నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడం(హార్టికల్చర్) వైపు నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఏకబిగిన ప్రపంచజనాభా పెరిగిపోతూండడంతో అందరూ పండ్లు, కూరలు పండించడానికి, రేపటి పండ్లు, కూరల అవసరాలను తీర్చడానికి, ఉన్న వనరులను పరిరక్షించుకోవడానికి మెరుగైన పద్ధతులను ఆచరించాల్సిన అవసరాన్ని తెలుసుకన్నారు గ్రీన్ హౌస్ హార్టికల్చర్‌ను ఆచరించడంవల్ల ఫాన్సీ పంటలను ఆఫ్-సీజన్లో సీజన్లో వచ్చే దిగుబడికన్నా మెరుగైన దిగుబడిని పొందే అవకాశాన్నిస్తుంది.
ఈ గ్రీన్ హౌస్ పరిజ్ఞానం యొక్క ముఖ్యోద్దేశ్యం ఒక్కటే. చక్కని మొక్కలు పెరిగే వాతావరణాన్ని కలగజేయడం, తద్వారా మంచి నాణ్యమైన చెట్లను ఏడాది పొడుగునా పెంచే వీలు ఏర్పర్చడం. అభివృద్ధిచెందిన దేశాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఎంతో సున్నితంగా ఉంటాయి. అందువల్ల పండ్లు, పూలు, కూరగాయలను పాలిహౌస్‌లలో పండించడం సర్వసాధారణం. గ్రీన్ హౌస్ నిర్మాణాలను సాధారణంగా ఆఫ్-సీజన్ హార్టికల్చర్ పంటలను మామూలుగా పండించడానికి అనువుగాని సమయాల్లో కూడా పండించడానికి వాడతారు. ఈ గ్రీన్ హౌస్ పరిజ్ఞానాన్ని వాడటంవల్ల పండ్లు, పూలు, కూరగాయలను ఏడాది పొడవునా నిరాటంకంగా సరఫరా అవుతుంది.
నియంత్రిత వాతావరణం, ప్లాస్టిక్ గ్రీన్ హౌస్ మొదలైన పద్ధతులు వ్యవసాయంలో కీలక పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా దేశంలోని వైవిధ్యభరితమైన వాతావరణ పరిస్థితులున్న పలుచోట్ల ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
గ్రీన్ హౌస్‌లనే నిర్మాణాలు ఎల్డిపిఇ, ఎఫ్ఆర్పి, పాలీకార్బొనేట్ షీట్స్ వంటి ట్రాన్స్పరెంట్గా ఉండే వాటితో కప్పి ఉన్న నిర్మాణాలు. ఇవి సూర్యరశ్మిని లోపలికి ప్రవేశింపజేస్తాయి. కానీ, లోపల వస్తువులు వెదజల్లే థర్మల్ రేడియేషన్‌ను ట్రాప్ చేస్తుంది. దీనివల్ల మొక్కలు పెరగడానికి వాతావరణం అనువుగా ఉంటుంది. సూర్యుడినించి అందుకొన్న సూర్యరశ్మిని గ్రీన్ హౌస్ లోపల వేడిమిని కలగ జేయడమేకాకుండా లోపల మొక్కలవల్ల ఉత్పన్నమయ్యే చెమ్మను పీల్చేస్తుంది. ఈ నిర్మాణాలవల్ల మొక్కలకు అవసరమయ్యే కాంతి, వేడిమి, కార్బన్డయాక్సైడ్, చెమ్మ - ఇవన్నీ సులభంగా నియంత్రితమౌతాయి.
మరి ఈ నిర్మాణాలకు అయ్యే ఖర్చు, కప్పు స్థిరంగా ఉంటుందా, తీసి పెట్టుకోవచ్చా, నిర్మాణానికి వాడే ముడి వస్తువులమీద జి.ఐ. పైపులు, ఎంఎస్ యాంగిల్స్, ఫైబర్‌గ్లాస్, రీఎన్ఫోర్స్డ్ పాలియస్టర్ , గాజు, ఎక్రిలిక్ వగైరా వాడతామా వగైరా అంశాలపై ఆధారపడి ఉంటుంది. గ్రీన్ హౌస్ నిర్మాణానికయ్యే ఖర్చుతోబాటు పైన కప్పడానికి వాడే షీట్లపైన కూడా ఆధారపడి ఉంటుంది.
పైన చెప్పిన ఖరీదైన పదార్థాలతో తయారయ్యే గ్రీన్‌హౌస్‌ల నిర్మాణాలు ఖరీదుతో కూడుకొన్నవి. సగటు భారతీయ రైతులు అంత ఖర్చుకు తట్టుకోలేరు. ఈ సమస్యను అధిగమించడానికి, రైతులకు అనుగుణంగా ఉండేదానికి తక్కువ ధరలో చెక్కతో నిర్మించే గ్రీన్హౌస్ నిర్మాణాలు రూపుదిద్దు కొన్నాయి. వీటిని పరీక్షించడం జరిగింది కూడా. వీటికి పై కప్పుగా ప్లాస్టిక్ షీట్లు, అతినీలోహిత కిరణాలను స్థిరపరిచిన ఎల్డిపిఇ ఫిల్మ్ షీట్లు, షేడెడ్ నెట్స్ వంటివి అనువుగా ఉంటాయి.
ఇందులో చెప్పిన గ్రీన్ హౌస్ నిర్మాణాల ప్రక్రియ గ్రీన్ హౌస్ ఎక్కువ స్థలాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో, ఎలా వివిధ వ్యవసాయపనులు చేపట్టవచ్చో తెలుపుతుంది. చిన్నరైతులకు, సన్నకారు రైతులకు ఈ పరిజ్ఞానం ఎంతో సహాయకారిగా ఉండి అధిక దిగుబడిని సంపాదించిపెట్టడమేకాక, ఆఫ్ సీజన్ పంటలను పండించుకొనే వీలునిస్తాయి.
కావలసిన వస్తువులు
1. చెక్క స్థంభాలు
మనం ఎంత బలమైన నిర్మాణాన్ని కావాలనుకొంటామో, దాన్నిబట్టి మనం చెక్క స్థంభాలను నిర్ణయించు కోవాలి. చవుకు స్థంభాలకన్నా యూకలిప్టస్ స్థంభాలు వాడటంలో చెదలు పట్టడం, ఫంగస్ రావడం వంటి ఉపద్రవాలు తక్కువగా ఉండటంవంటి ఎన్నో లాభాలున్నాయి. పైగా, మేకలు కొట్టినా స్థంభాలు చెక్కుచెదరవు.
రెండు రకాల సైజుల్లో ఈ స్థంభాలను వాడతారు. ఒకటి 7నించి 10 సెం.మీ. వ్యాసంతో, మరొకటి 5 సెం.మీ. వ్యాసంతో ఉంటుంది. పెద్ద వ్యాసంతో ఉండే స్థంభాలను ప్రధాన నిర్మాణానికి, చిన్న వ్యాసంతో ఉండే స్థ ంభాలను సపోర్టింగ్‌గా వాడతారు.
కావలసిన స్థంభాల సంఖ్య :-
పెద్ద వ్యాసంతో ఉండే స్థంభాలు : 21
చిన్న వ్యాసంతో ఉండే స్థంభాలు : 34
మొత్తం స్థంభాలు : 55
2. జిఐ తీగలు
4 ఎం.ఎం. వ్యాసంగల జిఐ తీగలను వాడి వెదురు కర్రలను ప్రధాన నిర్మాణానికి కలిపి కట్టడానికి వాడతారు.
కావలసిన మొత్తం జిఐ తీగ : 2 కిలోలు
3. చీలలు/మొలలు
పొడవాటి తీగ చీలలు చెక్క స్థంభాలను, సపోర్టింగ్‌గా ఉండే స్థంభాలతో జోడించడానికి, జాయింట్లను పటిష్టం చేయడానికి వాడతారు.
కావలసిన మొత్తం చీలలు : 3 కిలోలు
4. యువితో స్థిరపరచిన ఎల్‌డిఇ ఫిల్మ్
ఈ చెక్క నిర్మాణాలు ఎలాటి ఫిల్మ్ లేదా పొరలతోనైనా కప్పే వీలుతో ఉంటాయి. ఎల్డిపిఇ(లో డెన్సిటి పాలి ఎథిలీన్) ఫిల్మ్‌నే ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా వాడుతున్నారు. ఇవి చవకే కాదు. సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇండియాలో వీటిని ఇండియా పెట్రో కెమికల్స్ లిమిటెడ్(ఐపిసిఎల్) సంస్థ తయారుచేస్తోంది. దీనివల్ల అనేక సౌకర్యాలున్నాయి. మొక్కల పెంపకానికి కావలిసిన కాంతి, వేడిమి, కార్బన్‌డైఆక్సైడ్, తేమ వగైరాలను చక్కగా నియంత్రిస్తాయి.
ఎంత ఫిల్మ్ కావాలి ?
గ్రీన్ హౌస్ లోపల నేల ఎంత వైశాల్యం ఉందో దానికి 2.48 రెట్ల సైజులో ఫిల్మ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు, 35' x 20' = 700 చ.అ. గ్రీన్ హౌస్‌కు దాదాపు 1736 చ.అ| ఫిల్మ్ కావాలి. ఇది దాదాపుగా 30కిలోల బరువుంటుంది. 200 మైక్రాన్ల మందంతో ఉంటుంది.
5. కోల్తార్ / బితుమెన్ : 2 లీటర్లు కావాలి.
6. ఎల్డిపిఇ ఫిల్మ్ రోల్(10సెం.మి వెడల్పు)
సాధారణమైన ఎల్డిపిఇ ఫిల్మ్ రోల్ లేదా మిగిలిన యువి స్థిరమైన ఫిల్మ్ రోల్ ను 10 సెం.మి. నిడివి ఉండేలా తయారుచేసుకొని స్థంభాలను, జాయింట్లను, తీగలను కప్పేలా చుట్టాలి. ఆ ఫిల్మ్ నేరుగా దేన్నీ తాకుండా ఉండేలా చూసుకోవాలి.
మొత్తం కావలసిన ఫిల్మ్ - మూడు కిలోలు
7. ప్లాస్టిక్ తాడు
ప్లాస్టిక్ తాళ్ళను వాడి ఆ తాళ్లకు ట్రస్ నిర్మాణాలకు మధ్య ఎల్డి పిఇ షీట్లను సాండ్విచ్ చేయడానికి ప్లాస్టిక్ రోప్స్‌ని వాడతారు. ఇది ఎక్కువ గాలి ఒత్తిడి వల్ల షీట్ చిరిగి పోకుండా కాపాడుతుంది.
మొత్తం కావలసిన ప్లాస్టిక్ తాడు - ఐదు కిలోలు
8. వెదురు బొంగులు
నిర్మాణంపై కప్పిన ఎల్డిపిఇ షీట్లకు ఊతాన్నిచ్చేలా నిర్మాణం చుట్టూతా వెదురు బొంగులను ఉంచాలి.
కావలసిన మొత్తం వెదురు బొంగుల సంఖ్య - 30
9. సన్నని చీలలు(టాగ్ నెయిల్స్)
అంచె - 1
స్థలం ఎంపిక, గ్రీన్హౌస్ నిర్మాణం
అంచె - 2
మరిన్ని వివరాలకు:
సంచాలకులు,
శ్రీ ఏఎంఎం మురుగప్ప చెట్టియార్ రిసెర్చి సెంటర్
తారామణి
చెన్నై - 600 113, తమిళనాడు, ఇండియా
ఫోన్ : 044-22430937
ఫాక్స్ : 044-22434268
వెబ్ సైట్ : www.amm-mcrc.org
ఆధారము: శ్రీ ఏఎంఎం మురుగప్ప చెట్టియార్ రిసెర్చి సెంటర్ , తారామణి, చెన్నై - 600 113, తమిళనాడు, ఇండియా
తేనెటీగల,పట్టు,పుట్టగొడుగుల,పెరటి తోటల,వర్మి కంపోస...