హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఆహార ధాన్యాలు / చిరుధాన్యాల ప్రాముఖ్యత - వాటితో అదనపు విలువలు కలిగిన ఉత్పత్తులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

చిరుధాన్యాల ప్రాముఖ్యత - వాటితో అదనపు విలువలు కలిగిన ఉత్పత్తులు

చిరుధాన్యాల గురించి తెలుసుకొని వాటిని ఏదో ఒక రూపంలో తీసుకునే అవసరం ఎంతైనా ఉంది.

మన పూర్వీకుల ఆరోగ్యాన్ని బలాన్ని పరిశీలిస్తే - వారు కష్టపడి పనిచేసేవారు, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకొనేవారు. ప్రస్తుత కాలంలో శారీరక కష్టం తగ్గింది. అంతేకాక నాజూకు తిండి తినడం వల్ల అనారోగ్యాల పాలై పోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు ఆహారపు అవసరాలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న జనాభాకు మనకు అందుబాటులో ఉన్న వనరులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నాణ్యమైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించాలి. కాబట్టి చిరుధాన్యాల గురించి తెలుసుకొని వాటిని ఏదో ఒక రూపంలో తీసుకునే అవసరం ఎంతైనా ఉంది.

చిరుధాన్యాలు - ప్రాముఖ్యత

 • బంజరు భూములు, తక్కువ సారవంతం కలిగిన భూముల్లో వర్వాధారపు పంటగా పండించవచ్చు.
 • చిరుధాన్యాలలోని పిండి వ దారాలు, మాంసకృత్తులు వరి, గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఈ ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఊబకాయస్తులకు ప్రధానమైన ఆహారం.
 • చిరుధాన్యాలలో కాల్వియం, ఇనుము, మెగ్నిషియం, భాస్వరం అనే ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
 • చిరుధాన్యాలలో కొవ్వులు తక్కువ శాతంలో ఉండటం వలన రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గి నుంది. అంతేకాక రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మంచి ఆహారం.
 • చిరుధాన్యాల పైపొరల్లో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.
 • చిరుధాన్యాలలోని పీచు పదార్ధం రక్తంలోని చక్కెర శాతం తొందరగా పెరగనీయక పోవడం వలన షుగర్ పేషంట్స్కు చక్కెర శాతం కంట్రోల్లో ఉండటమే కాక త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది.

చిరుధాన్యాలనగా ప్రధానంగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఉలవలు.

జొన్నతో అదనపు విలువలు గల ఉత్పత్తులు

 • జొన్నతో సాంప్రదాయక వంటలైన జొన్న రొట్టె, అంబలి, సత్తుపిండి, పేలాలు, గటుకన్నంను తయారు చేస్తారు.jonna
 • జొన్నతో కేకులు, బిస్కెట్లు, బ్రెడ్ తయారు చేయవచ్చు. జొన్నలో గూటిన్ అనే పదార్థం లోపించడం వలన పిండి జిగురుగా ఉండదు. జొన్న బ్రెడ్ రెండు రోజులు మాత్రమే మెత్తగా ఉండి తర్వాత ఎండి రస్కుల రుచి వస్తుంది.
 • జొన్నతో పేలాలు, అటుకులు కూడా చేయవచ్చు.
 • జొన్నను రవ్వగా మార్చి వాటితో ఉప్మా కిచిడీ, దోశ, ఇడ్లీ తయారు చేయవచ్చు. జొన్నలో అనేక పోషక విలువలు ఉండడం గూటిన్ లోపించడం, ఫినాల్ పదార్థాలు కలిగి ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధంగా పనిచేస్తాయి.
 • జొన్నతో ఆధునిక వంటకాలైన జొన్న వర్మిసెల్లి, జొన్న నూడుల్స్ అలాగే ఆహార పానీయాలైన బూస్ట్, బోర్న్వీటా తయారు చేయవచ్చు.
 • జొన్న చొప్పను పశువుల దాణాగా వాడుతారు.
 • జొన్నని ప్రధానంగా కోళ్ళ దాణా, ఆల్కాహాల్ తయారీ పరిశ్రమలో వాడుతున్నారు.
 • జొన్నను మందుల పరిశ్రమలో వాడే పదార్థాల తయారీకి అనగా, ప్రక్టోజ్ సిరప్, గూకోజ్ పౌడర్, సిట్రిక్ఆసిడ్, సార్జిటాల్ను తయారు చేయవచ్చు.
 • తీపిజొన్నతో బెల్లం, ఇథనాల్, సిరప్లను తయారు చేయవచ్చు.

జొన్న: రబీ జొన్నను నవంబరు మొదటి వారం వరకు విత్తుకోవచ్చును.

 • ఎకరానికి 3 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి ధయోమిధాగ్జామ్ మందును 3 గ్రా. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
 • ఆఖరి దుక్కిలో ఎకరాకు 16 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులను వేసి కలియడున్నాలి.
 • విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ దూరం, మొక్కల మధ్య 12-15 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి.
 • విత్తిన 48 గంటలలోపు ఒక లీటరు నీటికి 4గ్రా. అట్రాజిన్ మందును కలిపి ఎకరాకు 200 లీటర్లు మందు ద్రావణాన్ని తడినేలపై పిచికారీ చేస్తే పంట మొదట దశలో కలుపు మొక్కలను రాకుండా నివారించవచ్చు.

సజ్జతో అదనపు విలువలు గల ఉత్పత్తులు

 • సజ్ఞను అన్నంగాను, రొట్టె, అంబలి గాను వాడుతారు. ఈ పదార్థాలు ఆలస్యంగా జీర్ణమయ్యి  చక్కని బలాన్ని చేకూర్చుతాయి.sajja
 • సజ్ఞ పులగం, సజ్జ గారెలు కొన్ని జిల్లాలలో ప్రత్యేక వంటకంగా చేసుకుని తింటారు.
 • సజ్జను బిస్కట్ల పరిశ్రమలోను, బర్పీల తయారీలోను వినియోగిస్తారు.
 • పశువులకు దాణాగా సజ్జలను ఉడికించి వాడతారు.
 • సజ్ఞ చొప్పను కూడా పశువులకు దాణాగా వాడవచ్చు.

రాగులతో అదనపు విలువలు కలిగిన ఉత్పత్తులు

 • రాగుల గింజలను నానబెట్టి మొలకగట్టి మాల్ట్ ను చేయవచ్చు. దీనిని పిల్లలు, పెద్దలు రోజు తీసుకోవచ్చు.ragi
 • రాగులతో సంగటి, రాగిలడు, రొట్టె, రాగి దోసె. రాగి పిట్ట, బిస్మెట్ల, రాగి ఇడ్లీ, మురుకులు, వడలు తయారు చేసి గర్భిణీలకు, బాలింతలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారంగా ఇవ్వవచ్చు. ఇది పుష్టిని, బలాన్ని ఇస్తుంది.
 • వేసవిలో రాగి అంబలిలో మజ్జగ, ఉప్పు చేర్చి తాగడం వలన వడగాల్పుల నుండి కాపాడుతుంది.
 • రాగి చొప్పను పశువుల దాణాగా వాడవచ్చు
 • రాగిలో ఉండే మిథియోనైన్, లైసిన్ అనే అమైనో ఆమూల వలన రాగులను చర్మ సౌందర్య సాధనాల తయారీలో విరివిగా వాడుతారు.

రాగి: రబీలో నవంబరు – డిసెంబరు మాసంలో విత్తుకోవాలి.

 • ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3గ్రా. మాంకోజేబ్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. 25-30 రోజుల వయసుగల నారును నాటుకోవాలి.
 • నాటేటప్పుడు వరుసల మధ్య 20-25 సెం.మీ మొక్కల మధ్య 10-12 సెం.మీ దూరం ఉండేలా నాటుకోవాలి.

కొర్రలు - అదనపు విలువలు కలిగిన ఉత్పత్తులు

 • కొర్రతో కొర్ర అన్నం, కిచిడి లాంటివి చేయవచ్చు.korra
 • కొర్రలను గోధుమలతో కలిపి బిస్మెట్లు, లడు వంటివి చిరుతిండ్లు తయారుచేసి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

3.01639344262
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
YELIGETI VITTAL Nov 26, 2019 11:11 AM

Diabetes vallu chiru danyalu yevee thinali

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు