పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రస్తుత పరిస్ధితుల్లో వరిసాగు పద్ధతులు

ప్రస్తుత పరిస్ధితుల్లో వరిసాగు పద్ధతులు.

ఈ సంవత్సరం ఒడిదుడుకులతో మెదలైన తొలకరిలో జులై ఆఖరి వరకు తెలంగాణలో367.5 మి.మీ. సాధారణ వర్షపాతంకు గాను 299.5 మి.మీ. వర్షపాతం నమేదైంది. ఇది -19% లోటు వర్షపాతం. తెలంగాణలోని 33  జిల్లాల్లో కేవలం 7 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నామేదైంది. ఈ పరిస్ధితుల్లో నాట్లు ఆలస్యమై, వరి విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. వరిలో దీర్ఘ మరియు మధ్యకాలిక రకాల నార్లు పొసే సమయం మించి పోయంది. నారుపోసి సాధారణ నాటు పద్ధతి ద్వారా సాగు చేయుటకు స్వల్పకాలిక రకాలను జులై మాసం చివరి వరకు నార్లు పోసుకోవాలి. అతిస్వల్పకాలిక రకాలు (ప్రద్యుమ్న వరాలు) సాగు నీటి వసతి ఉండి, నారు పోయుట మరీ ఆలస్యమైనటువంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయంగా ఆగష్టు మొదటి వారం వరకు కూడా విత్తుకోని సాగు చేసుకోవచ్చు.

ప్రస్తుత పరిస్ధితుల్లో సాధారణ నాటు వేయు పద్దతికి బదులు ప్రత్యామ్నాయ వరిసాగు పద్ధతులు ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాటిలో ప్రధానంగా:

 1. దమ్ము  చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి
 2. పొడి వరిని తరి పొలంగా సాగు చేయుట
 3. ఆరుతడి వరి సాగు

దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి

 • ఈ పద్ధతి ద్వారా నారు పెంచే సమయం, నారు పీకి నాటు వేసే ఖర్చు ఆదా అవుతుంది.
 • పంట కూడా 7-10 రోజుల ముందుగా కోతకు వస్తుంది.

నేలలు: సాధారణ పద్దతిలో సాగు చేసే అనువైన నేలలు ఈ సాగు విధానానికి అనుకూలం. సమస్యాత్మక నేలలు మరియు నీటిముంపుకు గురయ్యే భూములు ఈ పద్దతికి అనుకూలం కాదు.

విత్తన మేతాడు: రకాన్ని బట్టి ఎకరాకు 10-15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వివిధ ప్రాంతాలకు అనువైన, రైతులకు ఆమీదయెగ్యమైన అన్ని రకాలను ఈ పద్దతిలో సాగు చేసుకోవచ్చు.

విత్తన శుద్ధి, మండే కట్టడం : లీటరు నీటికి ఒక గ్రాము కార్బండజిమ్ కలిపినా ద్రావణంలో కిలో విత్తనాలను 12 గంటలు నానబెట్టి, 24 గంటలు మండికట్టి కొద్దిగా ముక్కు పగిలిన విత్తునాలను డ్రమ్ సిడర్ తో సాళిలో విత్తకోవాలి. డ్రమ్ సిడర్ లోని డ్రమ్ములలో 3/4 వ వంతు విత్తనాలను నింపి బురద పదునులో డ్రమ్ సిడర్ ను లాగి 8 వరుసల్లో విత్తుకోవచ్చు. వరసకు వరుసకు మధ్య 20 సెం.మీ. వరుసలో కుదురుకు కుదురుకు మధ్య 5-8 సెం.మీ. దూరం ఉంటుంది. తాడును ఉపయేగించి డ్రమ్ సిడర్ లాగితే వరుసలు బాగా వస్తాయి, కోనోవిడార్ తిప్పడానికి వీలుగా ఉంటుంది.

ప్రధాన పొలం తయారీ: ప్రధాన పొలం వీలైనంత బాగా చదును చేసుకొని, ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి. నల్లరేగడి భూముల్లో ఆఖరి దమ్ముచేసి, చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవాలి. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు. ఇసుక శతం ఎక్కువగా ఉన్న నెలల్లో విత్తలనుకున్న రోజే ఆఖరి దమ్ము చేసి, చదును చేసి పలుచటి నీటి పోరా ఉండేటట్లు చూసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం : సాధారణ వరిసాగుకు సిపారేసు చేసిన ఎరువుల మేతాడు సరిపోతుంది. కాకపోతే దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు (మొత్తం మేతాడు) మరియు పోటాష్ ఎరువు (సిపారను చేసిన మేతదులో సగం) మాత్రమే వేయాలి. దమ్ములో కానీ, విత్తేటప్పుడు కానీ నత్రజని ఎరువులను వేస్తే కలుపు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ సమయంలో నత్రజని ఎరువులను వేయకూడదు. నత్రజని ఎరువులను 3 సమభాగాలుగా చేసి 1/3 భాగం విత్తిన 15-20 రోజులకు, 1/3 భాగం  విత్తిన  40-50 రోజులకు, మిగిలిన  1/3 భాగం నత్రజని, సగం పోటాష్ విత్తిన  60-65 రోజులకు వేయాలి.

కలుపు యాజమాన్యం :

 • విత్తన 3-5 రోజుల లోపు  ప్రీతిలకలా+సేపనార్ మందును ఎకరాకు 600-800 మీ.లి. చొప్పున 25 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి.
 • విత్తిన 8 - 10 రోజులలోపు 80 - 100 గ్రా. పైరాజాసల్ఫ్యూరిన్ ఇడైల్ లేదా 1-1.5 లి. బ్యూటక్లోర్ లేదా 500 మి.లి. ప్రీతులకెలా లేదా 35 - 45 గ్రా. అక్సాదయార్జిల్ మందులలో ఎదో ఒకదానిని 25 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి.
 • విత్తిన 15 రోజులకు 300 మి.లి. సైహలోపప్ - పి-బ్యుటైల్ లేదా 250 - 300 మి.లి. పినాక్సీప్రాప్  - పి-ఇడైల్ మందులలో ఎదో ఒక దానిని ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 • విత్తిన 20 రోజులకు ఎకరాకు 100 మి.లి. బిస్ పైరీబాక్ కోడియం మందున గడ్డిజాతి మరియు వేదపులకు కలుపు నివారణకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 • విత్తిన 25-30 రోజులకు వెడల్పకు కలుపు నివారణకు 600 గ్రా. 2 , 4 - డి, సోడియం సాల్ట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.

నీటి యాజమాన్యం :

 • విత్తిన తర్వాత మొదట్లో నీరు లేకుండా బురద పదునులో మాత్రమే ఉంచాలి. వారం రోజుల పాటు ఆరు తఫులిచ్చి, ఆ తర్వాత 2-3 సెం.మి. నీరు పలుచగా పిలకలు వేసే దశ వరకు ఉంచాలి. పైరు చిరు పొట్ట దశ నుండి గింజ గట్టి పడే దశ వరకు 5 సెం.మి. నీరుంచాలి కోతకు 7-10 రోజుల ముందు నీరు క్రమంగా తగ్గించి పొలాన్ని ఆర బెట్టాలి.

పొడి వరిని తరి పొలంగా సాగుచేయట

ఈ పద్ధతి ద్వారా ప్రస్తత పరిస్ధితుల్లో స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేయడానికి నిలుండి. పొడి దుక్కులు చేసుకొని, వ్యవసాయ వాతావరణ సుచబాలను అనుసరించి ముందుస్తు సమాచారంతో ఎకరాకు 25-30 కిలోల విత్తనశుద్ధి చేసిన పొడి విత్తనాలను నాగలి లేదా గొర్రు సాళ్ళలో పొడి దుక్కిలో విత్తుకోని మట్టితో కప్పాలి. వర్షాలు కురిసేంత వరకు విత్తనాలు నెలలోనే ఉండి, వర్షాలు కురిసిన తర్వాత మేకకెత్తుతాయి. వర్షాలు కురిసిన వెంటనే నెలలో తగినంత తేమ ఉన్నపుడు ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిధలైన మందును 200 లి. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా మెలకెత్తాయినా పంటను జలాశయాలు, చెరువులు, కాలువల ద్వారా చిరు విడుదలయ్యేఎంత వరకు వర్షాధారంగానే ఆరుతడి పంటలుగా సాగు చేయాలి. ఆ తర్వాత విత్తిన 20 రోజులకు 100 మి.లి. బిస్ పైరీబాక్ సోడియం మందును 200 లీటర్ల నీటిలో కలిపి నెలలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయాలి. వర్షాలు కురిసి చెరువులు, జలాశయాల్లోకి నీరు కాలువల ద్వారా విడుదలయ్యాక పొడి వరిని తరి పొలంగా మర్చి సాధారణ నాటు వేయు పద్ధతిలాగా నీరు నిల్వ ఉంచి పంటను సాగు చేయాలి.

ఆరుతడి వరి సాగు (ఎరోబిక్ రైస్)

ఈ వరిసాగు పద్దతిలో వరిని సాధారణంగా పండించే మొక్కజొన్న వాలే ఆరుతడి పరిస్ధితుల్లో పండిస్తారు . పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా వరి పండించే విధానాన్ని ఆరు తడి వరిసాగు (ఎరోబిక్ రైస్)గా పిలుస్తారు.

ఆరుతడి వరిని ముఖ్యంగా మ్యాగీని భూముల్లో, సాధారణ పద్దతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండించే భూముల్లో, అడపాదడపా నీరు అందించే సుకార్యం కలిగిన ప్రాంతాల్లో, చెరువుల క్రిమ్ద సాగు చేసే పరిస్ధితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఈ పద్దతిలో దమ్ము చేసి నీరు నిల్వ ఉంచవలసిన అవసరం లేదు.

ఆరుతడి వరిసాగుకు లోతైన వేరు వ్యవస్ధ, దుర్దమైన కాండాన్ని కల్గి బెట్టాను తట్టుకొనే స్వల్పకాలిక రకాలైన యంతియు 1010 , ఇర్-64 రకాలు అనుకలం. తొలకరి వర్షాలను సద్వనియాగం చేసుకొని పలుమార్లు దున్ని మేత్తిని దుక్కి చేసుకొని కలుపు సమస్య రాకుండా చూసుకోవాలి. ఎకరాకు 25-30 కిలోల విత్తనమవసరముతోంది. విత్తే ముందు 3 గ్రా. కార్బండజిమ్ కిలో విత్తనానికి నేరుగా చదును చేసిన పొలంలో 20 సెం.మి. దూరంలో నాగటి సళ్ళ వెనక గాని, గొర్రుతో గాని, ట్రాక్టరుతో నడిచే సిడకమ్ పార్టీగ్రిల్ తో విత్తుకోవచ్చు. విత్తనం పై పొరల్లో పడేట్లు తక్కువ లోతులో (2.5-5 సెం.మి) విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ ఎరువులను వేసి బాగా కలియదున్ని నెల సమతలంగా ఉండేటట్లు చదును చెయాలి. పోటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో సగభాగం మిగిలిన సగభాగం నత్రజని ఎరువులతో సాధారణంగా వేసే మాగాణి వారికంటే సుమారు 25 % అధికంగా వేయాలి. నత్రజని ఎరువును మూడు ధపాలుగా విత్తిన 15 రోజులకు, పిలక దశలో, అంకురం దశలో వేయాలి. ఆరుతడి వరిలో ఇనుపడతు లోపం వలన ఆకులూ తెల్లగా పాలిపోయినట్లు ఉండి ఎదుగుదల తగ్గుతుంది. ఈ లోపే సవరణకు లీటరు నీటికి 3-5 గ్రా. అన్న బేది, 1 గ్రా. నిమ్మఉప్పు కలిపి పిచికారి చేయాలి. అవసరమైంధి వరం రోజుల తర్వాత మళ్ళీ పిచికారి చేయాలి.

ఈ పద్దతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తిన వెంటనే కలుపు మందు వేయడం తప్పనిసరి.

కలుపు నివారణకు : విత్తన 2 రోజులలోపు 80-100 గ్రా. పైరాజాసల్ఫ్యూరిస్ ఇడైల్ లేదా 600 మి.లి. ప్రీతిలకలా + సేపసర్ ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

విత్తిన 20-25 రోజులకు ౩౦౦ మి.లి. సైహలోపప్-పి-బ్యుటైల్ లేదా 8 గ్రా. మేట సల్ఫ్యూరిన్ మిడైల్ + క్లోరిమ్యరం ఇడైల్ మందులను 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి. వెడల్పకు కలుపు నివారణకు 400 గ్రా. 2 , 4 - డి - సోడియం సాల్ట్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటకు ప్రతి 7-10 రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటితడులు పెట్టాలి. అయితే పంటకు కావాల్సిన తేమను అందించడం, పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూడటం ప్రధానాంశం. అధిక వర్షాలు ణమేదైనపుడు నీటి తడులు అవసరం ఉండదు. ఈ విధంగా వానాకాలంలో 3-4 తడులతో వరిసాగు చేసుకొనే అవకాశం కలదు. ఈ పద్ధతి ద్వారా సాధారణ వరి సాగాడు పద్దతిలో పోలీసై  40-50% నీటిని అదా చేసుకోవచ్చు.

ఆధారం:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు