హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఆహార ధాన్యాలు / మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలకు అడవి పందుల యాజమాన్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలకు అడవి పందుల యాజమాన్యం

అడవి పందులు తినడం ద్వారా చేసే పంట నష్టం కంటే అవి విస్త్రుతంగా సంచరించడం ద్వారా పంట మొక్కలు ధ్వంసం చేయబడి నష్టశాతం పెరుగుతుంది.

ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, పండ్ల జాతికి చెందిన దానిమ్మ, ద్రాక్ష, కూరగాయల పంటల పై అడవి పందులు దాడిచేసి తినడం ద్వారా పంట నష్టం సంభవిస్తుంది. అడవి పందులు తినడం ద్వారా చేసే పంట నష్టం కంటే అవి విస్త్రుతంగా సంచరించడం ద్వారా పంట మొక్కలు ధ్వంసం చేయబడి నష్టశాతం పెరుగుతుంది. అడవి పందులకు వాసనను పసిగట్టే గుణం అధికంగా ఉంటుంది. అందువలన అవి దూరం నుంచి పంట పోలాలను వాసన ద్వారా గుర్తించి దాడి చేయడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది.

అడవి పందుల సమగ్ర నివారణ - భౌతికంగా ఏర్పాటు చేసే ప్రహారీలు :

ఇనుము ముళ్ళ తీగ కంచెను : పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో 3 వరుసలతో బిగించి కట్టినట్లయితె అడవి పందుల రాకను అడ్డుకోవచ్చు. ఈ విధంగా చేయడానికి ఒక ఎకరాకు అయ్యే ఖర్చు సుమారు రూ. 7000/-

లేజర్ ఫెన్స్ (వలయాకార ముళ్ళ కంచే) : ఈ పద్ధతిలో వలయాకారంలో ఉన్న కంచెను పొలం గట్ల వెంబడి ఒక అడుగు దూరంలో అమర్చినట్లయితె కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహనికి తీవ్రమైన గాయాలను కలుగచేస్తాయి. ఈ విధంగా చేయడానికి ఒక ఎకరాకు అయ్యే ఖర్చు రూ. 20,000/-

ఇనుపవల కంచే (చైన్ లింక్ ఫెన్స్) : పొలం నుండి ఒక అడుగు దూరంలో నుండి ముళ్ళను కలిగి ఉన్న ఇనుప కంచెను 3 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్ధవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది.

ఇనుపవల కంచే చుట్ట వేల సుమారు రూ. 10,000/- నుండి 11,000/-

కందకం తవ్వే పధ్ధతి : పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి రెండు అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగుల లోతైన కందకాలను ఏర్పాటు చేసినట్లయితే అడవి పందులు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ పధ్ధతి ఒక్క అడవి పందుల నివారణ మాత్రమే కాకుండా వర్షాభావ ప్రాంతాలలో నేలలోకి తేమను వృద్ధి చేయడానికి ఒక పొలం నుండి ఇంకో పొలానికి సోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.

జీవ కంచెలు

పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసలలో నాటడం : మొక్క జొన్న పంట పొలాల చుట్టూ 4-7 వరుసలు ఆముదపు పంటను దగ్గర తీస్తే మొక్కజొన్న పంట వాసనకన్నా ఆముదపు పంట వాసన ఎక్కువగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు మొక్కజొన్న వాసనను పసిగట్టలేక లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి.

కుసుమాలు : కుసుమాలు కూడా పైన చెప్పిన విధంగా చేయాలి. కుసుమ ముళ్ళు అడవి పందులకు కుచ్చుకొని అవి లోపలికి రావడానికి ఇష్టపడవు.

సాంప్రదాయ పద్ధతులు

వెంట్రుకలు వెదజల్లే పధ్ధతి : పనికిరాని వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు పోరంతాన్ని చదును చేసి వెంట్రుకలను పల్చగా చల్లాలి. అడవి పందులు నేలను తవ్వే అలవాటు వాసన చూసే అలవాటు ప్రకారం అవి నేల మీద తమ ముట్టే భాగాన్ని ఉంచి గాలి పీల్చడం వలన ఆ వెంట్రుకలు వాటి ముక్కులోనికి ప్రవేశించి శ్వాస పరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనుకకు వెళ్ళిపోతాయి.

చీరాల పద్ధతి : పాత చీరలను కర్రలను పాతి గోడలు వలే కట్టినట్లయితే అడవి పందులు రాత్రి సమయాల్లో దాడిచేసినప్పుడు ఆ చీరాల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపొతాయి. ఈ శబ్డాలను విన్న మిగతా పందులు భయపడి దూరం నుండి వెనుదిగురుతాయి.

పొగ పెట్టె పధ్ధతి : ఊరపందుల పేడ పిడకలను సేకరించి మట్టి కుండలలో ఉంచి కాల్చడం ద్వారా పొగ వచ్చేటట్లు చేయాలి. ఈ కుండలను రాత్రి సమయంలో పొలం చుట్టూ అక్కడక్కడ ఉంచాలి. తద్వారా వెలువడే వాసన ద్వారా ముందే అక్కడ మరొక పందుల గుంపు వెనుదిరుగుతాయి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.01492537313
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు