పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సజ్జ

సజ్జను ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును.

సజ్జ పంటను ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఆగష్టు రెండవ పక్షం వరకు కూడ ఒక ప్రత్యామ్నాయ పంటగా విత్తుకొని మంచి దిగుబడులు సాధించవచ్చును. సజ్జలో ఇనుము మరియు జింకు అధికంగా ఉంటాయి.

విత్తే సమయం

వర్షాధారంగా ఖరీఫ్ లో జూన్ మొదటి పక్షం నుంచి జూలై రెండో పక్షం వరకు విత్తుకోవచ్చు. వేసవిలో ఆరుతడి పంటగా రెండవ పక్షం లోపు విత్తుకోవాలి.

నేలలు

తేలికపాటి నుండి మధ్య రకం నేలలు మరియు నీరు ఇంకే మురుగు నీటి పారుదల గల నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.

రకాల ఎంపిక

క్రింద తెలుపబడిన హైబ్రిడ్లతో పాటు ప్రైవేటు రంగానికి చెంది ప్రాచుర్యంలో ఉన్న సజ్జ హైబ్రిడ్లను కూడ ఎంచుకొని సాగు చేసుకోవచ్చు.

రకాలు:

రకం ఋతువు పంటకాలం (రోజులు) దిగుబడి (క్వింటాళ్ళు/ఎకరానికి) గుణగణాలు
పి.హెచ్.బి-3 ఖరీఫ్ , వేసవి 80-85 10-12 వెర్రికంకి తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది.
హచ్.హెచ్.బి-67 ఖరీఫ్ , వేసవి 65-70 8-10 అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే హైబ్రిడ్. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది.
ఐ.సి.ఎమ్.హెచ్-356 ఖరీఫ్ , వేసవి 80-85 10-12 గింజలు మధ్యస్థ లావుగా, ఉంటాయి. వెర్రి కంకి తెగులు, బెట్టను తట్టుకుంటాయి
ఐ.సి.టి.పి-8203 ఖరీఫ్ , వేసవి 80-85 8-10 గింజలు లావుగా, తెల్లగా ఉంటాయి. వెర్రి కంకి తెగులు, బెట్టను తట్టుకుంటాయి.

విత్తే మోతాదు

ఎకరానికి 1.5-2.0 కిలోలు

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 6 గ్రా. ఆప్రాన్ 35 ఏస్.డి.తో విత్తనశుద్ధి చేసి పచ్చ కంకి వెర్రి తెగులును నివారించవచ్చును. కిలో విత్తనానికి 3 గ్రా. డ్తెరమ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

విత్తే దూరం

వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 12-15 సెం. మీ. దూరం ఉండేటట్లు గోర్రుతో విత్తుకోవాలి.

ఎరువులు

ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి. వర్షాధారంగా సాగు చేసినపుడు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నీటి పారుదల పంటకు ఎకరానికి 32 కిలోల నత్రజని, 16 కులోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజని విత్తేటప్పుడు సగం, మిగితా భాగం 30 రోజుల దశలో వేయాలి.

నీటి యాజమాన్యం

సజ్జ సాగుకు సుమారు 400-450 మి.మీ. నీరు అవసరముంటుంది. ఖరీఫ్ లో వర్షాధారంగ సాగు చేసినప్పుడు నీటి పారుదల అవసరం ఉండదు. అయితే 20-25 రోజులకు మంచి బెట్ట పరిస్దితులు ఏర్పడితే, పూత దశ మరియు గింజ కట్టే దశలో నీటి తడులు ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో సాగు చేసేటప్పుడు కూడా పుతదశ, గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టి పడే దశల్లో నీటి తడులు ఇవ్యాలి.

అంతర పంట

సజ్జ : కంది 4:1 లేదా 6:1 నిష్పత్తిలో వేసుకోవాలి.

కలుపు నివారణ, అంతరకృషి

విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపు అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 6౦౦ గ్రా. లేదా టోప్రొమెజిన్ 33.6% ఏస్.సి 40 మి.లీ. + అట్రజిన్ 50% డబ్ల్యు.పి 400 గ్రా. ఎకరాకు, 200 లీ. నీటిలో కలిపి తడి నెల పై పిచికారి చేయాలి. 25-30 రోజుల దశలో గుంటకు లేదా దంతితో అంతర సేద్యం చేయాలి.

సస్యరక్షణ

పచ్చ కంకి/వెర్రి కంకి తెగులు

తెగులు సోకిన మొక్కలో ఆకులుగా మారిన పుష్ప గుచ్చం ఏర్పడుతుంది. తెగులు తీవ్ర దశలో మొక్కలు గిడస బారి 30 రోజుల లోపు చనిపోతాయి. దీని నివారణకు కిలో విత్తనానికి 6 గ్రా. మెటలాక్సిల్/అప్రాన్ 35 ఏస్.డి.తో విత్తనశుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉనట్లయితే మెటలాక్సిల్ 35 డబ్ల్యుఏస్ 1 గ్రా. లేదా మెటలాక్సిల్ 8% + మాంకొజెబ్ 64% డబ్ల్యుపి 4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తేనేబంక తెగులు

తెగులు సోకిన కంకి నుండి గులాబి లేదా ఎర్ర రంగుగా ఉన్న తేనే వంటి ద్రవం బొట్లు బొట్లుగా కారుతుంది. మొక్కలు పుష్పి౦చే దశలో మబ్బులతో కూడిన ఆకాశం మరియు వర్షపు తుంపరులు ఈ తెగులు వ్యాప్తికి దోహద పడతాయి. దీని నివారణకు పైరు పూతదశలో మాంకొజెబ్ (2.5 గ్రా/లీ.) వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

కాటక తెగులు

ఈ తెగులు కంకులలో గింజ ఏర్పుడి సమయంలో కనిపిస్తుంది. కంకులలోని గింజలు పది లాంటి సెలిన్ద్ర బీజాలు సమాదాయాలుగా ఏర్పుడుతుంటాయి. దేని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టిన్ తో విత్తసుస్రుద్దీ చెయాలి.

త్రప్పు తెగులు

మొక్కల ఆకులపై త్రప్పు మచ్చలు. ఏర్పుడుతాయి. నివారణకు లీటరు నేటికీ 2.5 గ్రా. మొంకోజాబీ లేదా 1 గ్రా. కార్బడోజిమ్ చప్పున కలిపి పేరుపై పిచికారీ చెయాలి. మాంకోబీనా 2.5 గ్రా./లీ. నీటికి కలిపి విత్తన శుద్ధి చెయాలి.

అగ్గి తెగులు

మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారపు మచ్చలు ఏర్పుడుతాయి. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రా. కాప్తునితో విత్తన శుద్ధి చెయాలి. తెగులు అధికంగా ఉన్నప్పుడు హైకోనోజెల్ల 2 లీ./లీ/ లేదా టెక్నాజెల్ 0.6 గ్రా./లీ. నీటికి కలిపి పిచికారీ చెయాలి.

పంటకోత మరియు నూర్పిడి

సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి కనీసం 2 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతికట్టాలి. అన్ని రకాల పంటల నూర్పిడి యంత్రంతో ఈ పంట కంకులను బాగా ఆరబెట్టిన తర్వాత నుర్పిడి చేసుకోవచ్చును.

విత్తనోత్పత్తికి సూచనలు

సజ్జ హైబ్రిడ్ విత్తనోత్పత్తిని రబీ లేదా జనవరి మాసంలో చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. సర్టిఫైడ్ హైబ్రిడ్ విత్తనోత్పత్తికి కనీసం 200 మీ. వేర్పాటు దూరం పాటించాలి. 6-8 ఆడ మొక్కల వరుసలకు, 2 మగ మొక్కల వరుసలు ఉండేలా నిష్పత్తిని పాటించాలి. పిలకలు వేసేటప్పుడు మరియు పూత దశలో కేళీలను గుర్తించి వేరు చేయాలి. సాధారణంగా మగ మొక్కల వరుసలను ముందు కోసి తర్వాత ఆడ మొక్కల వరుసలను కోయాలి.

సజ్జ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త, (చిరూధాన్యాలు) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం. ఫోన్ నెం. 8008404874

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.03167420814
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు