పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వరిలో సమగ్ర పోషక యజమాన్యం

వరిలో సమగ్ర పోషకాల యాజమాన్యానికి సూచనలు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 44 లక్షల ఎకరాల్లో సాగుతున్న ప్రధానమైన అహార పంట వరి. ఇటీవలి కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, అలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడలు, రానురాను కూలీల సమస్య వరిలో దిగుబడుల మీద ఉత్పత్తి మీద ఇతర అంశాలైన నేల, నీరు, విత్తనాలతో పాటుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పోషకాల యాజమాన్యం. వరిలో సరాసరి దిగుబడి పెంచడానికి అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన పద్దతులను వినియోగించాలి. కేవలం రసాయన ఎరువులనే వాడకుండా సేంద్రియ పదార్థాల వాడకాన్ని పెంచుతు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన ఫలవంతమైన నేలను అందించాలి. వరి పంటలో అధిక, సుస్థిర దిగుబడులు సాధించాలంటే పోషక పదార్థాలు సమతుల్యంగా తగిన మోతాదులో అందించాలి అంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. సమతుల్యంగా పోషక పదార్థాలు వాడకపోతే తెగుళ్ళ వల్ల పంట ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. పంట అవసరాన్ని బట్టి, భూసార సహజ వనరుల శక్తిని సమన్వయం చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం నిష్పత్తిని నిర్ణయించాలి. కేవలం నత్రజని ఎరువులనే అధికంగా వాడి భాస్వరం పొటాష్ ఎరువులను వాడకపోవడం వలన చీడపీడల ఉధృతి ఎక్కువై పంట నాణ్యత తగ్గుతుంది.

భూసార పరిరక్షణకు, సుస్థిర దిగుబడులకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయన ఎరువులతో పాటు అందుబాటులో ఉన్న ఏదో ఒక సేంద్రియ ఎరువుగానీ, జీవన ఎరువులుగానీ 30-50 శాతం మేర వాడుకోవాలి. అంతేగాక పచ్చిరొట్ట ఎరువులు కూడా వాడి పైరుకు సమతుల్యంగా పోషక పదార్థాలు అందించాలి. ఒక టన్ను వరి ధాన్యం పండించేందుకు సుమారు 16 నుండి 20 కిలోల నత్రజని, 7-9 కిలోల భాస్వరం, 18-24 కిలోల పొటాష్ పోషకాలను పేరు తీసుకుంటుంది. వీటిలో పాటు సూక్ష్మపోషకాలైన జింకు, కాపర్, మాంగనీస్, బోరాన్, మాలిబిసం, ఉపపోషకాలైన కాల్షియం, మెగ్నిషియం, గంధకంలను కూడా మొక్కలు నేలనుండి సంగ్రహిస్తాయి. ప్రతి పోషకం పాత్ర జీవక్రియలో ప్రత్యేకంగా ఉంటుంది. ఒక పోషకం లోపిస్తే అది చేసే పని దెబ్బతింటుంది. దాని ప్రభావం దిగుబడి మీద పడుతుంది. కావున పోషకాలను తగు మోతాదులో, సరైన సమయంలో, సరైన పద్దతిలో అందిస్తే పైరు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది. ప్రస్తుతం సాగుచేస్తున్న అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకరజాతి వరి రకాలు వాటి కాలనుసారం, భూసార వనరుల శక్తి, కాలపరిమితి అనుసరించి దిగుబడి ఉంటుంది. మొదటగా పంట నేల భూసారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మట్టి నమూనాలు సేకరించి, నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్ శాతాన్ని సూక్ష్మ పోషకాల లభ్యత గూర్చి ప్రయోగశాలలు, పరీక్ష చేసి పోషకాల స్థాయిని తెలుసుకొని, పంట కావాల్సిన స్థాయిని మోతాదును) లెక్క చేసి అనవసర ఖర్చు తగ్గించవచ్చు. రసాయన, సేంద్రియ ఎరువుల కలయిక పంటకు మంచి నాణ్యతను, దిగుబడిని ఇస్తుంది. అధిక రసాయన ఎరువుల వాడకం అనర్థదాయకం అని గుర్తించడమైనది.

వరిలో సమగ్ర పోషకాల యాజమాన్యానికి సూచనలు

  • తొలకరిలో పెసర్లు, బబ్బెర్లు (అలసంద), జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 40-45 రోజులు పెంచి కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరగడమే కాక 20-25 శాతం వరకు నత్రజని ఆదా చేయవచ్చు.
  • పశువుల పెంట, కోళ్ళఎరువు, పట్టణ కంపోస్టు, వానపాముల ఎరువులను సేంద్రియ ఎరువులు అంటారు. వీటిని రసాయన ఎరువులతో పాటుగా దుక్కిలో వేయడం వల్ల సుమారు 20-25 శాతం నత్రజని ఆదా చేయడంతో పాటు, సేంద్రియ ఎరువులు భూ ఉత్పాదకత శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
  • రసాయన ఎరువులతో పాటుగా సేంద్రియ లేదా జీవన ఎరువులను ఉపయోగించడం సమగ్ర పోషక యాజమాన్యంలో ముఖ్యమైన అంశం.
  • జీవన ఎరువులు అయినటువంటి నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ కరగదీసే బ్యాక్టీరియా లాంటి వాటిని వాడకం ద్వారా 10-20 శాతం వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు.
  • నీలి ఆకుపచ్చ నాచు వరి పంటకు చాలా అనుకూలమైన జీవన ఎరువు. ఎకరాకు 4-6 కిలోల నాచు కల్చరును తీసుకొని వరి నాట్లు పూర్తి అయిన 7-10 రోజుల వ్యవధిలో ఇసుక లేదా మెత్తటి మట్టిలో కలిపి పొలం అంతటా సమానంగా చల్లుకోవాలి. వరి పొలాల్లో నీలి ఆకుపచ్చ నాచు ఎకరాకు 10-20 కిలోల నత్రజని అందించగలదు.
  • అజోల్లా వరి పొలంలో చములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను నేసి పల్చగా నీరు నిలువట్టి 100-150 కిలోల అజోల్లా వేసి రెండు నుండి మూడు వారాల సెరగనిచ్చి నేలలో కలిసేటట్లుగా దున్నాలి. దీనివల్ల ఎకరాకు 12 కిలోల నత్రజని లభిస్తుంది.
  • అజటోబ్యాక్టర్ - ఎకరాకు సరిపడా విత్తనాన్ని 200-400 గ్రా. కల్చరును పట్టించి లేదా 1 కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిసి ఎకరం నేలపై చల్లాలి. దీనివల్ల ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది.
  • ఫాప్ఫోబ్యాక్టీరియా - ఇది భాస్వరపు జీవన ఎరువు. భూమిలో లభ్యం కానీ స్థితిలో ఉన్న (గడ్డకట్టుకొని ఉన్నటువంటి) భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనానికి 400 గ్రా. కల్చరు పొడిని పట్టించి విత్తుకోవాలి. దీని ద్వారా 30 శాతం భాస్వరపు ఎరువును ఆదా చేయవచ్చు.

మైకోరైజా అనే శిలీంద్రం మొక్క వేర్లలో ప్రవేశించి వేర్లు రూపాంతరం చెంది, భాస్వరం, బింకు, రాగి, మాలిద్దినం తదితర సూక్ష్మపోషకాలు గ్రహించేలా తోడ్పడతాయి.

ఎరువుల వినియోగ సాచుర్యం పెంచాలంటే ఎరువులు వేసేటప్పుడు నేలలో సరైన పదును ఉండేలా చూసుకోవాలి. బురద పరుసులో మాత్రమే వేయాలి.

నారుమడిలో పోషకాల యజమాన్యం

ఆరోగ్యవంతమైన నారు పెరుగుదలకు నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ము చేసి, చదును చేసి నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసి ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకోవాలి. ఒక ఎకరం సరిపడా నారు పెంచడానికి రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని (1 కిలో విత్త ముందు చల్లేముందు, మరోకోలో 12-14మ రోజులకు) 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులు దుక్కిలో వేయాలి. నారుమడిలో జింకులోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకుసల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తుప్పు రంగు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడితే. జింకు లోపంగా గుర్తించాలి. అంతేకాక లేత చిగురుకు తెల్లగా మారి ఆకులు నిర్జీవమైతే ఇనుప ధాతులోపంగా గుర్తించి సవరణకు లీటరు నీటికి 20 గ్రా. అన్నభేదిని 2గ్రా. నిమ్న ఉప్పు కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

వరి నాటాల్సిన ప్రధాన పొలం ఎరువుల యాజమాన్యం

నాట్లు వేయడానికి 15 రోజుల ముందు నుండే పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించి లేత ఆకుపచ్చ నారు నాటుకుంటే మంచిది. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్ళు. భూసారం తక్కున ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి.

ముదురు నారు నాటేటప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25 శాతం పెంచి మూడు దఫాలుగా కాక రెండు దఫాలుగా అంటే 70 శాతం దమ్ములో మిగతా 30 శాతం అంకురం దశలో వాడాలి.

భూసారాన్ని బట్టి రసాయన ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకునిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జోన్లకు వాడవలసిన ఎరువుల వివరాలు (కిలోలు ఎకరాకు)

మండలం

వర్షాకాలం

నత్రజని

భాస్వరం

పొటాష్

ఉత్తర తెలంగాణ

40-48

20

16

మధ్య తెలంగాణ

40-48

20

16

దక్షిణ తెలంగాణ

40-48

24

16

పట్టికలో తెలియజేసిన పోషకాల మోతాదు మనం వాడే రకాలు, పంట కాల పరిమితి, నేల స్వభావం. భూసారం, సీజన్, యాజమాన్య పద్ధతులు బట్టి మారుతుంది.

నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో గానీ, యూరియా రూపంలో గానీ వాడవచ్చు. నత్రజనిని మూడు భాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను,

దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద - పదునులో మాత్రమే సమానంగా వెజల్లి 36-48 గంటల తరువాత మాత్రమే పల్చగా నీరు పెట్టాలి. ఈ

మధ్య కాలంలో వేపపూత పూయబడిన యూరియా అందుబాటులో ఉంది కావున దాన్ని వినియోగిస్తే నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మొత్తం - భాస్వరపు ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగం వేయాలి.

కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గానీ, అంకురం ఏర్పడే దశలో గానీ వేయరాదు.

2.99893276414
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు