హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఆహార ధాన్యాలు / నిల్వ ధాన్యాలను ఆశించే పురుగులు మరియు నివారణ చర్యలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నిల్వ ధాన్యాలను ఆశించే పురుగులు మరియు నివారణ చర్యలు

నిల్వ ధాన్యాలను ఆశించే పురుగులు మరియు వాటి నివారణ

పంట విత్తన మొదలు కోసే వరకు చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కల్గిస్తాయి. పంటకోత తర్వత నిల్వలో కూడా అనేక రకాల పురుగుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదముంది. నిల్వ చేసినప్పుడు ఆశించే పురుగులు, కలుగచేసే నష్టం, నివారణ గురించి తెలుసుకుందాం.

వరిధాన్యంలో – బియ్యం ముక్కు పురుగు

ఈ పురుగు బియ్యాన్ని కాకుండా, గోధుమ, జొన్న, మొక్కాజోన్న, బార్లీ గింజలను ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పురుగు పంట చేనులో ఉండగానే నష్టాన్ని కలిగిస్తుంది. పెంకు పురుగు వరి ధ్యాన్యం మీద గుడ్లను పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చిన లద్దె పురుగులు గింజ లోపలికి ప్రవేశించి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పురుగు ఆశించిన గింజల్లో వంకర టింకర రంధ్రాలు ఏర్పడతాయి.

గింజ తొలిచే పురుగు (నుసి పురుగు)

నుసి పురుగులు గోధుమ, వరి, జొన్న గింజలను అశంచి లోపల పూర్తిగా దొల్లగా మార్చుతాయి. ఈ పురుగులు తిని నష్టం చేసేది తక్కువ పిండి చేసి నష్టాన్ని చేసేది ఎక్కువ.

బియ్యపు చిలుక

ఈ పురుగు కూడా పైరు కంకి దశలో ఉండగానే అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. నిల్వలో ధాన్యపు గింజలపై పొరల్లో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. గిజంల పై గుండ్రటి రంధ్రాల్ని చేసి లోపలి పదార్ధాన్ని తింటాయి.

బియ్యం పురుగు

ఇది నిల్వ చేసిన బియ్యాన్ని జొన్నలను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు ఆశించిన గింజలు తుట్టేగా ఏర్పడతాయి. అనగా పురుగు రెండు లేదా అంతకన్నా ఎక్కువ గింజలను ఊలు దారం, మలంతో కలిపి గూడులాగా చేస్తుంది. లద్దె పురుగు తొలి దశలో నుకలను లేదా అంతకు ముందే గాయపడిన గింజలను ఆశిస్తుంది.

ఆల్ మండ్ మాత్ – వేరుశనగ కయతోలిచే పురుగు

ఈ పురుగు ఎండబెట్టిన, నిల్వ చేసిన వేరుశనగ కాయలను ఆశించి కాయల పై గుండ్రని రంధ్రాలు చేసి లోపలి పదార్ధాన్ని తింటుంది.

యాజమాన్య పద్ధతులు

 • పురుగు ఆశించక ముందు ధాన్యాన్ని 10-12 శాతం తేమ ఉండేలా ఆరబెట్టాలి.
 • నిల్వ చేసిన పాత ధాన్యాన్ని, కొత్త ధాన్యంతో కలపరాదు.
 • వీలైనంత వరకు కొత్త గొనె సంచులను వాడాల్సిన వస్తే వాటిని శుభ్రపరిచిన తర్వతే ఉపయోగించాలి.
 • గోదాముల్లో నిల్వ చేసే ముందు గోదాములను శుభ్రపరచాలి. ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడకు తగలకుండా తేమలేని ప్రదేశంలో చెక్క బల్ల మీద నిల్వ చేయాలి.

పురుగు ఆశించిన తర్వాత

 • గొనె సంచుల పైన మందులను పిచికారీ చేయాలి.
 • గోదాముల్లో నిల్వ చేసే ముందు వాటిని రాసాయనాల ద్వారా రోగ నిరోధన చేయాలి.
 • పాత గొనె సంచులను 0.01 శాతం ఫెన్వలరేట్ లేదా సైపర్మెత్రిన్ రసాయనంలో 10 నిమిషాల పాటు ముంచి తీసి, ఆరబెట్టిన తర్వాత వాటిలో ధాన్యాన్ని నిల్వ చేయాలి.
 • ఖాళీ గోదాముల్లో 0.05 శాతం మలాధియాన్ పురుగు మందును పిచికారీ చేయాలి.
 • విత్తనాల కోసం ఉపయోగించే ధాన్యానికి 5 శాతం మలధియాన్ (క్వింటా విత్తనానికి 250గ్రా.) కలిపి నిల్వ చేసుకోవాలి.
 • విషపూరిత వాయువులైన ఇధీలీన్ డైక్లోరైడ్, కార్బ్ న్ టెట్రా క్లోరైడ్, అల్యూమినియం ఫాస్పైడ్ ను ఉపయోగించి కూడా ధాన్యం నిల్వలలో ఆశించే పురుగుల్ని నివారించవచ్చు.
 • ఒక లీటరు ఇధలీన్ డైక్లోరైడ్, కార్బన్ టెట్రా క్లోరైడ్ ల మిశ్రమాన్ని (20 క్వింటాల ధాన్యానికి లేదా 35 లీ. మిశ్రమాన్ని ఘ.మీ. స్ధలానికి ఉపయోగించాలి)
 • అల్యూమినియం ఫాస్ఫేడ్ అయితే మాకెట్లో ట్యూబ్ ట్ల రూపంలో లభిస్తుంది. వీటిని 1-2 టాబ్లెట్స్ ని (3 గ్రా./టాబ్లెట్) మెట్రిక్ టన్ను ధాన్యైనికి లేదా 25 టాబ్లెట్లను 100 ఘ.మీ. స్ధలానికి ఉపయోగించాలి.
 • విషపూరిత వాయువులను వినియోగించడంలో నియమిత పరిమాణం లేదా నిర్దేశించిన మోతడులోనే చోరబడని వాతావరణంలోనే విషపుతిత వాయువులను ఉపయోగించాలి.
 • ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

  2.98994974874
  మీ సూచనను పోస్ట్ చేయండి

  (ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

  Enter the word
  నావిగేషన్
  పైకి వెళ్ళుటకు