పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

హరిత ఆకు ఎరువులు

హరిత ఆకు ఎరువుల వాడువిధానము

చెట్ల ఆకులను వేరే ప్రాంతాల నుండి తీసుకు వచ్చి నేలపై పరచి కలియ దున్నే ప్రక్రియను హరిత ఆకు ఎరువులు అంటారు

వర్షాధార ప్రాంతాల్లో పచ్చి రొట్ట పంటను వేయడానికి వీలు లేని ప్రాంతాల్లో త్వరిత గతిని పెరిగే వృక్షాలు గట్ల మీద వేసుకొని వాటి లేత కొమ్మలను, ఆకులను, తీసుకు వచ్చి ప్రధాన పంట విత్తడానికి 15 నుండి 20 రోజుల ముందు కలియ దున్నాలి.

ప్రయోజనాలు

 • పంట యాజమాన్య పద్ధతులు గురించి శ్రద్ద చూపనవసరం లేదు
 • చీడ పీడల సమస్య ఉండదు
 • అన్ని కాలాల్లో లభ్యమవుతాయి.

హరిత ఎరువుల వాడకం లో అవరోధాలు / ఇబ్బందులు

 • అన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు.
 • పొలం గట్ల పై చెట్లను పెంచిన దాని నీడ మరియు వేరు ప్రభావం పంట ఎదుగుదల, దిగుబడి పై ఉంటుంది.
 • ఆకులు, లేత కొమ్మలు దొరికే ప్రాంతం నుండి పొలానికి తీసుకు రావడం ఖర్చు తో కూడిన పని.
 • కావలసినంత రొట్ట లభ్యం కాదు.
 • అనుకొన్న మొక్కల రొట్ట లభ్యం కాకపోవచ్చు.అనగా మనకు నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు.

హరిత ఆకుల నిమిత్తం ఉపయోగించే వృక్ష జాతులు

 • గ్లైరిసీడియా (Glyricidia)
 • కానుగ (pongamia)
 • సుబాబుల్ (subabul)
 • జిల్లేడు (calotropis)
 • వేప (neem)
 • అజోల్లా(Azolla)

హరిత ఎరువులు వాడే పధ్ధతి

 

 • హరిత మొక్కల ఎరువులు లేదా హరిత ఆకు ఎరువులు ప్రధాన పంట విత్తు టకు  15 నుండి 20 రోజుల ముందు నేలలో కలియ దున్నాలి.
 • కలియ దున్నే సమయం లో నేలలో తగినంత తేమ ఉండాలి .
 • కలియ దున్నేటప్పుడు తగినంత సూపర్ ఫాస్పేట్ నేలపై వెదజల్లిన కృళ్ళే ప్రక్రియ వేగవంత మవుతుంది.
 • ఆకులు, లేత కొమ్మలు కలియ దున్నాలి. ముదురు కాండములు దున్నితే చివకడం ఆలస్యం అవుతుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00880410858
Jeevan Nov 12, 2016 10:59 PM

Azolla eakada dorukutundi cheppandi please

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు