పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సేంద్రియ వ్యవసాయమే సుస్ధిర ప్రత్యామ్నయం

భారతదేశంలో 70 శాతం జనాభా ప్రత్యక్షంగా, మ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.చాలా కాలం వరకు వ్యవసాయం సేంద్రియ పద్ధతిలోనే జరిగింది.

భారతదేశంలో 70 శాతం జనాభా ప్రత్యక్షంగా, మ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. చాలా కాలం వరకు వ్యవసాయం సేంద్రియ పద్ధతిలోనే జరిగింది. కాలక్రమేణా పెరుగుతన్న జనాభా అవసరాలకనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తికై స్వల్పకాలిక రకాలు, హైబ్రిడ్ వంగడాలు, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు హరిత విప్లవ ఫలాలుగా వచ్చాయి. పంటల దిగుబడి పెంచడానికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తప్పనిసరి అయింది. ఈ క్రమంలో మన దేశపు సంప్రదాయ వ్యవసాయం తన ఉనికిని కోల్పోతుంది. మానవాళికి ఇంతకు ముందెప్పుడు తెలియని కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తి మానవ మనుగడకే పెను ముప్పుగా మారింది. వ్యవసాయం కొనసాగేది భూమి పునరుత్పత్తి శక్తి పై .. ఈ రసాయనాలతో కాల క్రమేణా భూమి పునరుత్పత్తి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉండి. 2025 నాటికీ 13 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తిని సాధించాలి. జీవం లేని నేల, సత్తువ పెంచలేని రసాయన ఎరువుల ద్వారా ఇది అసాద్యం. ఆరోగ్యవంతమైన జీవనం, అధిక ఆదాయం, అధిక దిగుబడులు, ఆరోగ్యవంతమైన పంట కోసం సజీవమైన, ఆరోగ్యవంతమైన నేల కావాలి. దీనికి సేంద్రీయ వ్యవసాయం ఒకట్టే మార్గం.

సహజ వనరులతో, సాంప్రదాయ పద్ధతులతో నేలకు సేంద్రీయ పదార్ధాలను అందించి నాణ్యత గల అధిక దిగుబడులు పొందడమే సేంద్రీయ వ్యవసాయం.

పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, కంపోస్టు, వర్మికంపోస్టు, పచ్చిరోట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, పిండి చెక్కలు వంటి సేంద్రీయ ఎరువులు భూసారాన్ని పెంచడానికి ఉపయోగించాలి. అంతేకాకుండా రైతులు వివిధ రకాలైన సేంద్రీయ ఎరువుల తయారీ గురించి తెలుసుకొని అంచరించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరోట్ట పైర్ల సాగును ప్రోత్సహించే పలు పధకాలను అమలు పర్చడంతో పాటు, రైతాంగానికి శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలను నిర్వహిస్తోంది.

రాష్ట్ర రైతాంగం వ్యవసాయ శాఖ సూచిస్తున్న సేంద్రీయ పద్ధతులను పాటించి, పర్యావరణ సమతుల్యతను, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన, అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ.....

ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు

3.00985221675
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు