ఇది ఒక ద్రవరూపంలో తయారు చేయబడే సేంద్రియ/జీవన ఎరువు. దీనిని అప్పటి కప్పుడు తయారు చేసికొని వాడవచ్చును.
కావలసిన పదార్థములు
తాజా ఆవు పేడ |
10 కిలోలు |
తేనె |
500 గ్రా. |
ఆవు నెయ్యి |
250 గ్రా. |
నీరు |
200 లీటర్లు |
తయారు చేయు పద్ధతి
- ముందుగా ఆవుపేడను, తేనె ను చిక్కగా కలపాలి.
- తరువాత ఆవు నెయ్యిని వేసి ఎక్కువ వేగంగా కలియబెట్టాలి.
- ఈ కలిపిన ముద్దను 200 లీటర్ల నీరు ఉన్న తొట్టిలో కలపాలి.
వాడు పద్ధతి
ఈ కలియ ఉంచిన మిశ్రమమును విత్తుటకు ముందుగా ఒక ఎకరములో చల్లాలి. రెండవ మోతాదును ఒక నెల రోజుల పైరుకు సాళ్ళ మధ్యలో చల్లటం గాని లేదా సాగు నీటితో కలిపి గాని పారించాలి.
విస్తీర్ణము : ఇది ఒక ఎకరమునకు సరిపడును.

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.