పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చామంతి

చామంతి.

చామంతిని తెలంగాణ రాష్ట్రంలో 723 హెక్టర్లలో సాగు చేస్తూ 2472 మెట్రిక్ టన్నుల పులా దిగుబడిని పొందుతున్నారు. ఈ రాష్ట్రంలోని మెదక్, మేడ్చల్, మల్కజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు జుల్లాలు చామంతి సాగుకు అనుకూలం.

వాతావరణం: చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు స్మియంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటి చామంతిలో పూత బాగా ఏర్పుడుతుంది.

నేలలు: నీరు ఇంకే సారవంతమైన తేలిక నేలలు, గరప నేలలు అనుకూలం. ఉండజాని నుచి 6.4-7 మధ్య ఉండాలి. మురుగు నేటి పారుదల సరిగా లని ఎడల మొక్కలు చనిపోతాయి.

రకాలు: సాగులో ఉన్న చామంతి, పెద్ద స్టేజు గలవిగా విభజించవచ్చు. తెలుపు, ఎరుపు, పసుపు, కుంకుమ, గులాబీ, కాషాయం, వంగ పూవ్యూ రంగులలో చామంతి పూలు లబ్యమవుతున్నాయి.

పసుపు రంగు పులా రకాలు: బసంతి, కో-1 , పూనమ్, రామాచూర్, ఎల్లొగోల్డ్ల్, చందమా, పేపరుల్లో, తెలుపు రంగు

పులా రకాలు: రాతలమ్ సెలక్షన్, బగ్గీ, పూర్ణిమ, స్నోబాల్, పేపర్ వైట్ ప్లో, రాజా వైట్.

ఎరుపు రంగు పులా రకాలు: రెడ్ లేడి, రెడ్ పెయిర్ డే, రెడ్ వైన్

గులాబీ రంగు పులా రకాలు: రోజ్ డే, ప్రిన్స్, పెయిర్, వైలెట్

ప్రవర్ధనం: పిలకలు, కొమ్మ కత్తిరింపులు ద్వారా ప్రవర్ధనం చేస్తారు.

పిలకలు: పులా కోతలు పూర్తయిన తరువాత మొక్కలను మొదలు వరకు కత్తిరించి ఎరువులు వాసి వారానికో తడి ఇస్తుంటే రెండు నెలల్లో వారితో కూడిన అనేక పిలకలు ఈపుడతాయి వాటిని జూన్లో వారు చేసి ప్రధాన పొలంలో నాటికోవాలి.

కొమ్మ కత్తిరింపులు: ఈ పద్దతి ద్వారా వచ్చే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పులా నాణ్యత బాగుంటుంది. తల్లి మొక్క నుండి లత కొమ్మలు చివరి భాగాన్ని 5 -7 సన్.మీ. పొడవుతో కత్తిరించుకొని, దాని మీద పూర్తిగా విచ్చుకొన్న మూడు ఆకులను మాత్రమ్ ఉంచి విగతా ఆకులను తీసివేసి, ఈ కత్తిరింపులను జూన్-జులైలో ప్రధాన పొలంలో నాటుకోవాలి. కత్తిరింపులకు మేర్లు బాగా రావాలంటే ఐబీఎ 2500 పిపియం ద్రావణంలో ముంచి నాటుకోవాలి.

నాటటం: జూన్-జులై మాసాల్లో నాటుకొన్నట్లయితే నవంబరు-డిసెంబరు మాసాల్లో పూస్తాయి. చిన్న పూలు ఇచ్చే రకాలను 30*30 సన్.మీ ఎడంగా నాటాలి. ఎకరాకు 55,000 నుండి 60,000 మొక్కలు అవసరంవుతాయి. అడా పెద్ద పులా రకాలు అయితే 90*60 సం.మీ లేదా 90*75 సం.మీ దూరంలో నాటుకుంటే 8000-9000 మొక్కలు నాటుకొని ఆడక దిగుబడి పొందవచ్చు.

ఎరువులు: ఆఖరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల యూరియా, 200 కిలోల సూపర్, 50 కిలోల పోటాష్ ఎరువులు వేసుకొని కలియదున్నాలి. 25,45 ,60 రోజులకు 19:19:19 ఎరువు 50 కిలోలు పైపాటుగా వేసుకోవాలి. బోదిలాను ఎగదోసుకోవాలి. 60 రోజుల తరువాత నుండి నేతిలో కారిగా 19:19:19, 14:35:14, 13:0:45 ఎరువులను ఎకరాకు 3 కిలోల చొప్పున రోజు మర్చి రోజు, మర్చి మర్చి డ్రిప్పు ద్వారా పెరటిగేషన్ పద్దతిలో ఎరువులను అందించాలి. మొగ్గ దశ నుండి మత్రం కాల్షియం న్తట్రీటు 3 కిలోలు రోజు మర్చి రోజు డ్రిప్పు ద్వారా దండించాలి. తలలు; త్రుంచే సమయంలో పైపాటుగా 50 కిలోల యూరియాను చామంతికి అందించాలి.

నీటి యాజమాన్యం: వాతావరణంను బట్టి, నెల తీరును బట్టి నీరు ఇవ్వలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3  సార్లు అటు పిమ్మటి వారానికి ఒక తడి ఇవ్వలి. డ్రిప్ పద్దతిలో అయితే ప్రతి రోజు 10 నీవిషాలు నీరు అందించాలి.

తలలు తుంచటం: నారు నాటిన నాలుగు వరాల తరువాత చామంతి మొక్కల కోనలు అంటే 2-3  ఆకులతో కూడిన మొగ్గతొ సహా త్రుంచి వేయాలి. దీనివల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. పంటను కొంత ఆలస్యం చేయవచ్చు. దిగుబడి పెరుగుతుంది.

ఊతమివ్వడం : చామంతి మొక్కలు పూలు ఫుసితప్పుడు బరువుకి వంగిపోకుండా మెదురు కర్రలతో లేదా సెట్టింగ్ మ్తెరుతో యూతావివ్వడం మంచిది.

హార్మోన్ల వాడకం: 100 పి.పి.యమ్ నాప్టిలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని ముగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పుటను కొంత ఆలస్యం చేయవచ్చు. 100-150 పి.పి..యమ్ జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారీ చేస్తే 15-20 రోజుల్లో త్వరగా పూటకొస్తుంది.

పూల కోత: జూన్-జులై లో నాటిన మొక్కలు నవంబరు నుండి జనవరి వరకు పూత పూసి కోటకొస్తాయి. ఈ సమయంలో అధిక దిగుబడులను ఇస్తాయి. ఆ తరువాత అంటే ఫిబ్రవరి-మర్చి మాసాలలో తక్కువ దిగుబడులను ఇస్తాయి. ఒక పంట కాలంలో 15-20  సార్లు పూలు కోయవచ్చు.  ఎకరాకు ఆధునిక హైబ్రీడ్లు 8-10 టన్నుల దిగుబడినిస్తాయి.

సస్యరక్షణ: పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింద పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

తామర పురుగులు: ఇవి గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయడం వాళ్ళ ఆకులు ముడుతలు పది ఎండిపోతాయి. పూలు కూడా వాడిపోయి రాలిపోతాయి. నివారణకు 2 మీ.లి. డ్తెమిదోయేట్ లాకా 2 మీ.లి. పెప్రోనిల్ లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

పచ్చపురుగు: పురుగు యెక్క లార్వా మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తిని వేస్తుంది. నివారణకు మలాథియాన్ 2 మీ.లి. లేదా ఇమామిక్తిన్ బొంజయేత్ 0.5 గ్రా. లను లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ: చిన్న తెల్ల దోమ అధికంగా రసం పీల్చడం వాళ్ళ ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకొని రాలిపోతాయి. నివారణకు 0.5 గ్రా. దయావిడకోసం లేదా 1 గ్రా. ఏసీటీవీప్రిడిలను లీటరు నేటికీ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో మర్చి మర్చి పిచికారీ చేయాలి.

తెగుళ్ళు

ఆకుమచ్చ: నల్లని లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పుడం వాళ్ళ ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణకు మొంకోజిబ్ 3 గ్రా. లీటరు నేతిలో కలిపి పిచికారీ చేయాలి.

మేరుకుళ్ళు తెగులు: మొక్కలు అకస్మాత్తుగా వడలిపోతాయి. ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. భూమిలో నాటిన కత్తిరింపులు కుళ్ళపొతాయి. దీని నివారణకు మురుగు నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లటాక్సు 3 గ్రా. లేదా మాంకోజిబ్ 2.5 గ్రా. లీటరు నేటికీ చొప్పున కలిపినా మందుతో నేలను బాగా తడిపి తెగులును అరికొట్టవచ్చు. 2 కిలోల ట్రెకోడెర్మా విరిడిని పశువుల ఎరువుతో కలిపి ఆఖరి దుక్కిలో వేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.85714285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు