పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రాగి / తైగులు

వరి మాగాణుల్లో నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.

కరీఫిల్ వర్షాధారంగా యాసంగిలో ఆరుతడి పంటగా రాగిణి సాగుచేసుకోవచ్చు. మాగాణుల్లో నేటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్దీ పాటి చేడు సమస్య ఉన్న పరిస్దితుల్లో రాగి పంట సాగు చేసుకుని మంచి దిగుబడులు పొందవచ్చును. రాగిలో క్యాలిసియం అత్యధికంగాను కొవ్యూ తక్కువగా ఉంటాయి.

విత్తే సమయము

ఈ పంటను ఖరీఫ్ లో జూలై మొదటి వారం నుండి ఆగష్టు చివరి వారం వరకు, రబీలో అక్టోబరు చివరి వారం వరకు మరియు వేసవిలో ఫిబ్రవరి మొదటి పక్షంలోపు నాటుకోవాలి.

నెేలలు

రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నెలలు మరియు కెద్ది పాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చును.

రకాలు:

రకం ఋతువు పంటకాలం (రోజులు) దిగుబడి (క్వింటాళ్ళు/ఎకరానికి) గుణగణాలు
భారతి అన్ని కాలాలకు 105-110 12-14 వెన్నులు పెద్దవిగా, ముద్దగా ఉంటాయి. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
శ్రీ చైతన్య ఖరీఫ్ 110-120 10-12 పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది.
మారుతి ఖరీఫ్,వేసవి 85-90 9-10 బెట్టను మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది.
హేమ రబీ 105-110 10-12 తెల్ల గింజ రాగి రకము. అగ్గి తెగులును తట్టుకుంటుంది.

విత్తన మొతాదు

2.0 కిలోల విత్తనముతో 5 సెంట్లలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనము అవసరమువుతుంది.

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండాదిమ్ తో విత్తనశుద్ధి చేయాలి.

విత్తే పద్ధతి

నారుమడికి తేలికపాటి దుక్కి చేసి విత్తనం చల్లి, పట్టే తోలాలి. బాగా దుక్కి చేసిన నేలల్లో రాగిని 1:3 నిష్పత్తిలో విత్తనము మరియు సన్నని ఇసుక కలిపి నేరుగా కూడ విత్తుకోవచ్చును.

నారు నాటేపధ్ధతి

85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసు కలిగిన మొక్కలను, 1.5-120, రేజుల దీర్ఘకాలిక రకాలను 30 రోజుల మొక్కలను నాటాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం పాటించాలి.

ఎరువులు

నాటే ముందు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి. ఎకరాకు 25-30 కిలోల డి.ఎ.పి., 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకు 25 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి.

కలుపు నివారణ, అంతరకృషి

విత్తనము వేసే దానికి మరియు నారు నాటే ముందు పెండిమిధాలిన్ ఎకరాకు 600 మీ.లీ. చొప్పున 200 లీ. నీటిలో (3 మీ. లీ. లీటరు నీటికి) కలిపి పిచికారి చేసి కలుపును నివారించవచ్చు.

నీటి యాజమాన్యము

పూత దశ, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా చూడాలి.

సస్యరక్షణ

వివిధ పరిశోధన కేంద్రాలలో నేర్వాహ్ణచిబడిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింది సస్యరక్షణ చెర్యలు మరియు మందులు సూచించబడినవి.

గులాబి రంగు పురుగు

బాగా ఎదిగిన లార్వాలు గులాబీ రంగులో ఉండి కాండాన్ని తొలచి లోపలి భాగాలను తినడం వలన మొవ్వు చనిపోతుంది. పంటను కంకి దశలో ఆశిస్తే తెల్లకంకులు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

అగ్గి తెగులు

ఈ తెగులు ఆశించినపుడు ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దారపు కండె ఆకారం మచ్చలు ఏర్పడతాయి. కణుపుల పై తెగులు ఆశిస్తే కణువులు విరగడం, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారుతాయి. మొక్కలపై ఈ తెగులు ఆశించినప్పుడు 1 గ్రా. కార్బండాజిమ్ లేదా 1 మీ.లీ. ఎడిఫెన్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంట కోత, నూర్పిడి

గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నపుడు, వెన్నుల దగ్గర ఆకులు పండినట్లుగా ఉంటే పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పకోసి, 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయాలి. బాగా ఆరిన వెనులను కర్రలతో కొట్టిగాని, ట్రాక్టరు నడపడం ద్వారా గాని గింజలను సేకరించాలి. అలా సేకరింసచిన గింజలను గాలికి తూర్పారబట్టి నాణ్యమైన గింజలను పొందవచ్చును.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.01581027668
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు