పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మల్లె

మల్లె.

వేసవిలో సువాసనలను వెదజల్లే పూలను తెలంగాణలోని ఖమ్మం, మహబూబీనగర్, మంచిర్యాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, వరంగల్ రూరల్, యాదాద్రి జల్లాల్లో 154 హెక్టార్లలో సాగు చేస్తూ 434 టన్నుల మల్లపులను ఉత్పత్తి చేస్తున్నారు.

వాతావరణం: మల్లె సాగుకు ఉష్ణ మండల ప్రాంతాలు అనుకూలం. తక్కువ చలి, కాంతివంతమైన వాసవి, గాలిలో సరిపడినంత తేమ గల ప్రాంతాలు మల్లె సాగుకు అనుకూలం.

నేలలుల: తేలిక పొతే నేలలు, ఒండ్రు నేలలు, ఇసుక నేలలు అనుకూలం. అయితే మల్లెలు ఒకసారి నాటితే 12  సంవత్సరాల వరకు పులనిస్తూనే ఉంటాయి. కాబట్టి అధిక కర్బనాశాతం కలిగిన బరువైన నేలలు అత్యంత అనుకూలం.

రకాలు: మల్లెలో అనేక రకాలున్నా మన రాష్ట్రంలో గుండుమల్లె, జాజి మల్లె, కాగడా రకాలను సాగు చేస్తున్నారు. వీటిల్లో 75 % విస్తరణం గుండుమల్లె సాగులో ఉంది.

గుండుమల్లె: మర్చి నుండి సెప్టెంబరు వరకు పులా దిగుబడినిస్తాయి. రామనాథపురం, రామబాణం, ఇరువచ్చి అనే రకాలు అధిక దిగుబడినిస్తాయి. రామనాథపురం రకం దాదాపు సంవత్సరంలో 9 నేలలు పులా దిగబడినిస్తుంది.

జాజిమల్లె: మర్చి నుంచి నవంబరు వరకు పులా దిగుబడినిస్తుంది. ఎందులో కో-1 , కో-2 రెండు రకాలు అధిక దిగుబడినేస్తాయి.

ప్రవర్ధనం: మెల్లను కొమ్మ కత్తరింపు కుక్కలు, లాయర్లు, పిలకలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఒక వమైతేరూ పొడవున్న తెగ కొమ్మను కత్తిరించి, రొండు కోణాలను భూమిలో పాటి నీరు పెట్టాలి. లేయర్లను అంటే తీగను వంచి భూమిలో లోతుగా నాటుకుంటే దాని నుండి మేర్లు అభివృద్ధి చెందుతాయి.

నాటడం: 4 -5 సార్లు భూమిని బాగా దుక్కి చేయాలి. ఆ తరువాత రకాన్ని  బట్టి గుండుమల్లె 1 .2 *1 .2 మీ., జాజిమల్లెకు 1 .8 *1 .8 మీ. దూరంలో 1 .5 పునపుటడుగుల గుంతలు తీసి పై సగం మట్టికి  5 కిలోల పశువుల ఎరువు, 100 గ్రా. సూపర్ పోసెప్తు, 25 గ్రా. మ్యురేట్ ఆఫ్ పోటాష్, అరకిలో వేపపిండి విశ్రమంతో గుంతను నింపాలి. గుంత మధ్యలో మొక్కను నటి చుట్టూ కాళ్ళతో మట్టిన గట్టిగ తొక్కులి. కొత్త చిగురు వచ్చే వరకు 3 -4 రోజులకొకసారి నీరందించాలి.

కత్తిరింపులు: మల్లెలో కొత్త రెమ్మల చివరి భాగంలోను, పక్కల నుంచి పూత వస్తుంది. కాబట్టి పూలు పూసే కొమ్మలు రెమ్మలను ఎక్కువ సంఖ్యల పొందుదానికి, అధిక దిగుబడి కోసం కత్తిరింపులు చేయాలి. జనవరి మొదటి పక్షంలో 5 సంవత్సరాల్లోపు వయస్సు తోటల్లో తీగలను భూమి నుంచి రెండు అడుగులు, 5 సంవత్సరాలు పైన వయస్సున్న తోటల్లో మూడు అడుగులు ఉంచి మెలిగిన పై భాగాన్ని కత్తిరించాలి. తరువాత తేలికపాటి తడినిచ్చి నేలను మొత్తబడేటట్లు చేయాలి. నెల ఆరిన తరువాత వరుసల మధ్యలో దుక్కి చేసి వరం రాజులూ ఎండనీవ్యాలీ. ప్రతి పులా కోట అయ్యాక దుక్కి చేయాలి.

ఆకులు రాల్చడం: మల్లె తోటలను నవంబరు నుండి నీరు పెట్టకుండా చెట్టను నేటి ఎద్దడికి గురిచేయడం ద్వారా ఆకులు రాలిటట్లు చేసుకోవాలి. కొమ్మలన్నింటిని దగ్గరకు చేర్చి తాడుతో కడితే ఆకులు తొందరగా రాలుతాయి. లీటరు నెటిక్ 3 గ్రా. పెంటెక్లోరోఫినాల్ లేదా పొటాషియం ఆయెదటిదని కలిపి మొక్కల పై పిచికారీ చేస్తే ఆకులన్నీ రాలిపోతాయి. ఈ విధంగా షాకేయ పెరుగుదలను నిలిపి పూత మొగ్గలను ఏర్పుడేటట్లు చేసుకోవచ్చు.

ఎరువులు: కత్తిరింపులు తర్వాత నేలను దున్ని వరం రోజులు ఎండిన తరువాత ప్రతి చెట్టు చుట్టూ గాడి చేసి అందులో 2 .5 కిలోల పశువుల ఎరువు, 100 గ్రా. వేపపిండి, 200 గ్రా. అమ్మనేయం సెల్ప్ట్, 100 గ్రా. సూపర్ ప్రొస్పెటు, 7 .5 గ్రా. మ్యురేట్ ఆఫ్ పోటీషలను వాసి మట్టి కప్పేసి నేటి తడులు ఇవ్వలి. ఈ విధంగా పూలు పూయడం పూర్తయ్యేలోపు 4 ధపాలుగా నేలను దున్ని, వారం రోజులు ఎండనిస్తూ, గదిని తవ్వి వాటిలో పై ఎరువుల వేసుకోవాలి. మల్లెకు నత్రజనిని అమ్మెనేయం సెల్పేట రూపంలో ఇవ్వడం వల్ల పులా వాసం, నాణ్యత పెరుగుతుంది.

నీటి యాజమాన్యం: నెల స్వభావాన్ని బట్టి 5 -6 రోజుల కొకసారి పూలు పూసే సమయంలో నేటి తడులు ఇవ్వలి. డ్రిప్ ద్వారా అయితే వారంలో రెండు సార్లు నీతూ అందించాలి. పూలను కోయడం పూర్తయిన తరువాత 10 రోజులు నీరు పెట్టకుండా మొక్క వాడేటట్టు చేసే తరువాత నీరు పరిస్తే పులా దిగుబడి అధికంగా ఉంటుంది.

మొగ్గలా కోత: పూత దిగుబడి పెంచుటకు లీటరు నేటికీ 5 గ్రా. సూక్ష్మపోషక ధాతువుల మిశ్రమంను కలిపి 3 సార్లు పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమై మొక్క పెరిగి కొద్దీ దిగుబడి అధికం అవుతుంది. పూర్తిగా పెరిగిన మొగ్గలను ఉదయం 11 గంటల లోపలే కోయాలి. ఆలస్యం చేస్తే నాణ్యత తగ్గుతుంది.

దిగుబడి: ఎకరాకు 3 -4 టన్నుల దిగుబడి పొందవచ్చు. పూలను 2 -3 రోజుల వరకు తాజాగా ఉంచడానికి లీటరు నీటికి 10 గ్రా. సుక్రోజ్ లేదా 5 గ్రా. బోరిక్ ఆమ్లం లేదా 1 గ్రా. అల్యువినియం సెల్పేట కలిపినా ద్రావణంలో 5 -10 నిమిషాలు ముంచి, ఆరబెట్టి గోనె సంచుల్లో 2 -5 కిలోల వరకు ప్యాకింగ్ చేసుకోవాలి. రహణలో మధ్య మధ్యలో సంచులపై నీరు చిలకరిస్తే మొగ్గలు తాజాగా ఉంటాయి.

సస్యరక్షణ: పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రింద పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

మొగ్గ తొలుచు పురుగులు: పురుగు యుక్కా లార్వా మొగ్గాలోకి చొచ్చుకొని పోయి పులా భాగాలను తిని వేస్తూ తీవ్ర దశలో మొగ్గలన్నింటిని ఒక దగ్గరికి చేర్చి ముడుచుకు పోయేటట్లు చేస్తుంది. మొగ్గ దశలో మొగ్గలు నీలం రంగుకు మారుతుంటాయి. నివారణకు మలాథియాన్ మందును 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మొగ్గ తొలుచు ఈగ: మొగ్గ తొలుచు ఈగ ఆడ రెక్కల పురుగులు మొగ్గ చివర్లలో గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు మొగ్గ లోపలకు తొలుచుకొని లోపలి భాగాలను తినడం వల్ల మొగ్గలు ఆకారాన్ని కోల్పోయి ఉండ రంగులోకి మారతాయి. నివారణకు మిథేల్ థేమటేన్ 2 మీ.లి. లేదా మోనోక్రోటోఫాన్ 1 .6 మీ.లి. లీటరు నీటికి చొప్పున కలిపి మొగ్గలు ఏర్పుదే సమయం నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చెయాలి.

ఎర్ర నల్లి: ఈ పురుగు ఉద్రతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. పురుగులు  ఆకు అడుగుభాగం చేరి రసాన్ని పేల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మరి రాలిపోతాయి. నివారణకు లీటరు నీటికి 3 గ్రా. గంధకం పొడిని లేదా 5 మీ.లి. డ్తెకోపాల్ లేదా 3 మీ.లి. ప్రోపర్జ్టేట్ కలిపినా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.

తామర పురుగులు: పిల్ల, తల్లి పురుగులు గుంపులు గుంపులుగా లత ఆకులు, పూరేకులపై చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. పూరేకులు ఏందీ రాలిపోతాయి. నివారణకు పెప్రోనిల్ 2 మీ.లి. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.

తెగుళ్ళు

ఆకు ఎండు తెగులు: తెగులు ఆశించిన ఆకులు దేశసరిగా మారుతాయి. ఆకుపై భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పుడతాయి. తీవ్ర దేశంలో 50 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. నివారణకు మొంకోజిబ్ 3 గ్రా. లేదా కార్బెన్దిజోమ్ 1 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయాలి.

ఎండు తెగులు: తొలి దేశంలో మొక్క క్రింది భాగం ఆకులు ఎండిపోతాయి. ఆటు పిమ్మటి పై బాగానే ఉన్న ఆకులు కూడా ఏందీ రాలిపోతాయి. తీవ్ర దశలో మొక్కంతా ఏందీ చనిపోతుంది. నివారణకు మొక్కల మెదళ్ళ చుట్టూ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపినా ద్రావణంతో తడపాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.8
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు