অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భీమా పధకాల వార్తలు

జాతీయ వ్యవసాయ భీమా పధకాల వార్తలు

సవరించిన (మాడిఫైడ్) జాతీయ వ్యవసాయ భీమా పధకానికి (ఎమ్ ఎన్ ఎ ఐ ఎస్) ఆమోదం

ఆర్ధిక విషయాల మంత్రిమండలి (కాబినెట్) సంఘం, సవరించిన జాతీయ భీమా పధకాన్ని (ఎమ్ ఎన్ ఎ ఐ ఎస్) ఆమోదించింది. వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఈ పధకంలో ఉన్న లోటుపాట్లు సవరించి, దీన్ని మరింత సమగ్రంగానూ, రైతులకనుకూలంగాను మలచేందుకు అవసరమైన మార్పులను చేర్పులను చేసి, ఈ సవరించిన జాతీయ భీమా పధకం రూపొందించబడింది.

ఈ పధకాన్ని కేంద్ర రంగ పధకంగా అమలుచేస్తారు. తొలుతగా ఈ పధకాన్ని 50 జిల్లాలలో, 2010 -2011 రబీ సీజన్ తో మొదలు పెట్టి, 11 వ పంచ వర్ష ప్రణాళిక చివరి రెండేళ్ళలో అమలుచేస్తారు. అంతేకాకుండా ఈ సవరించిన ఎన్.ఎ.ఐ.ఎస్. పధకానికి 2010 -11 మరియు 2011 -12 సంవత్సరాలకు ఆదాయ వ్యయ పట్టిక (బడ్జెట్)లో కేటాయింపునకు గాను 358 కోట్ల నిధుల మంజూరుకు అనుమతి లభించింది.

ఈ సవరించిన పధకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మరింత మంది రైతులు వ్యవసాయంలో సంభవించే కష్ట నష్టాలను సమర్ధవంతంగా ఎదుర్కొని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన సందర్భంలో కూడా వారి ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకో గలరన్నది ఈ పధకం యొక్క ఆకాంక్ష.

వ్యవసాయోత్పత్తికి నష్టం కలిగించే వివిధ ఉపద్రవాలను దృష్టిలో ఉంచుకుని, వీటి నుండి రైతులకు రక్షణ కల్పించాలని, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ జాతీయ వ్యవసాయ భీమా పధకాన్ని ఒక కేంద్ర రంగ పధకంగా 1999 -2000 రబీ సీజను నుండి అమలుచేస్తున్నది. దీని అమలుతో వచ్చిన అనుభవంతో ఈ పధకాన్ని సమీక్షించగా, ఈ పధకంలో ఎన్నో లోపాలను గుర్తించడం జరిగింది.

ఆమోదింపబడిన పధకం ఈ కింది ప్రధాన లక్షణాలు కల్గివుంది

  • పంటల భీమా కిస్తులు (యాక్త్యుఅరీ ప్రీమియములు) చెల్లింప బడతాయి కాబట్టి బీమా సొమ్మును చెల్లించ వలసిన బాధ్యత భీమా చేయించిన వారి మీదే ఉంటుంది.
  • ముఖ్యమైన పంటలకు భీమా కల్పించడంలో గ్రామ పంచాయితీ పరిదిని ఒక ప్రమాణంగా (యూనిట్) పరిగణన లోనికి తీసుకుంటారు.
  • విత్తనాలు మొలకెత్తక పోయినా, మొక్కలు సరిగా రాకపోయినా పూచిపడిన భీమా మొత్తం చెల్లించవలసి ఉంటుంది. అలాగే పంట కోత అనంతరం తుఫాను కారణంగా నష్టం వాటిల్లితే కూడా భీమా మొత్తం చెల్లించవలసి ఉంటుంది.
  • ఖాతా చెల్లింపు కింద భీమా డబ్బులు చెల్లించ వలసి వచ్చే సందర్భాల్లో, సత్వర సహాయంగా రైతులకు ఇవ్వవలసిన మొత్తంలో 25 % వరకూ అడ్వాన్సుగా ఇస్తారు
  • భీమా పాలీసీలు కొనడానికి ఋణాలు తీసుకున్న రైతులకూ, ఋణాలు తీసుకోని రైతులకూ ఒకే గడువు తేదీలను పాటించడం (యూనిఫారం సీజనాలిటీ డిసిప్లిన్)
  • దిగుబడి హద్దు (త్రెషోల్డ్ ఈల్డ్)ను లెక్క గట్టడం మరింత ప్రామాణికంగా ఉండడం మరియు కనిష్ట నష్ట పరిహారం 60% బదులు 70% ఉండడం
  • మెరుగు పరచిన అంశాలు కల సవరించిన (మాడిఫైడ్) ఎన్.ఎ.ఐ.ఎస్. లో రెండు భాగాలు ఉంటాయి - నిర్బంధ బీమా మరియు స్వచ్చంద బీమా. రుణాలు తీసుకున్న రైతులకు నిర్బంధంగాను, రుణాలు తీసుకోని రైతులకు స్వచ్చందంగాను భీమా చేయిస్తారు.
  • ఈ ఎమ్ ఎన్ ఎ ఐ ఎస్. ను అమలుపరచడానికి తగిన మౌలిక సదుపాయాలూ, అనుభవమూ ఉన్న ప్రైవేటు రంగ భీమా సంస్థలను కూడా అనుమతిస్తారు.

కాఫీ రుణ విముక్తి ప్యాకేజీ వలన లబ్ధి పొందనున్న 75,000 మంది చిన్నకారు కాఫీ రైతులు

అప్పుల్లో కూరుకుపోయిన చిన్నకారు కాఫీ రైతులను ఆదుకునేందుకు రూ. 241.33 కోట్ల వ్యయంతో, 2010 కాఫీ రుణ విముక్తి ప్యాకేజీని అమలుపరచడానికి ప్రభుత్వం తన అంగీకారాన్ని తెలిపింది. అప్పులు పేరుకుపోయిన 78,665 మంది ఋణగ్రస్తులు ఈ ప్యాకేజీ పరిధిలోనికి వస్తారు. వీరిలో 74,929 (95%) మంది చిన్న కారు రైతులు కాగా వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చెయ్యడం (వైవర్) మరియు మిగిలిన మొత్తాన్ని కొంత కాలం తరువాత చెల్లించే వెసులుబాటు (రీషె డ్యూలింగ్) వర్తిస్తాయి. తక్కిన 3,736 ( 5%) ఖాతాలు మధ్యస్థ మరియు పెద్ద రైతులకి చెందినవి. వీరికి మిగిలిన మొత్తాన్ని కొంత కాలం తరువాత చెల్లించే వెసులుబాటు మాత్రం ఉంటుంది. ఈ ప్యాకేజీ అమలు చురుకుగా సాగుతోంది.

కాఫీ వర్షపు భీమాలో సవరింపులు

అంతే కాకుండా కాఫీ వర్షపు భీమా పధకం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ వర్షపు భీమా పధకం ఇంత వరకూ ఋతుపవనాలలో వచ్చే భారీ వర్షాలను, మరియు ఋతుపవనాల ముందు వచ్చే వర్షం ( బ్లాసం షవర్)ను, ఇది వచ్చిన 15-20 రోజుల లోపు వచ్చే బాకింగ్ షవర్ను మాత్రమే పరిగణన లోనికి తీసుకునేది. ఇప్పుడు ఈ పధకం పంట కోత సమయంలో, అంటే నవంబర్ - ఫిబ్రవరిలో వచ్చే అకాల వర్షాలను కూడా ఈ పధకం పరిధిలోకి వచ్చేటట్లు విస్తృతపరచబడింది. 2010-11 లో వచ్చే అకాల వర్షాల ఉధృతిని బట్టి గ్రేడెడ్ పద్ధతిలో డబ్బులు చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. 2010 లో వర్షాకాలానికి, తదుపరి కాలానికి కలిపి 15,790 మంది కాఫీ పండించే రైతులకు భీమా సౌకర్యం కల్పించబడింది. షుమారు 2 కోట్ల రూపాయల ప్రీమియం వసూలు కాబడింది. కాగా ఇందులో 50% ప్రభుత్వ సబ్సిడీ కింద వస్తుంది. లోగడ సంవత్సరంలో భీమా కల్పించిన 5200 మంది కాఫీ పండించే రైతులతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

ఆధారము: www.pib.nic.in© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate