పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

హరిత గృహాలలో కూరగాయలు, పులా పెంపకం

హరిత గృహాలలో కూరగాయలు, పులా పెంపకం

పంటలు సాగుచేయడానికి సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ సర్నాక్చారు పై పారదర్శక  పదార్థం (200 మ్తెక్రాన్ల లేక 800 గేజి య.మీ. స్టబ్ల్టేజిడి ఫిల్ము) తో కప్పబడి లోపలి వాతావరణ పరిస్దితులను కొద్దిగా గాని, పూర్తిగా గాని నేయఁత్రెంచి మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్దితులను ఏర్పాటు చేయడానికి నిర్మించే కట్టడాలను హరితగృహాలు అంటారు. హరిత గృహం పైకప్పుగా పాలిథిన్ ఫిల్మ్ మరియు పేడ్ నేటిలను ఉపోయోగిస్తే వాటిని పాళిహెసెలు అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1017 ఎకరాలు పాలిహీనులలో ఎక్కువ దార పలికే కూరగాయలు (కాప్సికమ్, కీరదోస, చెర్రీ టమాటా, టమాట), పూలు (గులాబీ, జెర్బారీ, చామంతులు, కార్నేషన్) లను పండిస్తున్నారు.

వాతావరణం: మన రాష్ట్రంలో కూరగాయలు మరియు పూలు పండించుటకు న్యాచురల్లీ వంటలేటిడ్ పాలిహీన్ అనుకూలం. ఎందుకంటే విద్యుత్ లేకున్నా వాతావరణ పరిస్దితులను అనుకూలంగా మలుచుకొనుటకు విలవు తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం తూర్పుమ్తెపు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు దక్షిణం వైపు ప్లాస్టిక్ తెరలను మూసి ఉంచాలి. పోలిహేసిపై తెరలను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3.30 వరకు మూసి ఉంచాలి. పంట పెరుగుదలకు అవసరమైన 32.5 కే.లక్స్ ఎండా తీవ్రత వచ్చేటట్లు పాలిథిన్  ఫిల్ము, పై తెరలను అమర్చుకోవాలి. సూర్యరశ్మిలో ముఖ్యంగా 400-700 ఎన్.ఎమ్ తరంగ దిర్యం ఉన్న కనిపించే వెలుతురు మాత్రమే కిరణజన్య సామ్యేగక్రియకు ఉపోయోగిపడుతుంది. మొక్కలకు హాని కలిగించే అతినెలలోహత, ఏంప్రరెడ్ కిరణాలను ఆపగలిగే పదార్థంతో కూడిన పిలమును పైకప్పుగా ఉపయోగించాలి.

ప్రతికూల వాతావరణ పరిస్దితులు నియంత్రణ: రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ముఖ్యంగా మే-జూన్ నెలల్లో, దిగుబడి, నాణ్యత, మొక్కలు జీవించే కాలాన్ని నియంత్రిస్తాయి. అందువలన ఈ అత్యధిక ఉష్ణోగ్రతలను కొన్ని పద్ధతులు పాటించి తగ్గించుకొని అధిక దిగుబడులు పొందాలి.

 1. పాళిహేశులలో ఏర్పర్చిన పేడ్ నేటిలను ఉష్ణోగ్రత, వీలుతురు అధికంగా ఉన్నప్పుడు మూసి ఉంచాలి. మే-జూన్ నెలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసి ఉంచాలి. తరువాత రాత్రిళ్ళు పూర్తిగా తీసి ఉంచాలి.
 2. పాళిహేశులలో గాలి ప్రసరణను నాలుగువైపులా ఉన్న కర్టెన్లను తీసి, తెరలను మాత్రం మూసి ఉంచిన గాలి ప్రసరణ నాలుగు విపుల ఉండటం, వాడిగాలి పైభాగం నుండి బయటకుపోవుటకు వీలు కలుగుతుంది.
 3. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా ప్రాంతాలలో పాలీహ్నులపై మెత్తటి సున్నమును నేతిలో కలిపి పిచికారీ చేసిన మంచి ఫలితం ఉంటుంది. వాసివి తరువాత వర్షం కురిసినప్పుడు కరిగిపోతుంది.
 4. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెంటిగ్రేడు నమోదయ్యా ప్రాంతాలలో పాలిహీనులపై షేడెనెట్లు కప్పటం వలన కూడా ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు.
 5. బెడ్స్ మధ్య ఉన్న కాలిబాటలో లావు ఇసుకను 4-6 అంగుళాల మందంలో నింపి, రోజు విడిచి రోజు నేటితో బాగా తడపటం వలన చల్లటి వాతావరణం ఏర్పర్చవచ్చు.
 6. మొక్కకు అవసరమైన వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ప్లోరోసెంట్ బల్బులను ఉపోయోగించాలి.
 7. ఇంకా ఫ్యాన్, ప్యాడ్ ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్ద, షాగే ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్దలను వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
 8. పొగర్స్ ఏర్పరచి నీటిని చిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రంచవచ్చు. కానీ నేటి నాణ్యత ప్రమాణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే నేటి తుంపరలు మొక్కలు, పూలు, కాయల మీద పడితే మాడిపోయా అవకాశం ఎక్కువ.
 9. పాలిహీన్ ప్లాస్టిక్ పక్క తెరలను పగలు సగం తెరవాలి. అదే రాత్రి సమయాల్లో పూర్తిగా తెరచి, గాలి సరఫరాకు సహకారం అందించాలి.
 10. హరిత గృహాలలో మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్దితులను కల్పించడానికి ముఖ్యంగా షేడ్నెస్ విస్టీలు, పాగర్లు, వెంటిలేటర్లు ల్తెట్లు మరియు పాన్లు మొదలైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.

హరిత గృహాలలో వివిధ పంటలకు అనువైన వాతావరణ పరిస్దితులు:

పంట

పగటి ఉష్ణోగ్రత (సెల్సయస్)

రాత్రి ఉష్ణోగ్రత (సెల్సయస్)

గాలిలో తేమ%

టమాట

21-28

15-20

60-65

కాప్సికమ్

22-23

18-19

70-75

కీరదోస

20-25

18-20

70-90

స్ర్టాబెర్రి

21-22

17-19

60-65

చేమంతి

18-20

16-17

68-70

గులాబీ

21-27

16-17

60-62

కార్నేషన్

16-19

12-13

70-72

జెర్బారా

20-24

13-15

65-70

సాధారణంగా పూలు, కూరగాయల పెరుగుట లకు మరియు నాణ్యత పెంపొందించుటకు ఉపోయోగకరమైన సగటు పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు వరుసగా 26-30 సెల్సయస్, 15-18 సెల్సయస్. హరిత గృహాల్లోపలి ఉష్ణోగ్రత 40 సెల్సయస్ కంటే ఎక్కువ అవుతుంది, కావున వెంటిలేటర్లు మరియు ఫ్యాన్ మరియు ప్యాడ్స్ ద్వారా ఉష్ణోగ్రత నివారించవచ్చు. ఈ పై వాతావరణ పరిస్దితులే కాకా బొగ్గుపులుసు వాయువు పరిమాణం 300-1000 పి.పి.యం. సూర్యరశ్మి 250-450 మిక్రోమేల్స్/చ.మీ./సెకను ఉండేటట్లు చూడాలి. టమాట, వంగ మరియు గులాబీకి మాత్రమూ 450-750 మీఆక్రోమేల్స్/చ.మీ./సెకను ఉండాలి.

నెలలు/మట్టి విశ్రమం: హరిత గృహాలలో వాడే మట్టి సమునను పరీక్ష చేయించి పండించుటకు వీలు ఉన్న మట్టిని మాత్రమే వినియోగించాలి.

మట్టి నాణ్యత ప్రమాణాలు

 • ఎర్రమట్టి, నీరు ఇంకిపోయే స్యభావం, అదే విధంగా మొక్క నిలబడుటకు ఊతం ఇవ్వలి.
 • ఉదజని సూచి 5.5 - 7.0, లవణాల సాంద్రత 2 మిల్లి మాస్/సం.మీ. కంటే తక్కువ ఉండాలి.
 • నీటిలో కరిగే లవణాలు తక్కువగానూ, సేంద్రియ పదార్థం ఎక్కువగాను ఉండాలి. ఎంచుకున్న మట్టిలో కలుపు గింజలు, నులి పురుగులు లేకుండా చూసుకోవాలి.

మట్టి విశ్రమం తయారీ: కూరగాయలు, పూలు ఎక్కువ సంవత్సరాలు పండించుటకు వీలుగా అత్యధికంగా అంటే 50% సేంద్రియ పదార్థం కలుపుకోవాలి. ఈ సేంద్రియ పదార్థం త్వరగా క్షిణించకుండా ఎక్కువ రోజులు ఉండేదాన్ని, వీలున్నంత తక్కువ ఖర్చుతో, తేలికగా లభ్యమయ్యే దానిని ఎన్నుకోవాలి. ముఖ్యంగా బెడ్స్ తయారీకి పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, వరిపొట్టు, వేరుశనగ చెక్కలు విరివిగా వాడవచ్చు. వీటిలో 3-4 రకాలు కలుపుకున్న మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మట్టిని, తరువాత ఎంచుకున్న సేంద్రియ పదార్దాలను పాలిహీన్ లోకి చేర్చి బాగా కలిపినా తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. తరువాత విశ్రమాన్ని ఒకసారి పరీక్ష చేసి సరిచూసుకోవాలి.

ప్యూమిగేషన్: మట్టి విశ్రమంలో కీటకాలు, వేరుపురుగులు, చెదలు, నులిపురుగులు, రోగకారక శిలింద్రాలు లేకుండా చేయుటకు పార్మాల్డిహెటెడ్ తో ప్యూమిగేట్ (ప్రగ్యా పారించడం) చేయాలి. పాలిహీనులలో ఏంటని మడులు, దార్లు తయారుచేసుకున్న తరువాత మట్టి అంటే తడిచే విధంగా ముందుగా నేటితో తడపాలి. 5 లీటర్ల పార్మాలిన్ మందును 200 లీటర్ల నేతిలో కలిపాలి. 1600 లీటర్ల మందు ద్రావణాన్ని తయారుచేసుకొని మట్టి అంతా తడిచే విధంగా మందును 560 చ.మీటర్లలో వెదజల్లి, వెంటనే పల్చని నల్లటి పలాషిటీను కూడా మూసి వరం రోజులు ఉంచాలి. వరం రోజుల తరువాత ప్లాస్టిక్ కాగితాన్ని తీసి, పాళిహేంపై, ప్రక్కల తెరలు కూడా తీసి, మట్టిని బాగా క్రింది నుంచి కలిపి మందు అవశిషాలు పూర్తిగా మట్టి నుంచి పోయే విధంగా విస్తారంగా నీటిని చల్లాలి.

ఎత్తేన మడులు తయారీ: మట్టి అరుదలకు వచ్చిన తరువాత మరల ఎత్తేన మడులు, దార్లు (కాలి బాటలు) తయారు చేసుకోవాలి. సాధారణంగా పాలిహీన్ పొడుగు, 90 సం.మీ. వెడల్పు, 30-40 సం.మీ. ఎత్తు గల మడులు 22-24 దాకా చేసుకోవాలి. ఎత్తుమడుల మధ్య దూరం 50-60 సం.మీ. వదిలితే అవి కాలిబాటలుగా ఉపోయోగపడతాయి. పాళిహెసెలో తిరగడానికి మధ్యలో 1 మీ. వెడల్పు కలిగిన గట్టి నెల దారిని ఏర్పాటు చేసుకోవాలి.

డ్రిప్ పైపులను పరచుట: 16 మీ.మీ. వ్యాసం కలిగి ప్రతి 45-60 సం.మీ. వద్ద గంటకు 2-4 లి. నీటిని చుక్కలుగా విడుదల చేసే ఇనెల్టెన్ డ్రిప్ లేటరల్ పైపులను మడి మధ్య భాగంలో పరుచుకోవాలి.

మల్చింగ్: 1.2 మీ. వెడల్పు, 30-100 మైక్రాన్లు మందం కలిగిన పాలిథిన్ కాగితాన్ని మడిపై కప్పాలి. మల్చింగ్ కాగితంపై నిర్దేశించిన ఎడంలో 5 సం.మీ. వ్యాసం గల రంద్రాలను చేయాలి.

రకాలు: రకం మీద దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఏది చాల ముఖ్యమైన అంశం. సాగుచేసే రకం పరిమాణం, ఆకారం, రంగు, నిల్వ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాగుచేసే రకం అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. చీడపీడలకు నిరోధక శక్తి కలిగి, ఎక్కువ కలం నిల్వ ఉండేటట్లు వంటి రకాలను ఎన్నుకోవాలి.

టమోటా రకాలు: అధిక దిగుబడినిచ్చే డిఎఆర్ఎల్ -303, హెటి-6, సన్-7611, ఎన్ఎన్-1237, నవీన్, ఎన్ఎన్-4130, అబిమన్, కోటీహెచ్-1, ఎన్డిటే -5, ఎన్డిటి-120, పూస దివ్వ, మీనాక్షి, లక్ష్మి వంటి రకాలను సాగు చేసుకోవాలి.

కీరదోస: కీరదోసలో మూడు ప్రధానమైన రకాలు మోనోషయస్, గతేనాషాయస్, పార్థినోకార్సిక్ వాణిజ్య సరళిలో సాగుకు అందుబాటులో ఉన్నాయి. మోనోషోయస్ రకాల్లో ప్రతి మొక్కపై ఆడ, మెగా పూలు వరువారుగా ఏర్పడతాయి. గతేనాశేయస్ రకాల్లో కేవలం ఆడపులి మాత్రమే వస్తాయి. అందువల్ల ఈ గితేనోషయస్ రకాలు సాగుచేసేటప్పుడు పుప్పొడిని అందించే మెగా పూలను ఉత్పత్తి చేసే మోనోషేయస్ రకాలను దూడ హరిత గృహాల్లో నాటుకోవాలి. పార్డీనొకరిపిక్ రకాలు పరంగా సంపర్కం, ఫలదీకరణ చెందకుండానే పిండే కట్టి సాధారణ కాయలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ పార్డీనొకరిపిక్ రకాలను సాగుచేసేటప్పుడు పుప్పొడిని అందించే మెగా మొక్కలను హరితగృహాల్లో సాగుచేయాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో పార్థినోకార్పెక్ రకాలను విరివిగా సాగుచేస్తున్నారు.

మోనోషేయస్ రకాలు: జాపనీస్ లాంగ్ గ్రీన్, పెయిన్ నెట్టే, కిరపునే, బాలంకిరా.

గతేనాశేయస్ రకాలు: హాసన మోహన్ సన్, దీనార్, మస్టాంగ్, బ్రెనోకో.

పార్డీనొకరిపిక్ రకాలు: సిటీస్, అలమిర్, సన్-9729, సన్-3019, కిమాన్.

కాప్సికమ్: కాలిఫోర్నియా వండర్, యాలోవాండర్, కింగ్ ఆఫ్ నార్త్, వీటినుంచి ఎంపిక చేయబడిన అర్క గేరావ్, అర్క మోహినీ, అర్క బసంతీలు సాగు చేయుటకు అనుకూలం. ఇవికాక అనేక ప్రైవేట్ శంకర రకాలు ఇంద్ర (ఆకుపచ్చ రంగు,), ఓరొబెల్లి (పసుపు), బాంబే (ఎరుపు), గ్రీన్ గోల్డ్, భారత్ వంటివి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రాంతాన్ని అనుసరించి రకాన్ని ఎన్నుకోవాలి.

జెర్బేరా: రుబీరెడ్, ఫానియా, తామర అనే ఎరుపు రంగుపూల రకాలు, సూపర్ నోవా, డోన్, పులమున్ప ప్రేడ్ కింగ్ అనే పసుపు రంగు రకాలు ఎక్కువగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

చామంతి: రెడీగోల్డ్, పంకజ్, అజమ్, సోనాలి, స్వర్ణ, రవికిరణ్, ఎల్లొస్తారు, ఇందిర, రబి వంటి దేశవాళీ హెట్బ్రేడ్సేతో పటు విదేశాల నుండి దిగుబడి చేసుకొన్నా రకాలు అధికంగా వినియోగంలో ఉన్నాయి.

నరు పెంపకం: ఒక పాలిహీన్ విస్తరణంకు సరిపడా  నరు పెంచుటకు 1మీ. వెడల్పు*5మీ. పొదుపు గల 3 బెడ్స్ సరిపోతాయి. నారుమడిని 15 సం.మీ. ఎత్తుగా చేసి 10 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి పోసి బాగా కలియబెట్టలి. చ.మీ.కు 20 గ్రా. కార్బొఫూరన్ గుళికలు వేసిన రసం పీల్చు పురుగులు ఆశించవు. విత్తనాలను 10 సం.మీ. ఎడం గల వరుసలో నాటుకోవాలి. నాటిన 12 మరియు 20 రోజులకు ఒకసారి కాపర్ సంబంధిత శిలింద్ర నాశీనులతో నెల తడిచేటట్లు పిచికారీ చేసిన నరుకుళ్ళు తెగులును నివారించుకోవచ్చు. ఐతే ఇటీవల కాలంలో గుంతలు గల ప్లాస్టక్ ట్రేల లో కోకోపీట్ నింపి, వాటిలో విత్తనాలు నాటి, నరు మొక్కలను వరుముద్దతో సహా ముడుల్లో నాటుకోవచ్చు. ఈ పద్దతిలో విత్తనం, నరు వృదాను అరికట్టవచ్చు. నారును ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చాల సులభంగా రవాణా చేసుకోవచ్చు.

నాటడం: సాధారణంగా పంటను బట్టి 25-40 రోజుల వయస్సు గల నారును 60*50 సం.మీ. లేదా 60*45 సం.మీ. దూరంలో ఎత్తేన మడులపై నాటుకోవాలి. అదే విధంగా జార్బెర్, చామంతి వంటి పులా మొక్కలను ఒక మడిలో రెండు వరుసలు 30 సం.మీ. దూరంలో, మొక్కలకు మొక్కలకు మధ్య 30 సం.మీ. ఉండేటట్లు నాటాలి.

నాటే సమయం: జులై నుండి నవంబరు వరకు నాటుకోవచ్చు. ఫాగర్స్ ఉన్న యడల పాలిహీన్ ఏ పంటనైనా సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. పాలిహీన్ నాటిన 10-15 రోజుల తర్వాత లీటరుకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొక్క మెదళ్ళను తడుపుకోవాలి.

ఎరువులు: నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ పద్దతిలో విషేటిగేషన్ విధంగా ద్వారా మొక్కలకు పోషకాలు అందించవచ్చు. బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ళ వర్మీకంపోస్టు, 20 కిలోల సింగిల్ పాస్పెట్ వాసి కలియబెట్టాలి. నాటిన 15-20 రోజుల నుండి. వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా ఒక కిలో యూరియా, పొటాషియం న్తెట్రేట్లను మర్చి మర్చి ఇవ్వాలి. పూత, పిండే దశ నుండి రెండు కిలోల కాల్షియం న్తెట్రేట్, 1 కిలో పొటాషియం న్తెట్రేట్, 1 కిలో యూరియా లేదా 1 కిలో 19:19:19 లను రోజు విడిచి రోజు ఇవ్వాలి. వారంలో ఒక రోజు నేటితో డ్రెంచింగ్ ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలను అనగా బోరాన్ 10 గ్రా., జింక్ సిల్పట్ 25 గ్రా., మాగ్నీషయం సల్పేట్ 20 గ్రా., పెర్రస్ సల్పేట్ 25 గ్రా., నెమ్మ ఉప్పు 2 గ్రా. లను 10 లి. నేటికీ కలిపి 15 రోజులకొకసారి పూత, పిండే దశ నుండి పిచికారీ చేస్తే దిగుబడి బాగుంటుంది.

అదే విధంగా జెర్బార్, చామంతి వంటి పులా మొక్కలను నాటిన 3 వరాల తరువాత 19:19:19 ను ప్రతి మొక్కకు 0.4 గ్రా. చొప్పున రోజు మర్చి రోజు, 20:20:20 ను 1.5 కిలో రెండు రోజులకొకసారి మొదటి మూడు నెలలు ఇచ్చినట్లయితే షేకీయ పెరుగుదల బాగా ఉంటుంది. పూత ప్రారంభం అయిన తరువాత 15:8:35 ను 1 గ్రా. మరియు 19:19:19 ను 0.4 గ్రా. చొప్పున ప్రతి మొక్కకు రోజు మర్చి రోజు ఇచ్చినట్లయితే పుప్ఫశల నాణ్యత, దిగుబడి పెరుగుతాయి.

ఇటీవల మార్కెట్ లో  లభ్యమవుతున్న నీటిలో కరిగే మ్తెక్రోఫోల్ బి, రెక్సోలిన్, సీక్వెల్, పేరడిలాన్ మ్తెక్రోల్, పార్ములా -4 వంటివి కూరగాయల, పులా మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి భూసార పరీక్షా చేయించటం ద్వారా ఎప్పటికప్పుడు భూమిలో పోషకాల స్థాయి తెలుసు కొని దాని కనుగుణంగా ఎరుపులు నిర్ణయించుకోవాలి.

పాలిహీన్ మొక్కలు చుసిన వారందరికీ మొక్కలు ఆరోగ్యంగా చక్కగా మారుస్తూ కనిపించినట్లైతే మనం వాటిని సక్రమంగా పెంచుతున్నట్లే.

నీటి యాజమాన్యం

పాలిహీనులలో పెంచే మొక్కలకు నాణ్యమైన మంచి నీరు అవసరం. ఒక ఎకరా పాళిహేంకు రోజుకు 7000-8000 లీటర్ల నీరు వేసవిలో అవసరం ఉంటుంది. అదే విగత కలల్లో తక్కువ అవసరం ఉంటుంది. సాధారణంగా పాలిహీనులలో మొక్కలు రోజుకి 300-700 మీ.లి. నీటిని వినియోగించుకొంటాయి. నెలలో తేమ శాతాన్ని బట్టి డ్రిప్ ద్వారా నీటిని అందించే సమయాన్ని మార్చుకోవచ్చు. వేసవిలో బెడ్లను వాటి అంచులు తడిచేలా షవర్ తో నీటిని అందిస్తే అవసరమయ్యే నేటి శాతాన్ని తగ్గించడంతో పటు పాలిహీన్ లో సూక్ష్మ వాతావరణాన్ని కల్పించవచ్చు. వీటి కొరకు ఒక అంగుళం వ్వాసం గల వైపుకు చిన్న చిన్న అవుట్ లెట్లు ఏర్పరచడం ద్వారా షవరింగా చేయవచ్చు.

పులా మొక్కలకు ఐతే మొదటి దశ పూత ప్రారంభం అయ్యే వరకు ఎంతోకారో స్పిన్కర్స్ ద్వారా నీటిని ఇచ్చి, తరువాత డ్రిప్ ద్వారా అందించాలి. వాసవి తీవ్రతను తగ్గించుటకు పగర్స్ వాడటం ద్వారా కావాల్సిన తేమ శాతాన్ని ఏర్పరుచుకోవచ్చు.

పార్టిగేషన్ పద్దతిలో ఉపోయోగించి నేటి నాణ్యత ముకునినా అంశం. నీటిని వాడే ముందు నాణ్యత పరీక్షా చేయాలి. ముఖ్యంగా ఉండజాని సూచి, కరిగిన లవణాల శతం, విద్యత్ చాలాకత్తా తప్పనిసరిగా చూడాలి. నీరు పరిశుబ్రాంగా ఉండాలి. లేని ఎడల పిల్టర్ వాడాలి లేకపోతె డ్రిప్ లేటరల్ పైపుపై ఉన్న ఏవిట్టర్స్ మూసుకొని నీరు మొక్కలన్నింటికీ సమంగా అందదు.

బోరుబావిలో నుంచి తీసిన నీటిలో ఎక్కువగా కాల్షియం, కాల్బానేట్, సల్పేట్స్, క్లోరైడెలు, ఇనుము మెగ్నీషియం, బోరాన్ అనే ధాతువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రకం నీరు వాడటం వాళ్ళ బోదెలలో ఉండజాని సూచి, ఇసి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి నేటి వాడకం తగ్గించాలి.

పాలిహీన్ లో ఉన్న మొక్కలు, వాటి పెరుగుదలను అనుసరించి పార్టిగేషన్ రసాయన ఎరువుల విశ్రమాన్ని తయారు చేసుకొన్నా తరువాత విశ్రమం ఉండజాని సూచి 5-7 మధ్యలో ఉంటె మొక్కల పెరుగుదల బాగుంటుంది ఉండజాని సూచి ఎక్కువగా ఉంటె 10-20% ఆమ్లాలను, తక్కువగా ఉంటె 10 శతం క్షరాలను విశ్రమానికి కలపాలి. అదే విధంగా నత్రజనినిని న్తెట్రేట్ రూపంలో ఎక్కువ రోజులు అందిస్తే ఉండజాని సూచిక పెరుగుతుంది. కానీ నత్రజనిని అమ్మేనియా రూపంలో ఎస్టీ ఉండజాని సూచి తగ్గుతుంది. అందువలన నత్రజనిని 10-20 శాతం అమ్మేనియా రూపంలోనే ఇవ్వాలి.

అంటారా కృషి: మొక్కలు నాటిన తరువాత మనుషులతో రెండు సార్లు కలుపు తీసిన సరిపోతుంది. పాలిహీన్ పెంచే ప్రతి పంటలో కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య  పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చు.

కాప్సికమ్

శిక్షణ: మొదటగా వచ్చే పుటను, పెండెను జాగ్రత్తగా గోటితో తుంచి వేయాలి. ప్రతి మొక్క నుండి బలంగా పెరిగే 3-4 కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి.

ఉత వివ్వటం (స్టెకింగ్): కాప్సికమ్ మొక్క కాండం బలహీనంగా ఉండే కయ బరువుకి కొమ్మలు విరిగి పోతుంటాయి. కావున పాలిహీన్ లో 8 అడుగుల ఎత్తులో జి.ఐ. వేటుతో ఒక్కక్క మొక్కల వరుసకు ఒక వరుస వీరును పైపులకు కట్టవలెను. మొక్క పెరిగే కొలది పెరిగిన కొమ్మను ప్లాస్టక్ వీరికి మెలిపెట్టడము ద్వారా కొమ్మ కాపు మీద విరగకుండా చూడవలెను.

టమాట

సక్కరింగ్: మొక్క నుంచి క్రిందిగా పెరిగే, గుబురుగా ఉండే కొమ్మలను తీసివేయాలి. కాండం నిలువుగా పెరిగేలా చూసుకోవాలి.

ఉత వివ్వడం: మొక్కలు నాటిన తరువాత సన్నని ప్లాస్టిక్ మ్తెరుతో ఊతంగా కట్టాలి. భూమి నుంచి కనీసం 3 మీ. ఎత్తు సమాంతరంగా వైర్లు కట్టి ఊతంగా వదిన వైర్లు దానికి కట్టాలి. దీనినే ట్రెల్లిస్ పద్దతి అంటారు.

ఆకులను తీసివేయడం: ఆకులు ఎక్కువగా భూమిని తాకినప్పుడు రకరకాల శిలింద్ర వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఆకులు ఉన్నప్పుడు తీసివేయడం ద్వారా చక్కని గాలి, మేలుతురు కోకేటట్లు చేసి శిలింద్ర వ్యాధులను నిర్ములించుకోవచ్చు.

పిండెను రాల్చటం: చిన్న, పూర్తిగా ఎదుగుదల లేని కాయలను తీసివేయడం ద్వారా నాణ్యమైన పెద్ద స్టేజున్న కాయలను దిగుబడిగా పొందవచ్చు.

పరాగ సంపర్కం: టమాట గాలి ద్వారా పరంపరగా సంపర్కం జరుపుకొని ప్రకృతిలో కాయలు కాస్తుంది. కానీ పాలిహీన్ లో పెరిగే తమతో పుష్పాలు అధిక ఆర్ద్రతతో ఉండి, గాలి చలనం ఒకవైపు నుండి మరోవైపుకు తక్కువగా ఉంటుంది. కాబట్టి కృత్రిమ పరాగ సమ్పకారంను జరపాలి. దీని కోసం ఉదయం 10-11 గంటల మధ్య బ్రాషెను ఉపోయోగించి పూలగుత్తుల మీద రుబ్బటం ద్వారా (వారానికి రెండు సార్లు చొప్పున) పిండే కట్టడానికి తోడ్పడవచ్చు.

కీరదోస

శిక్షణ, కత్తిరింపులు: పాలిహీనులలో కిరకోశాను రెండు పద్ధతుల్లో పాకించాలి.

 1. వర్టికల్ కార్డాన్ పద్దతి: ఈ పద్దతిలో ప్రతి బెడెపై రెండు వరుసల్లో మొక్కలను పెంచాలి. మొక్కలను నిటారుగా మడిపైన 10 అడుగుల ఎత్తులో సమాంతరంగా కట్టిన జి.ఐ తీగ వరకు పెరగనివ్వాలి. జి.ఐ తీగను తాకినా వంటనే తలా భాగాన్ని తుంచి వేయాలి. తర్వాత వచ్చే పక్క కొమ్మలు గొడుగుపై బాగానే ఉన్న సువ్వాలా మాదిరిగా ఎదుగుతాయి.
 2. కార్డాన్ పద్దతి: ఈ పద్దతిలో ప్రతి మడిపై మొక్కలను ఒకే వరుసలో వరుసకి వరుసకి మధ్య 1.5 మీ., వరుసలో మొక్కల మధ్య 30 సం.మీ. ఎండం ఉండేలా నాటుకోవాలి. మడిపై భాగంలో 75 సం.మీ ఎండల్లో రెండు జి.ఐ. తీగలను 10 అడుగుల ఎత్తులో భూమికి సమాంతరంగా కట్టాలి. కార్బాన్ పద్దతిలో ఎదిగే మొక్క కోన భాగం జి.ఐ. వైరును తాకి 1-2 ఆకులు వచ్చిన తరువాత కొనభాగాన్ని తుంచి వేయాలి. దాని కింద నుంచి వచ్చిన 2 పక్క కొమ్మలను క్రిందకు పాకించాలి. ఈ విధంగా క్రిందకు పాకించి కొమ్మలను కూడా భూమికి తాకినా వెంటనే కోన భాగాన్ని తుంచి వేయాలి.

పిందెలను తొలగించడం: మొక్కపై ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ఏర్పడిన కాయల్లో కొన్ని కాయలను తొలగించినట్లయితే మొక్కపైన ఉన్న విగతా కాయలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులనిస్తాయి.

చామంతి, జెర్బేరా

ఊతమివ్వటం: చామంతి మొక్కలు పూలు పూచేటప్పుడు బరువుకి వంగిపోకుండా ట్రేలిసింగ్ వైరుతో వలల అల్లి మొక్క ఎత్తు పెరిగేకొద్దీ దానిని పైకి జరపటం ద్వారా ఉతంను ఇవ్వవచ్చు.

తలలు తుంచటం (పించింగు): చామంతి, జర్బర్లలో మొక్క నాటిన 4-5 వారాల తరువాత మొక్కల తాళాలను తుంచి వేయాలి. దీని వాళ్ళ పులా దిగుబడి అధికంగా వస్తుంది. పంట కోత కొంత ఆలస్యంగా వస్తుంది.

కోత, దిగుబడి

కాప్సికమ్: ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోయాలి. పసుపు, ఎరుపు రంగు రకాలను 50 శాతం రంగు మారగానే కోయాలి. పూర్తిగా రంగు మరీనా కాయలు తర్వాత విడిపోతాయి. ప్రతి రెండు మూడు రోజులకొకసారి కోయలు కోయాలి. ఒక ఇక్రా పాలిహీన్ నుండి 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

టమాట: నాటిన 75-85 రోజుల వ్యవధిలో కోతకు వచ్చి, ప్రతి రోజు ఎంతో కొంత దిగుబడినిస్తూనే ఉంటుంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడినిస్తాయి.

కీరదోస: మొక్కలు నాటిన 55-65 రోజుల్లో పంట కోతకు వస్తుంది. 2-4 రోజుల వ్యవధిలో లేతగా, ఆకుపచ్చగా ఉన్న కాయలను కోయాలి. ఒక మొక్క నుంచి సరాసరి 8-10 కిలోల దిగుబడి అంటే 40-50 టన్నుల దిగుబడి ఎకరాకు వస్తుంది.

చామంతి: నాటిన ఐదు నెలల నుండి పులనివ్వటం మొదలు పెడతాయి. 40 నుండి 50 సార్లు వరకు పూలు కోయవచ్చు. ఒక పంట కాలంలో దిగుమతి చేసుకున్న హెటిబ్రెడ్ రకాలు 30 టన్నుల వరకు పులా దిగుబడి నిస్తున్నాయి.

జెర్బేరా : జెర్బెర్ 24-30 నెలల పంట. మొక్కలు నాటిన 7-8 వారాల తరువాత మొదటి పూత కనిపిస్తుంది. 14-16 ఆకుల దశలో ఒక చ.మీ. కు 6-7 మొక్కలు నుంచి 200 పుష్పాలు అంటే సుమారుగా 3-4 లక్షల వరకు పులా దిగుబడి వస్తుంది.

సస్యరక్షణ: సాధారణ సాగు కంటే హరిత గృహాలలో పురుగులు, తెగుళ్లు చాల తక్కువ. హరిత గృహానికి నాలుగువైపులా 40-50 నీలం మిషే వాలాను ఏర్పటు చేయడం వాళ్ళ కీటకాలు, రసం పేల్చే పురుగులు, వైరస్ సోక్రమణ జరగదు. ఐతే ఒకసారి హరిత గృహంలోకి పురుగులు, తెగుళ్లు ప్రవేశించినట్లైతే అవి చాల వేగంగా పెరిగి ఉదృతి అధికమవుతుంది. నివారించడం చాల కష్టం

పురుగులు

తామర పురుగులు: ఏవి గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకొని ఎండిపోతాయి. పూలను ఆశించినప్పుడు పూరెక్కలపై తెల్లని గీతలు, మచ్చలు ఏర్పడతాయి. పూలు కూడా వాడిపోయి రాలి పోతాయి ముఖ్యంగా బెట్ట వాతావరణంలో వీటి ఉదృతి అధికంగా ఉంటుంది. కాబట్టి నేరిని సక్రమంగా అందించాలి. పగ్గస్స ద్వారా నీటిని పిచికారీ చేసి ఉదృతిని కొంత తగ్గించవచ్చు. మొక్కలు నాటిన 15, 45 వ రోజులకు పెప్రోనిల్ 0.3 శాతం గుళికలు వేసుకోవాలి. లీటరు నేటికీ మాటేసిస్టాక్స్ 1 గ్రా. లేదా ఏసీపెట్ 1.5 గ్రా. లేదా మావరిక్ 2 గ్రా. లేదా పెప్రోనిల్ 2  మీ.లి. లేదా ఏవిదక్లోప్రేడ్ 0.3 మీ.లి. లేదా అసితంఇప్రెడ్ 0.2 గ్రా. లేదా ప్రేప్రాణి 2 మీ.లి. లను లీటరు నేటికీ కలిపి పిచికారీ చేయటం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చు.

గ్రీన్ హేస్ తెల్లదోమ: ఏది ఆకుల అడుగు బాగానే రసం పీల్చడం వాళ్ళ ఆకులు పసుపు రంగుకు మరి ముడుచుకొని రాలిపోతాయి. వేడి వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు 0.5 గ్రా. డయేవిధక్సామ్ లేదా 1 గ్రా. ఎసిటమిపార్టేడను లెటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు.

ఎర్రనల్లి: ఆకు అడుగు బాగానే అసంఖ్యాకంగా చేరి రసం పీల్చుట వలన అడుగుభాగం గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు, పూవులు కూడా రంగు కోల్పోయి పండుబారి రాలిపోతాయి. నివారణకు డ్తెకోపాల్ 5 మీ.లి. లేదా ప్రోపర్జ్ట్ట్ 3 మీ.లి. లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు.

ముగ్గ, కయ తొలుచు పురుగు: పురుగు ఆకుల మీద గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన లార్వాలు ఆకుల మీద, ముగ్గల లోకి చొచ్చుకొని పోయి, పులా భాగాలను తినివేస్తుంది. కపిసకంలో ఐతే కాయలోని గింజలను కూడా తిని నష్టపరుస్తుంది. నివారణకు మలాథియాన్ 2 మీ.లి. లేదా క్లోరిపైరిపాస్ 2 మీ.లి. లేదా 0.5 గ్రా. ఏమమక్తిన్ బెంజోయిట్ లీటరు నేటికీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఆకుముడత: సన్నని ఆకుపచ్చ పురుగులు ఆకులను తొలిచి పాము లాంటి గుర్తులను /మచ్చలను ఏర్పరుస్తాయి. నివారణకు డ్తెమిదోయేట్ మందు 2 మీ.లి.ను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ప్లైన్లలో కీటకాల ఉదృతిని తగ్గించుటకు ప్రతి 15 రోజులకొకసారి వేపనూనె 3 మీ.లి. లేదా పొంగమియా (కానుగ) నూనె 3 మీ.లి. లను పిచికారీ చేయాలి.

తెగుళ్ళు

వేరు,కాండం,కయ కుళ్ళు తెగుళ్ళు (మొక్క ఎండు తెగులు): మొక్కలు పూత, పిండే దశల్లో ఉన్నప్పుడు వడలిపోయి ఎండిపోతాయి. ఆకులు రాలిపోతాయి. కాయ మీద మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి. నీరు ఎక్కువగా లేకుండా చూడాలి. గాలిలో తేమ శాతం 90 కన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. పూలల్లో పులా మధ్య భాగం కుళ్లిపోతుంది. నివారణకు మొక్కలపై బెనోమిల్ 1 మీ.లి. లీటరు నేటికీ కలిపి పిచికారీ చేయాలి. కార్బండజిమ్ 1 గ్రా. లేదా బెల్తెటాక్సు 3 గ్రా. లేదా కాపర్ హెటెడ్రాక్సిడ్ 2.5 గ్రా. లీటరు నీటికి చప్పున కలిపి మొక్కల మెదళ్ళ వద్ద భూమిని తడపాలి.

ఆకుమచ్చ: గోధుమ లేదా నల్లని మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. తీవ్ర దశలో ఆకులు ఏందీ రాలిపోతాయి. నివారణకు మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.02564102564
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు