పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కొర్ర

తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.

తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో కొర్ర పంటను సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.

విత్తే సమయము

ఖరిఫ్ లో జూన్ రెండవ వారం నుండి జూలై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి రెండవ పక్షం లోపు విత్తుకోవాలి.

నేలలు

తేలికపాటి ఎర్ర చల్కానేలలు, నల్లరేగడి నేలలు మరియు మురుగు నీటి సౌకర్యం గల నేలలు అనుకూలమైనవి.

విత్తన పద్ధతి

విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనం మరియు సన్నని ఇసుక కలుపుకొని వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో గొర్రుతో విత్తుకోవాలి.

ఎరువులు

ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 30-35 రోజుల దశలో మరో 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువును పై పాటుగా చేయాలి.

రకాలు:

రకం ఋతువు పంటకాలం(రోజులు) దిగుబడి(క్వింటాళ్ళు/ఎకరానికి) గుణగణాలు
సూర్య నంది ఖరీఫ్, వేసవి 75-80 10-12 అగ్గి తెగులు మరియు వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమములో పండించుటకు అనుకూలం.
ఎస్.ఐ.ఏ- 3156 ఖరీఫ్ 85-90 10-12 అధిక దిగుబదినిచ్చే రకం. వెర్రి కంకి తెగులను తటుకుంటుంది.
ఎస్.ఐ.ఏ- 3085 ఖరీఫ్, వేసవి 75-80 8-10 నీటి ఎద్దడిని మరియు అగ్గి తెగులును తట్టు కుంటుంది.

అంతర పంటలు

కొర్ర : కంది/సోయచిక్కుడు – 5:1 నిష్పత్తి.

కలుపు నివారణ, అంతరకృషి

విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా అంతర సేద్యం చేయాలి.

సస్యరక్షణ

గులాబి రంగు పురుగు

లార్వాలు మొవ్వుని తొలిచి తొలచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. నివారణకు 2.5 మీ.లీ. క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వెర్రి కంకి తేగులు

తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజు లాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్క నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. దీని నివారణకు 1గ్రా. మెటలాక్సిల్ 35 డబ్ల్యుఎస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కొర్ర సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెం. 8008404874

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.00806451613
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు