పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బంతి

బంతి

తెలంగాణ రాష్ట్రంలో బంతి సుమారుగా 1098 హేయాక్టర్లో సాగు చేయబడుతూ 3498 మెట్రికి టన్నుల పూల దిగుబడినిసున్నది. బంతిలో చాలా ఆకర్షిణీయమైన రంగులు, పరిమాణాలు, ఆకారాలతో బాటు, విడిపూలు ఎక్కువ కలం నిలువ ఉండే స్యభావం ఉన్నందువల్ల పూలసాగుదార్లను, హ్యపారస్తులాల్ని విశషంగా ఆకరిస్తున్నది. ఇటీవల కాలంలో బంతి పూల నుంచి ల్యూటిన్లు, జోడుపిల్లులు అనే పైగ్మాటిను సకరిస్తుండటం వలన వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.

వాతావరణం: బంతి పెరుగుదల, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం, 18 -20 డిగ్రీల సెల్సియొసు ఉష్ణోగ్రత అనుకూలం. అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పూల నాణ్యత దబ్బతింటుంది. స్యతహగా గట్టి మొక్కలు కాబట్టి కరుపు పరిస్థితులను కొంత వరకు తట్టుకోగలవు. అయితే మంచు పరిస్థితులను అస్సలు తట్టుకోలేవు. సూర్యరశ్మి బాగా తగిలే ప్రదిశలు వీటి సాగుకు అనుకూలం. నీడలో మొక్క బాగా పరుగుతుంది కానీ పూలు పూయపు.

నేలలు: నీరు త్వరగా ఇంకిపోయా స్వభావం గల అన్ని రకాల నెలల్లో బంతిపూలు సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 7 .0 - 7 .5 మధ్య గల నేలలు అనుకూలం. సురవంతమైన గరపు నేలలు బంతికి అత్యంత అనుకూలం మైనవి. ప్రించి బంతి సాగుసు తేలికపాటి నెలల్లో, ఆప్రకాన్ బంతిని కొద్దిపాటి తడినేలల్లో సాగు చేసుకోవచ్చు.

రకాలు: హానిజ్యపురంగా సాగు కొరకు ఆఫ్రికన్ బంతి రకాలను వాడుతారు. పూలు పసుపు, నారింజ, బంగారు రంగులతో ఉంది ముద్దగా ఉండే పులకు మార్కెట్ల మంచి గిరాకీ ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న కొన్ని బంతి రకాలు:

  1. పూసా నారంగి గుండా: ముదురు నారింజ రంగులో బాగా ఆకర్షణయంగా ఉండే పెద్ద పరిమాణం కల పూలను ఇస్తుంది. 125-135 రోజుల తరువాత వువ్యూలను ఇస్తుంది. హెక్టారుకు 25-30 టన్నుల పూలు, 100 -125 కిలోల విత్తనాలను ఇస్తుంది.
  2. పూసా బసంతి గుండా: 135-145 రోజుల తరువాత నిమ్మ పసుపు రంగు వువ్యూలను ఇస్తాయి. హెక్టరుకి 20-25 టన్నుల పూలు, 70-100 కిలోల విధానాలను ఇస్తుంది.
  3. హైబ్రిడ్ రకాలు: నేడు మార్కెట్లో బంతి పులకు అనేక రకాల ప్రెవేట్ హైబ్రాడ్, పొట్టి రకం, పొడువు రకం, మద్ద రకం, పసుపు, నారింజ, తెలుపు రంగుల్లో లభిస్తున్నాయి. అయితే సాధారణ రకాలతో పోలిస్తీ వీటికి దార కాస్త ఎక్కువగా ఉంటుంది.

ప్రవర్ధనం: హణిజ్య పరంగా విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు.

విత్తన మేతాడు, విత్తే పద్దతి: ఎకరాకు సరిపడే నారు పంచుదానికి 800 గ్రా.ల విత్తనం అవసరం. విధానాలను 1 మీ. మెడల్పు, 15 సం.మీ. ఎత్తు, సరిపడే పొడవున్న ఎత్తు నారుమడులు చేసుకొని విథునలను వరుసకి వరుసకి మధ్య 5 సం.మీ. ఎడం ఉండే విదంగా వరుసల్లో, 2-3 సం.మీ. లోతులో మాత్రమే విత్తుకోవాలి. మడులు తయారు చేసుకొనే సమయంలో 1 చ.మీ.కి 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి ముందు చీమలు, చెదలు రాకుండా మడులపై క్లోరిప్రాయిపసు పొడి మందు చల్లుకోవాలి. 5-7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే హైడ్రేడ్ విత్తనాల దార చాలా అధికంగా ఉండటం వల్ల వీటిని నారుమడిలో పంచడం కంట ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న ప్రాత్రలలో పెంచుకోవడం ఉంత్తమం, తద్వారా వితనం వ్యాధా కాకుండా చోసుకోవచ్చు.

విత్తే సమయం: బంతిని ఏడాది పొడువునా శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు.

సీజను

విత్తే సమయం

నాటే సమయం

వర్షాకాలం

జూన్ రెండవ వరం

జులై రెండవ వరం

శీతాకాలం

ఆగస్ట్ రెండవ వారం

సెప్టెంబర్ రెండవ వారం

వేసవి కాలం

జనవరి మొదటి వారం

ఫిబ్రవరి మొదటి వారం

నాటిన రొండు నెలల పులా దిగుబడి వస్తుంది. కాబట్టి మార్కెట్లో పండుగల గిరాకీని బట్టి నారూపంచుకొనే రైతులు అధిక లాభాలు పొందవచ్చు.

నాటే  విధానం: 25-30 రోజులు, 3-4 ఆకులు కలిగి ఉన్న నరు నాటికోవడానికి అనుకూలం. నరుని సాయంకాలం వేళలో నాటుకుంటే బాగా కుదురుకుంటాయి. ఆఫ్రికన్ బంతి రకంను 45*30 సం.మీ.దూరంలో, ప్రెంచి బంతి రకం అయితే 20*20  సం.మీ దూరంలో నాటితే పులా దిగుబడి బాగుంటుంది.

కలుపు నివారణ: బంతి పులా సాగులో కలుపు వర్షకాలంలో ఎక్కువగా ఉంటుంది. పంట కాలంలో 3-4 సార్లు కూలీల సాయంతో కలుపు కనిపించిన వెంటనే తీసివేయాలి. అంతేకాక పోల్స్టిక్ మార్చ్ వేసుకొని కలుపు తీయటానికి అయ్యే కూర్చును అడా చేయవచ్చు.

తలలు త్రుంచడం: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో ప్రధాన కోండం బాగా ఏపుగా పెరిగి చివరిగా పూమొగ్గ ఏర్పుడుతుంది. అప్పుడే ప్రక్కకొమ్మలు అరూపుడతాయి. దేనికి బదులుగా మొక్క 20 సం.మీ. ఎత్తిన్నప్పుడు, అంటే 30-40 రోజుల సమయంలో ప్రధాన కోండం చివిరి 2-3 సం.మీ. బాగాన్ని త్రుంచి వేయాలి. దీనినే పించింగ్ అంటారు. దీనివల్ల పూల దిగుబడి పెరగడమే కాకుండా శనగ పచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగపచ్చ పురుగు సాధారణంగా లేతఆకుల చివర్లలో గ్రుడ్లు పెడుతుంది.

ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వాసి కలియదున్నాలి. దీనితో పాటుగా 40 కిలోల నత్రజని, 80 కిలోల బస్యరం, 80 కిలోల పొటాషినెక్కుచు ఎరువులు వేయాలి. నాటిన 30 రోజులకి 30 కిలోల నత్రజని పైపాటగా వాసి నీరు పెట్టాలి. ఎరువును 0 .4 గ్రా/మొక్కకు రెండు రోజులకొకసారి,15:8:35 ను 1.5 గ్రా/మొక్కకు 4 రోజులకొకసారి అందించడం ద్వారా పుప్పాల నాణ్యతను, దిగుబడిని పెంచవచ్చు.

నీటి యాజమాన్యం: 4 -6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడం మంచిది. బిందు సేద్యం ద్వారా సాగు చేసుకుంటే నీటి ఆదాతో పాటు, కలుపు తగ్గించుకోవచ్చు, 15-20 % వరకు దిగుబడులు పెంచుకోవచ్చు. ఏ దశలోనైనా మొక్కల నీటి ఎద్దడికి గురైతే, పెరుగుదల మరియు పూల దిగుబడి తగ్గుతుంది.

పూలకోత: పొలంలో నాటుకొన్న రెండు నెలల తరువాత నుంచి పూలను కోసుకోవచ్చు. మొదటి కోత నుండి మరో రెండు లేదా రెండున్నర నెల్ల వరకు పూత వస్తుంది. పూలను 3-5 రోజులకు ఒకసారి కోసుకోవచ్చు. బాగా విచ్చుకొన్న పూలను ఉదయం కానీ సాయంత్రం కానీ కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తరువాత ఎక్కువ కలం తాజాగా ఉంది నిలువ ఉంటాయి. సకాలంలో పులకోతలు చేస్తూ ఉంటా పూల దిగుబడి పెరుగుతుంది.

పూల దిగుబడి: ఎకరాకు ఆఫ్రికన్ రకాలు అయితే 8-10 తన్నులు, హైబ్రెడ్ రకాలు అయితే 12-15 టన్నుల పూల దిగుబడి వస్తుంది.

సస్యరక్షణ: పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింది పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

పేను: పిల్ల, పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా మొక్క లేత భాగాలను ఆశించి అందులోని రసాన్ని పిల్లచకొంటాయి. మొక్కలు బలహీనంగా మరి పుటను ఇవ్వవు. మసి తగులు బాగా కన్పిస్తుంది. నివారణకు పోంపోవిడెన్ 1 మీ.లి లేదా డావిడోయటి 2 వి.లి లీటరు నేటికీ చొప్పున కలిపి 15 రోజులకొకసారి పిచికారీ చేసుకోవాలి.

దీపపు పురుగులు: ఈ పురుగులు ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుల మీద ఎక్కువగా ఆశించడం వాళ్ళ ఆకులు గుండ్రంగా చుట్టుకొని, మెలికలు తిరిగి మొక్క పదలిపోతుంది. నివారణకు 0.3 వి.లి. ఈవిడొకఁలోప్రెడ్ లీటర్లు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఎర్రనల్లి: ఈ పురుగులు పూత దశలో ఎక్కువగా ఆశిస్తాయి. ఆశించిన ఆకులు పసుపు రంగులోకి మరి క్రిందకి ముడుచుకొంటాయి. నివారణకు డితోకలాపాల్ 5  వి.లిను లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

గొంగళి పురుగులు: ఈ పురుగులు ఆకుల కోన భాగాలను గోకి తింటూ, తీవ్ర స్థాయిలో ఈనేలను మాత్రమే మిగుల్చుతాయి, నివారణకు డ్రాకులామస్ ముందు 1 వి.లి. లేదా సూపర్ మేత్రిన్ 1 వి.లి.ను లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

మొగ్గ తొలుచు పురుగు: శనగ పచ్చు పురుగు లార్వాలు పూల రెమ్మలను తింటాయి. తద్వారా పూలు వాటి ఆకారాన్ని, నాణ్యతను కోల్పితాయి. పూమొగ్గలు కూడా విచ్చుకోవు. ఆశించిన మొగ్గలను, పూలను త్రుంచేసి పోరాముయాలి. ఒక లీటరు నేటికీ 1 వి.లి. ఇండికేసికార్బ్ కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగులను నివారించవచ్చు.

తామర పురుగులు: తల్లి, పిల్ల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లటి మచ్చలు అరూపుడతాయి. ఆకులు పైకి ముడుచుకొంటాయి. ఆశించిన మొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. రోజొక్యంతో నీళ్ళను చల్లడం ద్వారా వీటి ఉద్రతిని అరికట్టవచ్చు. నివారణకు 2 వి.లి. దివిడోయట్ లేదా 1 వి.లి. పిప్రానిల్ లేదా 1.5  గ్రా. అసిపేట్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

పాముపొడ తెగులు: ఆకులపై పాము వంటి ఆకారంలో తెల్లటి చారలు కనిపిస్తాయి. నివారణకు డావిడోయట్ మందు 2 వ్.లి. ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

తెగుళ్ళు

నారుకుళ్ళు తెగులు: నరు మేర్లు కుళ్ళిపోయి, నరు పసుపు రంగులోకి మారి, గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నెలలో తడి ఎక్కువగా ఉండి, వాతావరణం వేచ్చగా ఉంటే ఏది ఆశిస్తుంది. లీటరు నీటికి 1 గ్రా. కార్బండజిమ్ మందును కలుపుకొని నేరుమాళ్ళను తడుపుకోవాలి.

ఆకుమచ్చ, ఆకుముడత తెగులు: ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పుడుతాయి. తర్వాత దశలో ఈ మచ్చలు న్నీ కలిసి ఒక వలయంలో ఏర్పుడి ఆకులు ముడుచుకొంటాయి. నివారణకు లీటరు నీటికి 3 గ్రా. మోకోజెబ్ లేదా 1 గ్రా. కార్బండిజమ్ కలిపి పిచికారీ చెయాలి.

కాండం కుళ్ళు తెగులు: కుళ్ళు తెగులు కాండం భాగాలను ఆశిస్తుంది పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 2.5 గ్రా. కార్బండజిమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి.

బూడిద తగులు: ఈ తెగులు వాళ్ళ మొక్క ఆకు, కొమ్మల భాగాల్లో తెల్లటి పొడి లాంటి పదార్థం కనిపిస్తుంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నేతిలో కరిగి గంధకం లేదా 1 మీ.లి. దినొకప్ కలుపుకొని పిచికారీ చెయాలి.

మొగ్గ కుళ్ళు తెగులు: తెగులు సోకిన మొగ్గలు శుప్కెంచి, గోధుమ రాణఁగులోకి మారిపోతాయి. పాత ఆకుల అంచుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పుడి ఆకులు ముడుచుకు పోతాయి. నివారణకు లీటరు నీటికి 2 గ్రా. మాంకోజెబ్ మందు కలుపుకొని పిచికారీ చెయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.66666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు