కొత్త పంట బీమా పథకం "ఒక దేశం- ఒక పథకము" అనే ప్రాతిపదికతో పని చేస్తుంది. ఇది అన్ని మునుపటి పథకాల ఉత్తమ లక్షణాలు కలిగి ఉంటుంది. అదే సమయంలో, అన్ని మునుపటి లోపాలు/బలహీనతలు తొలగించబడ్డాయి. జాతీయ వ్యవసాయ బీమా పథకం అలాగే సవరించిన NAIS రెండు పథకాలను PMSBY భర్తీ చేస్తుంది.
అన్ని రబీ పంటలకు 2% మరియు అన్ని ఖరీఫ్ పంటలకు 1.5% ఏకరీతి ప్రీమియాన్ని రైతులు చెల్లించ వలసి ఉంటుంది . వార్షిక వాణిజ్య మరియు తోటల విషయంలో రైతులు చెల్లించే ప్రీమియం కేవలం 5% ఉంటుంది. రైతులు చెల్లించే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. సమతుల్యత ప్రీమియం వలన రైతులకు పంట నష్టం జరగకుండా రైతులకు పూర్తి భీమా మొత్తాన్ని అందించడానికి సహజ విపత్తుల ఖాతానుంచి ప్రభుత్వం చెల్లిస్తుంది.
నోటిఫై ప్రాంతంలో నోటిఫై పంటల వేసిన అందరు రైతులు పంట బీమాకు అర్హులు.
పథకం కింద నమోదు చేసుకోవడానికి, నోటిఫై ప్రాంతంలో నోటిఫై పంట సాగు పై బీమాకు లోబడి, క్రింది విధంగా రైతుల కేటగిరీలు ఉండాలి:
కేసీసీ/పంట రుణ ఖాతా హోల్డర్స్ తో కలిపి పైన చేప్పిన వాటిలో రాని రైతులు స్వచ్ఛంద కవరేజీని పొందవచ్చును.
పథకాన్ని 'ఏరియా అప్రోచ్ ఆధారంగా' అమలు చేస్తారు. అనగా వైపరీత్యాల ఆధారంగా ప్రతి పంటకు "నోటిఫై ఏరియా" లను గుర్తిస్తారు. ఈ ప్రాంతాలలోని రైతులందరిని ఒక భీమా యూనిటుగా భావిస్తారు. ఒక యూనిటు రైతు లందరు ఒకేరకమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఒక హెక్టేరుకు అయ్యే ఖర్చుకూడా ఒకేరకంగా ఉంటుంది. హెక్టారుకు వచ్చే సంపాదన కూడా ఒకే రకంగా ఉంటుంది. మరియు ఒకేరకమైన పంట నష్టం ఉంటుంది.
ముఖ్య పంటలకు నిర్వచించిన ప్రాంతగా (అనగా, భీమా యొక్క యూనిట్ ప్రాంతం) గ్రామం/గ్రామ పంచాయతీ స్థాయిలో, ఏ పేరుతో వీటిని పిలిచినా, గర్తిస్తారు. ఇతర పంటలకు గ్రామం/గ్రామ పంచాయతీ ప్రాంతాలకంటే పెద్ద ప్రాంతాన్నీ తీసుకుంటారు. కొంతకాలం తర్వాత, ఒకే రకమైన ప్రమాదాలు గల నోటిఫై పంటల బీమా యూనిటు జియో-ఫెన్సుడ్/ జియో-మ్యాప్ కావచ్చు.
కార్యాచరణ | ఖరీఫ్ | రబీ |
---|---|---|
తప్పనిసరి రుణం కింద తీసుకున్న రైతుల రుణ కాలం (రుణం మంజూరు అయింది) . | జూలై నుంచి ఏప్రిల్ | అక్టోబర్ నుంచి డిసెంబర్ |
రైతుల (రుణం తీసుకున్న మరియు తీసకోని) ప్రతిపాదనలు తీసుకొనే కట్ ఆఫ్ తేదీ. | 31 జూలై | 31 డిసెంబర్ |
దిగుబడి డేటా కోసం కట్ ఆఫ్ తేదీ | చివరి పంట నుండి ఒక నెల లోపల | చివరి పంట నుండి ఒక నెల లోపల |
వరస సంఖ్య | లక్షణం | NAIS 1999] | MNAIS [2010] | ప్రధాని పంట బీమా పథకం |
---|---|---|---|---|
1 | ప్రీమియం రేటు | తక్కువ | అధికం | NAIS కన్నా తక్కువ (గవర్నమెంట్ ఐదింతలు ఆ రైతుకు చెల్లిస్తుంది) |
2 | ఒక సీజన్ - ఒక ప్రీమియం | అవును | కాదు | అవును |
3 | భీమా సొమ్ము కవర్ | మొత్తం | క్యాప్డ్ | మొత్తం |
4 | ఖాతా చెల్లింపు | కాదు | అవును | అవును |
5 | ప్రాంతీయ రిస్క్ కవరేజ్ | కాదు | వడగళ్ళు తుఫాను, భూమి స్లయిడ్ | వడగళ్ళు తుఫాను, భూమి స్లయిడ్, జలమయం |
6 | పోస్ట్ హార్వెస్ట్ నష్టాల కవరేజ్ | కాదు | తీర ప్రాంతాలు - తుఫాను వర్షం కోసం | మొత్తం దేశం - తుఫాను + అకాల వర్షాలకు |
7 | సాగు నివారన కవరేజ్ | కాదు | అవును | అవును |
8 | టెక్నాలజీ ఉపయోగం (త్వరిత పరిష్కారం కోసం) | కాదు | ఉద్దేశించబడింది | తప్పనిసరి |
9 | అవగాహన | అవును | అవును | అవును (50% డబుల్ కవరేజీ లక్ష్యం) |
పథకం గురించి పూర్తి సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి
మూలం: వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు రైతు సంక్షేమం, భారత ప్రభుత్వం