పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కనకాంబరం

తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయకంగా సాగవుతున్న పూలలో కనకాంబరం ఒకటి. ఆకర్షనీయమైన రంగులతో తేలికగా, ఎక్కువగా నెల్వశక్తితో, నేటి ఎద్దడిని తట్టుకునే బహువార్షికా పులా మొక్క కావడంతో ఇటీవల ప్రాచుర్యం పొందుతున్నది.

వాతావరణం: ఊష్ణో మండల బహువర్షకా పంట. పెరుగుదలకు 30 డిగ్రీల సెలసియున్ ఉష్ణోగ్రత చాలా అనుకూలం. చల్లని వాతావరణం వారిస్దితులలో పులా దిగుబడి అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో పూలు లేత రంగుకు మరి నాణ్యత తగ్గుతుంది.

నేలలు: నీరు నిలవని అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు, గరప నేలలు బాగా అనుకూలం. క్షార, చేదు భూములు పనికి రావు. నులిపురుగుల సమస్య ఉన్న భూముల్లో దీన్ని సాగు చేయకూడదు.

రకాలు: నారింజ రంగు, పసుపు, గులాబీ, లత ఆకుపచ్చ, ఎరుపు రంగు పులనిచ్చే రకాలున్నాయి. ఎక్కువగా నారింజ రంగు పూలు పూసే స్దునేక రకాలే సాగులో ఉన్నాయి.

ఆరంజ్ ఢిల్లీ: ఏది ముదురు నారింజ రంగు పులకిస్తుంది. దీనికి విధానాలుండవు. కొమ్మ కత్తరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలి.

ల్యూటియస్ ఎల్లో: ఏది పసుపు వర్ణం పూలను ఇస్తుంది.

మధుమాడి: నారింజ వర్ణంలో పెద్ద పూలను ఇస్తుంది. ఈ రకం నులిపురుగులను, శిలింద్రాలను తట్టుకొంటుంది.

సెబిక్యూలియన్ రెడ్: ఏది ఎరుపు పులకిస్తుంది. నులిపురుగులను తట్టుకొనే రకం.

అర్క అంబర: నారింజ ఎరుపు రంగులో పెద్ద పులనిచ్చే ఐ.ఐ.హెచ్.ఆర్, బెంగళూరు వారు విడుదల చేసిన రకం.

అర్క కనక: నారింజ రంగులో పేద పులనిచ్చే ఐ.ఐ.హెచ్.ఆర్, బెంగళూరు రకం.

లక్ష్మి: నారింజ రంగులో అధిక దిగుబడినిచ్చే రకం. హెక్టారుకి 750 కిలోల పులనిస్తుంది.

డా.ఎ.పి.జె. అబ్దుల్ కలామ్: ఏది ఎరుపు రంగు పూల నిస్తుంది. సాధారణ పూల కన్నా కొంచెం పెద్దగా ఉండి, నిల్వ సామర్ధ్వం ఎక్కువగా ఉండటం వాళ్ళ దూర ప్రాంతాలకు తరలించడానికి బాగా అనుకూలం.

ప్రపర్దానం: విత్తనం మరియు కండపు ముక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు.

విత్తనం: ఎకరాకు రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలు వేరుచేసి కొద్ది రోజులకే మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. కాబట్టి కొత్తగా తీసిన విత్తనాలను పలుచగా నారుమడిలో నాటుకొని 50-60 రోజులు పెంచితే నాలుగు జతల ఆకులు పుట్టి నరు నాటుటకు అనుకూలంగా ఉంటుంది.

కండపు ముక్కలు: కొమ్మల చివర్ల నుంచి 6-10 సం.మీ. పొడవు, కనీసం 2 కణుపులున్న కండపు ముక్కల్ని 500 పి.పి.యం. ఇండోల్ బ్యుట్రిక్ ఆమ్లం ద్రావణంలో ఒక నిమిషం పటు ముంచి విస్ట్ చాంబర్లలో నాటితే వేర్లు త్వరగా ఏర్పుడతాయి. 16,700 కాండపు ముక్కలను ఎకరా భూమిలో నాటుకోవచ్చు.

నాటటం: విత్తనాన్ని మే-జూన్ నెల్లో నారుమడిలో విత్తి, ఆగస్టు-సెప్టెంబరు మాసాల్లో మొక్కలను 30*30 సం.మీ. ఎడంలో నాటుకోవాలి.

ఎరుపులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేప పిండి, 30 కిలోల యూరియా, 250 కిలోల సూపర్ పొస్పెట్, 40 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేసి నెలలో కలియ దున్నలి. పై పాటుగా 3 నెలలకు, 9 నెలలకు రెండు ధపాలుగా 30 కిలోల యూరియా 100 కిలోల సూపర్ పొస్పెట్, 40 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ తొలకరితో వేసుకోవాలి. పై పాటుగా మూడు నెలలకొకసారి 30 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేయాలి.

నీటి యాజమాన్యం: కనకాంబరం నీటి ఎద్దడిని తట్టు కొంటుంది. అయినప్పటికీ వాణిజ్య సరళిలో సాగుచేస్తే  అవసరాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్దతి ద్వారా అయితే 4 -5 రోజులకొకసారి నీటిని అందించాలి.

అంటారా కృపి: పై పాటుగా 3వ, 9వ నెలల్లో యూరియా వేసినప్పుడు మట్టిని ఎగదోయాలి. వేసవిలో ఎండా తీవ్రతను తగ్గిండానికి అవిశ మొక్కల్ని పెంచి పాక్షిక నీడను కల్పిస్తే మొక్కలు వేసవిలో బాగా పెరిగి నాణ్యమైన అధిక పూల దిగుబడులను ఇస్తాయి. పూల కడుల్లో పూలు కోయడం పూర్తయిన తరువాత పూలగుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే సంవత్వరం పొడవునా పూలు పూసి దిగుబడి పెరుగుతుంది.

పూలకోత: మొక్కలు నెత్తిన 3-4 నెలలకు పూలు వూయడం ప్రారంభమై సంవత్వరం పొడవునా పూస్తుంటాయి. పూలు పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రెండు రోజులకొకసారి పూర్తిగా విచ్చుకొన్న పూలను కోసుకోవాలి. పూర్తిగా విచ్చుకొన్న పూలు మొక్కలపైనా 3-4 రోజుల తాజాగా ఉంటాయి. పూలు కోసిన తరువాత రెండు రోజుల్లో విడిపోతాయి.

దిగుబడి: ఒకసారి నాటితే 3 సంవత్వరాల వరకు పుస్తంది. సాధారణంగా కిలోకు సుమారు 15000 పూలు తూగుతాయి. అయితే ఇటీవల పెద్ద పూల రకాలయితే కిలోకు 8 నుంచి 9 వేల పూలు మాత్రమే తూగుతాయి. రెండు సంవత్వరల్లో ఎకరాకు 1500-2500 కిలోలు, 3 వ సంవత్వరంలో 2000 కిలోల వరకు పూల దిగుబడి పొందవచ్చు.

సస్యరక్షణ: పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింద పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

నులి పురుగులు: ఏవి వర్లపై బుడిపెలను కలుగజేస్తాయి. దీని వాళ్ళ ఆకు ముడుచుకొని ఉద రంగుకు మరి, మొక్కలు గిడసబారి దిగుబడి, పూల పరిమాణం బాగా తగ్గుతాయి. నులిపురుగులు చేసిన రంద్రాలు గుండె శిలింద్రాలు వార్లలోకి చేరి ఎండు తెగులు కలుగు చేయడం వాళ్ళ మొక్కలు త్వరగా చసిపోతాయి. నివారణకు ఎకరాకు 4 కిలోల పోరెట్ గుళికలు వేసి భూమిలో కలిపి నీరు పెట్టాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఎకరాకు 200 కిలోల వేపపిండి వేయాలి.

పిండి నల్లి పురుగులు: లేత కొమ్మలు, ఆకులు, పూమొగ్గలపై తెల్లటి పిండి లాంటి పదార్థంతో కప్పబడిన ఉండరంగు పురుగులు గుంపులుగా చేరి రసం పీల్చడం వాళ్ళ ఆకులు పసుపు రంగుకు మరి మొక్కలు గిడస బారతాయి. ఇవి విసర్జించే తీపి పదర్థంపై నల్లటి బుజ ఆశిస్తుంది. నివారణకు 2.5 మీ.లి. క్లోరిపైరిపెన్ + 1 మీ.లి. డ్తెక్లోరోవేసన్లను లీటరు నేటికీ చొప్పున కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

తెగుళ్ళు

నారుకుళ్ళు: నరుదశలో శిలింద్రాలు వేరు, కాండం కలిసే చోట ఆశించడం వాళ్ళ కుళ్ళిపోయి నరు గుంపులు గుంపులుగా చనిపోతుంది. నరు మందుల్లో లీటరు నేటికీ 1 గ్రా. కార్బండజిమ్ కలిపినా ద్రావణంను చ.మీకు 2.5 లీటర్ల చొప్పున ముంపుగా నారుమడిని తడపాలి.

ఎండు తెగులు: ఈ తెగులు సోకినప్పుడు ఆకులు మొదట కిందికి వాలుతాయి. ఆకుల అంచులని పసుపు రంగుకు మరి, కొమ్మల చివర్లు క్రిందకు వంగి వేర్లు కుళ్ళుతాయి. తరువాత కాండంను కూడా కుకళ్ళేటట్లు చేస్తుంది. కాండాన్ని చీల్చి చుస్తే లోపల గోధుమ రంగుకు మరి ఉంటుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. నివారణకు లీటరు నేటికీ 2.5 గ్రా. మాంకోజెబెను కలిపి 20-25 మీ.లి. మందు ద్రావణంతో మొక్క మొదలు చుట్టూ నెల తడిచేలా పోయాలి.

ఆకుమచ్చ: ఆకుపై భాగాన చిన్న, గుండ్రని పసుపు పచ్చని మచ్చలు ఏర్పడే తావతా గోధుమ రంగులోకి మారుతాయి. తెగులు సోకినా ఆకులు ఎండిపోయి రాలిపోతాయి నివారణకు 2.5 గ్రా. మాంకోజిబెను లీటరు నేటికీ కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.15384615385
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు