অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయాధిరిత వ్యాపారాలు (ఆగ్రి బిజినెస్)

వ్యవసాయాధిరిత వ్యాపారాలు (ఆగ్రి బిజినెస్)

ఎండిన పూల ఉత్పత్తి

ఎండిపోయిన పూలెందుకు

 • ఎండిపోయినపూలకు ఇటు మనదేశంలోనూ, అటు అంతర్జాతీయ విఫణిలోనూ మంచి గిరాకీ ఉంది. మనదేశంనించి అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాలకు ఎగుమతి అవుతూన్నాయి.
 • వివిధ రకాల ఎండిపోయినపూల ఎగుమతిలో మనదేశానిదే అగ్రస్థానం.
 • ఎండిపోయినపూలంటే, కేవలం పూల భాగాలే కాదు, ఎండిన కాడలు, విత్తనాలు, కొమ్మలు వగైరా.
 • మన దేశం ఎండిపోయినపూలు, మొక్కలు ఎగుమతి వల్ల సాలుకు 100 కోట్లు ఆర్జిస్తోంది. దాదాపు 500 రకాలు 20 దేశాలకు ఎగుమతి అవుతూన్నాయి.
 • వీటిని చేతితో తయారుచేసే కాగితంలో, లాంప్‌ షేడ్‌లలో, కాండిల్‌ హోల్డర్‌లలో, జనపనారతో చేసే సంచుల తయారీలో, ఫోటో ఫ్రేంలలో, బాక్సులలో, పుస్తకాలలో, గోడ క్విల్ట్‌లలో, కార్డులలో ఇతర గిఫ్ట్‌ ఐటమ్‌ల తయారీలో విరివిగా వాడతారు.

ఎండిపోయిన పూల తయారీలో మెళకువలు

ఎండిపోయినపూల ఉత్పత్తిలో రెండు ప్రధాన అంచెలున్నాయి.

 • ఎండబెట్టడం
 • రంగువేయడం

I.ఎండబెట్టడం
ఎండబెట్టడానికి పూలను కోయడానికిఅనువైన కాలం :

ప్రాతః సమయాల్లో, మొక్కలపైని మంచు బిందువులు ఆరిపోయాక పూలు కోయడం మంచిది. పూలను కత్తిరించాక, వాటిని ఒక చోటకు చేర్చాలి. తర్వాత గుత్తులుగా కట్టి సూర్యరశ్మి తగలకుండా ఉంచాలి.

ఎండలో ఎండబెట్టడం:

 • ఎండలో ఎండబెట్టడం చాలా సులభం, చవక కూడా. ఐతే, ఈ పద్ధతి వానాకాలానికి పనికి రాదు.
 • పూలగుత్తులను తలకిందులుగా తాళ్లపై గానీ, వెదురుకర్రలపై గానీ వేళ్లాడ దీయాలి.
 • ఎలాటి రసాయనాలూ వాడకూడదు. చక్కగా గాలి తగలాలి.
 • ఈ పద్ధతిలో ఫంగస్‌ సోకే ప్రమాదం ఉంది.

ఫ్రీజ్‌ పద్ధతిలో ఎండబెట్టడం :

 • ఎండలో ఎండబెట్టడం కన్నా ఇది మెరుగైన పద్ధతి.
 • ఫ్రీజ్‌ డ్రై పద్ధతిలో ఎండబెట్టడానికి వాడే పరికరాలు చాలా ఖరీదు. ఐతే, ఈ ఫ్రీజ్‌ పద్ధతిలో ఎండబెట్టడంవల్ల పూలు ఎంతో నాణ్యతతో ఉంటాయి. చక్కని ధరా పలుకుతాయి.

గ్లిజరిన్‌పద్ధతి :

 • పూలలోని తేమని తొలగించి గ్లిజరిన్‌తో తడపాలి.
 • ఈ పద్ధతిలో ఎండబెట్టడంవల్ల పూలు ఎంతో నాణ్యతతో ఉంటాయి.

పాలిసెట్‌పద్ధతి :

 • పూలపై పాలిసెట్‌ పాలిమర్‌ను స్ప్రే చేయాలి.
 • ఈ పద్ధతిలో పూలు ఎండేదానికి చాలా తక్కువ సమయం పడుతుంది.
 • ఎండినపూల రంగు ఎంతో మెరుగ్గా ఉంటుంది.

సిలికాడ్రైయ్యర్లు

 • సిలికా లేదా సిలికా జెల్‌ను వాడి పూల నాణ్యతను పెంచవచ్చు. పూలను యధాతథంగా ఉంచవచ్చు.
 • అతి సున్నితమైన పూలను, మొక్కలను ఈ పద్ధతిలో ఎండబెట్టవచ్చు.

II.రంగువేయడం

 • ఎండిన పూలకు “ప్రోసియన్‌” రకం రంగు మంచిది.
 • 4కిలోల డై పొడిని 20 లీటర్ల నీళ్లలో కలపాలి.
 • ఆ ద్రావణాన్ని 800లీటర్ల వేడి నీళ్లలో పల్చగా చేసుకోవాలి.
 • దానికి 2 లీటర్ల అసిటిక్‌ ఆమ్లము కలపాలి.
 • మరీ సున్నితంగా ఉండే పూలకు మెగ్నీషియం క్లోరైడ్‌వాడి రంగును మెరుగుపర్చవచ్చు.
 • ఎండిన పూలని ఆ రంగులో ముంచి అవి రంగును పీల్చుకొనేదాకా ఉంచాలి.

ఎండిపోయిన పూల వాణిజ్య ఉత్పత్తులు

పూలు,మొక్కల భాగాలు

 • తురాయి, జాజి, ఊదా రంగు అమరాంతస్‌, పోక, కొబ్బరి ఆకులు, కత్తిరించిన పూలు - ఇవన్నీ ఈ తరగతిలోకొస్తాయి. ఎండుటాకులు, రెమ్మలు ఫిల్లర్లుగా వాడటం జరుగుతుంది. వీటన్నిటినీ గత 20 ఏళ్లుగా భారతదేశం ఎగుమతి చేస్తోంది.

 

పాట్‌పురీ

 • ఒక పాలిథీన్‌ సంచిలో సువాసన ద్రవ్యంపూసిన ఎండిన విడి పూల మిశ్రమం.
 • వీటిని సాధారణంగా అలమెరాలలో, డ్రాయర్లలో, బాత్‌రూంలలో ఉంచుతారు.
 • ఈ పద్ధతిలో కనీసం 300 మొక్కలను వాడతారు.
 • తురాయి, జాజి, రోజా పూలరేకులు, కాగితం పూలు, వేపాకులు, పండ్ల విత్తనాలు ఇండియాలో తయారయ్యే పాట్‌పురీలో చోటు చేసుకొంటాయి.
 • ఇంగ్లండ్‌ దేశం వీటి ప్రధాన కొనుగోలుదారు.

ఎండిపోయిన పూలకుండీలు

 • ఎండిన కాడలనీ, మొగ్గలనీ ఇందులో వాడతారు.
 • వీటికి మార్కెట్‌లో గిరాకీ తక్కువే అయినా, అధిక ఆదాయ వర్గాలు వాటిని కోరుకొంటారు. ఎక్కువ ధర పలుకుతుంది.
 • ఎండిన పత్తి తొక్కలు, దేవదారు పూలు, ఎండు మిరప, ఎండు దోస, గడ్డి, జాజిచెట్టు, ఎక్కువకాలం నిలిచే పూవు, కాకపాలాకు, ఫెర్న్‌ ఆకులు, చెట్టు బెరడు, చిన్న రెమ్మలు, కొమ్మలు - వీటిలో ఎక్కువగా ఉంటాయి.

ఎండిపోయిన పూలతో చేతి పనులు

 • ఎండిన పూల విఫణిలో ఇది తాజా పరిణామం.
 • ఎండిన పూలతో చిత్రాలను తయారుచేసి పటంగట్టి అమ్మడం, గ్రీటింగ్‌ కార్డులు, కవర్లు, బొకేలు, గాజుపాత్రలు - ఇవన్నీ వివిధ రంగులువాడి ఎండిన పూల పదార్థాలతో చేయడం లాభదాయకం.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

గ్రామీణ విత్తన కేంద్రాలు

గ్రామీణ విత్తన కేంద్రాలు అంటే ఏమిటి ?

పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంలో గ్రామీణ విత్తన కేంద్రాలను ఏర్పాటుచేసి, మేలైన పంటరకాలను రైతుల పొలాల్లో ఉత్పత్తిచేసి, తద్వారా నాణ్యమైన విత్తనాలకొరకు ఉన్న డిమాండు, సరఫరాలమధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యము.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాల ద్వారా మేలైన వంగడాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మూల విత్తనాలను, అనువైన ప్రణాళికలు, విత్తన శుద్ధి వంటి సదుపాయలు నాణ్యతా ప్రమాణాలు ఏర్పాటు చేసి , మహిళా సంఘాలు, సహకార సంఘాలు, అభ్యుదయ రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది.

విత్తన కేంద్రాల ఆవశ్యకత

 • నాణ్యమైన, మేలైన దిగుబడినిచ్చే పంటరకాలు అందుబాటులో లేకపోవడం.
 • విత్తన సరఫరా సకాలంలో లేకపోవడం.
 • పప్పు ధాన్యాల వ్యాపార పరంగా ఉత్పత్తి చేయడానికి వాటి విత్తనోత్పత్తి నిష్పత్తి తక్కువగా ఉండటం.
 • పండించిన పంట విత్తనాలకు సరైన నిల్వ సౌకర్యాలులేమి.
 • సాంకేతిక సిబ్బందికొరత.
 • కొత్త రకాల విడుదలకు చట్టబద్దమైన అడ్డంకులు ఉండటం.

ఇక్రిశాట్

ఇక్రిశాట్ అంతర్జాతీయ ఉష్ణమండల మెట్టపంటల పరిశోధనాకేంద్రం. ఈ సంస్థ లాభాపేక్షరహితంగా, రాజకీయాలకు అతీతంగా, వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిశోధనలు చేపడుతుంది. ప్రధానంగా భవిష్యత్తు అవసరాల కొరకు పరిశోధనలు చేస్తున్న 15 అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఇక్రిశాట్ ఒకటి. ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి వ్యవసాయ పరిశోధనలు ద్వారా విశేషంగా కృషిచేస్తుంది.

వ్యవసాయ వాణిజ్య విభాగము - ఇక్రిశాట్:

వ్యవసాయానికి సంబంధించి వాణిజ్య కేంద్రాలను మొదటి సారిగా ప్రారంభించే ఔత్సాహికులకు తోడ్పాటు అందించడంలో వ్యవసాయ వాణిజ్య విభాగము ప్రధాన భూమిక వహిస్తుంది. వ్యవసాయ రంగం ద్వారా అభివృద్ధి చెందడానికి అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానం, సలహా సంప్రదింపులు, నిర్వహణ, శాస్త్రవేత్తల సహకారంతో పర్యవేక్షణ, మూలధన సేకరణ మరియు పెట్టబడి తదితర అంశాల్లో సహకారం అందించి, తద్వారా మెరుగైన అవకాశాలను ఏర్పరచి సమస్యలను కొంతమేర తగ్గిస్తుంది. భారత ప్రభుత్వం, ఇక్రిశాట్ సంయుక్త అధ్వర్యంలో వ్యవసాయ వాణిజ్య విభాగం, శాస్త్రీయ టెక్నాలజీ విభాగం సౌజన్యంతో, జాతీయ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అభివృద్ధి మండలి ద్వారా ప్రారంభించడం జరిగింది.

ఆకృతి అగ్రికల్చరల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా

ఆకృతి సంస్థ వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులచే ప్రారంభించబడింది. ఆంధ్ర, కర్నాటక, రాష్ట్రాలలో రైతుముంగిట్లో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి, జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతుపొలాల్లోకి బదలాయించి రైతాంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంది. వ్యవసాయ వాణిజ్య విభాగము, - ఇక్రిశాట్ భాగస్వామ్యంతో, గ్రామీణవిత్తన కేంద్రాల అభివృద్ధిలో ఎంటర్ ప్రిన్యూర్స్ కు తోడ్పాటును అందిస్తుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ శాఖ కమీషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామీణ విత్తనాభివృద్ధి పథకాన్ని, ఈ గ్రామీణ విత్తన కేంద్రాలతో రాయలసీమ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఖరీఫ్ - 2008 నుంచి అనుసంధానం చేయటం జరిగింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో విత్తనాభివృద్ధి పథకాన్ని బలోపేతంచేసి, వేరుశనగ, కంది, పప్పుశనగ, వరి, పంటలలో నాణ్యమైన విత్తనాలను వినూత్నమైన బ్రాండ్ ద్వారా రైతాంగానికి అందుబాటులో తేవడం జరుగుతుంది.

గ్రామీణ విత్తన వ్యాపార కేంద్రాలు ప్రారంభించే వారికి కలిగే ప్రయోజనాలు

విత్తనోత్పత్తికి ముందు
వ్యాపార ప్రణాళికలు: ఈ విత్తన వ్యాపార కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుంది.
కేంద్రాల అభివద్ధి: విత్తనోత్పత్తికి అవసరమైన శిక్షణ, నాణ్యతా ప్రమాణాలు, విత్తన సరఫరా, నిర్వహణ, విత్తనశుద్ధి, మార్కెటింగ్ కొరకు అవసరమైన సలహా సూచలనను అందజేయడం జరుగుతుంది.
ఒనగూరే సదుపాయలు: మార్కెట్ యార్డులు, బ్యాంకులు మరియు ప్రభుత్వరంగ విత్తన సంస్థలతో ఈ కేంద్రాలను అనుసంధానం చేయడం జరుగుతుంది.
విత్తనోత్పత్తి దశలో
నాణ్యమైన విత్తనాలు అందజేయుట: విత్తనోత్పత్తి అవసరమైన నాణ్యమైన మూలవిత్తనాలను అందించి, ఈ కేంద్రాల ద్వారా రైతులపొలాల్లో విత్తనోత్పత్తి కొరకు అందజేయడం జరుగుతుంది.
నాణ్యతా ప్రమాణాలు: విత్తన పరిక్షాకేంద్రాలలో నాణ్యమైన విత్తనాలను ధృవీకరించడానికి అవసరమైన సౌకర్యాలను, సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
విత్తనశుద్ధి మరియు ప్యాకింగ్: విత్తనశుద్ధి, ప్యాకింగ్ చేయడానికి, అవసరమైన యంత్ర పరికరాలను, ప్యాకింగ్ బ్యాగులను, అందజేయడం జరుగుతుంది.
విత్తనాల నిల్వ మరియు రవాణా: రైతుల పొలాల్లో ఈ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలను మార్కెట్ యార్డ్ గోదాముల్లో నిలువ చేయడానికి, అవసరమైన సహకారాన్ని అందజేస్తారు.
విత్తనోత్పత్తి అనంతరము:
గుర్తింపు (బ్రాండింగ్): ఉత్పత్తి చేసిన విత్తనాలకు ఉమ్మడి బ్రాండింగ్ తో మార్కెట్ చేయడం
పంపిణి (మార్కెటింగ్): విత్తనాలను మార్కెట్ లో అమ్మడానికి అవసరమైన విదివిధానాలను రూపకల్పన చేసి వివిధ సంస్థలకు, ఈ కేంద్రాల ద్వారా విక్రయించడం జరుగుతుంది.

విత్తన కేంద్రాలు ప్రారంభించిన ఎంటర్ ప్రిన్యూర్స్ అభిప్రాయాలు

నేను ములగాలపాలెం ఝాన్సీరాణి డ్వాక్రా గ్రూపు లీడరును. గ్రామీణ విత్తన కేంద్రాలు (యస్.బిఐ.) లో మా గ్రూపులోని సభ్యులందరము చేరినాము. ప్రత్యేక పద్ధతిలో, (యస్.బిఐ.) ద్వారా విత్తనోత్పత్తిలో శిక్షణ పొంది, ఐ.సి.జి.వి - 91114 వేరుశనగ రకాన్ని పండించి ఒక వినూత్నమైన ప్యాకింగ్ మరియు మన సీడ్స్ బ్రాండింగ్ తో మార్కెట్ చేస్తున్నాము. మా ఆర్ధిక పురోగతికి బాటలు వేస్తున్న భాగస్వామ్యులందరికీ ధన్యవాదాలు.

 

 

నేను గార్లదిన్నెలో, గ్రామాణ విత్తన కేంద్రాన్ని (యస్.బిఐ.) ప్రారంభించాను. (యస్.బిఐ.) ద్వారా విత్తనోత్పత్తిలో శిక్షణ పొంది, వేరుశనగ రకాలైన ఐ.సి.జి.వి - 91114, కె-6, వరిలో బి.పి.టి - 5204 రకాలను రైతుల పొలాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పండించి నాణ్యమైన విత్తనాలను మా గ్రామానికి అందించగలననే విశ్వాసంతో ఉన్నాను.

 

గత కొన్ని సంవత్సరాలుగా వేరుశనగలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేక, ఆశించిన దిగుబడిరాక ఆర్ధికంగా నష్టాలకు గురౌతున్నాము. అటువంటి మాకు యస్.బిఐ. ద్వారా మా గ్రామంలో రైతుస్థాయిలో విత్తనోత్పత్తి ద్వారా క్రొత్త వేరుశనగ రకాలతో మేలైన దిగుబడులు సాధించగలమని విశ్వాసంతోవున్నాము. ధీర్ఘకాలంతో మరికొన్ని క్రొత్త రకాలను ప్రవేశపెట్టి మా రైతాంగం అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాము.

 

 

నేను ఎస్.బి.ఐ. భాగస్వామ్యుల ప్రోత్సాహంతో ప్రారంభించిన విత్తన కేంద్రాల కార్యక్రమంలో ఎంటర్ ప్రిన్యూర్ గా చేరి లక్కిరెడ్డిపల్లె మండలంలో విత్తనోత్పత్తి చేపట్టినాను. కంది, వేరుశనగ పంటలలో నూతన వంగడాల విత్తనాలను ఈ కార్యక్రమం ద్వారా పండించి, మా ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తాను.

ఆధారము:

ఆగ్రీ బిసినెస్ ఇన్ క్యుబేటర్ – పటాన్ చెరు 502324, ఆంధ్రప్రదేశ్, టెలిఫోన్: 040-30713417, ఫాక్స్: 040-30713075

ఆక్రుతి ఆగ్రికల్చరల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా
#6-3-903/ఏ/3, 2 వ అంతస్తు, సూర్యనగర్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500082.
టెలిఫోన్: 40038381, సెల్: 9849910975

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate