గ్రామీణ భారతంలో జీవనోపాధినిచ్చేది నిస్సందేహంగా వ్యవసాయమే (అనుబంధ రంగాలతో). మనం ఎలక్ట్రానిక్ యుగంలోకి అడుగుపెట్టాం. దానికి తోడు కొత్త కల్పనలు, ఆవిష్కరణలూ ఎన్నో వస్తున్నాయి. దీనికి వ్యవసాయ రంగం అతీతమైనది ఎమీ కాదు. అందువల్ల వ్యవసాయదారులందరికీ ఈ రంగంలో వస్తున్న వినూత్న మార్పుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన పరిజ్ఞానం గురించి ఉపయుక్తమైన సమాచారాన్ని గ్రామీణ భారతంలోని రైతులోకానికీ, మరియు రైతులకు సేవలందించే వారికీ తెలియాలి. అలా అందుబాటులోకి తేవడమే ఈ పోర్టల్ లక్ష్యం.
గ్రామీణ వ్యవసాయ రంగంలో వివిధ భాగస్వాములు అంటే-రైతులు, సహకార సంస్థలు, ఔద్యోగిక సంస్థలు, వ్యవసాయ పనిముట్ల క్రయవిక్రయదారులు, ఎరువులు, రసాయనిక కంపెనీలు, బీమా సంస్థలు, అగ్రోనమిస్టులు, కన్సల్టెంట్స్, సలహాదారులు వంటి వారికోసం ఈ పోర్టల్ ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసి, ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలను చూపే విధంగా ప్రయత్నిస్తుంది.
ఈ పోర్టల్ లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, విధానాలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాటించే అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.
సమయానికి నమ్మకమైన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా స్ధానిక భాషల్లో అందించి, అనుభవజ్ఞులతో పరస్పర సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, రోజువారీ పనులు ప్రణాళిక చేసుకోవడానికి ఒక వేదిక నందిస్తుంది., అవసరమైనప్పుడు అన్ని రకాల సహాయాలు, సలహాలూ అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో మేము ఒక వ్యవసాయ జ్ఞాన సమాజాన్ని చూడ గోరుతున్నాం.
ఈ విభాగం ఉత్పత్తి మరియు పంటకోత అనంతర పరిజ్ఞానాలు, వ్యవసాయ పెట్టుబడులు వ్యవసాయ పనిముట్లు, వాతావరణం, మార్కెటింగ్ విజయవంతమైన పంట ఉత్పత్తి మరియు వివిధ అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది.
పశు సంపద, ఆవుల జాతులు, కోళ్ళ జాతులు, మేకల పెంపకం, కుందేళ్ళ పెంపకం, గొఱ్ఱెల పెంపకం, పందుల పెంపకం, ఎమూ, కౌజు, టర్కీ, రాష్ట్రాల పాడి పశువుల అభివృద్ధి, సాంకేతిక, జాతులు, ఆర్థిక సహాయ, మోడల్ ప్రాజెక్టులు, పాల, పౌల్ట్రీ, పంది, మేక, గొర్రె, కుందేలు యొక్క వాణిజ్య ఉత్పత్తి కేస్ స్టడీస్ సహా పశువుల నిర్వహణ యొక్క అనేక కోణాలను, ఈ విభాగంలో ఉన్నాయి.
మత్స్య సంపద. చేపల పెంపకంద్వారా వ్యర్ధ జలాల శుద్ధి , గట్టి పెంకు పీతల ( మడ్ క్రాబ్స్ ) పెంపకం , మంచినీటిలో ముత్యాల పంట (పెర్ల్ కల్చర్) , కార్ప్ జాతి మంచినీటి చేపల పెంపకం,లోతట్టు మత్స్య, రొయ్యల సంస్కృతి, అలంకరణ చేపలు ఉత్పత్తి,చేప ఉత్పత్తి యొక్క వివిధ కోణాలు, యంత్రాలు మొదలైనవి వివరాలు ఈ విభాగం అందిస్తుంది.
ఆధునిక మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ తేనెటీగల పెంపకం పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకం పెరటి తోటల పెంపకం వర్మి కంపోస్టు ఆగ్రి బిజినెస్ గ్రామీణ పరిజ్ఞానం మొదలగునవి ఇందులో పొంద పరిచినవి.
శ్రీ వరి సాగు, రైతు అనుభవాలు, ఖచ్చిత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మొదలగు విషయాలు ఈ విభాగం లో ఉన్నాయి.
వ్యవసాయానికి సంబంధించిన పథకాలు మరియు స్కీములు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఉపాధి కల్పన, మత్స్య సంపద ఉన్నాయి.
వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు సంబంధించిన వ్యవసాయ రుణ మరియు బీమా ఉత్పత్తులు వివిధ అంశాలను వివరించబడినవి.
వివిధ ఏజన్సీల, వ్యవసాయం, పశు పోషణ మరియు వ్యవసాయ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వినూత్న రైతులు, వ్యవసాయ పోర్టల్, సంబంధిత మంత్రిత్వశాఖలు, సరుకు బోర్డ్ మరియు వారి సంప్రదింపు వివరాలు జాబితా లో అందిస్తున్నాం.
ఈ వేదిక వ్యవసాయ సంబంధిత సమస్యలకు చర్చ కోసం అందుబాటులో ఉంది.
ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) మరియు ఆధార్ నమోదు సెంటర...
ఆధార్ డేటా డెమోగ్రాఫిక్ (పేరు, అడ్రస్) & బయోమెట్రి...
ఆధార్ సేవలైనటువంటి ఆధార్ ధ్రువీకరణ, మొబైల్ & ఇమెయి...
ఆధార్ గురించిన సమాచారము పొందుపరచబడినది.