অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మిరప

మిరప

వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైన పంట. భారతదేశంలో  8,30,000 హెక్టార్లలో సాగు చేయబడి 18,72,000 టన్నుల దిగుబడి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిరప 1,20,000 హెక్టార్లలో సాగు చేయుచు 3.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని పొందుతున్నాము.

నేలలు

వర్షాధారంగా నల్ల నేలలు, నీటి వసతి క్రింద ఎర్ర నేలలు, చల్కా భూములు, ఒండ్రు నేలలు అనుకూలం. మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి.

పంటకాలం

తేమగా, వెచ్చగా ఉన్న వాతావరణం అనుకూలం. పాప్రికా రకాలకు రాత్రివేళల్లో ఉష్ణోగ్రత 10-17o సెం. మధ్య 30-40 రోజుల పాటు ఉంటే దిగుబడి బాగుంటుంది. రాత్రి ఉష్ణోగ్రత పెరిగే కొలది పూత రాలడం ఎక్కువగా ఉంటుంది.

ఖరీఫ్: జులై – ఆగష్ట్

రటీ: అక్టోబర్ – నవంబర్

రకాలు

సింధూర్ (సి.ఎ 960): కాయలు పొడవుగా, లావుగా ఉంటాయి. వచ్చి మిర్చికి అనుకూలం. నీటి వసతి కింద వేయదగిన రకం. త్వరగా కాస్తుంది. కారం తక్కువ. వేసవి పంటకు అనుకూలం. దిగుబడి 20-22 క్వి/ఎ.

కిరణ్(ఎల్.సి.ఎ-200): పోడవైన కాయలు, తెలంగాణలో నీటి ఆధారపు పంటకు ఆనుకూలం. దిగుబడి 16-18 క్వి/ఎ.

భాస్కర్ (ఎల్.సి.ఎ-233): కాయ పొడువు తక్కువ, కారం ఎక్కువ, ఖరీఫ్, రబీలకు అనుకూలం. దిగుబడి 20-24 క్వి/ఎ.

ప్రకాష్ (ఎల్.సి.ఎ-206): పొడవైన కాయలు, పచ్చి మిర్చికి, ఎండు మిర్చికి అనుకూలం. ఖరీఫ్ – రబీలకు ఆనుకూలం. దిగుబడి 18-20 క్వి/ఎ.

ఎల్.సి.ఎ – 334 (లాం – 334): మొక్కలు ఎత్తుగా, గుబురుగా పెరుగుతాయి. వైరస్ ను తట్టుకుంటుంది. కాయలు 7-8 సెం.మీ. పొడవు, మంటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ఖరీఫ్-రబీలకు అనువైనది. ప్రతికుల పర్స్థితులను తట్టుకొని సుస్థిర దిగుబడినిస్తుంది. జాతీయ స్థాయిలో “ప్రశాంత్” పేరుతో విడుదల చేయబడినది. దిగుబడి 24-26 క్వి/ఎ. ఎగుమతికి అనువైన రకం.

లాం – 353 ( ఎల్.సి.ఎ-353): మొక్కలు, గుబురుగా, మధ్యస్థంగా, కాయలు లేతాకు పచ్చ రంగులో 7-9 సెం.మీ. పొడువుతో సన్నగా ఉండి, ఎల్.సి.ఎ-334 రకం కంటే 20-25 రొజులు ముందుగా కాపుకు వస్తుంది. పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకం. పండిన కాయలు మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన పసుపు రంగు కలిగి ఉంటాయి. దిగుబడి 24-26 క్వి/ఎ.

యల్.సి.ఎ. 625: యల్.సి.ఎ.-334 కంటే త్వరగా కాపుకు వచ్చును. మొక్కల కొమ్మలు బలిష్టంగా ఉండి ఎత్తుగా పెరుగును. కాయలు సన్నగా 8-10 సెం.మీ. పొడువుతో మంచి ఎరుపు రంగు కలిగి ఉండి తాలు కాయల శాతం తక్కువగా, కారం అధికంగా (0.57%) ఉండి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (1158 ఎ.ఎస్.టి.ఎ) కలిగి, ఎక్కువ నిల్వ కాలం కలిగిన రకం. దిగుబడి 25-37 క్వి/ఎ.

ఇవి కాకుండా వివిధ రకాల ప్రైవేటు కంపెనీ విత్తనాలు మార్కెటులో లభిస్తున్నాయి. ప్రాంతానికి, సీజన్ కు అనువైనవి జాగ్రత్తగా ఎన్నుకోవాలి.

పాప్రికా రకాలు

ఈ రకాల కాయలు లావుగా, పొడవుగా ఉండి, కారం తక్కువ – రంగు ఎక్కువగా ఉంటాయి. వీటిని పచ్చళ్ళకు, సవాడ్స్, ఓలియో రెసిన్ తయారీకి ఎక్కువగా వాడుతారు. వీటికి యూరొపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. తూర్పు-పశ్చిమ గొదావరి జిల్లాలలో పండించే లంక మిరప రకాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పండించే లావు కాయలను ఇతర దేశ పాప్రికా రకాలతో సంకర పరిచి కొత్త రకాలను రూపొందించడం జరుగుతుంది.

వరంగల్ లోకల్ (టమాట మిర్చి): దీనినే చపాట మిర్చి అని కూడా అంటారు. తక్కువ కారం, ఎక్కువ రంగుతో పొట్టిగా లావుగా ఉండే లోకల్ రకం. పచ్చళ్ళకు అనువైనది.

యల్.సి.ఎ-424: పాప్రికా రకం. కాయలు 10-12 సెం.మీ పొడువుతో లావుగా, నిగారింపైన ఎరుపు రంగుకలిగి ఉండి వరంగల్ లోకల్ కంటే ముందుగా కోతకు వచ్చును. ఎగుమతికి ఆనుకూలం.

యల్.సి.ఎ-436: పాప్రికా రకం, కాయలు 8-9 సెం.మీ, పొడువుతో పచ్చి కాయలు లేత ఆకుపచ్చ రంగు, పండిన కాయ నిగారింపైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. దిగుబడి 18.0-18.4 క్వి/ఎ.

విత్తన మోతాదు

నేరుగా ప్రధాన పొలంలో ఎద పెట్టడానికి 2.5 కి/ఎ.

నారు పెంచుటకు

సూటి రకాలు : 650 గ్రా/.ఎకరానికి

హైబ్రిడ్ రకాలు : 75-100 గ్రా./ఎకరానికి

విత్తనశుద్ధి

 • మిరపలో వైరస్ తెగులు నివారణకు 150 గ్రా. ట్రైసోడియం ఆర్థో ఫాస్ఫేట్ ను ఒక లీటరు మంచి నీటిలో కరిగించి, దీనిలో విత్తనాన్ని 20 నిమిషాలు నానబెట్టి, నీరు తీసి, కడిగి విత్తనాన్ని నీడలో ఆరనివ్వాలి.
 • ఆ తరువాత అదే విత్తనానికి రసం పీల్చే పురుగుల నివారణకు (నల్లి తప్ప) ఇమిడాక్లోప్రిడ్ 8గ్రా/ కిలో విత్తనానికి పట్టించాలి.
 • ఆ తరువాత అదే విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా కాప్టాన్ ను కలపాలి.
 • అటు తరువాత చివరగా ట్రైకోడర్మా విరిడి అనే శీలీంధ్రం పొడిని 5 గ్రా./ ఒక కిలో విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.

నారుమడి యాజమాన్యం

మిరపలో మంచి నారుమడి అధిక దిగుబడి నాంది కాబట్టి, ఆరోగ్వవంతమైన ధృడమైన నారు ఎంతో అనసరం. నారుమడికి సారవంతమైన ఒండ్రు నేలలు, నీటి వసతి, ఒక మోస్తారు నీడ కలిగినటు వంటి ప్రదేశాలు చాలా అనుకూలం. నారుమడికి ఎంచుకున్న స్థలం ప్రతి ఏడాది మార్చుకొనుట ద్వారా నేల నుండి సంక్రమించే తెగుళ్ళను నివారించవచ్చు. నారుమడి ఎంచుకోనే ప్రదేశాన్ని మంచిగా దుక్కిదున్ని బాగా చివికిన పశువుల ఎరువు, వేపపిండి వేయుట శ్రేయస్కరం.

ఎత్తు నారుమడులు, ఒక మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తుగా చేసి విత్తుకోవాలి. ఒక ఎకరాకు సరిపడే నారు కావాలంటే ఒక మీటరు వెడల్పు, 40 మీ. పొడవు నారుమడి చేసి నారుమడికి నారుమడికి మధ్యలో 30 సెం.మీ. కాలువలు తీయాలి.

ఒక సెంటు నారుమడికి 650 గ్రా. విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 30 గ్రా. ఫిప్రోనిల్ గుళికలను వాడి రసం పీల్చు పురుగులను నివారించవచ్చును. సెంటుకు ఒక కిలో వేప పిండి వేయాలి. విత్తిన 9 వ రోజు, 13 వ రోజు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపిన ద్రావణంతో నారుమళ్ళను తడపాలి. ఆరు వారాల వయస్సు గల మొక్కలు నాటుకోవాలి. ప్రోట్రేలలో మిరప నారు పెంచుకున్నట్లయితే నారు ధృడంగా పెరగటంతో పాటు నారుకుళ్ళు మరియు వైరస్ తెగుళ్ళు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది.

నారు నాటుట:

ఆరు వారాల వయస్సు గల నారును 20 లీ. నీటికి 400 గ్రా. అజోస్పైరిల్లం + 400 గ్రా. ఫాస్ఫోబాక్టీరియా కలిపిన ద్రావణంలో 10-20 నిమిషాలు వేర్లు ముంచి నాటాలి.

నాటే దూరం : ఖరీఫ్ : 60*60 సం.మీ, 60*45 సం.మీ. 65*65 సం.మీ, 70*70 సం.మీ.

(నేటి వసతి క్రింద) : రబి : 60*60 లేదా 75*60 సం.మీ

 • సూటి రకాలు: పాదుకు “2” మొక్కలు
 • సంకర రకాలు: పాదుకు ఒక మొక్క

అంతర పంటలు/ పంట సరళీ

పురుగుల ఉధృతి తగ్గించడానికి మిరపను మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, పెసర పంటలతో మార్పిడి చేయాలి. ఆముదం, బంతి వంటి ఎర పంటలను పొలంలో గట్ల వెంట నాటుకోవాలి.

సమగ్ర ఎరువుల యాజమాన్యం

భూసార పరీక్షల ఆదారంగా ఎరువులను వాడాలి. మిరపలో అధిక దిగుబడి సాధించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వీలైనంత ఎక్కువగా వాడాలి. సేంద్రీయ ఎరువులు వాడటం వలన భూభౌతిక లక్షణాలు మెరుగుపడటమే కాకుండా సూక్ష్మధాత లోపాలు తగ్గుతాయి. సేంద్రీయ ఎరువుల వలన మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చేయడంతో పాటు భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి అధికమవుతుంది.

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా మిరప ముందు పచ్చిరొట్ట ఎరువులను పెంచి కలియదున్నాలి. వర్షాధార పైరుకు 60:40:50 కిలోలు, నీటివసతి క్రింద 300:60:120 కిలోలు ఇచ్చే నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను హెక్టారుకు వాడాలి. మొత్తం భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువులను తొలిదశలో మాత్రమే వేయాలి. నత్రజని, పొటాష్ లను 5 దఫాలుగా వేయాలి. ఎరువుల వాడకంలో సమతుల్యత లోపంచడం, సేంద్రీయ ఎరువులు వాడకపోవడం, ఆధిక మోతాదులో కాంప్లెక్స్ ఎరువులను వాడటం వలన ఇటీవలి కాలంలో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా జింక్, బోరాన్, ఇనుము, మాంగనీస్ మరియు మెగ్నీషియం ముఖ్యమైనవి.

జింక్ ధాతులోపం ఆశించినప్పుడు మొక్కల్లో తగినంత పెరుగుదల ఉండక కణువుల మధ్య దూరం తగ్గి మొక్కలు గిడసబారతాయి. ఆకుల మీద త్రుప్పు మచ్చలు ఉండి క్కమేపి మొక్కలు ఎండిపోతాయి. దీని నివారణకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో మిగిలిన ఎరువులతో కలుపకుండా విడిగా వేయాలి. జింక్ లోపం కనిపించినప్పుడు 2 గ్రా. జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

ఈ మధ్య కాలంలో మిరపలో బోరాన్ లోపం అధికంగా గమనించడం జరిగింది. ఈ లోపం వలన లేత ఆకులు చిన్నవిగా మారడం, మొక్కలు ఎదగక పోవడం, పూత తగ్గడం, ఆకులు పడవ ఆకారంలో మారటం కనిపిస్తుంది. మొక్కలు గుబురుగా కనిపించి ఆకులు, కాయల రూపాలు మారతాయి. నివారణకు బోరాక్స్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో జింక్, బోరాన్ తో పాటు ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం లోపాలు కూడా గమనించడం జరిగినందుకు నివారణకు గాను మిరప నాటిన తరువాత ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ మరియు జనవరి మాసాలలో మార్కెటులో అనుమతించబడిన సూక్ష్మపోశక మిశ్రమాన్ని 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

జీవన ఎరువులైన అజోస్పైరిల్లమ్, అజటోబాక్టర్, ఫాస్ఫో బాక్టీరియాలు ఎకరానికి 2 కిలోల చొప్పున వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని 25% వరుక తగ్గించవచ్చు.

సమగ్ర కలుపు యాజమాన్యం

నారు నాటడానికి 1.2 రోజుల ముందు ఫ్లుక్లోరాలిన్ 45% ఒక లీటరు/ఎ. చొపున లేదా ఆక్సిఫ్లోరోఫిస్ 23.5% 200 మి.లీ/ఎ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి 1.2 రొజుల ముందు పిచికారి చేయాలి లేదా పెండిమిథాలిన్ 30% 1.2-1.6 లీ/ఎ 200 లీ. నీటిలో కలిపి నారు నాటిన 48 గంటలలో సాళ్ళ మధ్యలో మొక్కలపై పిచికారి చేసి అన్ని రకాల కలుపును 30 రోజుల వరకు నివారించవచ్చును. వర్షాలు అధికమై పంట ముంపుకు గురైన పరిస్దితులలో కలుపు తీయడం లేదా అంటరాక్షపే చేయడం వీలుకాని పక్షంలో పంట వరుసల మధ్యనున్న కలుపు మందును ఎకరాకు 400 మీ.లి. (2 మీ.లి/లి. నేటికీ ఖోప్పున పిచికారీ చేసినట్లయితే తుంగ తప్ప విగిలిన గడ్డిజాతి కలుపు మొక్కల్ని నివారింవచ్చును.

అంతరకృషి

నాటిన 25,30 రోజుల తరువాత 15-20 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు, గుంచకలతో అంతరకృషి చేయాలి.

సస్యరక్షణ

పురుగులు/తెగుళ్ళ పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు/ఉధృతిగా ఉండు కాలం పురుగులు/తెగుళ్ళ మందులు
తామర పురుగులు (పైముడుత) (1) తామర పురుగులు ఆకుల ఆడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి. (2) పురుగులు కాయలను గీరడం వలన కాయల మీద చారలు ఏర్పడతాయి. (3) ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె రాలిపోతుంది. (4) ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారుతాయి. వాతావరణం పొడిగా, బెట్టగా ఉన్నప్పుడు, పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉష్ణోగ్రత ఉధృతి ఎక్కువగా ఉంటుంది. (1) నారుమడిలో సెంటు నారుమడికి 80 గ్రా. 0.3% ఫిప్రోనిల్ గుఓళికలు వేయాలి. (2) నాటిన 15 మరియు 45 రోజులకు ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ గుఓళికలు తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. (3) అవసరాన్ని బట్టి ఎసిఫెట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రా. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లేదా క్లోరోఫెన్ఫైర్ 2 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లనల్లి (క్రింది ముడుత) (1) తెల్లనల్లి ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి క్రిందకు ముడుచుకుంటాయి. (2) నల్లి ఆశించిన ఆకులు గిడసబారి ముదురు ఆకుల కాడలు పొడువుగా సాగి పెళుసుగా మారి చివరకు రాలిపోతాయి. (3) ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలిపోయి కాపు గణనీయంగా తగ్గుతుంది. నల్లి ఉధృతి అక్టోబర్ నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా ప్రోపార్గెట్ 2.5 మి.లీ. లేదా ఫాసలోన్ 2 మి.లీ. లేదా క్లోర్ఫెన్ఫైర్ 2 మి.లీ. లేదా ఫెనాజాక్విన్ 2 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పేనుబంక (1)పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన మరియు లేత కొమ్మల నుంచి రసాన్ని పూల్చటం వలన మొక్కలు గిడసబారుతాయి. (2) పురుగులు తేనే వంటి పదార్థాన్ని వితర్జించడం వలన చీమలు చేరుతాయి. (3) ఉధృతి ఎక్కువగా ఉంటే జిగురు పదార్థం వలన నల్లటి బూజు తెగులు ఏర్పడి కిరణజన్యు సంయోగక్రియకు అంతరాయం ఏర్పడడం వలన మొక్కలు క్షీణించి ఆకులు పసుపు పచ్చగా మారి, కాయల నాణ్యత తగ్గుతుంది. పేనుబంక పురుగులు ఉధృతి డిసెంబర్ మరియు జనవరి మాసాలలో ఎక్కువగా ఉంటుంది. ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మిధైల్డెమెటాన్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పూత పురుగు/గండు పూత (1) పూత, పూమొగ్గలు గుడ్లు పొదగబడి, బయటకు వచ్చిన అతి చిన్న లార్వాలు పూలలోని అండాశయం తెల్లగా మారి ఉబ్బుతుంది. పూమొగ్గలు విచ్చుకోక రాలిపోతాయు. (2) పిందె దశలో కాయలు గిడసబారి, గింజలు లేకుండా త్వరగా పండుబారి, కాయలు కొంకర్లు తిరిగి, పూత కాత విపరీతంగా రాలుతాయి. (1) పూత దశలో 5 % వేప గింజల కషాయం లేదా 5 మి.లీ. (1500 పి.పి.యం) వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (2) ఉధృతి ఎక్కువగా ఉంటే 1.25 మి.లీ. ట్రైజోఫాస్ పిచికారి చేసి, వారం రోజుల తరువాత క్లోరిఫైరిఫాస్ లేదా కార్బోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కాయతొలుచు పురగులు
పొగాకు లద్దె పురుగు (1) పొగాకు లద్దె పురుగు లార్వాలు ఆకులకు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆకులను జల్లెడగా మారుస్తాయి. (2) కాపు దశలో మిరపకాయలను ఆశించి ముచ్చిక వద్ద రంధ్రం చేసి శరీర భాగమంత కాయలోపలికి జొప్పించి గింజలను మరియు గుజ్జును తింటాయి. (1) పొగాకు లద్దె పురుగు ఎదిగిన లార్వాలను విషపు ఎరను ఉపయోగించి నివారించుకోవాలి. 5 కిలోల తవుడు, 500 మి.లీ. క్లోరిఫైరిఫాస్, 500 గ్రా. బెల్లం తగినంత నీటికి కలిపి చిన్న చిన్న గుళికలు తయారు చేసి పొలంలే సమానంగా చల్లాలి. (2) కాయతొలుచు పురుగుల నివారణకు థయోడికార్బ్ 1 గ్రా. లేదా నొవల్యూరాన్ 0.75 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లేదా క్లోరోఫినఫిర్ 2 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా డ్లైఫ్లూబెజురాన్ 1 గ్రా. లేదా క్లోరాంట్రానిసిప్రోల్ 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండామైడ్ 0.3 మి.లీ. లేదా ల్యూఫెన్సురాన్ 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (3) ఆముదం, బంతి వంటి ఎర పంటలను పొలంలో అక్కడక్కడ నాటుకోవాలి. (4) ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కాయ తొలుచు పురుగు ఉనికి, ఉధృతిని గమనించి ఎప్పటికప్పుడు సస్యరక్షణ చేపట్టాలి. (5) ఎదిగిన లార్వాలను, గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి. (6) ఎకరానికి 10-15 పక్షి స్థావరాలకు ఏర్పాటు చేసుకోవాలి. (7) జీవనియంత్రణలో భాగంగా ఎన్.పి.వి ద్రానణాన్నిపొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు విడివిడిగా కనీసం 250 వైరస్ సోకిన పురుగుల ద్రావణానికి 500 గ్రా. బెల్లం ద్రావణాన్ని 100 మి.లీ. టోపాల్ ను, 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
శనగ పచ్చ పురుగు కాయదశలో కాయలను ఆశించి తలను మాత్రం రంధ్రం లోపల ఉంచి మిగిలిన శరీరాన్ని కాయ బయట ఉంచి కాయ లోపలి గింజలను తింటాయి. ఇది అక్టోబర్ రెండవ వారంలో మొదలై నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మిరప పంటను ఆశిస్తుంది.
పచ్చ రబ్బరు పురుగు పచ్చ రబ్బరు పురుగు పెండు మూడు ఆకులను గూడులుగా చేసుకొని ఆకులను లేత కొమ్మలను గోకి తింటాయి.
వేరు పురుగు (1) వేరు పురుగు మొదట కలుపు మొక్కల వేళ్ళను తింటూ, మిరప నాటిన తరువాత వాటి వేళ్ళను కాండమును తింటాయి. (2) మొక్కలు వడలి ఎండిపోతాయి. (1) ఎకరాకు 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 10-12 కిలోల 3 శాతం కార్బోప్యూరాన్ గుళికలు ఆఖరి దుక్కిలో వేసి భూమిలో కలియ దున్నాలి. (2) క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా లాసంటా (ఇమిడాక్లోప్రిడ్+ ప్రుఫోనిల్) 1 గ్రా, లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళను తడపాలి. (3) మెటారైజమ్ 2 కిలోలు పశువుల ఎపువుతో కలిపి వేయాలి.
నులి పురుగులు (1) ఇవి ఆశించిన మొక్కల తల్లి వేరు, పిల్ల వేర్లపై బడిపెలు/కాయలు ఏర్పడతాయి. ఈ బుడిపెలు పరిమాణం సూది మొన పరిమాణం నుండి బఠాణి గింజ వరకు ఉంటాయి. (2) ఆశించిన మొక్కల పెరుగుదల తగ్గి, ఆకుల్లో పచ్చదనం తగ్గి లేత పసుపు రంగుకు మారి పూత, కాత విపరీతంగా తగ్గుతుంది. (3) మొక్కల వేర్ల పరిమాణం తగ్గి లేత గోధుమ నుండి ముదురు గోధుమ రంగుకు మారుతాయి. (4) నులి పురుగులు వేర్లలోని కణజాలాన్ని ఆశించి, మొక్కకు సరఫరా అయ్యే పోకాలను పీల్చుకుంటాయి. (5) ఈ క్రిములు కలుగ చేసే గాయాల వల్ల శీలీంధ్రాలు ప్రవేశించి ఎండు తెగులును కలుగజేస్తాయి. ఇసుక, ఒండ్రు, ఎర్ర గంప నేలల్లోను ముఖ్యంగా పొగాకు, వంగ, టమాటో పంటలు పాగయ్యే మిరపలో ఉధృతి ఎక్కువగా ఉంటుంది. (1) వేసవి లోతు దుక్కులు చేయాలి. (2) జొన్న, మొక్కజొన్న, ప్రత్తి, నువ్వులు వంటి పైర్లతో పంటమార్పిడి చేయాలి. (3) ఎకరాకు 200 కిలోల వేపపిండి వేయాలి. (4) ఆశించిన తోటల్లో కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఎకరాకు 12 కిలోల ఎద పెట్టాలి.
నారుకుళ్ళు / మాగుడు తెగులు (1) నారుకుళ్ళు ప్రధానంగా నారు విత్తిన పండు వారాల్లో నారుమడిలో కనపించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. (2) తెగులు పోకిన మడిలో నారుమడులు సుడులుగా పైనుండి క్రిందకు ఎండిపోయి మాడిపోయి చనిపోతుంది. (3) తెగులు ఆశించిన మొక్కల మొదళ్ళ మెత్తబడి కుళ్ళిపోయి గుంపులు గుంపులుగా చనిపోతాయి. (1) నారుమడి వత్తుగా ఉన్నప్పుడు మరియు నారుమడిలో తేమ అధికంగా ఉన్నప్పుడు తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. (2) మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఉధృతి అధికంగా ఉంటుంది. (1) తెగులు నివారణకు ఎత్తు నారుమడిలో నారు పెంచుకోవాలి. (2) కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేయాలి. (3) నారుమడిలో విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మరల వారం రోజులకొకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా 2.5 గ్రా. రిడోమిల్ యం.జడ్ లీటరు నీటికి కలిపి భూమి అంతా తడిచేలా పిచికారి చేయాలి.
బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, క్రమేపి అవి పెద్దవై జిగురు లాంటి పదార్థము స్రవించబడి నల్లటి గ్రీజు లాంటి పొడ ఏర్పడుతుంది. ఆకులు పండుబారి రాలిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి, ముసురు వర్షాలు పడినప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాపర్ ఆక్సిక్లోరైడ్ 20 గ్రా. + 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
కోయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు (1) మొదట గోధుమ రంగు నీటి మచ్చలు కొమ్మల భాగాల మీద ఏర్పడి కొమ్మలు, కాండం భాగాలు కుళ్ళి, వడలి ఎండపోతాయి. (2) కుళ్ళిన కొమ్మల భాగాల మీద శీలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. చిరుజల్లులు మరియు మంచు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నివారణకు గాను కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రా. 10 లీటర్ల నీటికి లేదా పైరాక్లోస్ట్రోబిన్ + మొటిరామ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కొమ్మ ఎండు /కాయ కుళ్ళు తెగులు (1) తెగులు లేత కొమ్మలను, పూతను ఆశించటం వలన పూత రాలిపోతుంది. (2) కొమ్మల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఈ మచ్చలు పొడువుగా సాగి వాటి మధ్యన నల్లని చుక్కలు కనిపిస్తాయి. (3) కొమ్మల చివర్ల నుండి క్రిందకు ఎండుకు రావడం ఈ తెగులు ముఖ్య లక్షణం. (4) తెగులు కాయలను ఆశించినప్పుడు కాయలు కుళ్ళిపోతాయి. (5) కాయలు మీద ఏర్పడిన నల్ల మచ్చలో శీలింధ్ర బీజాలు గమనించవచ్చు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం మరియు ఆధిక వర్షాలు పడుతున్నట్లయితే ఉధృతి అధికంగా ఉంటుంది. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాప్టాన్ 1.5 గ్రా. లేదా కాపర్ హైడ్రాక్రైడ్ 2.5 గ్రా. లేదా ప్రోరికొనజొల్ 1 మి.లీ. లేదా ప్రోరినంబ్ 2 గ్రా .లేదా డైఫెన్కొనజోల్ 0.5 మి.లీ. లేదా అజాక్సిప్చ్రోబిన్ + మెటిరామ్ 23 గ్రా. లేదా ట్రైఫ్లోక్సిత్టోబిన్+ టేబుకోనజోల్ 0.8 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు (1) తెగులు ఆశించిన ఆకులపై భాగం ఆకుపచ్చ రంగు కోల్పోతుంది. (2) ఆకు క్రింది భాగంలో తెల్లటి బూడిద లాంటి మచ్చలు ఏర్పడతాయి. (3) తెగులు ఉదృతి ఎక్కవగా ఉంటే బూడిద మచ్చలు పూత మరియు కాయలపై కనబడుతాయి. చల్లని, పొడి వాతావరణం తెగులుకు అనుకూలంగా ఉంటుంది. నివారణకు గాను నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైనోకాప్ 1 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మి.లీ. లేదా మైక్లోబ్యూటానిల్ 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్ళు /ఎండు తెగులు తెగులు ఆశించిన మొక్కలు వడలిపోయి, ఎండిపోయి, పూత, పిందె ఆకులు రాలిపోతాయి. బెట్ట పరిస్థితులు మరియు పొడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ళ దగ్గర పోయాలి. 90 కిలోలు పశువుల ఎరువు 10 కిలోలు వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విరిడి కలిపి వృద్ధి చేసుకొని మిరప సాళ్ళలో వేసుకోవాలి.
వైరస్ తెగులు
ఆకుముడత (జెమిని) (1) మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. (2) ఆకులు ఈనెలు ఆకుపచ్చ గాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చ రంగు కలిగి ఉండి కణువుల మధ్య దూరం తగ్గుతుంది, (3) ఆకుల మీద బొబ్బరులుగా ఏర్పడి ముదురుకుంటాయి. బెట్ట పరిస్థితులు మరియు పొడి వాతావరణం చాలా అనుకూలం, వివిధ రకాలైన కలుపు మొక్కలు వైరస్ తెగుళ్ళకు స్థావరాన్ని కల్పిస్తాయి. (1) గ్రీజు పూసిన పసుపు పంగు అట్టలకు పొలంలో అక్కడక్కడ ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొని కొంత వరకు నివారించవచ్చును. (2) తెల్లదోమ నివారణకు 5% వేపగిందల కషాయం లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ట్రైజోఫాస్ 1.25 మి.లీ లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (3) పేనుబంక నివారణకు 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా థయేమిథాక్సమ్ 0.2 గ్రా. లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. (4) తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ.లేదా స్పైనోశాడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్థయూరాన్ 1.25 గ్రా. లేదా క్లోరేఫెన్ఫైర్ 2 మి.లీ. లీటరు నీటికి పిచికారి చేయాలి. (5) గట్ల మీద వైరస్ క్రీములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. (6) పొలం చుట్టు 2-3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్న రక్షణ పంటలుగా వేసుకోవాలి. (7) సేంద్రీయ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. (8) వైరస్ తెగులు సోకిన మొక్కలకు పీకి కాల్చి వేయాలి.
కుకుంబర్ మొజయిక్ మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు.
మొవ్వు కుళ్ళు తెగులు (పీనట్ బడ్ నెక్రోసిస్) (1) తెగులు ఆశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని నిర్ధిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. (2) ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి.

నీటి యాజమాన్యం

మిరప అధిక తేమ, బెట్టను తట్టుకోలేదు. తగినంత నీరు మాత్రమే, ఎక్కువ సార్లు ఇవ్వాలి. మురుగు నీరు నిలువ రాదు. బిందు పద్ధతిలో నీరు ఇవ్వడం ద్వారా నీరు ఆదా అవటమే కాక, పంట ఎదుగుదల, కాయ దిగుబడి, నాణ్యత బాగుంటుంది. పూత దశలో పంట నీటి ఎద్దడికి గురికారాదు. ఈ దశలో నీటి ఎద్దిడి ఉంటే పూత రాలటం ఎక్కువ అవుతుంది. కాయ ఎదిగే దశలో కూడా క్రమం తప్పక నీరు ఇవ్వాలి. దీని వలన కాయ సైజు, నాణ్యత బాగుటుంది. పాప్రికా పండు మిర్చి కోతకు రెండు రోజుల ముందు నీరు ఆపాలి. దీని వలన కాయ నిల్వ నాణ్యత బాగుంటుంది. మిరప నీటి ఎద్దడికి గురైనప్పుడు మరియు అధిక వర్షాలకు లోనైనప్పుడు ఆకులపై ఎద్దిడికి గురైనప్పుడు మరియు అధిక వర్షాలకు లోనైనప్పుడు ఆకులపై 20 గ్రా. యూరియా లేదా పొటాషియం నైట్రేట్ (13-0-45) 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూత రాలుట నివారణ

సాధారణంగా మిరపలో 30-40 శతం పూత మాత్రమె కాయలుగా మరి మిగిలిన పూత సహజంగానే రాలిపోతుంది. పూత రాలుట నివారణకు ఎన్.ఎ.ఎ లేదా ప్లానోఫిక్స్ 1 మి.లీ/4.5 లీ, నీటికి లేదా ట్రైకాంటినాల్ 2 మి.లీ/1 లీ. నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. దీనిని ఇతర పురుగు మందులతో కలిపి పిచికారీ చేయరాదు.

మిరప కోతలు

పంట దిగుబడి అధికంగా పొందడానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి, పట్టాలపై కాని, సిమెంట్ కళ్ళాపైన గాని ఆరబెట్టడం శ్రేయస్కరం. వర్షాధార పంటకు 3-4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6-8 కోతలు కోయాలి.

ఎగుమతి కొరకు మిరప నాణ్యతను పెంచడానికి సూచనలు

 • మొక్కల మీద మిరప కాయలను ఎక్కువగా పండనీయరాదు. ఎక్కువగా పండితే నాణ్యత తగ్గుతుంది.
 • కాయలు కోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారి చేయరాదు. పిచికారి చేసిన ఎఢల మిరప కాయల మీద అవశేషాలుండే ప్రమాదముంది.
 • రాత్రిళ్ళు మంచుబారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి.
 • మిరపలో 10 శాతానికి మించి తేమ ఎక్కువగా ఉండకుండా ఎండబెట్టాలి.
 • ఎండబెట్టేటప్పుడు దుమ్ము, దూళి, చేత్త చెదారం లేకుండా కాయలు శుభంగా ఉండేటట్లు చూడాలి.
 • కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు, పిల్లులు , కోళ్ళు, ఎలుకలు మరియు పందికొక్కులు రాకుండా చూసుకోవాలి.
 • తాలు కాయలను. మచ్చ కాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి.
 • నిల్వ చేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనెసంచుల్లో కాయలు నింపాలి.
 • తేమ తగలకుండా పరిపొట్టు లేదా చెక్కబల్లల మీద గోదేలకు 50-60 సెం.మీ దూరంలో నిల్వ చేయాలి.
 • అవకాశం ఉన్న చోట శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా ఉంటుంది.
 • కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు రావాలని ఏ విధమైన రసాయనాలను, రమగులను వాడకూడదు. అవి ప్రమాదకరమైనవే కాక నిషేదింపబడ్డాయి.
 • అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గాని లేదా టొబాకోబారన్లలో ఎండబెట్టి మిరపకాయలను పొందవచ్చు.

అంతర్జాతీయ వాణిజ్యం

భారత్ నుండి మిరపను శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, సౌది అరేబియా, సింగపూర్, జర్మని దేశాలు దిగుమతి చేసుకుంటాయి.

మిరపను మన దేశంతో పాటు చైనా, పాకిస్థాన్, మెరాకో, టర్కీ, బాంగ్లదేశ్ లు మిరప ఎదుమతిలో భారత్ కు ప్రధాన పోటీదారులు.

పరిశుభ్రతా ప్రమాణాలు

అమెరిక సుగంధ ద్రవ్యాల వాణిజ్య సంస్థ, మిరప దిగుమతికి నిర్దేశించిన పరిశుభ్రతా ప్రమాణాల ప్రకారం పౌండ్ మిరప కాయలకు 4 చనిపోయిన కీటక అవశేషాలు, ఒక మిల్లీగ్రాము క్షీరజాల మలం, 0.5 శాతం ఇతర పదార్థాలు మించి ఉండకూడదు.

భాగం పదార్ధం పరిమితి
మిరపకాయలు ఇతర పదార్థాలు 5% వరకు
కీటకాల నష్టం 5% వరకు
మిరప పొడి బూడిద 1.3% వరకు
పీచు పదార్థం 3.0% వరకు
నూనె 2% వరకు

మిరప సాగు చేసే రైతులు ఈ మధ్య కాలంలో వివిధ దేశాలకు మిరపకాయలను మరియు అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. రైతులు అధిక దిగుబడి సాధించే లక్ష్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించవలసిన ఆవశ్యకత ఎంతైన ఉంది. కొన్ని పరిస్థితుల్లో జర్మనీ, ఇటలీ, స్పేయిన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు మన మిరప ఎగుమతులలో “అఫ్లోటాక్సిన్లు” గరిష్ట పరినమితులను మించి ఉండటం వలన తిప్ప పంపారు. ఈ నేపధ్యంలో “అఫ్లోటాక్సిన్” లపై అవగాహన పెంచుకొని నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేసినట్లయితే అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పలికే అవకాశం ఉంది.

అఫ్లోటాక్సిన్ సోకటానికి కారణాలు

మిరప కోతకు ముందు, తరువాత ఆశించే ఆస్పర్జిల్లస్ లాంటి ఈ అఫ్లోటాక్సిన్స్ ఇత్పత్తవుతాయి. అఫ్లోటాక్సిన్లు రావటానికి తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

 • కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకు గురైవప్పుడు.
 • మిరప కాయలు సాగు నీటిలో తడిసినప్పుడు.
 • మిరప కాయలను నేలపై ఎండబెట్టినప్పుడు.
 • కోత తరువాత తెగుళ్ళు, పురుగులు ఆశించిన కాయలను, విరిగిన కాయలను తొలిగించకపోవడం.
 • కళ్ళాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మరియు కాయలు కళ్ళాల్లో ఉన్న సమయంలో రాత్రులందు మంచు పడినప్పుడు.
 • కాయలు సరిగా ఎండనప్పుడు తేమశాతం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో బూజు పట్టటం.
 • నిల్వ సమయంలో మిరపకాయలు, సంభందిత ఉత్పత్తులో తేమశాతం 11 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు శీలింధ్రం పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు అఫ్లోటాక్సిన్లు ఉత్పత్తవుతాయి.
 • నిల్వ సమయంలో ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు.

అఫ్లోటాక్సిన్ నివారణ పద్దతులు

 • పలుచని గుజ్జు, ఎక్కువ ఘన పదార్ధం ఉన్న, మిరప రకాలను సాగు చేయాలి, దీని వలన ఆరుదల త్వరగా అవ్వటమే కాకుండా కాయలు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
 • కాయలను నేల మీద ఆరబెట్టకూడదు. మిరపకాయలను టార్బలిన్ పట్లాలు లేదా సిమెంట్ ఫ్లోర్ మీద ఆరబెట్టాలి.
 • రాత్రులందు మిరపకాయలను మంచుబారిన పడకుండా టార్బలిన్ పట్టాలతో కప్పాలి.
 • మిరప నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలు కోసినప్పుడు 75-80 శాతం ఉంటుంది. ధీనిని 10 నుండి 11 శాతం వచ్చే వరకు ఆరబెట్టాలి. తేమ కాయల్లో ఎక్కువగా ఉంటే అఫ్లోటాక్సిన్లు వృద్ధీ చెందే ఆస్కారం ఉంది. తేమ తక్కువగా ఉంటే మిరప రంగు కోల్పోవడమే కాకుండా ప్యాకింగ్ లో మిరప కాయలు విరిగిపోతాయి.
 • మిరపకాయలు ఆరబెట్టడానికి ఆధునిక డ్రయ్యర్లను వినియోగించుకోవాలి. దీని వలన కాయలు అకాల వర్షాలకు గురికాకుండా మందు బారిన పడకుండా దుమ్ము, ధూళి లేకుండా రంగు, నాణ్యత కోల్పోకుండా తక్కువ సమయంలో శాస్త్రీయంగా ఆరబెట్టవచ్చు.
 • ఎండిన కాయలను వెంటనే గ్రేడ్ చేసి తెల్ల కాయలు, చీడపీడలు ఆశించిన కాయలను వేకు చేయాలి. గ్రేడింగ్ సరిగా చేయకపోతే తాలుకాయల నుండి అఫ్లోటాక్సిన్లు మంచి కాయలకు సోకే ప్రమాదం ఉంది.
 • ఏ కోతకి ఆ కోత కాయలను వేరు చేసి నిల్వ చేసుకోవాలి.
 • టిక్కీలలో నింపే ముందు మిరప కాయలపై నీటిని చిలకరించరాదు. కాయలను గాలి పోకకుండా బస్తాలలో ప్యాకింగ్ చేయాలి. చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.

అఫ్లోటాక్సిన్ల విష ప్రభావం లేని నాణ్యమైన మిరపకు మార్కెచ్లో గిరాకీ ఎక్కువగా ఉండి ధర ఎక్కువగా పలుకుతుంది. ఎగుమతులకు అవకాశాలు కూడా మొరుగ్గా ఉంటాయి. మిరప ఎగుమతులు పెరిగితే నికరాదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.

రసం పీల్చేపురుగులు – వాటి నివారణ పద్ధతులు

మన రాష్ట్రంలో మిరప పంటను ప్రధానమైన వాణి జ్య వంటగా వివిధ ప్రాంతాలలో సాగుచేస్తున్నారు. మిరపను పండించడానికి వర్షాధారపు పంటకు నల్లనేలలు, నీటి ఆధారపు పైరుకు నల్లనేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. విత్తుకోవడానికి ముందు భూమిని 3-4 సార్లు దుక్కిదున్ని, 2 సార్లు గుంటక తోలాలి. నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రా. (ఒక ఎకరానికి సరి పడే నారు), విత్తనం ఎగబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది.

మిరప పంట సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది. పురుగుల సమస్య. మిరపను వివిధ రకాల పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి. మిరప పంటను ఆశించే రసం పీల్చే పురుగులు, వాటి నివారణ పద్ధతుల గురించి చూద్దాం.

తామర పురుగులు (త్రిప్స్) పైముడత:

మిరపను ఆశించే తామర పురుగులు, ఇతర పంటలను ముఖ్యంగా వంగ, పత్తి, వేరుశనగ, ఆముదం, సొరకాయ, జామ, ద్రాక్ష మొదలగు పంటలను కూడా ఆశించి నష్టం కలుగజేస్తాయి. నీటి వసతి లేని పంటల్లో వీటి సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఈ తామర పురుగుల పెద్ద పురుగులు సన్నగా, చిన్న గడ్డి రంగులో ఉండి, రెక్కల అంచుల వెంబడి  చిన్న వెంట్రుకలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు చాలా చిన్నగా ఉండే గుడ్లను ఆకుల ఈనెలలోనికి చొప్పించి పెడతాయి. గుడ్ల నుండి పిల్ల పురుగుల బయటికి వచ్చి నష్టాన్ని కలిగిస్తాయి.

పిల్ల పురుగులు, రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వలన ఆకుల అంచులు ఫై కి ముడుచుకొంటాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు రాలిపోతాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందే నిలిచిపోతుంది. ఈ పురుగులు ఆశించిన కాయల మీద రాగి రంగులో ఉండే చారలు/మచ్చలు కనిపిస్తాయి. పొడి వాతావరణం ఉన్న పరిస్థితులలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగుల వలన 30-50 శాతం నష్టం వాటిల్లుతుంది. ఈ పురుగులు చాలా తక్కువ సమయంలో అంటే 2-2.5 వారాల్లో వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొనడం వలన, తక్కువ సమయంలో పురుగుల సంఖ్య అధికమై నష్టం ఇంకా తీవ్రమవుతుంది.

నివారణ: నారుమడిలో విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనాన్ని ఇమిడాక్లోప్రిడ్ మందుతో (3 గ్రా. మందు ఒక కిలో విత్తనానికి చొప్పున) విత్తన శుద్ధి చేసుకోవాలి. నాటిన 15-45వ రోజు ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందచేయడం ద్వారా పైముడతను నివారించవచ్చు.

వీటి నివారణకి ఎకరానికి కార్బరిల్ 600 గ్రా. లేదా ఫాసలోన్ 400 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా. లేదా ఫిప్రోనిల్ 400 మి.లీ. లేదా స్పైనోసాడ్ 75 మి.లీ. లేదా పెగాసస్ 300 గ్రా. ఆకుల అడుగుభాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. (200 లీటర్ల నీటిలో మందును కలపాలి).

కింది ముడత (తెల్లనల్లి పురుగులు):

ఒకప్పుడు ఈ తెల్లనల్లి పురుగులు చాలా తక్కువగా మిరపను ఆశించి తక్కువగా నష్టాన్ని కలిగించేవి కానీ ఇప్పుడు వీటి ఉధృతి తీవ్రమై చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా చిన్నగా, పారదర్శకంగా ఉండే తెల్ల నల్లి పురుగులు ఆకుల అడుగుభాగంలో ఎక్కువ సంఖ్యలో గుంపులుగా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పిల్ల, తల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి, ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి.

వీటి నివారణకు ఎకరాకు డైకోపాల్ ఒక లీటరు లేదా నీటిలో కరిగే గంధకం 600 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు వాడరాదు. నత్రజని ఎరువులు నిర్దేశించిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.

పైముడత, కింది ముడత ఉధృతి ఒకేసారి గమనించినట్లయితే ఉధృతిని బట్టి ఎకరానికి ఫాసలోన్ 400 మి.లీ. లేదా డయా ఫెంథియురాన్ 300 గ్రా. లేదా క్లోరిఫెనాఫిర్ 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

పేనుబంక:

ఇవి చాలా ఇతర పంటలను కూడా చి ఆశిస్తాయి. మబ్బులతో కూడిన వాతావరణంలో ఈ పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు వీటి సంఖ్య చాలా తగ్గిపోతుంది.

పేనుబంక పిల్ల, పెద్ద పురుగులు లేత కొమ్మల, ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చడం వలన మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది. ఈ పురుగులు ఒకరకమైన తేనె లాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జించడం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఈ తియ్యటి పదార్థంపై నల్లటి మసి లాంటి శిలీంధ్రం వృద్ధి చెంది, ఆకులు, కాయలు నల్లటి మసి పూసినట్లుగా మారిపోతాయి. దీనివలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక దిగుబడులు తగ్గిపోతాయి.

పేనుబంక నివారణకి ఎకరానికి మిథైల్ డెమటాన్ 400 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 • రసాయన, సేంద్రియ ఎరువుల సమతుల్యత పాటించాలి.
 • పైముడతతో బాటు కింది ముడత కూడా ఉన్నట్లయితే కార్బరిల్, ఎసిఫేట్ మందులు వాడకూదు.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate