অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పట్టు పరిశ్రమ

మల్భరీ పెంపకం- పట్టు పరిశ్రమ

భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి 'చంద్రిక'లనే చట్రాల్లో పెట్టి ప్రత్యేక గదుల్లో ఉంచి కడు జాగ్రత్తగా పెంచాలి.

మల్బరీ మరియు పట్టు పురుగుల పెంపకానికి శ్రేష్టమైన పధ్ధతిని గూరించి సంపూర్ణమైన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నూతన పద్ధతిలో మల్బరీ ను మొక్కల పెంపక కేంద్రంలో పెంచుట

పట్టు పురుగుల పెంపకంలో, మల్బరీ మొక్కలను వాణిజ్యపరంగా ఎతైనా లేక చదునైన నారు మడుల నుండి అంటు మొక్కలుగా ఉత్పత్తి చేస్తారు.

మొక్క బాగా మొలకెత్తడానికి మరియు బలంగా ఉండడానికి, పోటీగా పెరిగే కలుపు మొక్కలు, నేలలోని తేమ, మరియు నేల ఉష్ణోగ్రత వంటివి ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో, కలుపు తీయడానికి, నీరు మరియు కార్మికుల అందుబాటు, ఖర్చు అడ్డంకులుగా ఉండడం వలన, ఈ సమస్యలను అధిగమించేందుకు ఫాలీధీన్ షీట్లను ఉపయోగించి మల్బరీ మొక్కలను పెంచడం అన్న నూతన పద్ధతి అభివృద్ధి పరచడమైనది. వాణిజ్య అవసరాలకు, ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా విజయవంతమై, శ్రేష్టమైన మల్బరీ మొక్కలను ఉత్పత్తి చేయడంలో మంచి ప్రభావం చూపుతున్నది.

పద్ధతి: - 30 నుండి 40 సెం.మీ. ల లోతుకు నేలని దున్నిన తరువాత, 8 నుండి 10 మెట్రిక్ టన్నుల పొలంలో తయారు చేసిన ఎరువును, నేలకి అందజేసి, చదును చేయాలి. నారుమడుల రెండు వైపులా, 3/ 4 వ వంతు ఉమ్మడిగా సాగునీటి కాలువలను ఏర్పరచి సిద్ధం చేయాలి. 15 అడుగులు x 5 అడుగుల పరిమాణంలో నల్లని ఫాలీధీన్ షీట్లను కత్తిరించి నారుమడి పై ఉంచాలి. 6 నుండి 7 మాసాల వయసు కల వ్యాధులు లేని మల్బరీ అంటుమొక్కలను ( 16 నుండి 20 సెంమీ. పోడుగుతో 3 చిగుర్లు కలిగినవి) ఫాలీధీన్ తో కప్పిన నారుమడి నేలలోనికి 10 సెం.మీ. x 10 సెం.మీ. ఎడం యిచ్చి నాటాలి. వారానికి లేదా పదిరోజులకు ఒకసారి, ఆ ప్రాంతపు నేల యొక్క స్వభావాన్ని బట్టి, కాలువలలో సాగునీరును ఫాలీధీన్ కే అందజేయాలి.

లాబాలు (Benefits) : - ఈ పద్ధతిలో, కలుపు మొక్కలను సూర్యరశ్మి సోకకపోవడం వలన పూర్తిగా నిర్మూలించవచ్చు. మొలకలు ఎదుగుతున్న దశలో (నాలుగు నెలలు) పూర్తి కాలంలో కలుపు తీసే అవసరమే రాదు. ఈ విధంగా, మనుషులను ఏర్పాటు చేసి తీసే కలుపు మొక్కలకయ్యే అధిక ఖర్చు కలిసి వస్తుంది.

ఎదుగుతున్న మల్బరీ మొక్కలతో పాటు పోటీగా కలుపు మొక్కలు లేకపోవడం వలన, మల్బరీ మొక్కలు నేలలోని పోషకాలన్నీ అవే వాడుకుని, ఎక్కువ శక్తితో ఎదిగి మంచి శ్రేష్టత కలిగిన మొక్కలను అందిస్తాయి. వేరే పద్ధతుల వలె కాక నీటి సదుపాయాన్ని 50 శాతం తగ్గించవచ్చు. ఎందుకంటే నేల పై పరచిన పాలీధీన్ కవర్ నేల ఉష్ణోగ్రత్తను సాధ్యమైనంతగా తగ్గించి వేస్తుంది. మరియు నీటిని ఆవిరి కాకుండ నిరోధిస్తుంది. అందువలన, నేల తేమ సంరక్షింపబడుతుంది.

రాబడి: - ఈ పద్ధతిలో నాలుగు నెలల కాలంలో,ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇతర పద్ధతుల కంటె ఈ విధానంలో, సగటు ఆదాయం 50000/- రూలు అధికంగా వస్తుంది.

బి. మోహన్ ,ఎన్. శక్తివేల్
ఆర్. బాలక్రిష్ణ
రీసెర్చ్ ఎక్స్ టెన్షన్ సెంటర్
సెంట్రల్ సిల్క్ బోర్డు,
శ్రీవిల్లి పుర్తూర్

పట్టు పురుగుల ఉత్పత్తి వ్యయం

పట్టుపురుగుల ఉత్పత్తి వ్యయం
(ఒక ఎకరానికి)

మల్బరీ తోటలను స్థాపించడానికయ్యే వ్యయం(తొలి సంవత్సరం)

క్ర.సం.

వివరాలు

విలువ(రు.)

1

దున్నడానికి

1500.00

2

భూమి తయారీ

400.00

3

తోటలో ఎరువు వేయడానికి(8టన్నులు)టన్నుకు రు.500

4000.00

4

మల్బరీ చెట్లు - 6000 నారు మెక్కలు. మెక్క ఒక్కటికి
రు.0.50

3000.00

5

ట్రాక్టర్ వాడి కాలువలు తీసి (4గంటలు) చెట్లు నాటడానికి

2200.00

6

ఎరువులు(100కిలోల అమోనియం సల్ఫేట్, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,

35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్)

1036.00

7

ఎరువులు వేయడానికి కూలీ ఖర్చులు

120.00

8

నీటి తడులు ఇవ్వడానికి

1500.00

9

బొరిగ/కలుపు తీయడం(3 సార్లు)

1800.00

10

ఇతర ఖర్చులు

500.00

మొత్తం

16056.00

రెండవ సంవత్సరము :

క్ర.సం.

వివరాలు

విలువ(రు.)

అ.

నిర్వహణ ఖర్చులు

1

తోటలో ఎరువు వేయడానికి(8టన్నులు)

4000.00

2

ఎరువులు(600కిలోల అమోనియం సల్ఫేట్, 300కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,

80కిలోల ఆఫ్ పోటాష్ మ్యూరేట్)

5538.80

3

ఎరువులు వేయడానికి కూలీ ఖర్చులు

1200.00

4

ఇరిగేషన్ నీటి ఖర్చు

5000.00

5

నీరు పెట్టడానికి

3600.00

6

కలుపు తీయడం

3400.00

7

నూర్పు

7200.00

8

చెట్లను కత్తిరించడం వగైరా

600.00

9

ల్యాండ్ రెవిన్యూ

50.00

10

ఇతరాలు

500.00

11

మూలధనంపై వడ్డి

621.78

మొత్తం చలనపు ఖర్చు

31710.58

ఇ.

నికరమైన ఖర్చులు
మల్బరీతోటల నిర్వహణ పంపకపు ఖర్చు

1070.42

మొత్తం ఆకుల ఉత్ప్తత్తి ఖర్చు

32781.00

మొత్తం ఖర్చు(ఒక కిలో ఆకుకు)

1.64

భవనాలు, పనిముట్ల సమకూర్చడం(300 డి ఎఫ్ ఎల్ - అనగా 300 ఆరోగ్యమైన పట్టు పురుగు గుడ్ల పెంపకం కోసం ఏర్పరిచే వరుస)

క్ర.సం.

భవనాలు, పనిముట్ల సమకూర్చడం

సంఖ్య/ పరిమాణం

ధర(రు.)

విలువ(రు.)

వ్యవధి

తరుగు

అ.

భవనాలు

1

లేట్ఏజ్ రేరింగ్ హౌస్-చౌకి, షూట్ స్టోర్ రూంలతోబాటు(చ.అ.)

1300

250.00

325000.00

30

10833.33

2

వరండా(చ.అ.)

300

50.00

15000.00

15

1000.00

అ. మొత్తం

340000.00

11833.33

ఆ.

పనిముట్లు

1

పవర్ స్ప్రేయర్

1

6000.00

6000.00

10

600.00

2

మాస్క్

1

2000.00

2000.00

5

400.00

3

రూం హీటర్

3

750.00

2250.00

5

450.00

4

హ్యుమిడిఫైయ్యర్

3

1500.00

4500.00

5

900.00

5

గ్యాస్ ఫ్లేం గన్

1

500.00

500.00

5

100.00

6

గుడ్లను బట్వాడా చేసే సంచి

1

150.00

150.00

5

30.00

7

చౌకి రేరింగ్ స్టాండ్స్

2

500.00

1000.00

10

100.00

8

కొయ్య రేరింగ్ ట్రేలు

24

150.00

3600.00

10

360.00

9

ఫీడింగ్ స్టాండ్స్

1

100.00

100.00

5

20.00

10

ఆకులు కత్తిరించే పీట

1

250.00

250.00

5

50.00

11

కత్తులు

1

50.00

50.00

2

25.00

12

ఆకుల ఛాంబర్

1

1000.00

1000.00

5

200.00

13

చీమల బావి

42

25.00

1050.00

5

210.00

14

చౌకి బెడ్ శుభ్రంచేసే నెట్లు

48

20.00

960.00

5

192.00

15

చిన్న బుట్టలు, వినైల్ షీట్స్

2

250.00

500.00

2

250.00

16

ప్లాస్టిక్ బేసిన్స్

2

50.00

100.00

2

50.00

17

ఆకుల సేకరించేదానికి వాడే బుట్ట

2

50.00

100.00

2

50.00

18

షూట్ రేరింగ్ ర్యాక్లు(45 అ. ృ 5 అ., 4దొంత రలు)

2

1500.00

3000.00

10

300.00

19

నైలాన్ నెట్

1

1500.00

1500.00

5

300.00

20

రోటరీ మౌంటేజి

105

240.00

25200.00

5

5040.00

21

ప్లాస్టిక్ ఇన్క్యుబేషన్ ఫ్రేం

6

50.00

300.00

5

60.00

22

ప్లాస్టిక్ బకెట్స్

2

50.00

100.00

2

50.00

ఆ. మొత్తం

54210.00

9737.00

పూర్తి మొత్తం

394210.00

21570.33

పట్టు పురుగుల పరిస్రమలో అయ్యె ఖర్చు మరియు రాబడుల వివరాలు

క్ర.సం.

వివరాలు

ఖర్చు/ రాబడి

.

మారే ఖర్చులు

1

ఆకు

32781.00

2

డిఎఫ్ఎల్స్(1500)

4200.00

3

క్రిమిసంహారకాలు

7425.00

4

కూలి(అ 25 ఃఉ/100 dౌ))

16875.00

5

రవాణా, మార్కెటింగ్

1580.00

6

ఇతరాలు

500.00

7

మూలధనంపై వడ్డీ

305.80

మారే ఖర్చుల మొత్తం

63666.80

.

స్థిరఖర్చులు
భవనం, పనిముట్లు - వీటిపై తరుగు, స్థిరఖర్చులపైవ డ్డీ

21570.33

మొత్తం ఖర్చులు

85237.13

ఇ.

రాబడి
పట్టుపురుగుల రాబడి

60.00

సగటు పట్టుపురుగుల ధర

120.00

పట్టుపురుగుల ఉత్పత్తి

900.00

పట్టుపురుగులనుంచి ఆదాయం

108000.00

ఉప ఉత్పత్తుల వల్ల ఆదాయం

5400.00

రాబడి మొత్తం

113400.00

నికర రాబడి

28162.87

లాభం, ఖర్చు నిష్పత్తి

1.33

భారతీయ పట్టు పరిశ్రమ- ఉపయుక్త వెబ్ లింకులు

www.indiansilk.kar.nic.in
www.seri.ap.gov.in/2_seri_tech.htm
www.seri.ap.gov.in/8_gallery.htm

చౌకి పెంపకం

చౌకి పెంపకం అంటే ఏమిటి?
పట్టు పరిశ్రమలో మొద టి రెండు దశలను చావ్కీ అంటారు. చావ్కీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంభించకపోతే పట్టుఉత్పత్తి నాణ్యమైనది గా ఉండక నష్టాలకు దారితీసే పరిస్థితి రావచ్చు. అందుచేత పట్టు పరిశ్రమలో చావ్కీ ప్రధాన ఘట్టం. ఉష్ణోగ్రత, తేమ, పారిశుద్యం, లేత మల్బరీ ఆకుల నాణ్యత, మంచి పెంపక వసతులు, అన్నిటికంటే మంచి సాంకేతిక నైపుణ్యత చావ్కీ పెంపకంలో ప్రముఖ స్థానం వహిస్తాయి.

వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకం కేంద్రాలు:
మైసూరులోని సి.ఎస్.ఆర్.టి.ఐ. లో సంవత్సరానికి 1,60,000 (డి . ఎఫ్. ఎల్.) సామర్థ్యం గల ఆరోగ్యవంతమైన చావ్కీ పెంపక మోడ్ల్ను ఉంచారు. ఈ కేంద్రంలో జట్టుకు 5000 డి. ఎఫ్. ఎల్. చొప్పున ఏడాది కి 32 జట్లుగా పట్టు పరిశ్రమలో అనుభవాన్ని సంపాదిస్తారు. ఈ విధంగా రెంళ్ళు జయప్రదంగా నిర్వహించిన తరువాత ఇటువంటి వాటిని దేశంలో ఇతర పెద్ద పెద్ద పట్టు పరిశ్రమ కేంద్రాలలో కూడా ఎర్పాటు చేస్తారు.

వాణిజ్య స్థాయిలో చావ్కీ పెంపకానికి కావల్సినవి:
- ప్రత్యేక నీరు పారుదల సౌకర్యం కలిగిన మల్బరీ తోట వాణిజ్య చావ్కీ కేంద్రానికి చేరి వుండాలి. పట్టుపురుగుల పెంపకానికి కావలసిన గదులు తప్పనిసరిగా ఉండాలి. పెంపకానికి అవసరమయ్యే చంద్రి క వంటి పరికరాలు, శాస్త్రీయ శిక్షణ పొంది న తరువాత అనుభవం సంపాదించిన సాంకేతిక సిబ్బంది ఉండాలి.
- చావ్కీ 80 నుండి 100 మంది కి చెందిన 120 నుండి 150 ఎకరాలలో వున్న మల్బరీ తోటల నుండి మాత్రమే పట్టుపురుగు గుడ్లను సేకరించాలి.

వాణిజ్య చావ్కీ కేంద్రాల వల్ల లాభాలు:
- ఎప్పుడూ ఒకే రీతిగా మంచి పట్టు గూళ్ళు దిగుబడిని ఇవ్వడానికిగాను ఆరోగ్యకరమైన చిన్న పురుగులు పొందడానికి అవకాశం ఉంది.
- ఎప్పుడూ ఒకే రీతిగా ఆరోగ్యకరమైన గూళ్ళను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
- అంటురోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది.
- గుడ్లు బాగా పొదగడానికి అవకాశం ఉంది.
- పెంపక సమయంలో పురుగుల శాతం తగ్గకుండా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది.
మరింత సమాచారం కావాలంటే, మైసూరులోని సెంట్రల్ సెరి కల్చర్ రీసెర్చ్ మరియు ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వారిని సంప్రదించండి .

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate