హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / వాణిజ్య పంటలు / పత్తిలో పూత మరియు పిందే రాలడం నివారణ చర్యలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పత్తిలో పూత మరియు పిందే రాలడం నివారణ చర్యలు

పత్తి పంటనందు పూత పిందే రాలుటకు కారణాలు నివారణ చర్యలు

మన దేశంలో పండిస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి అతి ముఖ్యమైన పంట. దాదాపుగా పత్తిని భారతదేశంలో 16 లక్షల హెక్టార్ల విస్తీర్ణం లో సాగుచేస్తున్నారు. పత్తి విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్ధానం, ఉత్పత్తి లో 2వ స్ధానంలో ఉందీ. ఇంతటి ప్రధానమైన వాణిజ్య పంట సాగులో రైతుల అవగాహన రాహిత్యం వల్ల కొన్ని వాతావరణ పరిస్దితులు నేల ప్రతికూల పరిస్దితులు ఇతర కారణాల వలన రైతు అనుకున్న అధిక దిగుబడులను పొందలేక పోతున్నారు. ఇందులో (పత్తిలో) పూత, పిందే రాలడం ఒక ప్రధానమైన సమస్య.

పత్తిలో పూత, పిందే రాలడానికి ప్రధాన కారణాలు

 • రైతులు పత్తి కీలక దశలైనటువంటి పూత, పిందే ఏర్పడే దశలలో వర్షభావం వలన గానీ, తగినంత నీటి లేకపోవడం వలన గానీ నీటిని ఇవ్వనప్పుడు.
 • పురుగులు, తెగుళ్ళు వలన గానీ
 • పూత పిందే దశలలో యంత్రాలతో గానీ, మనుషులతో గానీ అంతర కృషి చేసిన్నప్పుడు గానీ
 • జన్యుపరమైన కారణాల వలన
 • ప్రధాన, సుక్ష్మపోషకాలు లోపాల వలన గానీ

పత్తిలో పూత, పిందే రాలడం నివారణ

పత్తిలో దాదాపు 60-70 శాతం వరకు పూత, పిందే పైన తెలిపిన కారణాల వలన రాలుతుంది. ఈ పూత పిందే రాలడాన్ని కింది చర్యలు పాటించడం ద్వారా నివారించవచ్చు.

 • పత్తి పంట కీలక దశలైన పూత, పిందే దశలలో నీటిని ఇవ్వడం
 • సమగ్ర పోషక, సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వలన
 • నాణ్యమైన, జన్యుస్వచ్చత కలిగిన దృవీకరించిన విత్తనాలను వాడటం వలన
 • నాఫ్తలీన్ ఎసిటిక్ యాసిడ్ 10 పి.పి.ఎం. (ఫ్లానోఫిక్స్) ఒక మి.లీ మందును 4-5 లీటర్ల నీటిలో కలిపి విడిగా గానీ లేక 1-2 శాతం డై అమ్మోనియం ఫాస్ఫేట్ లేదా యూరియా ద్రవనంతో కలిపి గాని ఒకటి లేదా రెండుసార్లు 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి పిచికారీ నివారించవచ్చు.
 • సాగునీటి వసతి ఉన్న పరిస్దితుల్లో అధిక వర్షాలతో పాటుగా నత్రజని ఎరువులు (యూరియా) అధిక మోతాదులో వేయడం వలన ఎక్కువగా గొడుగు కొమ్మలు, కాయ కొమ్మలు ఏర్పడడం, మొక్కలలో తయారయ్యే పిండి పదార్దాలలో ఎక్కువ భాగం, ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత పిందే రాలుతుంది. సైకోసిల్ 60 పిపిఎం మోతాదులో పిచికారి చేసినట్లయితే మొక్కలలో అధిక శాఖీయ పెరుగుదల ఆగిపోయి, మొక్కలలో తయారయిన పిండి పదార్ధాలు పూత పిందే అభివృద్ధికి ఉపయోగపడి దిగుబడి పెరుగుతుంది.
 • బి.టి పత్తిని సాగు చేసినప్పుడు మొక్క పూత, పిందే కాయ బాగా తయారయ్యే దశలో భూమి ద్వారా అందించే ఎరువులతో పాటు పైపాటుగా డి.ఎ.పి లేదా యూరియా 2 శాతం ద్రావణాన్ని అంటే 20 గ్రా. లీటరు నీటికి కలిపి లేదా పొటాషియం నైట్రేట్ (మల్టికె) లేదా 19:19:19 (పాలిఫీడ్) ద్రావకాన్ని లీటరు నీటికి 10 గ్రా. చొప్పున కలిపి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.27272727273
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు