పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్వినోవా

క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహారపంట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహరంగా మంచి డిమాండ్ ఉంది.

క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహారపంట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహరంగా మంచి డిమాండ్ ఉంది. క్వినోవాలో 14-16 శాతం మాంసకృత్తులు, లైసీన్ మరియు మిథియోనైన్ అనబడే అమైనో ఆమ్లాలు, విటమిన్లు (బి మరియు ఇ), సూక్ష్మపోషకాలు (ఇనుము, కాల్షియo, మెగ్నీషియం) మరియు పీచుపదార్దాలు కలవు. క్వినోవా వెడల్పాటి ఆకులు గల ఏకవార్షిక ఆహారపంట. ఈ పంట సుమారు 1.0-1.5 మీ. ఎత్తు పెరుగుతుంది. క్వినోవాను ప్రధానంగా విత్తనం కొరకు సాగు చేస్తారు. వీటి విత్తనాల్లో మంచి పోషక విలువలు ఉన్నప్పటికీ, విత్తన పైపొరలో ‘సాపోనిన్లు’ ఉండటం వలన చేదు రుచి వస్తుంది. కావున విత్తన పైపొరను తప్పనిసరిగా తొలగించాలి.

క్వినోవా విత్తనాలకు ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడ డిమాండ్ వస్తున్నది, కావున ఈ పంట సాగు వివరాలు క్రింద తెలుపబడినవి.

విత్తే సమయము

సాధారణంగా క్వినోవా పంట పూత దశలో చల్లటి వాతావరణం ఉండాలి. కావున ఈ పంటను యాసంగిలో నీటి వసతి క్రింద అక్టోబర్ రెండవ పక్షం లోపు విత్తుకోవాలి. పంట పూత మరియ విత్తనం ఏర్పడే సమయంలో వర్షాలకు గురైతే దిగుబడి మరియు విత్తన నాణ్యత గణనీయగా తగ్గుతుంది.

నేలలు

ఈ పంటను ఎర్ర చల్కా నేలలు, నీరు ఇంకే మరియు మురుగు నీరు పోయే సౌకర్యం గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చును. చౌడు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం కావు.

విత్తన మోతాదు

ఎకరానికి 1.0-1.5 కిలోలు, విత్తేటప్పుడు విత్తనం మరియు సన్నని ఇసుక 1:3 నిష్కత్తిలో కలిపి విత్తుకోవాలి.

విత్తే పద్ధతి

ఈ పంటను నేరుగా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవచ్చు లేదా నారుమడి తయారు చేసుకొని 21-25 రోజుల మొక్కలను నాటవచ్చు. వరుసల మద్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం పాటించాలి.

ఎరువులు

ఎకరానికి 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాషియం నీచ్చే ఎరువులను వేయలి. నత్రజని సగాభాగం విత్తేటప్పుడు మిగతా సగం పైరు 35-40 రోజుల దశలో వేయాలి.

నీటి యాజమాన్యం

క్వినోవా సాగుకు 350-400 మి.మీ. నీరు అవసరమవుతుంది. కావున పంట కాలంలో నేలలను బట్టి 4-5 తడులు ఇవ్వాలి. గింజ కట్టే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా తడి ఇవ్వాలి.

సస్యరక్షణ:

ఆకు తొలిచే పురుగు మరియు పూతదశలో రెల్ల రాల్చే పురుగు ఆశిస్తే మోనోక్రోటోఫాస్ 2.0 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చు పూరుగులు ఆకులపైన, కాడలపైన ఉదృతి ఎక్కువైతే, డైమిదోయేట్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంట కోత మరియు నూర్పిడి

ప్రాంతాన్ని బట్టి క్వినోవా రకాలు 80-120 రోజుల్లో కోతకు వస్తాయి. కోత సమయానికి మొక్కలో ఆకులూ ఎండి పొలంలోని రాలిపోతాయి. ఆ తర్వత పంటను కోసి మార్పొడి చూసుకొని గింజలు మరు చూసుకోవచ్చు. విత్తనాల పై పోరాదు తొలిగించడానికి ప్రత్యక యంత్రాలు ప్రస్తుతం హైదేరాబద్, కర్నూల్ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నయి.

  • తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి సుమారుగా 6-8 కుంటలు గింజ దిగుబడి నమోదునుండి.

మార్కెట్

ప్రస్తుతం మన రాష్ట్రంలో క్వినోవాకి పూర్తిస్థాయి మార్కెట్ స్తాపించబడలేదు. కావున రైతులు సాగు చేసేటప్పుడు వ్యాపారులతో ఒప్పందం ప్రకారం అవగాహన కల్పించుకొని సాగు చేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.03162055336
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు