অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చిరుధాన్యాల ప్రాముఖ్యత

శ పురోగతికి ప్రతిబంధకంగా ఉన్న ఆహార సమస్యను పోలకులు, అధికారుల అండదండలతో శాస్త్రవేత్తలు అధిగమించగలిగారు. కానీ చిరుధాన్యాల పోషక విలువల పై సరైన అవగాహన ప్రజలలో, రైతు సోదరులలో లేకపోవడం వలన చిరుధాన్యాల ఉత్పత్తిలో మనం గణనీయంగా వేనుకపడిపోతున్నాం. పోషక విలువలలో వారికన్నా చిరుధాన్యాలు చాలా ముఖ్యమైనవి. గ్రమినుల ఆహారంలో వీటి వాడకం తగ్గడం వలన పోష్టిక విలువలు తగ్గిపోతున్నాయి. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయి.

చిరుదాన్యాలలో బి.కాం ప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. చిరుధాన్యాలను పోటు తీసిన తర్వాత ఆహారంగా వాడతారు. ఇలా చేయడం వలన ఎక్కువగా పొట్టులో ఉన్న బి-విటమిన్ శాతం నష్టపోతాం. కనుక చిరుధాన్యాలను పిండి చేస్తే ముందు కొద్దిసేపు ఉడకబేట్టడం లేదా నానబెట్టడం వలన బి-విటమిన్ లు నష్టపోయే శాతం కొంత మేరకు తగ్గించవచ్చు.

చిరుధన్యాలలో 3/4వ వంతు పిండిపదార్ధాలు ఉంటాయి. చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకునే ప్రజలలో 75-80 శాతం శక్తి ఈ పిండి పదార్ధాల వలన లభిస్తుంది.

సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలను పప్పులతో, మంసములలో, అకుకురలతో కలిపి తినడం వలన మానవులతో పెరుగుదల పాలలో ఉండే మంసకృత్తులతో సమానంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు సరైన పాళ్లలో అందుతాయి.

ఆహార ధాన్యాలతో పోల్చినపుడు చిరుధన్యాలలో ముఖ్యంగా సజ్జలలో అధిక శాతం కొవ్వు పదార్ధాలు (6.0-6.5 శాతం) ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో చలి కాలంలో ఎక్కువ శక్తికి గాను అధిక కొవ్వు పదార్ధాలు గల సజ్జలను ఆహారంగా తీసుకుంటారు.

VRK.jpg

చిరుధాన్యాలలో ఎక్కువగా కొర్ర, సామ, రాగులలో పీచు పదార్ధాలు ఉంటాయి. ఇవి మన జీర్ణ వ్యవస్ధలో ఉన్న ఎంజైముల వలన జీర్ణం కాకపోవడం ద్వారా మనుషులలో వచ్చే పలు రకాల రోగాలు ముఖ్యంగా మధుమేహం, స్ధూలకాయం, రక్తంలో లిపిడ్సు శాతం పెరగడం, క్యాన్సర్ మలబద్ధకం, జీర్ణవ్యవస్ధకు సంబందించిన రోగాలను దరికి చేయనీయదు.

సజ్జ రాగులలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లవణాలు ఉన్నాయి. అన్ని ఆహార ధాన్యాలు కంటే రాగిలో 7-35 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. నిత్యం రాగుల్ని ఆహారంగా తీసుకోవడం అన్ని వయస్సుల వారికి మంచిది. మొలకెత్తిన రాగులలో రోగ నిరోధక శక్తి వచ్చే విటమిన్-సి ఉంటుంది. పెరిగే పిల్లలలో ఎములకు, పుష్టికి పిప్పపళ్ళుగా మారకుండా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం లోపిస్తే పిల్లలలో పెరుగుదల కుంటుపడుతుంది. అంతేకాక దొడ్డి కాళ్ళు, గాడిద కాళ్ళు మొదలైనవి ఏర్పడతాయి. పెద్ద వాళ్ళలోనైతే ఎముకలు మెత్తబడి త్వరగా విరగడం, వెన్నుపూస వంగడం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి మొదలైనవి వస్తాయి.

ఈ చిరుధాన్యాలంటే చాలా మందికి చిన్న చూపు. విటమిన్లు తదితర లోపల వలన మందులు వాడి ఇతర రోగాల బారిన పడటం కంటే అన్ని పోషక విలువలు ఉన్న చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమోత్తమం.

చిరుధాన్యాల సాగులో సజ్జ సాగులో మేలకువలు

సజ్జ పంటలను మన రాష్టంలో అధికంగా మహబుబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో రైతులు సాగుచేస్తున్నారు. నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల తేలిక నుండి మధ్యరకం నేలలు అనుకూలమైనవి.

ఇ.సి.ఎం.ఎచ్ – 451, మల్లికార్జున, ఇ.సి.టి.సి – 8203, ఇ.సి.ఎం.పి – 221. ఈ రకాలు ఖరిఫ్, వేసవి కాలంలో పండించడానికి అనువైనవి. పంటకాలం 80-90 రోజులు. దిగుబడి – 20 నుండి 25క్వి/హె. వస్తుంది. ఈ రకం వెర్రి కంకి తెగులును, బెట్టను తట్టుకొని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది.

కిలో విత్తనానికి 3 గ్రా. ధైర్ మ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి,. పచ్చకంకి తెగులును నివారించడానికి మెటటాక్సిన్ 2 గ్రా. మందును కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి.

విత్తనానికి వరుసల మధ్య 45 సెం.మీ దూరంలో వరుసలలో 12-15 సెం.మీ ద్రుమలో గోర్రుతో విత్తుకోవాలి. లేదా నారుపోసి 15 రోజుల వయసు గల నారు మొక్కలను అదే దూరంలో నాటుకోవాలి.

వర్షాధారపు పంటకు 10 టన్నులSAJJA.jpg పశువుల ఎరువు ఒక హెక్టారుకు ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. నత్రజని 60 కిలోలు (సగం విత్తునప్పుడు మిగతా సగం నాటిన 25-30 రోజులకు) హెక్టారుకు భాస్వరం 30 కిలోలు హెక్టారుకు, పోటాష్ 20 కిలోలు / హెక్టారుకు విత్తేటప్పుడు వేయాలి.

 

నేల పరిస్ధితిని బట్టి సజ్జ పంటకు నీరు పెట్టాలి. పూత, గింజ పలుపోసుకునే సమయంలో నేలలో తగిన తేమ ఉండడం చలా అవసరం. నీటి ముంపు ఈ పంటకు హాని కలిగించును కనుక తగు మురుగు నీరు పారుదలను ఏర్పాటు చేయాలి.

విత్తనం మొలకేత్తక ముందు 0.8 కిలోలు/హె. అట్రజిన్ మందును లేదా విత్తనం మొలకెత్తిన తరువాత (15-20) రోజుల 2,4 – డి మందు 1.0 కి/హె. పిచికారీ చేయడం వలన కలుపు మొక్కలను నివారించవచ్చు.

తేలిక నేలల్లో చెదల నివారణకు హెక్టారుకు 20 కిలోల 5 శాతం కార్బరిల్ పొడిని దుక్కిలో వేసి దున్నాలి. బంక తెగులు నుండి పంటను కాపాడడానికి చిరుపోట్ట దశ నుండి 0.15 శాతం (1.5 గ్రా. మందును లీటరు నీటికి కలిపి) ధైరమ్ మందు 2 లేక 3 పర్యామూలు పంట పై పిచికారీ చేయాలి.,

సజ్జ పంటలో పిలక కంకుల కంటే ముందు ప్రధాన కాండపు కంకి మొదటి కోతకు వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి బంతి కట్టాలి. గింజలను సంచులలో గానీ, సీసాలతో గానీ నిలువ చేయాలి.

చిరుదాన్యాలలో రాగి సాగులో మెళకువలు

రాగి పంటను మన రాష్ట్రంలో మహబుబ్ నగర్, ఖమ్మం జిల్లాలో రైతులు వర్షాధారంగా, నీటిపారుదల కింద సాగుచేస్తున్నారు. రాగిని ఇసుక నేలలలో, బరువైన నేలలలో పండించవచ్చు.

మారుతి, గోదావరి, రత్నగిరి, కళ్యాణి, గౌతమి, పద్మావతి, సప్తగిరి, సింహాద్రి, వి.ఆర్. – 520, ఈ రకాల పంట కాలం 3-4 నెలల వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు 25-40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

బాగా దున్ని మెత్తగా తయారైన నేల రాగి పంట విత్తడానికి అనుకూలం. దీనికి గాను నాగలితో దున్ని, గుంటకను తోలాలి. హెక్టారుకు 5 కిలోల విత్తనం సరిపోతుంది.

రాగి పంటను మొదట నారుపోసి తరువాత నాటుకోవాలి. నారును ఎత్తెన నారుమడి పై తగిన నిరుపోయే సౌకర్యంతో పెంచిన 10 సెంట్ల నారుమడి అవసరం. స్వల్పకాలిక వంగడాలకు 21 రోజులు, దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల నారు నాటడానికి మంచిది. స్వల్పకాలిక రకాలకు 15 సెం. మీ. వరుసల మధ్య, 10 సెం. మీ. వరుసల మధ్య, 15 సెం. మీ. మొక్కల మధ్య దూరం ఉండాలి.

నారుమడిలో 250 చ. మీ. (10 సెంట్లు)కు 1.6 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం, 1.2 కిలోల పోటాష్ నిచ్చే రసాయనిక ఎరువులను వేసుకోవాలి.

నాటడానికి మొదలు ఆఖరి దుక్కిలో హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి భూమిలో బాగా కలిసెటట్లు దున్నాలి. 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్ వేసుకోవాలి. నాటిన 25-30 రోజులకు 30 కిలోల నత్రజనిని భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి.

నేల స్వభావాన్ని, అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. RAGI.jpgనారు మొక్కలు బాగా తొడిగిన తర్వత సుమారు 10 రోజులు నీటిని నిల్వ చేస్తే మొక్కులు ధృడంగా పెరిగి, ఆరోగ్యంగా ఉంటాయి. పూత, గింజ పలుపోసుకునే సమయంలో మాత్రం నేలలో తగినంత తేమ తప్పక ఉండాలి. రాగి పంట నీటి ముంపుకు తట్టుకోలేదు కనుకు మురుగునీరు పోయే వసతి తప్పక ఉండాలి.

 

నాటిన 3 వారాల వరకు కలుపు లేకుండా చేయాలి. పంట 30 రోజుల వయస్సులోపు చిన్న దంతితో కలుపుతీయాలి.

కిలో విత్తనానికి 2 గ్రా. ధైరమ్ మందును కలిపి విత్తనశుద్ది చేయాలి. అగ్గి తెగులు రాకుండా విత్తనం వేసిన 10-15 రోజులకు ఏదైనా కాపర్ ఫంగిసైడ్ లేదా కార్బండిజమ్ (0.1 శాతం) పిచికారీ చేయాలి. మరలా నాటడానికి ముందు ఇదే మందును పిచికారి చేయాలి.

పక్క పిలకల కంటే కొన్ని రోజులు మొదలే ప్రధాన కాండం వెన్ను పక్వానికి వస్తుంది. కనుక రాగిలో పంటకోత రెండుసార్లు జరగాలి.

గింజలకు ఒకే విధమైన రంగు రావడానికి కోసిన కంకుల పై తడుపత్రితో గాని లేక గోనే సంచులతో గానీ ఒక పూత కప్పాలి. కంకులు బాగా ఎండిన తరువాత బంతి కట్టాలి. విత్తనాన్ని ఎండబెట్టి పిపాలలో గానీ లేక సంచులలో గాని నింపాలి.

ఖరీఫ్ జొన్న: పంట కోత దశలో ఉంటుంది. గింజ క్రింది భాగాన నల్లటి చార ఏర్పడిన తర్వాత కంకులను కోయాలి.

మాఘి జొన్న : మాఫీు జొన్న పంటలో విత్తిన 20-25 రోజుల తర్వాత దంతితో అంతరకృషి చేయడం వలన కలుపు మొక్కలను నివారించవచ్చు. విత్తిన 40 రోజుల తర్వాత కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే 2,4-డి మందును ఎకరాకు 600 గ్రా|| చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కలుపు తీసిన తర్వాత ఎకరాకు 40 కిలోల నత్రజనినిచ్చు ఎరువును పై పాటుగా వేయాలి.

రబీ జొన్న: రబీలో జొన్నను అక్టోబర్ మాసం చివరి పక్షం వరకు విత్తుకోవచ్చు.

  • రబీలో పండించడానికి అనుకూలమైన సూటి రకాలు సి.ఎస్.వి 216 ఆ, సి.ఎస్.వి 14 ఆర్, యం 35-1, కిన్నేర, పాలమూరు జొన్న
  • రబీలో పండించడానికి అనుకూలమైన హైబ్రిడ్ రకాలు సి.యస్.హెచ్ 15 ఆర్. సి.యస్.హెచ్-16, మహాలక్ష్మి
  • ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. ధయోమిథాగామ్ 3 గ్రా మందును కిలో విత్తనానికి చొప్పన కలిపి విత్తుకోవాలి.
  • జొన్న పంటను సాళ్ళ మధ్య 45 సెం.మీ. దూరం మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి.
  • సజ్జ, రాగి, కొద్ర పంటలు కోత దశలో వున్నాయి. గింజ గట్టిపడిన తర్వాత సరైన పక్వత దశను గమనించి కోత కోసి నిల్వ చేసుకోవాలి.
ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate