పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మొక్కజోన్నలో చీడపీడల నివారణ

మొక్కజొన్న పంట తెగుళ్ల రకాలు మరియు సస్యరక్షణ చర్యలు

మొక్కజొన్న మన రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత సాగుచేసే ప్రధానమైన పంట మొక్కజోన్నలో కనిపించే చీడపీడలు వాటి నివారణ చర్యలు ఇలా చేసుకోవాలి.mokkajonna.jpg

పాముపోడ తెగులు

ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల, కాండం పైన బూడిద లేదా గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి అవి పరిమాణంలో పెరిగి ఒక దానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇవి చూడటానికి పాముపోడ మాదిరిగా కనిపిస్తాయి. ముందుగా ఈ రకమైన మచ్చలను నేలకు దగ్గరగా ఉన్న ఆకులలో గమనించవచ్చు. క్రమంగా పైఆకులను, కండాన్ని ఆశించడం వలన మొక్క కణుపుల వద్ద విరిగిపోయే అవకాశం ఉంది. తెగలు ఉన్నప్పుడు మొక్క పైనుండి కిందకు వడలీ ఎండిపోతుంది.

నివారణ

 • ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి.
 • ట్రైకోడెర్మా విరిడి 1 కిలో పొడిని 100 కిలోల పేడలో (బాగా మాగిన పెంట) లో కలిపి చెట్లు నీడన ఉంచి దానిపై గొనె సంచితో కప్పి నీటితో తడుపుతూ ఉండాలి. ఇలా మనకు వారం రోజుల్లో ట్రైకోడెర్మా విరిడితో చేసిన కంపోస్టు తయారవుతుంది. దానిని చేనులో దుక్కిలో వేసుకుంటే ఈ తెగుళ్ళను రాకుండా నివారంచవచ్చు.
 • తెగులు సోకిన, నేలకు దగ్గరగా ఉన్న ఆకులను తీసి కాల్చి వేయాలి.
 • కర్బండిజ్ మ్ 1 గ్రా. లీ/ ప్రొపికోనజోల్ / హెక్సాకోనజోల్ / టేబూకోనజోల్ ను గాని 1 మి.లీ. / లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

కాండం కుళ్ళు తెగులు

ఈ తెగులు ఆశించిన మొక్కలు కాండం మొదటి భాగంలో విరిగి కింద పడిపోతాయి. అటువంటి మొక్కల కాండాన్ని చీల్చి చుసినట్లైతే లోపల బెండు భాగం కుళ్ళి, తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారి ఉంటుంది. ఈ తెగుళ్ళు కారకమైన శీలింధ్రాం వేరు నుండి కాండం పై భాగానికి వ్యాపించి గోధుమరంగు చారలు ఏర్పడతాయి. పూత దశలో / నేలలో తెమశాతం తగ్గడం వలన / ఉష్ణోగ్రత వాతావరణంలో ఎక్కువైనప్పుడు ఈ తెగులు సోకుతుంది.

నివారణ

 • దుక్కిలో ట్రైకోడేర్మా విరిడి శిలింద్రాన్ని పెంటలో వృద్ధి చేసి ఆ కంపోస్టును వరుసగా 3-4 సంవత్సరాలు దుక్కిలో వేసుకోవాలి.
 • పూత దశ/ ఆ తర్వత నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి .
 • చేనులో చుట్టూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చుసుకోవాలి .
 • పంట మార్పిడి వలన కూడా ఈ తెగులు నివారించవచ్చు.
 • పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటను పండించి దుక్కిలో కలియడున్నడం వలన కూడా నివారించవచ్చు.

ఆకుమూడు తెగులు

వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు తెగులు త్వరగా వృద్ధి చెందుతుంది. ఆకుల పై పొడవాటి చిన్న చిన్న కోలగా బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ రంగు మచ్చలు ఆకుల కిందిభాగంలో ఏర్పడి పైపైపు వ్యాప్తి చెందుతాయి.

నివారణ

మాంకోజేబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

తుప్పు తెగులు

ఆకులకు రెండు వైపులా గుండరని లేదా పొడవాటి గోధుమ వర్ణపు మచ్చలు / పొక్కుల మాదిరిగా కనిపిస్తూ తర్వాత క్రమంగా నలుపు వర్ణంలోకి మారుతాయి.

నివారణ

మాంకోజేబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి 1-2 సార్లు పిచికారీ చేయాలి.

కయతోలిచే పురుగు

ఈ పురుగు పంట మొలకెత్తిన 10-30 రోజుల నుండి కంకి దశ వరకు ఆశించి వాటి ప్రభావాన్ని చూపుతాయి. మొదటి పిల్ల పురుగులు. (లార్వా) మొక్క మొలకెత్తిన 10-20 రోజుల దశలో పత్రహరితాన్ని గోకి తింటుంది. కాయ లోపల తినడం ముడుచుకొని ఆకు ద్వారా కాండం లోపలికి చేరి రంధ్రాలను చేస్తాయి. ఆ ఆకులు విచ్చుకున్నాక వరుస క్రమంలో ఉండే రంధ్రాలు అగుపిస్తాయి. ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వ చనిపోతుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి తగ్గిస్తుంది.

 • పరుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
 • చేనులో/ చేను చుట్టూ కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.
 • పొలం చుట్టూ జొన్న పంటను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వత తీసివేయాలి.
 • పప్పుదినుసుల పంటలు (సోయా, కంది) వంటి వాటిని అంతర పంటగా వేసుకోవాలి.
 • •ఉధృతి ఎక్కువగా ఉంటె కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఆకుసుడులలో వేసుకోవాలి.

రసం పిల్చే పురుగులు

మొలకెత్తిన 30 రోజుల తర్వత నుండి రసం పిల్చే పురుగులైన పెనుబంక, నల్లి వంటివి ఆకులను, కాండాన్ని ఆశించి రసం పిల్చిడం వలన ఆకులు పసుపు రంగులో మారి, మొక్క గడిసబారి పోతుంది. అయితే రసం పిల్చే పురుగులు జిగురు పదార్దాన్ని నిసర్జిస్తాయి. దాని వలన మసి తెగులు సాకి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు.

నివారణ

 • మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. / డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 • మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు, సిర్ఫిడ్స్ వంటి పరాన్న జీవులు రసం పిల్చే పురుగుల ఉధృతిని అరికట్టగలవు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.02314814815
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు