పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పత్తిలో పోషక యాజమాన్యం

పత్తి పంటసాగు నందు మేలైన రకాలు మరియు పోషక లోపాలు నివారణా

మన రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైనది. పత్తి సాగులో భారదేశం ప్రపంచంలో మొదటి స్ధానంలో, ఉత్పత్తిలో 2వ స్ధానంలో ఉంది. మన దేశంలో పత్తిని పండించే అన్ని ప్రాంతాల్లో సుమారుగా 16 లక్షలు హెక్టార్లలో సాగులో ఉంది.

పత్తిలో అధిక దిగుబడిని సాధించాలంటే ఇతర యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించడంతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా పోషక వినియోగ సామర్ధ్యం పెంచి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించవచ్చు.

పోషక జాతి రకాలు

‘పంటకు పెంట వంటకు మంట’ తప్పనిసరి కాబట్టి భూమి భౌతిక లక్షణాలు మెరుగుపడి అధిక దిగుబడి సాధించాలి. పోషక వినియోగ సామర్ధ్యం పెరగాలంటే ఆఖరి దుక్కిలో హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. 60 కిలోల భాస్వరాన్నిచ్చె ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 120 కిలోల నత్రజని 60 కీలలో పొటాషి నిచ్చె ఎరువులను నాలుగు సమభాగాలుగా చేసి విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్కల మొదళ్ళల్లో 1-10 సెం.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి. బి.టి. సంకర రకాలకు 150 కిలోల నత్రజనినిచ్చె ఎరువులు 60 కీలోల పోటాష్ నిచ్చే ఎరువులను విత్తిన 20,40,60,80 రోజులకు 7-10 సెం. మీ. దూరంలో పాదులు తీసి వేయాలి.

దేశవాళి రకాలు

ఈ రకాలు సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ప్రస్తుతం చాలా వరకు తగ్గింది. ఒక వేళ దేశవాళీ రకాలను సాగుచేసినట్లయితె హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. దీనితో పాటు హెక్టారుకు 20 కిలోల భాస్వరాన్నిచ్చె ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియదుననాలి. హెక్టారుకు 40 కిలోల నత్రజనినిచ్చె, 20 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను మూడు సమభాగాలుగా విత్తిన 30,60,90 రోజులకు మొక్కకు 7-10 సెం.మీ. దూరంలో 5-7 సెం.మీ లోతులో పాదులు తీసి వేయాలి.

అమెరికన్ రకాలు

బి.టి. హైబ్రిడ్ రకాల సాగుతో ఈ రకాల సాగు విస్తిరణం గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. వీటిని సాగుచేసేటప్పుడు హెక్టారుకు 10 టన్నుల పశువుల ఎరువు 40 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను విత్తటానికి ముందు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. హెక్టారుకు 90 కీలోల నత్రజనినిచ్చే 40 కిలోల పోటాషినిచ్చే ఎరువులను 3 సమభాగాలుగా విత్తిన 30,60,90 రోజులకు వేసుకోవాలి.

సుక్ష్మధాతు పోషణ నందు  లోపాలు – నివారణ

ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పోటాష్ లకు సంబంధించిన నత్రజని, భాస్వరం, పోటాష్ లకు సంబంధించిన ఎరువుల విపరీతమైన వాడకం, సుక్ష్మపోషక యాజమాన్యం గురించి సరైన అవగాహన లేక పట్టించుకోకపోవడం వలన ప్రస్తుతం పత్తిలో మేగ్నిషియం, బోరాన్, జింక్ సుక్ష్మధాతు లోపాలు కనబుడుతున్నాయి.

మెగ్నీషియం

ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ముదురు ఆకుల అంచుల నుండి మధ్య భాగానికి పసుపు రంగులోకి మారుతాయి. ఆకుల చివరకు ఎండిపోయి రాలిపోతాయి. మెగ్నీషియం లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ ను పైరు పై లోపాలు కనిపించినప్పుడు వారం వ్యవధిలో 2-3 సార్లు (లేదా) పైరు కోసిన 45,75 రోజుల తరువాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.

జింకు

జింకు లోపం పత్తిలో మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకుల ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం మాత్రమే పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకుల చిన్నవిగా ఉండి ముడత పడి కణుపుల మధ్య దురం తగ్గుతుంది. లోప దుక్కిలో వేసుకోవాలి. పైరుపై లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

బోరాన్

బోరాన్ లోపం వలన పూల స్వరూపం మారి ఆకర్షిక పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకుపోతాయి. ఆకుల కాడలు ఒకే రీతిన ఉండక కొంత దలసరిగాను కోత పలుచగా ఉండి పూత ఎండిపోయి, చిన్న కాయలు రాలిపోతాయి. మొక్కలు గిడసబారి ప్రధాన కాండం పై పగుళ్ళు ఏర్పడాతాయి. నివారణకు పైరు వేసిన 60,90 రోజుల తరువాత లీటరు నీటికి 1.5 గ్రా. బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.8
తోట కరుణాకర్ Jun 28, 2019 11:56 AM

నేను 3ఎకరాలు వర్షదారం క్రింద పత్తి పంటసాగు చేస్తున్నాను
మనీ మేకర్, మరియు మల్లికా రకాలు వేశాను, ఎరువుల యాజమాన్యం గురించి తెలుపగలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు