియా లేదా డి.ఎ.పి. ద్రావణం (20 గ్రాముల యూరియా లేదా డి.ఎ.పి.ని. ఒక లీటరు నీటికి) పిచికారి చేస్తే కొంత మేరకు దిగుబడులు పెంచవచ్చు.

శనగలో పురుగులు-తెగుళు-సస్యరక్షణ

పురుగుల/తెగుళ్ళ పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరుస్దితులు/ఉధృతిగా ఉండు కాలం పురుగు/తెగుళ్ళ మందులు (మోతాదు లీటరు నీటికి) జీవ రసాయనాలు
శనగపచ్చ పురుగు తల్లి పురుగు లేత చిగుళ్ళపై, పూ మొగ్గలపై, లేత పిందెల పై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగల్ని తోలచి కాయలోకి తలను చోప్పించి మిగిలన శారీరాన్ని బయటుంచి లోపల గింజలను తిని డోల్ల చేస్తాయి. పురుగు తిన్న గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. మొగ్గ, పూత మరియు పిందె దశలో వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు రాత్రి ఉష్ణోగ్రతలు ఒకసారి గా పెరిగినపుడు కందిలో సూచించిన సమగ్ర నన్యరక్షణ పద్ధతులు పాటించాలి. అంతర పంటగా ధనియాలు (16:4) సాగుచేయాలి. చుట్టు ప్రక్కలా 4 వరుసల జొన్న పంట వేయాలి. 50-100 బంతి మొక్కలు నాటాలి.
రబ్బరు పురుగు మొగ్గ దగ్గర పత్రహరితాన్ని గీరి తిని నష్టము కలుగ జేస్తుంది. పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టవరుస్తుంది. ఉదృతంగా ఆశించినప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోవును. తొలి 20-25 రోజుల దశలో బెట్ట వాతావరణ పరిస్దితుల తర్వాత అధిక వర్షపాతం నమోదైతే ఉదృతి ఎక్కువగా ఉండును. క్వినాల్ ఫాస్ (2 మి.లీ./లీ) లేదా క్లోరిపైరిఫాస్ (2.5 మి. లీ./లీ.) లేదా నోవల్యూరాన్ (1 మి.లీ./లీ.) మందును పురుగు ఉదృతిని బట్టి 2-3 సార్లు 4-5 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి.
ఎండు తెగులు తెగులు సోకిన మొక్కల ఆకులు వడిలిపోయి, పసుపు రంగులోకి మారి రాలిపోవును. తెగులు వచ్చిన మొక్కలు ఆక్కడక్కడ గుంపులు, గుంపులుగా చనిపోవును. భూమిలో ఉన్న శిలింద్రం ద్వారా వ్యాపిస్తుంది. అన్ని దశలో వ్యాపించును. కాయ దశలో ఎక్కువగా ప్రభావితమగును. మొక్కల మొదళ్ళు తడిచే విధంగా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి పోయవలెను. తెగులును తట్టు కొనే రకాలను ఐసిసివి-2, ఐసిసివి-10, జే.జి-11 మరియు ఐసిసివి-37 ఎనుకొని విత్తుకోవాలి. ట్రైకోడెర్మా మిశ్రమం 10 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి విత్తు కోవడం వలన కొంత వరకు ఎండు తెగులును నివారించవాచ్చు.

పంటకోత

పంట పరిపక్వత దశకు చేరిక తర్వాత ఆకులు పసుపు రంగుకు మారి కాయలు కూడా పసుపు రంగుకు ఆ తర్వాత వరి గడ్డి రంగుకు మారును. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోవును. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్ తోక్కించి లేదా కర్రలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. యాంత్రికంగా కంబైండ్ హార్వెస్టర్ తో కూడా పంటను కోయవచ్చును.

కోతానంతర జాగ్రతలు

పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నుర్పిడి యంత్రాలతో కాని, చేతితో కాని నూర్పుకోవచ్చు. దుమ్ము, దూళీ, తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేయాలి. నిల్వ చేయడానికి ముందు విత్తనాలలో తేమ 9 శాతం మించకుండా చూడాలి.

నాణ్యతా ప్రమాణాలు

పంట ఉత్పతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య (నాఫేడ్) ద్వారా శనగలో నిర్దారించిన నాణ్యతా ప్రమణాలు.

క్రమ సంఖ్య ప్రమాణాలు అత్యధిక పరిమితి శాతం (ప్రతి క్వింటాలు తూకానికి)
1. దుమ్ము, ధూళి, చెత్త, పుల్లలు, రాళ్ళు, మట్టి మరియు ఇతర పంటల గింజలు 1.0
2. ఇతర ఆహారధాన్యాలు 3.0
3. ఇతరత్రా పప్పుదినుసుల గింజలు 5.0
4. తేమ 14.0
5. బాగా రంగు మారినవి / అంతర్గతంగా దెభ్బతిని నాణ్యతను ప్రభావితం చేసేవి 3.0
6. పాక్షికంగా రంగు మారినవి / పైపైన దెబ్బతిని నాణ్యతా ప్రభావితం కానివి 4.0
7. పరిపక్వత చెందని మరియు ముడుత గింజలు 6.0
8. పుచ్చులు 4.0

ఉత్పత్తుల నిల్వ, మెళకువలు మరియు సస్యరక్షణ

నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను (గొనె సంచులు) శుభ్రపరుచుకోవాలి. గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంతో ముంచి ఆరబెట్టిన గోనే సంచులను వాడాలి లేదా సచులపై మలాధియాన్ 10 మీ.లీ. లేదా డెల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.

బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మి.లీ. మలాధీయాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగులకుండా జాగ్రత్త వహించాలి.

ముఖ్య సూచనలు

  • నేలను మెత్తగా దున్ని మంచి మొలక శాతం ఉండేలా చూడాలి. సరియైన మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి.
  • ఎండు తెగులును తట్టుకునే జె.జి. 11, జె.ఎ.కె.ఐ 9218, నంద్యాల శనగ 47 రకాలను సాగు చేయాలి. సకాలంలో విత్తుకొని పంట చివరి దశలో బెచ్చ పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతల ప్రతికూల ప్రభావం లేకుండా చూడాలి. విధిగా విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.
  • అవసరం మేరకు 1-2 తేలిక పాటి తడులు విత్తిన 35-40 రోజులకు మరియు 55-60 రోజులకు అందించాలి. ఎట్టి పరిస్దితులలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
  • బెట్ట వరిస్దితులలో మరియు మొగ్గ దశలో యూరియా లేదా డి.ఎ.పి. 20 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసినచో దిగుబడి పెరుగును.
  • సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి చీడ పీడలను నివారించావలెను.
  • వత్తడం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంభించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును.

విత్తనోత్పతి

  • సారవంతమైన మురుగు నీరు నిల్వని, గత పంట కాలంలో శనగ వంటను వేయని పోలాన్ని వితనోత్పతికి ఎన్నుకోనవలెయును.
  • ఇతర శనగ పంట పొలాల నుండి మూల విత్తనానికై కనీసం 10 మీ. సర్టిఫైడ్ విత్తనానికై కనీసం 5 మీ. వేరాటు దూరం ఉండేలా చుసుకోనవలెయును.
  • విత్తుకోవడానికి అక్టోబర్ – నవంబర్ 15 వరకు అనువైన సమయం.
  • ఆయా ప్రాంతానికి అనువైన, తెగుళ్ళను తట్టుకొని బాగా ప్రాచుర్యం పొందిన అధిక దిగుబదినిచ్చు రకాలను ఎన్నుకొని మూల విత్తనాన్ని అధీకృత సంస్దల నుండి సేకరించి వితనోత్పతికి వాడవలయును.
  • సిఫార్సు చేయబడిన అత్యుతమ సేద్య పద్దతులు, సస్యరక్షణ చర్యలు పాటించవలయును.
  • సాధారణంగా మిగులు తేమ, మంచు ఆధారంగా పండే పంట అయినప్పటికీ అవకాశమున్నచోట విత్తిన 30 నుండి 40 రోజుల సమయంలో తేలికపాటి తడి స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చినచో దిగుబడి పెరిగి నాణ్యమైన విత్తనం లభించును.
  • పూతకు ముందు, తరవాత పిందే లేదా కాయ తయారగు సమయంలో తప్పనిసరిగా కేళీలు తీసివేయవలెను. కేళీలు మూల విత్తనంలో 0.1 శాతం, సర్టిఫైడ్ విత్తనంలో 0.2 శాతం మించకూడదు.
  • కోసే 10 రోజుల ముందు క్వినల్ఫాస్ (2 మీ.లీ./లీ.) పంట పై పిచికారి చేసినచో విత్తన నిల్వలో ఆశించే పురుగుల బెడద చాలా వరకు తగ్గి తద్వారా నష్టాని అరికట్టవచ్చు.
  • పరిపక్వత దశను గుర్తించి పంటను సకాలంలో పొడి వాతావరణంలో కోయవలయును.
  • కోత, నూర్పిడి సమయంలో కూడా తగు వేర్పాటు దూరాన్ని పాటించి 9 శాతం తేమ ఉండే విధంగా ఎండనిచ్చి కోత సంచులు ఉపయోగించి బల్లలపై నిల్వ చేయాలి.

విత్తాన నాణ్యతా ప్రమాణాలు

క్రమ సంఖ్య ప్రమాణాలు మూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం
1. నిత్తిన భౌతిక స్వచ్ఛత 98% 98%
2. భౌతిక ఇతర పదార్దాలు (అత్యధికంగా) 2% 2%
3. ఇతర పంటల విత్తనాలు (అత్యధికంగా) - 5/కిలో విత్తనానికి
4. కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) - -
5. ఇతర గుర్తించదగిన రకాలు (అత్యధికంగా) 5/కిలో విత్తనానికి 10/కిలో విత్తనానికి
6. మొలక శాతం (గట్టి విత్తనాలు కలుపుకొని) 85 85
7. తేమ శాతం 9 9

శనగ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫొన్ నెం. 9849133493, ౯౭౦౪౨౨౨౭౪౨

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate