హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఆహార ధాన్యాలు / వరి సాగులో ఆరుతడి పద్ధతిలో నీటి కొరత అధిగమనం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వరి సాగులో ఆరుతడి పద్ధతిలో నీటి కొరత అధిగమనం

నానాటికి తగ్గుతున్న వర్షం, అడుగంటుతున్న భుగర్బలాలు నీటిపై ఒత్తిడి పెంచుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల నీరు ఒక పరిమితమైన వనరుగా మారింది. అన్ని రంగాలకు ఆత్యవసరమైన ఈ నీటి వనరు ఒక్క వ్యవసాయానికే 70-80 శాతం వరకు వినియోగించగా 20 శాతం తాగు నీరు, ఇండస్ట్రిలు, మిగతా రంగాలకు వినియోగిస్తున్నారు. మ్యవసాయంలో కూడా వరి పండించడానికే ఎక్కువ మోతాదులో నీరు అవసరం. సంప్రదాయ పద్ధతిలో కిలో బియ్యం ఉత్పత్తికి 3000-5000 లీటర్లు నీరు వినియోగీస్తూన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ జనాభా ప్రధాన ఆహారంగా వరినే తీసుకుంటున్నారు. ఇలా 2020-2025వ సంవత్సరం వచ్చేసరికి 15-20 మిలీయన్ హెక్టార్ల వరి పొలాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహర ఉత్పత్తికోసం తక్కువ నీటి వినియోగంతో దిగుబడులు తగ్గకుండా వరిని పండించాలి. శాస్త్రవేత్తల నిరంతర్ పరిశోధనల ఫలితంగా నీటి కొరతను అధికమించి వరి పండించడానికి ఆరుతడి (అంటే నీరు పెట్టడం, ఆరబెట్టడం) పద్ధతైన సాంకేతిక విధానాన్ని అనుసరించవచ్చని తెలియజేసారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం సాంప్రదాయ పద్ధతి కంటే 15-25 శాతం తగ్గుతుంది, నీటి వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. కానీ దిగుబడు మాత్రం విధానం ద్వారా సుమారుగా 14 శాతం దిగుబడులు పెరుగుతాయని నిపుణులు తెలియచేస్తూన్నారు. సంప్రదాయం పద్ధతిలో ఎక్కువగా వెలువడే మిధేన్ తదితర వాయువులను కూడా ఆరుతడి విధానం ద్వారా సుమరుగా 14 శాతం దిగుబడులు పెరుగుతాయని నిపుణులు తెలియచేస్తూన్నారు

సంప్రదాయ పద్ధతిలో ఎక్కువగా వెలువడే మిధేన్ తదితర వాయువులను కూడా ఆరుతడి పద్ధతిలో తగ్గుతుంది. ఆరుతడి విధానంలో వరి వేరు వ్యవస్ధ బాగా పెరుగుతుంది, చీడపురుగుల ఉధృతి కూడా తక్కువ ఉంటుంది. అలాగే భూమిలో జింక్ లభ్యత పెరిగి మొక్కకు అందుబాటులోకి వస్తుంది.

ఆరుతడి పద్ధతిని రైతులు చాలా సులువుగా ఆచరించదగ్గ పద్ధతి. ఈ పద్ధతి లో పొలంలో నిలిచి ఉన్న నీరు మొత్తం ఇంకిపాయిన కొన్ని రోజులుగాను మరల పొలానికి నీళ్ళు కట్టాలి. ఈ పద్ధతిలో రెండు తడుల మధ్య సమయం మట్టి రకాలు, వాతావరణం, పంతకాలాన్ని బట్టి 1 నుండి 10 రోజుల వరకు ఉండవచ్చు. ఆరుతడి పద్ధతి లో ఎప్పుడు నీరు కట్టాలి అనే అంశం చాలా కీలకం దీన్ని గుర్తించడానిక నిపుణులు ప్లాస్టిక్ గొట్టం చిట్కాను రూపొందించారు. ఇలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, చాలా సులువుగా ఆచరించు దగిన పద్ధతి, పెద్దగా నైపుణ్యత కూడా అవసరంలేదు.

పొలంలో అమర్చుకునే నీటి గొట్టం నిర్మాణం

ఈ పద్ధతిలో రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ గొట్టం వినియోగించి పొలంలో ఉండే నీటి మోతాదును గుర్తించి అవసరమైన నీటిని ఇవ్వడం జరుగుతుంది. గుర్తించి అవసరమైన నీటిని ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం రైతులు ముందుగా 6 అంగుళాలు వ్యాసంతో 1 అడుగు పొడవు ఉండే ప్లాస్టిక్ గోట్టమును తీసుకోవాలి. అడుగు పొడవు గల గొట్టం అడుగు భాగం నుంచి 6 అంగుళాల ఎత్తు వరకు కన్ని వైపులా రంధ్రాలు చేయలి. ఈ రంధ్రాలు 0.5 సెం.మీ. పరిమాణంలో గొట్టం ఇరువైపులా ఉండాలి. రెండు రంధ్రాల మధ్య 2 సెం,. మీ దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా పైపు గొట్టం చుట్టూ రంధ్రాలు చేసినత ర్వాతా గొట్టాన్ని సమానంగా 6 అంగుళాల పైకి కనబడేలా పాతాలి. గొట్టం అడుగు భాగం కనబడేలా గొట్టం లోపలి మట్టిని తీసేయాలి. ఇలా అమర్చిన గొట్టంలో పొలంలోని నీటి మట్టం గొట్టంలో కనబుడుతుంది. పైపు రంధ్రాల గుండా బయటికి లోపలికి నీరు సులభంగా ప్రాహిస్తుంది. ఈ గొట్టాన్ని పొలం గట్లకు దగ్గరగా 1 మీ. దూరంలో అందుబాటులో ఉన్న పొలంలో ఉంచాలి. దీనీవల్ల పర్యవేక్షణ సులువుగా జరుగుతుంది. అలాగే గొట్టం అమర్చుకునే చోట, పొలం సుమారు నటి లోటును తెలిపే లాగా అనగా పొలంలో ఎత్తు ప్రేదేశంలో లేదా లోతు ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇక పొలానికి తడి పెట్టినప్పుడు గోటంలోపల , బయట నీటి ఉపరితలం సమానంగా ఉండాలి. ఉపరితంలో సమానంగా ఉండాలి. ఉపరితలం సమానంగా ఉండని ఎడల గోత్తమునకు చేసిన రంధ్రాలు మట్టితో పురుకుపోతాయి. కనుక గొట్టాన్ని మరల జాగ్రత్తగా అమర్చుకోవాలి.

ఆరుతడి విధానం అమలు పద్ధతి

ఆరుతడి పద్ధతిని నారు నాటిన 30 రోజులు తర్వాత ఆరంభించాలి. అదే నేరుగా విత్తన పొలంలో అయితే మొక్క 10 సెం. మీ. ఎత్తు ఎదిగిన తర్వాత ఆరంభించాలి. ఒకసారి పొలానికి తడి పెట్టన తర్వత నిదానంగా పొలం పై నిలిచి ఉన్న నీరు తగ్తుతతూ ఉంటుంది. గొట్టంలో భూమి ఉపరితలం నుండి 15 సెం. మీ నీటి లోతు పడిపోతే అప్పుడు మరల భూమి పై 5 సెం.మీ. నీరు ఉండేలా తడి ఇవ్వాలి. మళ్ళి భూమి ఉపరితలం నుండి 15 సెం. మీ. లోతుకు పడిపోయిన తర్వత 5 సెం. మీ. నీటి ఎత్తు ఉండేలా తడిని ఇవ్వాలి. అయితే పంట పూత దశకు ఒక వారం ముందు నుండి ఒక వారం తరువాత వరకు మట్టుకు పొలంలో 5 సెం.మీ. నీరు నిలబడేలా చూసుకోవాలి. పూత వచ్చే సమయంలో నీటిఎత్తు భూమి ఉపరితలం నుండి 15 సెం.మీ లోతుకు పడిపోయిన తర్వత 5 సెం.మీ ఎత్తుకి తడిని ఇచ్చుకోవచ్చు. కాని ఎప్పుడైతే వరిపోలంలో కలుపు ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రం కలుపును అణచివేయడానికి 2-3 వారాలు ఈ పద్ధతి పాటించకుండా పొలంలో నీరు నిలిపి ఉంచాలి. ఆరుతడి పద్ధతిలో ఎరువుల మోతాదు, సంప్రదాయ పద్ధతిలో వేసే మోతదుతో సమానంగా అందిచాలి. కానీ నాత్రజనిని తడి పెట్టుకునే ముందు పొడి నేలలో వేసుకోవాడం ఇక్కడ ఎంచుకోదగ్గ పద్ధతి.

వరికి నీటి అవసరం ఎక్కువ కానీ నీటి మొక్క కాదు అనే విషయాన్ని రైతులు గుర్తించి ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు ఉద్యమించాలి. నీటి కొరతను అధిగమించి అధిక దిగుబడిని సాధించాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.99462365591
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు